ఇడ్లీ పిండి పుణుకులు
కావలిసిన పదార్థాలు
1. ఇడ్లీ పిండితగినంత
2. వరిపిండి 3 స్పూన్స్
3. ఉల్లిపాయలు 3
4. పచ్చిమిర్చి 4
5. కొత్తిమీర కొద్దిగా
6. జీలకర్ర
7. ఆయిల్ తగినంత
ఇడ్లీ పిండి తయారీకి
మినపప్పు ఒక గ్లాసు , ఉప్పుడు నూక 2 గ్లాసులు ,ఉప్పు తగినంత
తయారీ విధానం
ముందుగా మినపప్పును , ఉప్పుడు నూకను ,వేరు వేరు గిన్నె లలో నీళ్ళుపోసి
నానబెట్టుకోవాలి . నాని న పప్పును శుభ్రం గా కడిగి
తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
నూకను కూడా బాగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని ,
రుబ్బిన మినపపిండిని వేసి ,బాగా కలిపి ,
3 గంటలసేపు నాన నివ్వాలి .
ఉల్లిపాయలను, పచ్చిమిర్చి ని ,కొత్తిమీరను ,సన్నగా తరుగుకుని
మినప పిండిలో వేసి , జీలకర్రను కూడా వేసి ,
బాగా కలుపుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,ఆయిల్ వేసి ,
దీనిలో పిండిని పుణుకుల మాదిరి గా వేసి ,
దోరగా వేపుకుంటే ఇడ్లీ పిండి పుణుకులు రెడీ అవుతాయి
వీటిని కొత్తిమీర పచ్చడితోగాని కొబ్బరి పచ్చడి తో గాని తింటే బాగుంటాయి.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi