బెల్లం ఆవ కాయ
కావలిసిన పదార్థాలు
1. మామిడి కాయ ముక్కలు 2 కప్పులు
2. కారం 1 కప్పు
3. ఆవ పిండి 1 కప్పు
4. ఉప్పు అర కప్పు
5. ఆయిల్ 1 కప్పు
6. బెల్లం 2 కప్పులు
7. పసుపు కొద్దిగా
8. మెంతులు 1 స్పూన్
తయారీ విధానం
ముందుగా మామిడికాయలు శుభ్రం గా కడిగి ,
తుడిచి , ఆరబెట్టి, ముక్కలుగా తరుగు కోవాలి.
ఒక బేసిన్ లోకి కారం , ఆవపిండి, ఉప్పు, మెంతులు ,
పసుపు , వేసి ఉండలు లేకుండా బాగా కలిపి ,
తరువాత తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను ,
ఆయిల్ ను వేసి, బాగా కలిసేలా కలుపుకోవాలి .
తరువాత 2 కప్పు ల బెల్లం తురుమును కూడా వేసి
బాగా కలిపి, 4 లేక 5 రోజులు
ఎండలో పెట్టి ,
తరువాత ఇంగువ నూనె , కాచి ,
పోసుకుంటే బెల్లం ఆవ కాయ రెడీ అవుతుంది.
*** బెల్లమును పాకం పెట్టి , ఈ పాకం లో ఆవకాయను వేసి ,బాగా కలిపినా కూడా
బెల్లపు ఆవకాయ రెడీ అవుతుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's :
Achanta Subbalakshmi
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.