సేమ్యా పులిహోర
కావలిసిన పదార్థాలు
1. సేమ్యా ఒక కప్పు
2. పల్లీలు 2 స్పూన్స్
3. సెనగపప్పు 1 స్పూన్
4. మినపప్పు 1 స్పూన్
5. ఆవాలు అర స్పూన్
6. జీలకర్ర అర స్పూన్
7. ఎండుమిరపకాయలు
8. ఆయిల్ 4 /స్పూన్స్
9. కరివేపాకు
10. పచ్చిమిర్చి 4
11. అల్లం చిన్న ముక్క
12. నిమ్మ రసం కొద్దిగా
13. కొత్తిమీర కొద్దిగా
14. నీళ్లు తగినన్ని
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ,తగినన్ని నీళ్లు పోసి ,
మరగనిచ్చి దీనిలో సేమ్యా ను వేసి ,ఉడకనివ్వాలి .
ఇలా ఉడికిన సేమ్యాను చిల్లుల పళ్లెం లో వేసి , చన్నీళ్లను పోసి ,
చల్లారనివ్వాలి . దీనివలన సేమ్యా పొడి పొడిలాడుతూ ఉంటుంది.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,ఆయిల్ వేసి ,
పల్లీలు వేసి దోరగా వేగాక,
పైన చెప్పిన పోపు దినుసులు వేసి ,
అవి దోరగా వేగాక పచ్చిమిర్చి చీలికలు ,అల్లం ముక్కలు ,
కరివేపాకు వేసి దోరగా వేపుకోవాలి .
ఒక వెడల్పయిన బేసిన్ లోకి చల్లారిన సేమ్యాను వేసి , పసుపు ,
తగినంత ఉప్పు వేపుకుని , పెట్టుకున్న పోపు వేసి ,బాగాకలిపి ,
నిమ్మరసం కూడా వేసి ,
బాగా కలిపి , పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
సేమ్యా పులిహోర రెడీ అవుతుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi