పాలక్ పన్నీరు
కావలిసిన పదార్థాలు
1. పాలకూర 5 కట్టలు
2. ఉల్లిపాయ 1
3. పచ్చిమిరపకాయలు 2
4. ఎర్ర కారం 1 స్పూన్
5. పసుపు కొద్దిగా
6. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
7.టొమాటోలు 3
8. ధనియాలపొడి 1 స్పూన్
9. జీలకర్ర పొడి 1 స్పూన్
10. వెల్లుల్లి రెబ్బలు 5.
11. కసూరీ మేతి 1 స్పూన్
12. ఉప్పు రుచికి సరిపడా ,
13. పన్నీరు ముక్కలు ఒక కప్పు " నెయ్యి 5 స్పూన్స్
14. ఆయిల్ 6 స్పూన్స్ ,
గరం మసాలా దినుసులు :
15. ఏలకులు 2 ,
16. లవంగాలు 2 ,
17. దాల్చినచెక్క
తయారి విధానము :
ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి ,
ఒక ఉడుకు , ఉడికించి మెత్తని పేస్ట్ లాగ గ్రైండ్ చేసుకోవాలి .
ఉల్లిపాయను , టమాటో లను సన్నగా , చిన్న ముక్కలుగాను,
పచ్చి మిర్చిని చీలికలుగాను, తరుగుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి ,
గరంమసాలా దినుసులు వేసి కొద్దీ సేపు వేగనిచ్చి ,
ఉల్లి పాయ ముక్కలు , వెల్లుల్లి రెబ్బలు ,
వేసి దోరగా వేగనిచ్చి ,
పసుపు , అల్లం వెల్లుల్లి పేస్ట్ ,పచ్చిమిర్చి చీలికలు ,ధనియాలపొడి ,
జీలకర్ర పొడి , కారం , వేసి ,
కొద్దిసేపు వేగనిచ్చి
టమాటో ముక్కలు వేసి ,పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చి ,
పాలకూర పేస్ట్ ,తగినంత ఉప్పు వేసి , ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనిచ్చి ,
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి .
వేరే బాణలిని స్టవ్ మీద పెట్టి ,వేడెక్కాక నెయ్యి వేసి ,
తరిగిపెట్టుకున్న పన్నీరు ముక్కలను వేసి ,
దోరగా వేగనిచ్చి ,
పాలకూర మిశ్రమం లో వేసి ,
బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ,
పాలక్ పన్నీరు రెడీ
ఈ కూరను చపాతీ గాని పరోటా లోగాని తింటే రుచిగా ఉంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
Deepti Burgula .....U.S.A.,