Wednesday, 31 August 2016

పుదీనా పచ్చడి


                                                                    పుదీనా పచ్చడి

కావలిసిన పదార్థాలు

1. పుదీనా ఆకు 4 కప్పులు
2. చింత పండు కొద్దిగా
3. బెల్లం కొద్దిగా
4. పసుపు
5. ఉప్పు రుచికి సరిపడా

పోపు దినుసులు

సెనగపప్పు 1స్పూన్
మినపప్పు 1 స్పూన్
 ఆవాలు అర స్పూన్
ధనియాలు 1 స్పూన్
మెంతులు  కొద్దిగా
ఎండుమిరపకాయలు 8
ఇంగువ కొద్దిగా
ఆయిల్ 6 స్పూన్స్
వెల్లుల్లి రెబ్బలు 5

తయారీ విధానం

ముందుగా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి
చింతపండును కొద్దిగా నీళ్లు  నానబెట్టుకోవాలి.
 స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక పైన చెప్పిన
పోపు దినుసులను  వేసి దోరగా  వేపుకోవాలి
వీటిని  ఒకప్లేట్ లోకి   తీసుకోవాలి  అదే బాణలి లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి
ఆర బెట్టుకున్న పుదీనా ఆకును ,
పసుపు  చింతపండును వేసి బాగా మగ్గనివ్వాలి
పోపు దినుసులు బాగా చల్లారిన తరువాత మెత్తగా గ్రైండ్ చేసుకుని
దాంట్లో ముందుగా మగ్గా బెట్టుకున్న
 పుదీనా చింతపండు మిశ్రమం ,
ఉప్పుబెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 3 స్పూన్స్  ఆయిల్ వేసి వేడెక్కాక
 వెల్లుల్లి రెబ్బలు వేసి కాసేపు కాగనిచ్చి
తయారుచేసుకున్న పచ్చడినివేసి బాగా  కలిపి
స్టవ్ ఆఫ్ చేసుకుంటె
ఘుమఘుమ  లాడే పుదీనా పచ్చడి రెడీ

 దీనిని అన్నం లోకి ఇడ్లీ లోకి దోసెలలోను చపాతీలలోను బాగుంటుంది

Subha's kitchen 

Monday, 29 August 2016

సౌందర్య పోషకం " మెంతి "


                                                      సౌందర్య పోషకం " మెంతి "

                       మెంతులు, మెంతి ఆకులతో అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

1. మెంతిలో అధిక మోతాదులో లభించే ప్రొటీన్‌ జుట్టు రాలడాన్ని నివారించడంలో కీలకంగా పనిచేస్తుంది.

2. ఇందులోని నికోటినిక్‌, లెసిథిన్‌ కుదుళ్లు బలంగా మారేందుకు, జుట్టు ఎదగడానికీ సాయం చేస్తాయి.

3. ఇందులోని పొటాషియం చిన్నవయసులోనే శిరోజాల రంగు మారడాన్ని అరికడుతుంది.

4. గుప్పెడు మెంతుల్ని ఓ రోజంతా నానబెట్టాలి.

5. ఆ నీటిని వడకట్టి జుట్టుని తడపండి.

6. జుట్టుని అలాగే మూడు నాలుగు గంటలపాటు ఆరనివ్వండి.

7. ఆపై గోరువెచ్చని నీటితో స్నానం చేసి చూడండి. ఇలా వీలైతే రోజూ చేయండి.

8. తాజాగా ఉండే మెంతిఆకులను ఎంచుకుని శుభ్రంగా కడిగి మెత్తగా మిక్సీ పట్టాలి.

9. ఆ ముద్దకు ఓ రెండు చెంచాల నిమ్మరసం కలిపి తలకు పెట్టుకోవాలి.

10. అరగంటాగి స్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.

11. పావుకప్పు మెంతుల్ని నాలుగైదు గంటల ముందు పెరుగులో నానబెట్టుకోవాలి.

12. దాన్ని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగానే రుబ్బుకోవాలి.

13. దీన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించి బాగా నలుగు పెట్టుకోవాలి.

14. ఇలా చేయడం వల్ల మృత కణాలు తొలగిపోతాయి. చర్మంపై పేరుకున్న దుమ్ము,ధూళి, మురికి వదిలిపోతాయి. చర్మం నునుపుగా తయారవుతుంది.

15. ఇలా కనీసం వారంలో ఒకసారి చేస్తే యుక్తవయసు అమ్మాయిల్లో మొటిమల సమస్య తగ్గుతుంది.

Saturday, 27 August 2016

కాకరకాయ చక్రాల వేపుడు


                                                         కాకరకాయ చక్రాల వేపుడు

కావలిసిన పదార్థాలు
1. కాకర కాయలు పావు కేజీ
2. సెనగపిండి 2 స్పూన్స్
3. కొబ్బరికోరు చిన్న కప్పు
4. ఉప్పు రుచికి సరిపడా
5. కారము సరిపడా
6. కరివేపాకు కొద్దిగా
7. ఆవాలు అరస్పూన్
8. జీలకర్ర అరస్పూన్
9. పసుపు కొద్దిగా
10. ఎండుమిరపకాయలు 2
11. ఆయిల్ 5 స్పూన్స్

తయారీ విధానం
ముందుగా కాకర కాయలను శుభ్రం గా కడిగి
సన్నగా గుండ్రంగా తరుగుకోవాలి
మధ్యలోని గింజలను తీసి వేయాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
తరిగిపెట్టుకున్న కాకర కాయ ముక్కలను వేసి
దొరగావేపుకొవాలి దొరగావేగాక
సెనగపిండిని వేసి కాసేపు వేగనిచ్చి
ఉప్పు కారమువేసి బాగా కలపాలి
స్టవ్ పైన వేరే బాణలి పెట్టి
ఒక స్పూన్ ఒఇలవేసి పైన చెప్పిన పోపుదినుసులను వేసి
వేగాక కరివేపాకు కొబ్బరికోరులను వేసి
దోరగా వర్గానిచ్చి
ముందు గా వేపుకుని పెట్టుకున్న కాకరకాయ ముక్కల పైన వేసి
బాగాకలిపి
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటె

కాకర కాయ చక్రాల వేపుడు రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi





Friday, 26 August 2016

" కమ్మని కలలే సాకారం "

                                            " కమ్మని కలలే సాకారం "

ఆదర్శ్ రాఘవ రావు కు ఒక్క గా నొక్క కొడుకు . చిన్నతనము లోనే తల్లి పొతే ,
మళ్లీ "  పెళ్లి చేసుకోకుండా కొడుకుని గారాబముగా పెంచాడు .
ఇంజీనిరింగ్ చదువుతాను అంటే అప్పు చేసి మరీ చదివించాడు .
అది పూర్తి ఐన తరువాత , తనకు సినిమా ల మీద ఇష్టము ఉంది
"దర్సకత్వము " చేస్తాను అంటూ తిరగడము మొదలు పెట్టాడు .
అది చూసి రాఘవ ఉద్యోగము చేస్తే " జీవితానికి భద్రత " ఉంటుంది
అందులో చేర మంటాడు .
కానీ ఆదర్శ్ వినిపించు కోడు . ఇద్దరి మధ్య రోజు వాగ్వివాదము జరుగుతూ
ఉంటుంది రాఘవ కు విసుగు ఎక్కువ ఐతే గిన్నెలు విసిరేసి తన అసహనాన్ని చూపిస్తుంటాడు .
 రాత్రి కొడుకు ఇంటికి ఆలస్యము గ వచ్చాడని
ఆరోజు ఉదయము కూడా గొడవ జరుగుతోంది .
"తను చేసిన సినిమా పూర్తి ఐయీన్దని " అందుకే ఆలస్యము ఐయిన్దని చెప్పాడు
ఐనా కోపముతో చేతిలో ఉన్న గిన్ని వేసిరేసాడు నేల మీద . అది దొర్లుకుంటూ వెళ్లి గుమ్మము లో పడిం ది . అప్పుడే లోపలి కి అడుగుపెడుతున్న చారి ఆ గిన్ని తీసి పట్టుకుని
"ఏమిటయ్య రాఘవయ్యా" , గిన్నెలు అలా విసిరేస్తున్నావ్ "
అంటూ లోపలి కి వచ్చారు చారి .
" రండి అంకుల్ వచ్చి కూర్చోండి " అంటూ చూస్తున్న టీవీ ని అఫ్ చేసాడు ఆదర్శ్
" ఏరా అబ్బాయి బాగున్నావా " ఈ మధ్య కనిపించుట లేదు "
అంటూ కూర్చున్నాడు చారి .
రాఘవయ్య బయటకు వస్తూ
" ఏంచేస్తాం " చెట్టంత  ఎదిగిన కొడుకు
  చేతికి  అంది వస్తాడు అనుకుంటే "
" చలన చిత్రాల " మోజు లో " జీవితము చేజర్చుకుంటుంటే "
చూస్తూ కుర్చోవడముతప్ప  " చేయి " చేసుకోలేముగా "
అందుకే ఆ అసహనాన్ని ఇలా .........
అంటూ వచ్చి కూర్చున్నాడు రాఘవయ్య.
" ఇంతకూ ఏం జరిగింది " అని అడిగాడు చారి .
" అప్పు చేసి ఇంజనీరింగ్ " చదివించాను .
" దానికి లక్షలు ఖర్చు అయ్యాయి " ఇప్పుడు
" సినిమాలంటే ఇష్టము , దర్సకత్వము చేస్తాను  అంటూ తిరుగుతున్నాడు . "
ఏదో ఒక ఉద్యోగమచేసి ఆ అప్పు తీరుస్తాడు అనుకుంటే ,
" దమ్మిడి  సంపాదన లేదు "
" అప్పు తీర్చే మార్గము కనిపించుట లేదు" ఏం చెయ్యాలో అర్థము కాక
 ఇలా ప్రవర్తిస్తున్నాను " అన్నాడు రాఘవయ్య
" ఇంత జరుగుతున్నా ఏం పట్టనట్టు ఎలా ఉన్నడో చూడు " అన్నాడు రాఘవయ్య .
" తల్లి లేని బిడ్డ  , ప్రాణాలన్ని  వాడి మీదే పెట్టుకు బ్రతుకుతున్నాను" ,
" తండ్రి మాట మిద గౌరవములేదు, భవిష్యత్ మిద భయము లేదు "
అంటూ తన ఆవేదనను వ్యక్తము చేసాడు రాఘవయ్య.
 అప్పుడు  చారి గారు
 " మీ నాన్న బాధ అర్థము చేసుకోవచ్చు కదా ఆదర్శ్ " అన్నాడు
అది ఏమి లేదు అంకల్
" నా చిన్నప్పుడే మా అమ్మ పొతే ,
నాన్నే నాకు " అన్నీ"  అయి పెంచాడు "
నన్ను  పెంచాదానికి  నాన్న పడిన   కష్టములు నాకు  తెలుసు . "
" నా కోసము  మళ్లీ పెళ్లి  చేసుకోలేదు "
"నన్ను ఇంత వాడిని చేసాడు"
" అలాంటి నాన్నను ఇబ్బంది పెడతానా " ,
"కాని నాకు కుడా కొన్ని  ఇష్టాలు ఉంటాయి ."
" నా కలలు నెరవేర్చు కొనేది ఎప్పుడు ,"
" నాకేమో  " సినిమా "   అంటే ఇష్టము .
 "అలాగ అని సినిమా అంటూ తిరిగితే ,
అందులో అవకాశాలు రాకపోతే ,"
అప్పుడు కుర్చుని చదవలేనుగా ,
అందుకే " ఇంజనీరింగ్  " పూర్తి చేసాను
ఒక సారి  ఇంజనీరింగ్ పూర్తీ అవుతే , జాబు ఎప్పుడైనా వస్తుంది ,
రెండు ఏళ్ళ పాటు నా కలలని నెరవేర్చుకునే ప్రయత్నమూ చేస్తున్నాను .
ఇంకో రెండు ఏళ్ళు చదువు కుంటున్నాను అనుకోమనండి
విజయము వస్తే సరే , లేదంటే అప్పుడే
ఆయన చెప్పునట్టు జాబు లో చేరతాను "
" ఒక రెండేళ్ళు   నా కోసము ఆగలేరా " అని అడిగితె " కోపము ,
ఏం మాట్లాడ మంటారు "
" మిరే చెప్పండి అంకుల్  " అన్నాడు ఆదర్శ్
" అబ్బాయి చెప్పింది సబబు గానే ఉంది కదా రాఘవా  ."అన్నాడు  చారి
"చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తుంటే సరిదిద్దాను "
"ఇప్పుడు తప్పుటడుగులు " వేస్తూ ఉంటె
చూస్తూ ఎలా ఉరుకోమంటావు రా వాడిని " అన్నాడు రాఘవ
నేను వేసేవి తప్పుటడుగులు
అని ఎందుకు అనుకుంటున్నారు "
నాకు ఇష్టమైన రంగములో రాణించి
నా కలలను నేర వేర్చుకొనే ప్రయత్నము చేస్తున్నాను
అనుకోవచ్చు కదా "
చెప్పండి అంకుల్ అన్నాడు ఆదర్శ్
" సినిమా అన్నది కలల  ప్రపంచము . "
"అక్కడ విజయము సాధించాడానికి చాల కష్ట పడాలి
"దానికి అదృష్టము కలిసి రావాలి , "
అందు లో "సక్సెస్ "ఐన వాళ్ళ కన్నా , "ఫెయిల్ "ఐన వాళ్ళే ఎక్కువ
"సక్సెస్ కాక పొతే " ఆ దిగులు తో "
"భవిష్యత్  నాశనము చేసుకుంటా డెమోనని " నా భయము
ఒక తండ్రి గా నా ఆవేదన అర్థము చేసుకుని
"బుధి గా జాబు లో చేరరా అంటే విని పించుకోడు "
అన్నాడు రాఘవ
"విజయము , అపజయము మన చేతులలో ఉండక పోవ చ్చు , "
"కానీ సహనము అసహనము " మన చేతులలో నే ఉంటాయి కదా ,
ఐనా "ప్రయత్నించి ఫెయిల్ ఐతే ఓటమిని అంగీకరిస్తాను గాని , "
"అసలు ప్రయత్నించ కుండానే" "  ,
" ఓటమిని " అంగికరించమంటే ఎలా ?
చెప్పండి అంకుల్ అన్నాడు ఆదర్శ్
"పిల్లలు పుట్టగానే వాళ్ళు "అది అవ్వాలి,
ఇది "  అవ్వాలి అని చిన్నప్పుడే నిర్ణయము చేస్తారు "
కాని పెద్ద అయ్యాక వాళ్ళకి కొన్ని
 "ఇష్టాలు " ఏర్పడతాయి ,
,"కోరికలు " ఉంటాయి ,
"జీవితము లో ఎలా ఉండాలో " కొన్ని కలలు " ఉంటాయి "
అందుకు మీ "ప్రోత్సాహము "మాకు చాల అవసరము
పుట్టినప్పటి నుంచి మీ మాటలు వింటూ పెరిగాము ,
మీరు అస్తమాను "నేగ్గలేరు, "నేగ్గలేరు  "అంటూ ఉంటె
"మా మిద మాకే " నమ్మకము " పోతుతుంది
"అప్పుడు నిజముగానే " విజయము " సాధించ లేము .
"ముందు మా కలలను నెరవేర్చుకొనేటందుకు " ప్రోత్సాహమును ఇవ్వండి  "
"విజయము సాధిస్తే సరే , "లేదంటే మీ అండ ఎలాగు ఉంది కదా ,
"మీరు ప్రక్కన ఉన్నారు అన్న ధైర్యము తో "
"ఓటమిని ప్రక్కకు పెట్టి ,
"మీరు చూపించిన మార్గములో "
""కొత్త జీవితము " ప్రారంభిస్తాము  " అన్నాడు ఆదర్శ్
వాడు చెప్పింది ఒకసారి ఆలోచించరా రాఘవ
" ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు " ,
"ఇంట్లో మనమే ప్రోత్సాహించక పొతే "
"పాపము పిల్లలు బయటకి వెళ్లి ఎలా సాధిస్తారు "
"మనము వాళ్ళ కలలను సాకరకారము  చేసుకునెటందుకు
" ప్రోత్సాహము " ఇద్దాము
"ఫెయిల్ ఐతే "
"మనము ఎలాగు ఉన్నాము కదా ,
"ఏదో ఒక దారి చూపిద్దాము "
"పిల్లల సంతోషము కన్నా మనకి " ఏది ఎక్కువ కాదు కదా " అన్నాడు చారి
" నీ ఇష్టము రా ఆదర్శ్ ,
"నీకు ఎలా కావలేంటే అలా చెయ్ "
"నీవు కోరుకున్న"  రంగము " లో విజము సాధించు, "
" నీ " వెనుక నేను ఉంటాను "
"కానీ ఫెయిల్ ఐతే మటుకు '
నేను ఉన్నానని "మర్చిపోకు ,
అంటూ ఆప్యాయముగా గుండెలకి హత్తుకున్నాడు రాఘవ .



Thursday, 25 August 2016

కృష్ణాష్టమి


                                                                       కృష్ణాష్టమి

శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. ఆగస్టు 25న శ్రీకృష్ణామి. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి
 లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు.
చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది.
 కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు.
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది.
కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.

కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలు) లేచి, తలస్నానము చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపుకుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి. పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధము,తులసి మల ,శ్రీ కృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం , పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి.
ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి.
తదనంతరం పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి, తూర్పు దిక్కునకు తిరిగి
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
 ఇంకా పూజా సమయంలో
బాలకృష్ణ స్తోత్రమ్,
శ్రీకృష్ణ సహస్ర నామాలు,
శ్రీమత్భావగతములతో శ్రీకృష్ణున్ని స్తుతిస్తే మంచిది.
ఆ తరువాత శ్రీకృష్ణునికి నైవేద్యాలు సమర్పించి, దీపారాధన గావించి పూజను ముగించాలి.
కృష్ణాష్టమి రోజున ఒంటి పూట భోజనం చేసి, శ్రీకృష్ణునికి పూజ చేసి, శ్రీకృష్ణ దేవాలయాలు, గౌడీయ మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
 ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరతాయని పురోహితులు చెబుతుంటారు.
 ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది.

కృష్ణాష్టమి రోజున బంగారంతో గానీ, వెండితో గానీ చంద్రబింబాన్ని తయారు చేసి, వెండి లేక బంగారు పాత్రలలో ఉంచి పూజించి అర్ఘమిస్తే సకల కోరికలు తీరతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది.
అంతేగాక ఈ పుణ్యదినాన భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలిగిపోతాయని మహర్షులు చెప్పినట్లుగా ఉంది
సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని 
సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది.

Saturday, 13 August 2016

పోలిపూర్ణం బూరెలు


                                                               పోలిపూర్ణం బూరెలు

కావలిసిన పదార్థాలు

1. సెనగ పప్పు పావుకేజీ
2. పంచదార పావుకేజీ
3. ఇలాచీ పొడి కొద్దిగా
4. కొబ్బరికోరు ఒక కప్పు
5.ఆయిల్ అరలీటరు

తోపుకు
 ఒక కప్పు మైదాపిండి
 ఒక కప్పు వరిపిండి ,
ఒక కప్పు సెనగపిండి
 కొద్దిగాఉప్పు నీళ్లు

తయారీ విధానం

 ముందురోజు రాత్రే  సెనగపప్పును నీళ్లలో నానబెట్టుకోవాలి
నానబెట్టుకున్న సెనగపప్పును శుభ్రంగా కడిగి
 మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
ఇడ్లి ప్లేట్ లకు ఆయిల్ రాసి
ఈముద్దను వాటిలో పెట్టి కుక్కరులో పెట్టి
ఇడ్లి మాదిరిగా ఉడికించి చల్లారబెట్టుకోవాలి
చల్లారిన ఈ ఇడ్లీలను పొడి లాగ గ్రైండ్ చేసుకోవాలి
 ఈ మిశ్రమంలో పంచదార ,ఇలాచీ పొడి, కొబ్బరి కోరు, వేసి
బాగా కలుపుకుని చిన్న ఉండలుగా చేసుకోవాలి
ఒక గిన్నెలోకి పైన చెప్పిన మైదా పిండి
 సెనగపిండి వరిపిండి కొద్దిగా ఉప్పు వేసి
నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ పోసి ముందుగా చేసి పెట్టుకున్న ఉండలను
 పిండి మిశ్రమంలో ముంచి దోరగా వేపుకోవాలి
దోరగా వేగిన వీటిని
ఒక ప్లేటులో టిష్యూ పేపర్ వేసి దానిమీద వేసుకోవాలి
అంతే ఘుమఘుమ లాడే పోలి పూర్ణం బూరెలు రెడీ
ఇవి 3 రోజులు నిలువ ఉంటాయి


Subha's Kitchen


Thursday, 11 August 2016

కేబేజీ సెనగపప్పు కొబ్బరికోరు కూర

cabbage fry

                                           కేబేజీ సెనగపప్పు కొబ్బరికోరు కూర

కావలిసిన పదార్థాలు

1. కేబేజీ పావు కేజీ
2. కూర సెనగ పప్పు ఒక కప్పు
3.  కొబ్బరికోరు ఒక కప్పు
4. పచ్చిమిర్చి 3
5.  కరివేపాకు

 పోపు దినుసులు

 మినపప్పు 1 స్పూన్, ఆవాలు అర స్పూన్,
 జీలకర్ర అర స్పూన్, ఎండుమిరపకాయలు 2,
 ఉప్పు రుచికి సరిపడా,ఆయిల్ 4 స్పూన్స్

తయారీ విధానము 

ముందుగా కేబేజీ ని శుభ్రంగా కడిగి సన్నగా తరుగుకోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకోవాలి .
కూరసెనగపప్పును శుభ్రంగా కడుగు కోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి,
 అందులో కడిగి పెట్టు కున్న సెనగపప్పు ను ,నీళ్లను పోసి
, ఒక పావుగంట ఉడకనిచ్చి
 అందులో తరిగి పెట్టుకున్న కేబేజీ ని కూడా వేసి
మరి కొన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి
 పప్పు కేబేజీ పూర్తిగా ఉడికిన తరువాత
చిల్లుపల్లెం లో పోసి చల్లారనివ్వాలి
 స్టవ్ మీదబాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
 పైన చెప్పిన పోపు దినుసులను వేసి అవి వేగాక
 కొబ్బరికోరు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకును వేసి  అవి వేగాక
 ముందుగాఉడికించి చల్లారబెట్టుకున్న కేబేజీ సెనగపప్పును వేసి
 కొద్దిసేపు మగ్గనిచ్చి ఉప్పు వేసి కూర అంతా కలిసేలా కలిపి
 స్టవ్ ఆఫ్ చేసుకుని
 కొత్తి మీరతో గార్నిష్ చేసుకుంటె
 ఘుమఘుమ లాడే కేబేజీ సెనగ పప్పు కొబ్బరి కోరు కూర రెడీ

ఈ కూరను అన్నం లోను చపాతీలోకి బాగుంటుంది

Subha's Kitchen

ప్రతీ మనిషీ మూడు ఋణాలతో పుడతాడు.


ప్రతీ మనిషీ మూడు ఋణాలతో పుడతాడు.

1. ఋషిఋణం,
2. దేవఋణం,
3. పితౄణం.

ఈ ఋణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి. ఈ ఋణాలు తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తంది. మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. కావున ప్రతివాడు ఋణ విముక్తుడు కావాలి.
మన పెద్దలు చెప్పారు - "బ్రహ్మచర్యేణ ఋషిభ్యః" " యజ్ఞేన దేవేభ్యః" "ప్రజయా పితృభ్యః" అని.

1. ఋషి ఋణం: బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి. అంటే బ్రహ్మచర్యంలో చేయవలసిన వేదాధ్యయనం చేయాలి. అలాగే పురాణాలు మొదలైన వాగ్మయాన్ని అధ్యయనం చేసి తరువాత తరం వారికి వాటిని అందించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి.

2. దేవఋణం: యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, చేయించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞాలవల్ల దేవతలు తృప్తి చెందుతారు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. పాడిపంటలు వృద్ధి చెందుతాయి. కరువు కాటకాలు తొలగిపోతాయి. నీరు, గాలి, వెలుతురు, ఆహారాన్ని ప్రసాదిస్తున్న వారందరికి మనమెంతో ఋణపడివున్నాం. కనుక ఆ ఋణాన్ని తీర్చకపోతే మనం కృతఘ్నలం అవుతాం.

3. పితౄణం: సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, మనకు జన్మనిచ్చి పెంచి పోషించినవారు. వంశాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించడం ద్వారా, పితృ దేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితౄణం తీర్చుకోవాలి. సంతానం కనాలంటే వివాహం చేసుకోవాలి గదా! "ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః" అంటుంది వేదం. అంటే వంశపరంపరను త్రెంచవద్దు. వేదాధ్యయనం, యజ్ఞం చేయడం, సంతానము కనడం ఇవి మానవుడు తప్పని సరిగా చేయవలసిన విధులుగా వేదం చెపుతున్నది. యజ్ఞాలలో పంచ యజ్ఞాలు విధిగా ప్రతి మనిషీ చేయాలి. అవి దేవ, మనుష్య, భూత, పితృ, బ్రహ్మ యజ్ఞాలు

Thursday, 4 August 2016

కర కర లాడే " పకోడీ "


 కర కర లాడే  " పకోడీ "
కావలిసినపదార్థాలు
1. సెనగపిండి ఒక గ్లాసు
2. వరిపిండి 3 స్పూన్స్
3.  బేకింగ్ పౌడర్ కొద్దిగా
4. ఉల్లిపాయలు 3
5. పచ్చిమిర్చి 3
6. అల్లం చిన్నముక్క
7. కొత్తిమీర
8. కరివేపాకు
9. ఆయిల్ అరలీటరు
10. ఉప్పు రుచికి సరిపడా
11. కారంకొద్దిగా

తయారీ విధానం
ముందుగా ఉల్లిపాయలను సన్నగాపొడవు గాను
పచ్చిమిర్చిని , అల్లాన్ని , కొత్తిమీరను ,
సన్నగాను తరుగుకోవాలి .
సన్నగా తరిగిన వీటిని ఒక గిన్నెలో తీసుకుని
 కొద్దిగా ఉప్పు వేసి కలిపి , ఒక 5 నిమిషాలు వుంచెయ్యాలి.
 5 నిమిషాలు అయ్యాక
 సెనగపిండి , వరిపిండి ని , బేకింగ్ పొడి
ఉప్పు , కారము వేసి , కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి .
స్టవ్ వె,లిగించి బాణలి పెట్టి ఆయిల్ పోసుకుని
వేడెక్కాక
ముందుగా తయారుచేసి పెట్టుకున్న
 సెనగపిండి , ఉల్లిపాయలు,  పచ్చిమిర్చి , అల్లం ,
కొత్తిమీర కలిపిన  మిశ్రమాన్ని
 కొంచెం , కొంచెం గా వేసుకుని
దోరగా వేపుకుంటే
కర కర లాడే " పకోడీ " రెడీ
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

కాకరకాయ కూర


                                                                  కాకరకాయ  కూర

కావలిసిన పదార్థాలు
1. కాకరకాయలు పావుకేజీ
2. సెనగపిండి 5  స్పూన్స్
3. కారము 4 స్పూన్స్
4. ఉప్పు రుచికి సరిపడా
5. జీలకర్ర కొద్దిగా
6. ఆయిల్  8 స్పూన్స్

తయారీ విధానం

ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి
పైన ఉన్న తొడిమలు కత్తిరించుకుని
 కాయమధ్యలో ఒక గాటు పెట్టుకుని
లోపలున్న గింజలు తీసివేయాలి
ఒక ప్లేట్ లోకి పైన చెప్పిన
సెనగపిండి , ఉప్పు,  కారము , జీలకర్ర ,
ఆయిల్ వేసుకుని ముద్దలాగ చేసుకోవాలి .
ఈ ముద్దను గింజలు తీసివేసిన
కాకరకాయలో కూరుకోవాలి
స్టవ్ వెలిగించి వెడల్పయిన బాణలి పెట్టి
వేడెక్కాక ఆయిల్ వేసి
దాంట్లో సెనగపిండి మిశ్రమం , కూరుకున్న కాకరకాయలు
వేసి దోరగా వేపుకోవాలి .
మధ్య మధ్యలో కాయలను పైన కిందా కలుపుతూ
ఆయిల్ వేస్తూ ఉండాలి
కాయలు వేగాక ఒక ప్లేట్ లోకి తీసుకుని
పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
ఘుమ ఘుమ లాడే కాకరకాయ కూర రెడీ

కూర అంతా అయ్యేవరకు స్టవ్ మంట సిమ్ లో
ఉండేలా చూసుకోవాలి లేకపోతే కాకర కాయలు మాడిపోతాయి
ఈకూరకి సన్నగా చిన్నగా ఉండే కాకరకాయలు
తీసుకోవాలి దీనివలన కూర రుచిగా వస్తుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi



Wednesday, 3 August 2016

మిరపకాయబజ్జీలు


                                                             మిరపకాయబజ్జీలు

కావలిసిన పదార్థాలు

1.  పచ్చిమిరపకాయలుపెద్దవి 6
2. సెనగపిండి ఒకగ్లాసు
3. వరిపిండి 4 స్పూన్స్
4. బేకింగ్ పొడి కొద్దిగా
5.  వాము కొద్దిగా
6. చింతపండు నీళ్లు
7. ఉల్లిపాయలు 2
8. ఆయిల్
9. నిమ్మకాయ 1
10. కొత్తిమీర కొద్దిగా
11. ఉప్పు రుచికి సరిపడా
12. కారము కొద్దిగా

తయారీవిధానం

ముందుగా ఒక బౌల్ లోకి సెనగపిండి, వరిపిండి,
 బేకింగ్ పొడి , ఉప్పు , కారము , వాము ,
వేసి బాగా కలిపి నీళ్లుపోసుకుని
మధ్యస్తంగా కలుపుకోవాలి .
పచ్చిమిరపకాయలను మధ్యలో చాకుతో గాటు పెట్టుకుని
చింత పండు నీళ్ళలోఒక 5 నిమిషాలు
ఉడికించుకుని , ఒక ప్లేటులోకి తీసుకుని చల్లారనివ్వాలి .
ఉల్లిపాయలను సన్నగా తరుగుకోవాలి  ,
వాముకొద్దిగా , ఉప్పు , తరిగిన ఉల్లి పాయ ముక్కలను ,
కలిపి ఉడికించుకున్న మిరపకాయల్లో కూరుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ పోసుకుని మిరపకాయలను , సెనగ పిండి మిశ్రమం లో ముంచి
ఆయిల్ లో లేతగా వేపుకోవాలి
 లేతగా వేపుకున్న వీటిని
మరల సెనగపిండి మిశ్రమం లో ముంచి
దోరగా  వేపుకోవాలి .

మిరపకాయ బజ్జీలు రెడీ.

Subha's kitchen 

Tuesday, 2 August 2016

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు

 
                               

                                                   శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు

                                                            అలంకార ప్రియుడు,
                                 తనపై ఆలపించే భక్తి పాటలు, కీర్తనలు కు మురిసిపోయి

                                                          కోటి వరాలను అందించే

                                       కలియుగ ప్రత్యక్ష దైవం " శ్రీ వేంకటేశ్వర స్వామి ని  "

తమ పాటలతో, కీర్తనలతో కొలిచి తరించిన వారెందరో మహా వాగ్గేయకారులు, మహానుభావులు.

అందరిలో ఆద్యుడు  " శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. "

గొప్ప వాగ్గేయకారుడి గా ప్రసిద్ది చెందారు. కన్నడ వాగ్గేయ కారుడు శ్రీ పురందర దాసు గారు అన్నమయ్యను, శ్రీనివాసుని అవతారం గా ప్రశంసించారు అని అంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు ఖడ్గం ఐయిన “నందకం ” అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక నమ్మకం ఉంది.

నారాయణ సూరి, లక్కమాంబ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకుని సాష్టాంగ ప్రణామం ఆచరించినప్పుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భం లో ప్రవేశించినద ని గాధ. అలా పుట్టిన శిశువే అన్నమయ్య. ఆ ఏడుకొండలవాడు ధరించే బిరుదు “గజ్జియల ముప్పిడికఠారాన్ని ” వారికి అందచేసారుట.

అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతము, తండ్రి పాండిత్య ఛాయలలో పెరిగాడు.ఉపవీత సంస్కారము జరిగిన తరువాత ఇంటి గురుకులం లోనే విద్యాభాసంజరిగింది. తన ఏడేళ్ళ వయసులో గోవింద నామ స్మరణ చేస్తూ, చేయిస్తూ పొలము పనులు చేస్తుండగా పొరపాటున వేలు తెగింది. మనసు గోవిందుని పైవుంటే పొలం పనులు ఎలా సాగుతాయి…
 ఇహ అలానే వెళ్లి పొలం గట్టుపై నిదురించాడుట. అప్పుడతడు ఓ అపూర్వమైన కల కన్నాడట. అంతలో ఒక్క ఉదుటున లేచారు. చుట్టుప్రక్కల ఉన్నవారందరూ ఏమయ్యింది అని ప్రశ్నించగా , ఇలా వివరించాడు….

“కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు శ్రీ వేంకటా ద్రీశుడంటి”

అంటూ, ఇక నాకు ఈ ఐహిక బంధాలు వద్దు నేను వెంటనే తిరుమల వెళ్ళాలి అని అక్కడ నుండే బయలు దేరాడు అన్నమయ్య. ఆ తిరుమలేశుని మహిమ వల్లనె, ఆ సమయంలో అటుగా తిరుమల యాత్రికులవలె సనకసనన్దాదులనె మునీసులు పసుపు బట్టలు కట్టుకుని తలపైముడుపులు పెట్టికుని వెళుతున్నరుట…వారితో పాటు వెళ్ళిపోయారు… తల్లితండ్రులను మరిచారు, ఆకలి దప్పులు మరిచారు. అంత దూరం కాలి నడకన చేరుకున్నారు…. ఆ ఏడుకొండలు చూడగానే అన్నమయ్య కీర్తన చేసారు…

“అదివో అల్లదివో శ్రీ హరి వాసము
పది వేల శేషుల పడగల మయము”
అంటూ కొండపైకి వెళ్లారు…

అలా అన్నమయ్య ఎన్నో అద్భుత కీర్తనలు చేసారు. వారు సంకీర్తనా చార్యుడు, పంచ మాగమ సార్వ భౌముడు. తెలుగు సాహితి చరిత్రలో మొదటి వాగ్గేయకారుడు అయిన అన్నమయ్య కు “పద కవితా పితామహుడు” అని బిరుదు ఉన్నది.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ని, అహోబిలం లో శ్రీ నరసింహ స్వామిని ,ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 36000 కు పైగా సంకీర్తనలను రచించారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకిర్తనాచార్యులకు అన్నమయ్య మార్గ దర్శకుడు.

శ్రీ వారి సేవలో ఎన్నోకీర్తనలు రచించి, తరించి ఎందరికో మార్గ దర్శకుడైన అన్నమయ్య జన్మచరితార్ధమైనది. ఇంచుమించు 85 సంవత్సరముల పాటు ఆయన తిరుమలలోనే వున్నారు.వారి కీర్తనలు జగత్ విఖ్యాతం చెందాయి.

అన్నం పరమాన్నం


                                                                అన్నం పరమాన్నం

కావలిసిన పదార్థాలు

1. బియ్యం ఒక గ్లాసు
2. బెల్లం ఒకగ్లాసు
3. పాలు అరలీటరు
4. ఇలాచీ పొడి కొద్దిగా
5. జీడిపప్పుపలుకులు
6. నీళ్లు 2 గ్లాసులు
7. నెయ్యి కొద్దిగా

తయారీ విధానం

ముందుగా పాలు కాచుకోవాలి .
బెల్లాన్ని తురుము లాగ చేసుకోవాలి .
బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు బియ్యానికి
రెండు గ్లాసుల చొప్పున నీళ్లు పోసి కుక్కరులోపెట్టి
ఉడికించుకోవాలి .
ఉడికించుకున్న అన్నం చల్లారాక ,
దాంట్లో పాలు బెల్లం వేసి బాగాకలుపుకోవాలి .
స్టవ్ వెలిగించి పాలు , బెల్లం ,
అన్నం కలిపినా మిశ్రమాన్ని పెట్టి బాగా ఉడకనివ్వాలి .
ఇలాచీ పొడి,  నేతిలో వేపుజున్న జీడిపప్పు పలుకులను ,
వేసి బాగా కలిపి దగ్గర పడేంత వరకు ఉంచి
స్టవ్ ఆఫ్ చేసుకుంటే
ఘుమ ఘుమ లాడే అన్నం పరమాన్నం రెడీ.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

దసరా శుభాకాంక్షలు

Monday, 1 August 2016

సేమ్యా ఉప్మా


                                                                   సేమ్యా ఉప్మా

కావలిసిన పదార్థాలు

1. సేమ్యా పావుకేజీ
2. నెయ్యి కొద్దిగా
3. ఆయిల్ 3 స్పూన్స్
4. టొమాటో1
5. పచ్చిమిర్చి 2
6. అల్లం చిన్న ముక్క
7. కరివేపాకు
8. ఉల్లిపాయలు 2
9. కేరట్ 1
10. నీళ్లు 3 గ్లాసులు
11. ఉప్పు రుచికి సరిపడా

పోపు దినుసులు

సెనగపప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్
ఆవాలు అర స్పూన్ , జీలకర్ర అర స్పూన్
పల్లీలు 2 స్పూన్స్

తయారీ విధానం

ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
వేడెక్కాక నెయ్యి వేసి కరిగాక ,
సేమ్యాను దోరగా వేపుకోవాలి .
ఉల్లిపాయ , టొమాటోలను
,అల్లాన్ని , సన్నగా తరుగుకోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగాను ,
కేరట్టును కోరులాగా చేసుకోవాలి
స్టవ్ మీద బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి
ముందుగా పల్లీలను వేసి అవి వేగాక
పైన చెప్పిన పోపు దినుసులను వేసి
 అవి దోరగా వేగాక
తరిగిపెట్టుకున్న కూరముక్కలను
కరివేపాకును వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి .
అవి  మగ్గాక నీళ్లు పోసుకుని,
 ఉప్పు వేసి బాగా కలిపి నీళ్లను మరగనివ్వాలి
నీళ్లు బాగా మరిగాక
ముందుగా వేపుకుని పెట్టుకున్న సేమ్యాను వేసి
కొద్దిసేపు ఉడకనివ్వాలి
నీరుఅంతా పోయి ఉప్మా దగ్గరపడేంత వరకు ఉంచి
స్టవ్ ఆఫ్ చేసుకుని
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే

ఘుమఘుమ లాడే సేమ్యా ఉప్మా రెడీ

Subha's kitchen