శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీ మద్భగవద్గీత
మొదటి అధ్యాయము
అర్జున విషాదయోగం
ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ----
1 సంజయా ! ధర్మ భూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేసేందుకు సమకూడుకొనిన మా దుర్యోధనాదులును , ఆ పాండవులనూ ఏమి చేశారు .
సంజయుడు చెబుతున్నాడు
2 ధృతరాష్ట్ర మహారాజా ! మరి కాసస్సేపటిలో యుద్ధం ప్రారంభమవుతుందీ అనగానే నీ కొడుకైన దుర్యోధనుడు , పాండవుల సైన్య వ్యూహమును చూసి , ఆచార్యులైనా ద్రోణుణ్ణి సమీపించి ఇలా అన్నాడు
౩ ఆచార్యా , బుద్ధిశాలీ , మీ శిష్యుడూ అయినా ద్రుపదానందనుడు అగు ద్రుష్టద్యుమ్నునిచే వ్యూహాకారంగా తీర్చబడిన పాండవ సైన్యాన్ని చూడండి .
4 . ఆ పాండవ సైన్యంలో, భీమార్జునల కే మాత్రమూ తీసిపోని వారైన యుయుధాన (సాత్యకి ) విరాట , ద్రుపదాదులు---
5 మరియు - ధృష్టకేత , చేకితాన , కాశీరాజ, పురుజిత్ , కుంతిభోజ , శైబ్యదులు
6 యుధామన్యుడు,ఉత్తమౌజుడు , అభిమన్యుడు , ద్రౌపదీ తనయులైన ఉప పాండవులూ మొదలైన వారంతా కూడా వారి పక్షాన మహారధులే ( మహారథి - పదివేలమంది విలుకాండ్రతో ఏకాకిగా , ఏకకాలంలో యుద్ధం చేసి గెలవగల వీరుడు.)
7 బ్రాహ్మణోత్తముడవైన ద్రోణాచార్యా ! ఇక మన సైన్యం లో ఉన్న మహావీరులను చెబుతాను విను .
8 మీరు , భీష్ముడు ,కర్ణుడు , కృపాచార్యుడు , అశ్వద్ధామ , వికర్ణుడు , సౌమదత్తి , జయద్రధుడు మరియు
9 నా కొరకు తమ ప్రాణాలనైనా విడువగలవాళ్ళు , అస్త్ర శస్త్ర సంపన్నులు , యుద్ధ విద్యా విశారదులును ఐన అనేకమంది ఇతర శూరులు మన వైపున ఉన్నారు .
10 అపరిమితమైన మన సైన్యం భీష్ముడి చే రక్షింపబడుతూ ఉంది . పరిమితమైన ఆ పాండవసైన్యం భీముడి సంరక్షణ లో ఉంది.
11 కాబట్టి , మన పక్షాన గల మీరందరూ కూడా మీ నిర్ణీత స్థానాలను విడువకుండా నిలిచి మన నాయకుడైన భీష్ముణ్ణి రక్షిస్తూ ఉండండి .
12 ఆ మాటలు వినిన కురువృద్ధుడూ , తాతగారూ ఐన భీష్ముడు రారాజును సంతోషపరచేందుకై సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు.
13 అది వినిన కౌరవ వీరులందరు కూడా శంఖాలను పూరించారు . భేరీ , ఫణవానక, గోముఖాదులను మ్రోగించారు . ఆ శబ్దాలు దిక్కులన్నింటా నిండిపోయాయి .
14 , 15 . అప్పుడు , శ్వేతాశ్వాలను పూంచిన రధం మీద ఉన్నవారై కృష్ణాఅర్జునులు దివ్య శంఖాలను పూరించారు. శ్రీకృష్ణుడు " పాంచజన్యం " ను , అర్జునుడు " దేవదత్త" మనే శంఖమును , భీముడు భయంకరమైన " పౌండ్ర " మనే శంఖాన్ని పూరించారు .
16 . పాండవ పక్షాన రాజైన కుంతీ పుత్రుడు యుధిష్ఠిరుడు " అనంత విజయం " నకులుడు " సుఘోషము " , సహదేవుడు " మణిపుష్పకము ". అనే శంఖాలను పూరించారు.
17 మేటి విలుకాడైన కాశీరాజు , మహారథి అయిన శిఖండి --- ఓడిపోవడం అనేది ఏనాడూ ఎరుగని మహావీరులైన దృష్టద్యుమ్న , విరాట, సాత్యకులు .
18 ద్రుపదుడూ , ద్రౌపది కొడుకులైన ఉప పాండవులైదుగురు - ఇతరులైన రాజులు - యోధా గ్రేసరుడైన సుభద్ర కొడుకు అభిమన్యుడు వీళ్లంతా వేరువేరుగా తమ తమ శంఖాలను అనేక పర్యాయాలు ఊదారు.
19 ఆ శంఖ ధ్వని కౌరవుల గుండెలను చీల్చి వేస్తూ , భూమ్యాకాశాలను నిండి ప్రతిధ్వనించింది .
20 , 21 ఓ రాజా ఆ వ్యవస్థ పిమ్మట , కపిధ్వజుడైన అర్జునుడు కౌరవులను చూస్తూ -శస్త్రాదులనూ, ధనుస్సులను ధరించి , కృష్ణునితో ఓ అచ్యుతా ! మన రధాన్ని ఒకసారి రెండు సేనల మధ్య నిలుపుమని అడిగెను .
22 , 23 కృష్ణా ! దుష్టబుద్ధియైన ఆ దుర్యోధనుడిని గెలిపించడం కోసం మాతో సమరానికి సంసిద్ధులై వచ్చి నిలిచిన వారెవరో మనలోని ఎవరెవరు - వారిలోని ఎవరెవరితో యుద్ధం చేయాలో నిర్ణయించాలంటే వారందరిని చేరువగా చూడాలని అర్జునుడు పలికెను .
సంజయుడు చెబుతున్నాడు:-
24 , 25 అర్జునుడలా కోరగానే శ్రీకృష్ణుడు రధాన్ని ఉభయ సైన్యాల మధ్యకు పోనిచ్చాడు . భీష్ముడు, ద్రోణుడు మొదలైన మహావీరులకు అభిముఖంగా రధాన్ని నిలిపి -" అదిగో కౌరవ కూటం . చూడవయ్యా అర్జునా " అన్నాడు శ్రీకృష్ణుడు.
26 , 27 . రెండు సేనలకి మధ్య రథారూఢులై యున్న అర్జునుడు - ఆ రెండు సేనలలోను యుద్ధోత్సాహులై నిలిచి ఉన్న తండ్రులను , తాతలను , గురువులను ,మేనమామలను, సోదరులను , కుమారులను , మనుమలను, స్నేహితులను , బావలను- ఇతరులైన స్వజనులనూ అందరిని చూసాడు .
28 .సమర భూమికి వచ్చియున్న బంధువులను అందరిని చూచి , కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై శోకసంతప్తుడై ఇట్లు పలికెను.
29 . అర్జునుడు పలికెను - ఓ కృష్ణా! సమరోత్సాహం తో రణరంగమున నిలిచియున్న ఈ స్వజనసమూహమును జూచి , నా అవయములు
శిధిలమగుచున్నవి . నోరు ఎండిపోవుచున్నది . శరీరమునందు వణకు, గగుర్పాటు కలుగుచున్నవి .
30 . గాండీవము చేతి నుండి జారిపోవుచున్నది . చర్మము తపించిపోవుచున్నది . మనస్సు భ్రమకు గురిఅయినట్లు అనిపించుచున్నది .కనుక ఇక్కడ నిలబడలేక పోవుచున్నాను .
31 . ఓ కేశవా ! పెక్కు అపశకునములు కనబడుచున్నవి .యుద్ధమున స్వజనసమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు .
32 ఓ కృష్ణా ! నాకు విజయము గాని, రాజ్యము గాని , సుఖములు గాని అక్కరలేదు . గోవిందా ! ఈ రాజ్యము వలనగాని , ఈ భోగములవలన గాని, ఈ జీవితము వలన గాని ప్రయోజనము లేదు .
33 . మనము ఎవరికై ఈ రాజ్యమును , భోగములను , సుఖములను కోరుకున్నామో, వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చియున్నారు .
34 . గురువులు ,తండ్రులు , తాతలు ,కొడుకులు , మనుమలు , మేనమామలు , మామలు , బావమరుదులు , ఇతర బంధువులు మొదలగువారు అందరును ఇచ్చటికి చేరి యున్నారు .
35 .ఓ మధుసూదనా ! ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవ్వరినీ చంపను. ఇక ఈ భూమండల విషయమై చెప్పనేల ? అట్లే వీరిలో ఎవ్వరినైనను నన్ను చంపబూనిననూ , నేను మాత్రము వీరిని చంపనే చంపను.
36 . ఓజనార్దనా ! ఈ ధార్తరాష్ట్రులను చంపి మనము బావుకొనునది ఏమి ? ( మనము మూట కట్టుకొనునది ఏమి) ఈ ఆతతాయులను చంపుటవలన మనకు పాపమే కలుగును .
37 . కనుక ఓమాధవా ! మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు . స్వజనులను చంపిన మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును .
38 , 39 . లోభకారణముగ భ్రష్ట చిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను , మిత్రద్రోహము వలన సంభవించు పాపములను చూడకున్నచో , ఓ జనార్దనా! కులనాశనము వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఏలఆలోచింపరాదు .
40 . కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నియును నశించును . ధర్మము అంతరించి పోయినప్పుడు కులము నందు అంతటను పాపమే వ్యాపించును .
41 .ఓ కృష్ణా! అధర్మము ( పాపము ) పెచ్చుపెరిగి పోయినప్పుడు కులస్త్రీలు మిక్కిలి దూషితలు అగుదురు . ఓ వార్ష్ణేయా ! స్త్రీలు దూషితలు అయినచో వర్ణసాంకర్యము ఏర్పడును .
42 . వర్ణసాంకర్యము కులఘాతకులను , కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు ( శ్రాద్ధతర్పణములు ) లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలయ్యెదరు .
43 . వర్ణసాంకర్యమునకు మూలములైన ఈ దోషములవలన కులఘాతకులయొక్క సనాతన కులధర్మములు , జాతిధర్మములు నష్టమగును .
44 . ఓ జనార్దనా! కులధర్మములు నశించిన వారికి నిరవధికముగా ( కలకాలము) నరకప్రాప్తి తప్పదని ప్రతీతి .
45 . అయ్యో ! మనము బుద్ధిమంతులమైఉండియు రాజ్య సుఖ లోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తలమై, ఈ ఘోరపాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము - ఇది ఎంత దారుణము ?
46 . శస్త్రరహితుడనై. ఎదురింపని నన్ను శస్త్రములను చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధమున వధించినను , అది నాకు మిక్కిలి క్షేమకరమే అగును .
సంజయ ఉవాచ
47 . సంజయుడు పలికెను - అర్జునుడు ఈ విధముగా పలికి శోకసంవిగ్నమానసుడై , యుద్ధభూమియందు ధనుర్భాణములను త్యజించి , రథము వెనుక భాగమున చతికిలబడెను .
ఓం తత్సదితి శ్రీ మద్భాగవద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగోనామ ప్రధమో అధ్యాయః .