వెజిటబుల్ ఫ్రైడ్ రైస్
కావలిసిన పదార్థాలు
1. బియ్యం 3 గ్లాసులు లేక ( బాసుమతి రైస్ )
2. బీన్స్
3. గ్రీన్ పీస్ అర కప్పు
4. కేరట్లు 4
5. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
6. పచ్చిమిర్చి 6.
7. కొత్తిమీర కొద్దిగా
8. జీడిపప్పు పలుకులు 10
9. ఉప్పు రుచికి సరిపడా
10. ఆయిల్ 6 స్పూన్స్
11. లవంగాలు 6.
12. మిరియాలు 6
13. దాల్చిన చెక్క పొడి కొద్దిగా
తయారీ విధానం
ముందుగా బియ్యమును శుభ్రంగా కడిగి , ఒక గ్లాసుకి రెండు గ్లాసుల చొప్పున,
నీళ్లు పోసి కుక్కరులో పెట్టి ఉడికించుకుని ,
ఒక వెడల్పయిన బేసిన్ లో వేసి చల్లార్చుకోవాలి .
బీన్స్ , కేరట్ , కొత్తిమీరలను ,శుభ్రంగా కడిగి సన్నగా తరుగుకోవాలి.
పచ్చిమిర్చిని చీలికలుగా తరుగుకోవాలి .
స్టవ్ వెలిగించి , వెడల్పయిన బాణలి పెట్టి , వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసి ,
జీడిపప్పు పలుకులను వేసి , దోరగా వేపుకుని , ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి .
అదే బాణలిలో ,ఆయిల్ వేసి, లవంగాలు , మిరియాలు , దాల్చిన చెక్క పొడి వేసి ,
అవి దోరగా వేగాక , అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ,
అదికూడా దోరగా వేగాక
పచ్చిమిర్చి చీలికలు, కూర ముక్కలు ,గ్రీన్ పీస్ , ఆయిల్ వేసి, బాగా మగ్గనివ్వాలి .
ఇవ్వన్నీ బాగా మగ్గిన తరువాత , ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న,
అన్నమును కూడా వేసి , బాగా కలిపి, కొద్దీ సేపు వేగనిచ్చి,
ఉప్పు వేసి బాగా కలిపి, స్టవ్ ఆఫ్ చేసుకుని ,
జీడిపప్పు పలుకులు ,కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi