Friday, 9 June 2017

టమాటో దోశ


టమాటో  దోశ

కావలిసిన  పదార్థాలు
1. బియ్యం  1 కప్పు
2. టమాటో  1
3. జీలకర్ర  పొడి  పావు  స్పూన్
4. కారం  పావు  స్పూన్
5. ఆయిల్   తగినంత
6. ఉప్పు  తగినంత
7. ఆవాలు  కొద్దిగా
8.  జీలకర్ర   కొద్దిగా
9. మినపప్పు   అర  స్పూన్
10. కరివేపాకు
11 కొత్తిమీర

తయారీ  విధానం
ముందుగా  బియ్యమును శుభ్రం గా  కడిగి  ,
తగినన్ని  నీళ్లు  పోసి  ,4 గంటల  సేపు  నానబెట్టుకోవాలి.
ఇలా  నానిన  బియ్యమును  , ఉప్పు  ,టమాటో  వేసి ,
మెత్తగా  దోశ  పిండి  మాదిరిగా గ్రైండ్    చేసుకోవాలి  .
 ఈ  పిండికి  జీలకర్ర పొడి , కారం , వేసి   బాగా  కలుపుకోవాలి .
స్టవ్  వెలిగించి  బానలిపెట్టి  వేడెక్కాక   ,
పైన  చెప్పిన  పోపు  దినుసులను  ,కరివేపాకును  ,
వేసి  దోరగా  వేపుకుని, పిండి  లో  వేసి  ,బాగా  కలుపుకోవాలి .
స్టవ్  మీద  పెనం  పెట్టి  వేడెక్కాక,  ఆయిల్  వేసి ,
రుబ్బిన  పిండిని  వేసి  దోశ  మాదిరిగా  తిప్పుకోవాలి .
 ఒక పక్క  వేగాక  ,అట్లకాడతో  తిరగేసి ,కొద్దిగా  ఆయిల్  వేసి,
దోరగా  వేగనిచ్చి  ప్లేటులోకి  తీసుకుని
 సర్వ్  చేసుకుంటే  టమాటో  దోశ  రెడీ  అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.