పుల్ల అట్లు
కావలిసిన పదార్థాలు
1. చిక్కని మజ్జిగ 2 కప్పులు
2. బియ్యం 2 కప్పులు
3. మెంతులు కొద్దిగా
4. ఉప్పు తగినంత
5. ఆయిల్ తగినంత
6. ఉల్లిపాయ 1
7. పచ్చి మిర్చి 3
తయారీ విధానం
ముందుగా బియ్యమును , మెంతులను ,
శుభ్రం గా కడిగి ఒక గిన్నె లోకి తీసుకుని ,
అందులో మజ్జిగ పోసి 6. గంటలు నాన బెట్టాలి .
ఇలా నానిన బియ్యమును ,
తగినంత ఉప్పు వేసి ,
మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
ఇలా గ్రైండ్ చేసుకున్న, పిండి ,
ఒక రాత్రి అంతా బాగా ఊర నివ్వాలి .
మరునాడు ఇలా ఊరిన పిండిని,
దోసెల మాదిరి గా వేసుకోవాలి ,
ఉల్లి పాయను , పచ్చిమిర్చిని , సన్నగా తరుగుకోవాలి.
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి ,
అట్లకాడతో పామి ,
పిండిని వేసి , దోస మాదిరిగా గరిటతో తిప్పి
పైన ఉల్లి , పచ్చిమిర్చి ముక్కలు వేసి ,
ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక పక్క వేగిన తరువాత తిరగేసి
మరల ఒక స్పూన్ ఆయిల్ వేసి రెండో పక్క కూడా వేగనిచ్చి
ప్లేట్ లోకి తీసుకుని
అల్లం పచ్చడితో గాని టమాటో పచ్చడి తో గాని తింటే రుచిగా ఉంటాయి.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
" వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.