Monday 4 May 2020

మహాలక్ష్మి ధ్యాన శ్లోకం


మహాలక్ష్మి ధ్యాన శ్లోకం

పద్మనాభ ప్రియాం
దేవీం పద్మాక్ష్మీం పద్మవాసినీం
పద్మవక్త్రాం పద్మహస్తాం
వందే పద్మామ హర్నిశమ్
పూర్ణేందు బింబవదనాం
రత్నాభరణ భూషితాం
వరదాభయ హస్తాడ్యాం
ధ్యాయే చ్చంద్ర సహొదరీమ్
ఇచ్చా రూపాం
భగవత స్సచ్చిదానంద రూపిణీం
సర్వజ్ఞాం సర్వజననీ,
విష్ణువక్ష స్త్ఫాలాలయామ్
దయాళుమనిశం
ధ్యాయేత్ సుఖసిద్ధ స్వరూపిణీమ్

పద్మముల వంటి నేత్రములు కలిగినది పద్మనాభునికి ప్రియమైనది
పద్మమునందు కూర్చున్నది
పద్మమువలె వికసించినటువంటి సుందర వదనం కలిగినది
పద్మముల వంటి చేతులు కలిగినది
నిండుగా ఉదయించిన చంద్రుని వంటి వదనంతో ఉన్నది
శిరస్సు మొదలుకొని పాదముల వరకు అన్ని రకాల రత్నాభరణములను అలంకరించుకున్నది
క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు
చంద్రునితో పాటు పుట్టింది.
భగవానుడైన నారాయణుని యొక్క ఇచ్ఛా శక్తి స్వరూపిణి సచ్చిదానంద రూపిణి అయిన తల్లి.
అన్నీ తెలిసిన తల్లి
సర్వ జగత్తుకూ తల్లి
నారాయణుని వక్ష స్థలంలో ఉన్నది
దయ గలిగిన తల్లి
ఎల్లవేళలా ధ్యానిస్తున్నాను.
ఆనందము, సిద్ధి(కార్య సిద్ధి, మోక్షము)
ఈ రెండింటి యొక్క రూపమే మహాలక్ష్మి.