సేమ్యా ఉప్మా
కావలిసిన పదార్థాలు
1. సేమ్యా పావుకేజీ
2. నెయ్యి కొద్దిగా
3. ఆయిల్ 3 స్పూన్స్
4. టొమాటో1
5. పచ్చిమిర్చి 2
6. అల్లం చిన్న ముక్క
7. కరివేపాకు
8. ఉల్లిపాయలు 2
9. కేరట్ 1
10. నీళ్లు 3 గ్లాసులు
11. ఉప్పు రుచికి సరిపడా
పోపు దినుసులు
సెనగపప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్
ఆవాలు అర స్పూన్ , జీలకర్ర అర స్పూన్
పల్లీలు 2 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
వేడెక్కాక నెయ్యి వేసి కరిగాక ,
సేమ్యాను దోరగా వేపుకోవాలి .
ఉల్లిపాయ , టొమాటోలను
,అల్లాన్ని , సన్నగా తరుగుకోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగాను ,
కేరట్టును కోరులాగా చేసుకోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి
ముందుగా పల్లీలను వేసి అవి వేగాక
పైన చెప్పిన పోపు దినుసులను వేసి
అవి దోరగా వేగాక
తరిగిపెట్టుకున్న కూరముక్కలను
కరివేపాకును వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి .
అవి మగ్గాక నీళ్లు పోసుకుని,
ఉప్పు వేసి బాగా కలిపి నీళ్లను మరగనివ్వాలి
నీళ్లు బాగా మరిగాక
ముందుగా వేపుకుని పెట్టుకున్న సేమ్యాను వేసి
కొద్దిసేపు ఉడకనివ్వాలి
నీరుఅంతా పోయి ఉప్మా దగ్గరపడేంత వరకు ఉంచి
స్టవ్ ఆఫ్ చేసుకుని
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
ఘుమఘుమ లాడే సేమ్యా ఉప్మా రెడీ
Subha's kitchen