సెనగలు ఆవకాయ
కావలిసిన పదార్థాలు
1. మామిడికాయ ముక్కలు 2 కప్పులు
2. కారం 1 కప్పు
3. ఆవపొడి 1 కప్పు ,
4. ఉప్పు అర కప్పు
5. సెనగలు 5 స్పూన్స్
6. ఆయిల్ 1 కప్పు (నువ్వుల పప్పు నూనె )
7. పసుపు కొద్దిగా
8. మెంతులు 1 స్పూన్
తయారీవిధానం
ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడిగి , తుడిచి ,
ఆరిన తరువాత ముక్కలుగా తరుగుకోవాలి.
ఒక బేసిన్ లోకి కారం, ఆవపిండి , ఉప్పు , పసుపు , మెంతులు ,
వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకుని,
దీనికి మామిడికాయ ముక్కలు , సెనగలు వేసి బాగా కలిపి ,
తగినంత ఆయిల్ వేసుకుని, బాగా కలిపి ,
10 లేక 15 రోజులపాటు ఊర నివ్వాలి .
దీనివలన సెనగలు బాగా నాని ఆవ కాయ రుచిగా ఉంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi