పచ్చ ఆవకాయ
కావలిసిన పదార్థాలు
1. మామిడికాయ ముక్కలు 2 కప్పులు ,
2. పచ్చ కారం 1 కప్పు
3. ఆవపిండి 1 కప్పు
4. ఉప్పు అర కప్పు
5. ఆయిల్ 1 కప్పు
6. మెంతులు 1 స్పూన్
తయారీ విధానం
ముందుగా మామిడి కాయలను శుభ్రంగా కడిగి ,తుడిచి,
ఆరిన తరువాత ముక్కలు గా తరుగుకోవాలి .
ఒక బేసిన్ లోకి పచ్చకారము ,ఆవపిండి , ఉప్పు , వేసి
ఉండలు లేకుండా బాగా కలిపి ,
ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ,
తగినంత ఆయిల్ వేసి ,బాగా కలిసేలా కలుపుకుంటే
పచ్చ ఆవకాయ రెడీ అవుతుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi