Monday, 4 May 2020

నవగ్రహాలు విష్ణుమూర్తి అవతారాలు


నవగ్రహాలు విష్ణుమూర్తి అవతారాలు

శ్లో|| రామో೭వతార స్సూర్యస్య చంద్రస్యయదునాయకః|
నృసింహో భూమి పుత్రస్య బుద్ధ స్సోమసుతస్య చ|
వామనో విబుధేజ్యస్య భార్గవో భార్గవస్య చ|
కచ్ఛప సూర్య పుత్రస్య సైరిహకే యస్య సూకరః||
కేతోర్మీనావ తారస్య|| ఇతి పరాశ రేణోక్తం||

"పరి శేషాత్కాల రూపస్య మాందేః కల్కీ" ఇతి సూచ్యతే. అత ఏవోక్తం శ్రీమచ్ఛంకర భగవత్పూజ్య పాదైశ్చ స్రగ్ధరావృత్తం-

శ్లో|| మత్స్యః కూర్మో వరాహో నరహరిణపతి ర్వామనో జామదగ్న్యః|
కాకుత్థ్సః కంసఘాతీ మనసిజ విజయీ యశ్చకల్కీ భవిష్యన్‌||
విష్ణోరం శావతారా భువనహితకరా ధర్మ సంస్థాపనార్ధాః|
పాయాసుర్మాంత ఏ తేగురుతర కరుణా భార భిన్నాశయాయే||

కావున శ్రీ పరాశర మహర్షియు. పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ మచ్ఛంకర దేశికులును మాందితో గూడిన దశ సంఖ్యాక గ్రహములను శ్రీ మహావిష్ణుని దశ సంఖ్యాకమగు అంశావతారములని వచించి యుండిరి.

1. సూర్యుని అంశావతారము సూర్యుని వంశమున జనించిన దశరధ మహారాజపుత్రుడగు శ్రీ రాముడు
2. చంద్రుని అంశావతారము యుదు వంశోద్భవుడగు బలరాముడు (శ్రీ కృష్ణుడు)
3. కుజుని అంశావతారము ఆగ్ని స్వరూపుడగు నృసింహమూర్తి
4. బుధుని అంశావతారము బుద్థదేవుడు
5. బృహస్పతి అంశావతారము వామనమూర్తి
6. శుక్రుని అంశావతారము పరశురామమూర్తి
7. శని యొక్క అంశావతారము కూర్మమూర్తి
8. రాహుని అంశావతారము వరాహమూర్తి
9. కేతుని అంశా వతారము మన్మథుని కేతనం అగు మీనమూర్తి
10. పరిశేష న్యాయముచే మాందీ గ్రహాంశావతారము కాలమూర్తియగు కల్కిమూర్తిగను వర్ణింపబడియెను. ఇట్లు వరామిహహిరా చార్య కృతహోరా--శాస్త్ర మనియెడి జ్యోతిష గ్రంథరాజమున చెడ్పబడెను.

ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అవతార అధిదేవత ఉన్నారు. ఆయా గ్రహ అధిదేవతను ఉపాసిస్తే ఆ గ్రహ తీవ్రత తగ్గుతుంది. రవి కి రామావతారాన్ని, చంద్రుడికి కృష్ణావతారాన్ని, కుజుడికి నరసింహ అవతారాన్ని, బుధుడికి బుద్ధావతారాన్ని, గురువుకి వామనావతారాన్ని, శుక్రుడికి పరశురామావతారాన్ని, శనికి కూర్మావతారాన్ని, రాహువుకి వరాహావతారాన్ని, కేతువు కి మీనావతారాన్ని పూజించాలి.
నవగ్రహాలలో ఏ గ్రహం యొక్క తీవ్రత అధికంగా ఉందో తెలుసుకొని శ్రీమన్నారాయణ అవతార ధ్యానం చేస్తే ఆ గ్రహ తీవ్రత తగ్గుతుంది.
ఇది ఒక విధమైన శాంతి.
సేకరణ