Monday, 26 June 2017

సెనగ పిండి పచ్చడి లేక బొంబాయి చట్నీ


సెనగ పిండి  పచ్చడి  లేక  బొంబాయి  చట్నీ

కావలిసిన  పదార్థాలు
1. సెనగ  పిండి  6 స్పూన్స్
2.  పసుపు
3. ఉప్పు  రుచికి  సరిపడా
4. పచ్చిమిర్చి  2
5. అల్లం  చిన్న  ముక్క
6. కరివేపాకు
7. కొత్తిమీర
8. చింత పండు  కొద్దిగా
9. నీళ్లు  తగినన్ని

పోపు దినుసులు
సెనగ పప్పు  అర స్పూన్ ,   మినపప్పు  అర స్పూన్  ,ఆవాలు  కొద్దిగా ,
 జీలకర్ర  కొద్దిగా  ,ఎండుమిరప కాయలు  2 , ఆయిల్  2 స్పూన్

తయారీ  విధానం
ముందుగా  సెనగపిండి ని కాస్త వేయించి ,  ఒక  బౌల్ లోకి  తీసుకుని  ,
తగినన్ని  నీళ్లు పోసుకుని  ఉండలులేకుండా  కలుపుకుని ,
ఒక పక్కన  పెట్టుకోవాలి  . పచ్చిమిర్చి ని  చీలికలు గాను  , అల్లమును  చిన్న  ముక్కలుగా ను
తరుగుకోవాలి . స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి   ,
వేడెక్కాక  ఆయిల్  వేసి , పైన  చెప్పిన  పోపుదినుసులను  వేసి ,
 అవి  దోరగా  వేగాక కరివేపాకు  ,పచ్చిమిర్చి  చీలికలు  ,అల్లము  ముక్కలు  వేసి  ,
అవి వేగాక  ముందుగా  నీళ్లు పోసి  ,కలుపుకుని  పెట్టుకున్న సెనగపిండి  మిశ్రమాన్ని  వేసి
పసుపు  , ఉప్పు   ,చింతపండు  గుజ్జు  వేసి  బాగా  కలిపి  ,
తగినన్ని  నీళ్లు  పోసి  ఉడకనివ్వాలి  .
స్టవ్  మంట    సిమ్  లో  ఉండాలి . మధ్య మధ్య  లో  కలుపుతూ  ఉండాలి .
బాగా  ఉడికిన  తరువాత స్టవ్  ఆఫ్  చేసుకుని ,
 ఒక  బౌల్  లోకి  తీసుకుని కొత్తిమీరతో   గార్నిష్  చేసుకుంటే
సెనగ పిండి  పచ్చడి  రెడీ
దీనిని  చపాతీ  , ఇడ్లీ  , దోసెలలోకి  బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.