పులిహోర ఆవకాయ
కావలిసిన పదార్థాలు
1. మామిడికాయముక్కలు 2 కప్పులు
2. కారం అర కప్పు
3. ఆవ పిండి అర కప్పు
4. ఉప్పు పావు కప్పు
5. ఆయిల్ అర కప్పు
6. నీళ్లు అర కప్పు
పోపు దినుసులు
సెనగ పప్పు అర స్పూన్ , మినపప్పు అర స్పూన్ ,ఆవాలు కొద్దిగా ,
ఎండుమిర్చి 2 ,ఇంగువ కొద్దిగా , ఆయిల్ 3 స్పూన్స్ ,పచ్చిమిర్చి చీలికలు 3
కరివేపాకు కొద్దిగా
తయారీ విధానం
ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి ,తుడిచి ,
ఆరిన తరువాత చిన్న ముక్కలుగా తరుగుకోవాలి .
ముందు రోజు రాత్రి ఒక వెడల్పయిన బేసిన్ లోకి ,
కారము ,ఉప్పు , మామిడికాయముక్కలు , ఆయిల్ వేసి ,
బాగా కలిపి ఒక జాడీలోకి తీసుకుని ,మూత పెట్టుకోవాలి .
మరునాడు అర కప్పు నీళ్లు తీసుకుని , బాగా మరిగించి ,
చల్లారిన తరువాత ,
ఆవపిండిని ,
ఈ నీళ్లలో కలిపితే వచ్చిన ముద్దను , ఎండలో ఎండపెడితే ,
సాయంత్రానికి పొడిలా తయారవుతుంది .
ఈ పొడిని ముందుగా
కారం , ఉప్పు , ఆయిల్ కలిపి ,ఉంచుకున్న
మామిడిముక్కల మిశ్రమము పైన వేసి , బాగా కలిపి ,
ఒక బేసిన్ లోకి తీసుకుని 2 రోజులు ఎండబెట్టాలి .
ఇలా ఎండిన మిశ్రమాన్ని మనకి కావలిసినప్పుడు ,
కొద్దిగా ఒక బౌల్ లోకి తీసుకోవాలి ,
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 3 స్పూన్స్ ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి ,
దోరగా వేగాక పచ్చిమిర్చి చీలికలు , కరివేపాకు లను వేసి ,
కొద్దిసేపు వేగనిచ్చి బౌల్ లోకి తీసుకున్న ఆవ కాయ మిశ్రమం పైన ,
వేసుకుంటే పులిహోర ఆవకాయ రెడీ
ఈఆవకాయను మాగాయ పచ్చడి లాగ ఎప్పటికప్పుడు కొద్దిగా తీసుకుని ,
పులిహోర పోపు పెట్టుకుంటే బాగుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.