తియ్య గుమ్మడికాయ కూర
కావలిసిన పదార్థాలు
1. తియ్యగుమ్మడికాయ అర చెక్క
2. పచ్చిమిర్చి 5
3. కరివేపాకు
4. పసుపు
5. ఉప్పు రుచికి సరిపడా
6. బెల్లం తగినంత
7. వరిపిండి కొద్దిగా
8. నీళ్లు తగినన్ని
పోపు దినుసులు
సెనగ పప్పు 1 స్పూన్ ,మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు అర స్పూన్ ,జీలకర్ర అర స్పూన్ ఎండుమిరపకాయలు 2, ఆయిల్ 2. స్పూన్స్
తయారీ విధానం
ముందుగా గుమ్మడి కాయ చెక్కను శుభ్రంగా కడిగి,
లోపల వున్న గుజ్జును పైన వున్న పెచ్చును ,
తీసి వేసి చిన్నముక్కలుగా తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకుని
చల్లార్చుకోవాలి .స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి పైన. చెప్పిన పోపు దినుసులను వేసి ,
అవి దోరగా వేగాక ,పచ్చిమిర్చి చీలికలు , కరివేపాకు వేసి ,
అవి కూడా దోరగా వేగాక ,
ముందుగా ఉడికించి పెట్టుకున్న , గుమ్మడికాయ ముక్కలు , పసుపు ,
తగినంత బెల్లం ,తగినంత ఉప్పు ,వరి పిండిని వేసి ,
బాగా కలిపి కూర అంతా దగ్గర పడేంత వరకు ఉంచి
స్టవ్ ఆఫ్ చేసుకుంటే
తియ్య గుమ్మడికాయ కూర రెడీ అవుతుంది
ఈ కూరను వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi