Friday, 20 January 2017

రాజ్మా గింజల మసాలా కూర


రాజ్మా  గింజల  మసాలా  కూర

కావలిసిన  పదార్థాలు
1. రాజ్మా  గింజలు  2 కప్పులు
2.  ఉల్లిపాయలు  5.
3. టమాటాలు  3
4.  అల్లం  వెల్లుల్లి  పేస్ట్  1 స్పూన్
5.  పచ్చిమిర్చి  4.
6.  కారం  1 స్పూన్
7. ధనియాలపొడి  1 స్పూన్
8. గరం  మసాలా  పొడి  1 స్పూన్
9. రాజ్మా  మసాలా  పొడి  1 స్పూన్
10.  పసుపు  కొద్దిగా
11. ఉప్పు  రుచికి  సరిపడా
12.   నీళ్లు  తగినన్ని
13. కొత్తిమీర  
14. ఆయిల్ 8 స్పూన్స్
15. పల్లీలు  2 స్పూన్స్
16. జీడిపప్పు  పలుకులు  6.
17. పెరుగు  3 స్పూన్స్

తయారీ  విధానం
రాజ్మా  గింజలను  ముందురోజు  తగినన్ని  నీళ్లు  పోసుకుని  ,
నానబెట్టుకోవాలి  . ఇలా  నానిన  రాజ్మా  గింజలను  నీళ్లు  పోసుకుని
కుక్కరులో  పెట్టి   ఉడికించుకోవాలి  .

3 ఉల్లిపాయలను  ,టమాటాలు  ,
చిన్న ముక్కలుగా  తరిగి  ,స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  ,
వేడెక్కాక    2 స్పూన్స్  ఆయిల్  వేసి  ,
తరిగిన టమాటా  ఉల్లిపాయ  ముక్కలను  వేసి , పచ్చి  పోయేంత  వరకు  వేగనిచ్చి  ,
స్టవ్  ఆఫ్  చేసుకోవాలి.

చల్లారాక  ముద్దలాగా  గ్రైండ్  చేసుకోవాలి .
పల్లీలను  ,జీడిపప్పు  పలుకులను  ,దోరగా  వేపుకుని  ,
చల్లారాక  మెత్తని  పొడిలాగా  చేసుకోవాలి  .

పచ్చిమిర్చిని  చీలికలుగాను , 2 ఉల్లిపాయలను  సన్నగాను  తరుగుకోవాలి  .
స్టవ్  వెలిగించి  వెడల్పయిన  బాణలి  పెట్టి  వేడెక్కాక ,
ఆయిల్  వేసి   ,అల్లం  వెల్లుల్లి  పేస్ట్ ను  వేసి  ,దోరగా  వేగాక  ,
సన్నగా తరిగి పెట్టుకున్న  ఉల్లిపాయ  ముక్కలు  ,పచ్చిమిర్చి  చీలికలు  వేసి ,
అవి కూడా  వేగాక  టమాటా  ఉల్లిపాయ  ముద్దను  వేసి  ,
కొద్దిగా  నీళ్లుపోసి  ఉడకనివ్వాలి  .
 దీనిలో  ముందుగా  మనం  ఉడికించి  ఉంచుకున్న
రాజ్మా  గింజలను  వేసి,  పసుపు  ,కారము , ధనియాలపొడి , గరం మసాలాపొడి  ,
రాజ్మా  మసాలా పొడి  , తగినంత  ఉప్పును  ,వేసి
బాగా  కలిపి , తగినన్ని  నీళ్లు  పోసి   బాగా ఉడకనివ్వాలి .
దీనిలో  పెరుగు  వేసి , కలిపి  పల్లీ  జీడిపప్పు  పొడిని  వేసి  ,బాగా  కలిపి ,
 కొద్దిసేపు  ఉడకనివ్వాలి  .
కూర  అంతా  దగ్గర  పడ్డాక  స్టవ్  ఆఫ్  చేసుకుని  ,
కూరను  ఒక  బౌల్ లోకి  తీసుకుని , కొత్తిమీరతో గార్నిష్  చేసుకుంటే
రాజ్మా  గింజల  మసాలా  కూర  రెడీ  అవుతుంది
ఈకూర  చపాతీ  లలోను  పరోటా  లోకి  బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi