రాజ్మా సలాడ్
కావలిసిన పదార్థాలు
1. రాజ్మా 1 కప్పు
2. ఉల్లి పాయ ముక్కలు పావు కప్పు
3. టొమాటో ముక్కలు పావు కప్పు
4. కొత్తిమీర తురుము 1 స్పూన్
5. ఉప్పు రుచికి సరిపడా
6. మిరియాల పొడి తగినంత
పోపు దినుసులు
ఆయిల్ 1 స్పూన్ , ఆవాలు 1 స్పూన్ , జీలకర్ర 1 స్పూన్ , కరివేపాకు, ఎండుమిరపకాయలు 2
తయారీ విధానం
ముందుగా రాజ్మా గింజలను ముందురోజు రాత్రి అంతా నాన బెట్టి ,
మరునాడు శుభ్రంగా కడిగి కుక్కరు లో పెట్టి ,
ఉడికించుకోవాలి .
టొమాటోలను , ఉల్లి పాయలను , సన్నని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి .
ఒక వెడల్పయిన బౌల్ లోకి,
ఉడికించి పెట్టుకున్న రాజ్మా గింజలు, తరిగి పెట్టుకున్న ,
ఉల్లి పాయ , టమాటో ముక్కలు , కొత్తిమీర , తగినంత ఉప్పు , తగినంత మిరియాలపొడి ,
వేసి బాగా కలిపి , ఒక 5 నిమిషాల సేపు పక్కన పెట్టెయ్యాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక , ఆయిల్ వేసి,
ఆవాలు , జీలకర్ర , ఎండుమిరప ముక్కలు , కరివేపాకు ,
వేసిదోరగా వేగనిచ్చి , ముందుగా తయారు చేసిపెట్టుకున్న ,
రాజ్మా మిశ్రమం పైన వేసి , బాగా కలిపి సర్వ్ చేసుకుంటే
రాజ్మా సలాడ్ రెడీ.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
Deepti Burgula