కేబేజీ సెనగపప్పు కొబ్బరికోరు కూర
కావలిసిన పదార్థాలు
1. కేబేజీ పావు కేజీ
2. కూర సెనగ పప్పు ఒక కప్పు
3. కొబ్బరికోరు ఒక కప్పు
4. పచ్చిమిర్చి 3
5. కరివేపాకు
పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్, ఆవాలు అర స్పూన్,
జీలకర్ర అర స్పూన్, ఎండుమిరపకాయలు 2,
ఉప్పు రుచికి సరిపడా,ఆయిల్ 4 స్పూన్స్
తయారీ విధానము
ముందుగా కేబేజీ ని శుభ్రంగా కడిగి సన్నగా తరుగుకోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకోవాలి .
కూరసెనగపప్పును శుభ్రంగా కడుగు కోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి,
అందులో కడిగి పెట్టు కున్న సెనగపప్పు ను ,నీళ్లను పోసి
, ఒక పావుగంట ఉడకనిచ్చి
అందులో తరిగి పెట్టుకున్న కేబేజీ ని కూడా వేసి
మరి కొన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి
పప్పు కేబేజీ పూర్తిగా ఉడికిన తరువాత
చిల్లుపల్లెం లో పోసి చల్లారనివ్వాలి
స్టవ్ మీదబాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను వేసి అవి వేగాక
కొబ్బరికోరు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకును వేసి అవి వేగాక
ముందుగాఉడికించి చల్లారబెట్టుకున్న కేబేజీ సెనగపప్పును వేసి
కొద్దిసేపు మగ్గనిచ్చి ఉప్పు వేసి కూర అంతా కలిసేలా కలిపి
స్టవ్ ఆఫ్ చేసుకుని
కొత్తి మీరతో గార్నిష్ చేసుకుంటె
ఘుమఘుమ లాడే కేబేజీ సెనగ పప్పు కొబ్బరి కోరు కూర రెడీ
ఈ కూరను అన్నం లోను చపాతీలోకి బాగుంటుంది
Subha's Kitchen