మెంతి కూర పచ్చడి
కావలిసిన పదార్థాలు
1. మెంతికూర 3 కట్టలు
2. చింతపండు కొద్దిగా
3. పసుపు
4. ఉప్పు రుచికి సరిపడా
5. వెల్లుల్లి రెబ్బలు 8.
6. ఆయిల్ 10 స్పూన్స్
పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్, ఆవాలు అర స్పూన్, మెంతులు కొద్దిగా, ఇంగువ కొద్దిగా ,
ఎండుమిరప కాయలు 10.
తయారీ విధానం
ముందుగా మెంతికూరను శుభ్రం గా కడిగి ,సన్నగా తరిగి ,
ఆర బెట్టుకోవాలి . స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి , దోరగా వేపుకుని ,
చల్లార నివ్వాలి . అదే బాణలిలో ఆయిల్ వేసి ,
మెంతికూరను ,చింత పండును , పసుపును ,
వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చి ,
చల్లారనివ్వాలి . ముందుగా చల్లారిన పోపును ,
తగినంత ఉప్పు వేసి మెత్తని పొడి లాగ చేసుకుని ,
దీనిలో మెంతి కూరను వేసి మెత్తని ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి ,
వెల్లుల్లి రెబ్బలను వేసి దోరగా వేపుకుని, ఒక ప్లెట్ లోకి తీసుకోవాలి .
అదే బాణలి లో ఆయిల్ ,ఇంగువ వేసి ,వేడెక్కాక
ఈ ముద్దను ,వెల్లుల్లి రెబ్బలను వేసి ,ఆయిల్ అంతా పచ్చడిలోకి ఇంకేంత వరకు ఉంచి
స్టవ్ ఆఫ్ చేసుకుంటే
మెంతి కూర పచ్చడి రెడీ అవుతుంది
ఈ పచ్చడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటుంది
చపాతీ లలోకి కూడా బాగుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi