వంకాయ పెరుగు పచ్చడి
కావలిసిన పదార్థాలు
1. తెల్ల వంకాయలు పెద్దవి 2
2. పెరుగు 2 కప్పులు
3. ఉప్పు తగినంత
4. పచ్చిమిర్చి 4
5. కొత్తిమీర కొద్దిగా
పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు అర స్పూన్ , ఎండుమిరపకాయలు 2 ,
ఇంగువ కొద్దిగా ,ఆయిల్ 2 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా తెల్లవంకాయలను శుభ్రంగా కడిగి ,
స్టవ్ పైన కాల్చుకుని చల్లారాక ,పైన వున్న తొక్కను తీసి గుజ్జులాగా చేసుకోవాలి .
పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా ,కొత్తిమీరను సన్నగా ,
తరుగుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను వేసి ,
దోరగా వేగనివ్వాలి .ఒక బౌల్ లోకి పెరుగును తీసుకుని ,
దానిలో వంకాయ గుజ్జును , పోపు ను ,పచ్చిమిర్చిని ,
తగినంత ఉప్పును వేసి ,
బాగా కలిపి కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే ,
వంకాయ పెరుగు పచ్చడి రెడీ అవుతుంది
దీని ని వేడి అన్నం లో కలుపుకుని తింటే రుచిగా వుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi