క్యాబేజీ పచ్చడి
కావలిసిన పదార్థాలు
1. సన్నగా తరుగుకున్న క్యాబేజీ 2 కప్పులు
2. చింత పండు కొద్దిగా
3. పచ్చిమిర్చి 2.
4. పసుపు కొద్దిగా
5. ఉప్పు తగినంత
6. ఆయిల్ 4 స్పూన్స్
7. సెనగ పప్పు 1 స్పూన్
8. మినపప్పు 1
9. ఆవాలు అర స్పూన్
10. జీలకర్ర ఆర స్పూన్
11. ఇంగువ కొద్దిగా
12 . ఎండుమిరపకాయలు 6
13. కరివేపాకు
14. నీళ్లు తగినన్ని
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి , బాణలి పెట్టి వేడెక్కాక ,
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను వేసి ,
అవి దోరగా వేగాక ఒకప్లేట్ లోకి తీసుకుని ,
మరల అదే బాణలిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ,
క్యాబేజీ తురుము , చింతపండు , పసుపు , వేసి
పచ్చి వాసం పోయేంత వరకు మగ్గనిచ్చి ,
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి .
చల్లారిన పోపును మీత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకుని ,
దీనిలో కాబేజీ మిశ్రమాన్ని వేసి , తగినంత ఉప్పు వేసి,
మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
అవసరమైతే కొద్దగా నీళ్లు పోసుకుని ,
గ్రైండ్ చేసుకోవాలి . తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక , ఆయిల్ వేసి ,
కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు ,
వేసి దొరగా వేగనిచ్చి ,పచ్చడిలో కలుపుకుంటే ,
ఘుమఘుమ లాడే క్యాబేజీ పచ్చడి రెడీ
ఈపచ్చడి వేడి అన్నంలో ను చపాతీ లోకి బావుంటుంది .
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
" వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.