Wednesday 27 May 2020

శ్రీ మహాలక్ష్మీ


శ్రీ మహాలక్ష్మీ

హరికిం బట్టపుదేవి,
పున్నెముల ప్రోవు, అర్ధంపు బెన్నిక్క,
చందురు తోబుట్టువు,
భారతీ గిరిసుతల్‌తో నాడు పూబోడి,
తామరలందుండెడి ముద్దరాలు,
జగముల్ మన్నించు నిల్లాలు,
భాసురతన్ లేములు వాపు తల్లి,
సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్

లక్ష్మి లేదా మహాలక్ష్మి లేదా శ్రీ హిందూ సంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత.
త్రిమూర్తిలలో ఒకరైన విష్ణువు నకు ఇల్లాలు. క్షీర సాగర మధనం సమయంలో అవతరించింది.

సంస్కృతంలో "లక్ష్మి" అన్న పదానికి మూల ధాతువులు - లక్ష్ - పరిశీలించుట, గురి చూచుట .
ఇదే ధాతువును "లక్ష్యం" అనే పదంలో కూడా చూస్తాము. వేదాలలో లక్ష్యాయిధి లక్ష్మిః - అనగా జనులను ఉద్ధరించే లక్ష్యం కలిగినది - అని అన్నారు.

మహాలక్ష్మిని శ్రీ అని కూడా అంటారు. తమిళంలో తిరుమగళ్ అంటారు. ఆమె ఆరుసుగుణములు పరిపూర్ణముగా కలిగినది. నారాయణుని శక్తికి ఆమెయే కారణము. ఆమె విష్ణువునకు ఇల్లాలు.
సీతగా రాముని పెండ్లాడినది. రాధ, రుక్మిణి మరియు శ్రీకృష్ణుని భార్యలందరును లక్ష్మీదేవి అంశలే.