Friday, 19 May 2017

సున్ని ఉండలు


సున్ని ఉండలు

కావలిసిన  పదార్థాలు
1. ఛాయ  మినపపప్పు  పావుకేజీ
2. బియ్యం  4 స్పూన్స్  
3.  బెల్లం  పావుకేజీ
4. నెయ్యి  100 గ్రాములు

తయారీ  విధానం
ముందుగా   స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి ,
 వేడెక్కాక  ఛాయ మినప పప్పును ,బియ్యమును వేసి ,
 దోరగా   కమ్మటి  వాసన  వచ్చేంత  వరకు  వేపుకుని ,
 చల్లార్చుకోవాలి .చల్లారిన   పప్పును  మెత్తని  పొడిలాగా ,
 గ్రైండ్  చేసుకోవాలి  .
 బెల్లం తురుమును,ముందుగా  మనం తయారు  చేసుకున్న
పొడిని   వేసి
బాగా కలిపి ,
నెయ్యిని  కూడా  వేసి  ,
బాగా  కలిపి
ఉండలుగా చేసుకుంటే
 సున్ని ఉండలు  రెడీ  అవుతాయి
ఇవి  ఒక నెలరోజుల పాటు  నిలువ  ఉంటాయి.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.