వారానికి 7 రోజులు " పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలు"
మన వాడుకలో ప్రతి రోజుకి ఒక పేరు ఉంది.
ఆది వారము, సోమ వారము, మంగళ వారము,బుదవారము,
గురువారము, శుక్రవారము, శని వారము.
ఆ పేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి వుంది.
నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు.
భారత కాలమానంలో హోరా అనగా ఒక గంట అని అర్థం.
దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు HOUR .
ఒక రోజుకు 24 గంటలుంటాయి, అంటే 24 హోరాలు.
ఒక రోజులో ఉన్న 24 గంటలు (24 హోరాలు) కూడా ఏడు హోరాల చక్రం లో తిరుగుతాయి..
ఆ 7 హోరాలకి ఏడు పేర్లున్నాయి.
అవి వరుసగా... (ఈ వరుసలోనే) శని, గురుడు, కుజుడు, రవి, శుక్ర, బుద, చంద్ర
హోరాలు ప్రతి రోజు వుంటాయి.
ఈ 7 హోరాలే ప్రతి రోజు 24 గంటల్లో ఉంటాయి.
7 గంటల కొకసారి ఈ 7 హోరాలు పూర్తీ అయ్యాక మల్లి మొదటి హోరాకి వస్తుంది.
అంటే శని హోరా నుండి చంద్ర హోరాకి మల్లి శని హోరాకి..
ఉదాహరణకు ఆది వారము రవి హోరాతో ప్రారంభం అయి ,
మూడు సార్లు పూర్తికాగా (3 సార్లు 7 హోరాలు 3x7 = 21 హోరాలు)
22 వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది.
23 వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది.
24 వ హోరా బుద హోర అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది.
ఆతర్వాత హోరా 25వ హోరా.
అనగా తరువాతి రోజు మొదటి హోరా దాని పేరు చంద్ర హోరా.
అనగా సోమవారము. అనగా చంద్ర హోరాతొ ప్రారంభ మౌతుంది.
ఏరోజు ఏ హోరాతో ప్రారంభ మవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది.
చంద్ర హోరాతో ప్రారంభమైనది గాన అది సోమ వారము.
ఈ విధంగానే మిగిలిన దినములు కూడా ఆయా హోరాల పేరన పేర్లు ఏర్పడతాయి.
రవి (సూర్యుడు) హోరాతో ప్రారంభం = రవివారం,
ఆదిత్య అన్న కూడా సూర్యుడు పేరే..ఆదివారం, భానుడు అన్న కూడా సూర్యుడే భానువారం (కర్ణాటక, తమిళనాడు లో భానువారం వాడుతారు)
ఇలా ఆయా హోరాలు బట్టి రోజుల పేర్లు వచ్చాయి...
ఆదివారం తరవాత సోమవారం ఎందుకు రావాలి?
మంగళ వారమ్ రాకూడదా??
రాదు.... ఏందుకంటే ఆదివారం రవి హోరా ప్రారంభం అయ్యింది, తరువాత రోజు అంటే సోమవారం చంద్ర హోరా తో ప్రారంభం అయ్యింది కాబట్టి.
ఇంత నిర్థిష్టమైన పద్ధతిలో వారమునకు పేర్లు పెట్టారు గనుకనే భారత దేశ సంప్రదాయాన్ని ప్రపంచ మంతా అనుసరిస్తున్నది..