గోధుమ పిండి అప్పాలు
కావలిసిన పదార్థాలు
1. గోధుమ పిండి 1 గ్లాసు
2.వరిపిండి 2 స్పూన్స్
3. బెల్లం తురుము 1 గ్లాసు
4. భేకింగ్ పొడి కొద్దిగా
5. నీళ్లు గ్లాసు
6.ఆయిల్ తగినంత
7. ఏలకుల పొడి కొద్దిగా
తయారీవిధానం
ముందుగా స్టవ్ వెలిగించి , వెడల్పయిన బాణలి పెట్టి ,
అందులో నీళ్లు ,బెల్లం తురుము ,ఒక స్పూన్ ఆయిల్ ,
కొద్దిగా బేకింగ్ పొడి , ఏలకుల పొడి ,
వేసి మరగనివ్వాలి ,
తరువాత గోధుమ పిండి ,వరిపిండి లను ,
వేసి అంతా బాగా కలిసేలా కలిపితే చలివిడి ముద్దలా అవుతుంది .
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,
తగినంత ఆయిల్ వేసి చల్లారిన ,పిండి మిశ్రమాన్ని ,
ఒక సారి బాగా కలిపి మనకు కావలిసిన సైజు లో ,
ఉండలు చేసుకుని ,
ప్లాస్టిక్ పేపర్ మీద ఆయిల్ ఆయిల్ రాసి ,
ఈ ఉండను దాని మీద పెట్టి ,
అప్పం మాదిరిగా తట్టి ,
ఆయిల్ లో వేసి దోరగా వేపుకోవాలి .
వేగిన తరువాత వీటిని ,
రెండు చిల్లుల చట్రా ల మధ్య పెట్టి ,
అరిసెల మాదిరిగా నొక్కితే అప్పాలు రెడీ
ఇవి 4 రోజులపాటు నిలువ ఉంటాయి.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
" వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.