Thursday 5 October 2017

ములక్కాడల కూర్మా


ములక్కాడల  కూర్మా

కావలిసిన  పదార్థాలు
1. ములక్కాడలు  5.
2. ఉల్లిపాయలు 2.
3. టమాటాలు  2
4. క్యాప్సికం  1
5. అల్లం  చిన్న ముక్క
6. పచ్చిమిర్చి  2.
7.  కొత్తిమీర  కొద్దిగా
8. కరివేపాకు
9. పసుపు
10. ఉప్పు  తగినంత
11. కారం  తగినంత
12. ఆయిల్  4 స్పూన్స్
13. సెనగపిండి  5 స్పూన్స్
14.ధనియాలపొడి   అరస్పూన్
15.  గరం మసాలా పొడి  అరస్పూన్
16. చింత పండుగుజ్జు 2 స్పూన్స్
17. జీలకర్ర  అర  స్పూన్
18. ఆవాలు  అర  స్పూన్

తయారీ  విధానం
ముందుగా  కూరలన్నిటిని  శుభ్రంగా  కడిగి ,
 అల్లమును సన్నని ముక్కలుగాను  ,పచ్చిమిర్చిని  చీలికలుగాను  ,
టమాటా  ,క్యాప్సికం ,ఉల్లిపాయలను ,
చిన్న ముక్కలుగాను ,
ములక్కాడలను పొడవుగాను తరుక్కోవాలి  .
ముందుగా  ములాక్కాడలను విడిగా ఉడికించి ,
దానిలోనుండి ములక్కాడలు  తీసి ,
ఆ ఉడికించిన  నీళ్లు  విడిగా  పెట్టుకోవాలి .
స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి వేడెక్కాక  ఆయిల్  వేసి  ,
జీలకర్ర , ఆవాలు  , వేసి  దోరగా  వేగాక  ,
అల్లం ,పచ్చిమిర్చి , కరివేపాకు  , వేసి
అవివేగాక  ఉల్లిపాయ  ,టమాటాలు  ,వేసి  కొద్దిసేపు  మగ్గనిచ్చి
క్యాప్సికం ముక్కలు  వేసి , కొద్దిసేపు  ఉడకనిచ్చి  ,
అందులో ఉడికించి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు  ,
పసుపు , కారం  , ఉప్పు  , ధనియాల  పొడి  ,గరం మసాలా పొడి  ,
చింతపండుగుజ్జు  ,సెనగపిండి  వేసి  బాగా  కలిపి
అందులో ములక్కాడలు  ఉడికించిన  నీళ్లు  పోసి ,
బాగాకలిపి  మూత  పెట్టి  కూర  అంతా  దగ్గర  పడేంత  వరకు  ఉంచి
స్టవ్  ఆఫ్ చేసుకుని  ఒక  బౌల్  లోకి  తీసుకుని
 పైన  కొత్తిమీరతో  గార్నిష్  చేసుకుంటే
 ములక్కాడల కూర్మా  రెడీ.

దీనిని  చపాతీ  పరోటాలతో ను ,
వేడి అన్నం తో తింటే రుచిగా ఉంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.