Friday, 19 May 2017

సున్ని ఉండలు


సున్ని ఉండలు

కావలిసిన  పదార్థాలు
1. ఛాయ  మినపపప్పు  పావుకేజీ
2. బియ్యం  4 స్పూన్స్  
3.  బెల్లం  పావుకేజీ
4. నెయ్యి  100 గ్రాములు

తయారీ  విధానం
ముందుగా   స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి ,
 వేడెక్కాక  ఛాయ మినప పప్పును ,బియ్యమును వేసి ,
 దోరగా   కమ్మటి  వాసన  వచ్చేంత  వరకు  వేపుకుని ,
 చల్లార్చుకోవాలి .చల్లారిన   పప్పును  మెత్తని  పొడిలాగా ,
 గ్రైండ్  చేసుకోవాలి  .
 బెల్లం తురుమును,ముందుగా  మనం తయారు  చేసుకున్న
పొడిని   వేసి
బాగా కలిపి ,
నెయ్యిని  కూడా  వేసి  ,
బాగా  కలిపి
ఉండలుగా చేసుకుంటే
 సున్ని ఉండలు  రెడీ  అవుతాయి
ఇవి  ఒక నెలరోజుల పాటు  నిలువ  ఉంటాయి.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. 

Saturday, 13 May 2017

సెనగలు ఆవకాయ


సెనగలు  ఆవకాయ

కావలిసిన  పదార్థాలు
1. మామిడికాయ  ముక్కలు  2 కప్పులు
2. కారం 1 కప్పు
3. ఆవపొడి 1 కప్పు ,
4. ఉప్పు  అర కప్పు
5. సెనగలు  5 స్పూన్స్
6. ఆయిల్  1 కప్పు  (నువ్వుల పప్పు నూనె )
7. పసుపు  కొద్దిగా
8. మెంతులు  1 స్పూన్

తయారీవిధానం
ముందుగా  మామిడికాయలు  శుభ్రంగా  కడిగి  , తుడిచి ,
ఆరిన తరువాత  ముక్కలుగా తరుగుకోవాలి.
 ఒక  బేసిన్ లోకి  కారం,  ఆవపిండి , ఉప్పు  , పసుపు , మెంతులు  ,
వేసి  ఉండలు లేకుండా   బాగా  కలుపుకుని,
దీనికి  మామిడికాయ  ముక్కలు  , సెనగలు  వేసి బాగా కలిపి ,
తగినంత  ఆయిల్  వేసుకుని,  బాగా కలిపి  ,
10  లేక  15 రోజులపాటు ఊర  నివ్వాలి .
దీనివలన  సెనగలు  బాగా నాని  ఆవ కాయ  రుచిగా ఉంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

Friday, 12 May 2017

పచ్చ ఆవకాయ


పచ్చ  ఆవకాయ

కావలిసిన  పదార్థాలు
1. మామిడికాయ  ముక్కలు  2 కప్పులు ,
2. పచ్చ  కారం  1 కప్పు
3.  ఆవపిండి  1 కప్పు
4. ఉప్పు  అర  కప్పు
5.  ఆయిల్  1 కప్పు
6. మెంతులు  1 స్పూన్

తయారీ  విధానం
ముందుగా  మామిడి కాయలను  శుభ్రంగా  కడిగి  ,తుడిచి,
ఆరిన  తరువాత  ముక్కలు గా  తరుగుకోవాలి .
ఒక  బేసిన్ లోకి పచ్చకారము  ,ఆవపిండి  , ఉప్పు  , వేసి
ఉండలు లేకుండా  బాగా  కలిపి ,
ముందుగా  తరిగి  పెట్టుకున్న  మామిడికాయ ముక్కలు  ,
తగినంత ఆయిల్   వేసి  ,బాగా కలిసేలా  కలుపుకుంటే
పచ్చ  ఆవకాయ  రెడీ  అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

రాజ్మా సలాడ్


రాజ్మా  సలాడ్

కావలిసిన  పదార్థాలు
1. రాజ్మా  1 కప్పు
2. ఉల్లి పాయ   ముక్కలు  పావు కప్పు
3. టొమాటో ముక్కలు  పావు  కప్పు
4. కొత్తిమీర  తురుము  1 స్పూన్
5.  ఉప్పు  రుచికి  సరిపడా
6. మిరియాల పొడి  తగినంత

పోపు దినుసులు
ఆయిల్ 1 స్పూన్ ,  ఆవాలు  1 స్పూన్ , జీలకర్ర  1 స్పూన్  , కరివేపాకు, ఎండుమిరపకాయలు 2

తయారీ  విధానం
ముందుగా  రాజ్మా  గింజలను ముందురోజు  రాత్రి  అంతా నాన బెట్టి  ,
మరునాడు శుభ్రంగా కడిగి  కుక్కరు లో పెట్టి ,
ఉడికించుకోవాలి  .
టొమాటోలను , ఉల్లి పాయలను ,  సన్నని  చిన్న ముక్కలుగా తరుగుకోవాలి .
ఒక వెడల్పయిన  బౌల్ లోకి,
ఉడికించి  పెట్టుకున్న రాజ్మా గింజలు,   తరిగి పెట్టుకున్న ,
ఉల్లి పాయ , టమాటో ముక్కలు , కొత్తిమీర , తగినంత  ఉప్పు , తగినంత మిరియాలపొడి ,
వేసి  బాగా కలిపి  , ఒక 5 నిమిషాల సేపు పక్కన పెట్టెయ్యాలి .
స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి  వేడెక్కాక , ఆయిల్  వేసి,
ఆవాలు , జీలకర్ర  , ఎండుమిరప ముక్కలు  , కరివేపాకు ,
వేసిదోరగా  వేగనిచ్చి  , ముందుగా తయారు చేసిపెట్టుకున్న ,
రాజ్మా  మిశ్రమం  పైన  వేసి  , బాగా కలిపి  సర్వ్  చేసుకుంటే
రాజ్మా సలాడ్  రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
Deepti Burgula

Thursday, 11 May 2017

పాలక్ పన్నీరు


పాలక్  పన్నీరు

కావలిసిన పదార్థాలు
1. పాలకూర 5 కట్టలు
2. ఉల్లిపాయ  1
3. పచ్చిమిరపకాయలు 2
4. ఎర్ర కారం 1 స్పూన్
5. పసుపు  కొద్దిగా
6. అల్లం  వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
7.టొమాటోలు 3
8. ధనియాలపొడి  1 స్పూన్
9. జీలకర్ర పొడి  1 స్పూన్
10. వెల్లుల్లి రెబ్బలు  5.
11. కసూరీ మేతి  1 స్పూన్
12. ఉప్పు రుచికి సరిపడా   ,
13. పన్నీరు ముక్కలు  ఒక కప్పు "  నెయ్యి 5 స్పూన్స్
14. ఆయిల్ 6  స్పూన్స్ ,

గరం మసాలా దినుసులు :
15. ఏలకులు  2 ,
16. లవంగాలు 2 ,
17. దాల్చినచెక్క

తయారి విధానము :

ముందుగా  పాలకూరను  శుభ్రంగా   కడిగి  ,
ఒక ఉడుకు , ఉడికించి మెత్తని  పేస్ట్ లాగ గ్రైండ్  చేసుకోవాలి .

ఉల్లిపాయను , టమాటో లను సన్నగా , చిన్న ముక్కలుగాను,
పచ్చి మిర్చిని  చీలికలుగాను, తరుగుకోవాలి .
స్టవ్   వెలిగించి  బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్  వేసి  ,
గరంమసాలా దినుసులు  వేసి కొద్దీ సేపు  వేగనిచ్చి ,
ఉల్లి పాయ ముక్కలు , వెల్లుల్లి రెబ్బలు ,
వేసి  దోరగా వేగనిచ్చి ,
పసుపు , అల్లం వెల్లుల్లి  పేస్ట్   ,పచ్చిమిర్చి చీలికలు  ,ధనియాలపొడి  ,
జీలకర్ర పొడి , కారం , వేసి  ,
కొద్దిసేపు  వేగనిచ్చి
టమాటో   ముక్కలు  వేసి  ,పచ్చివాసన పోయేంత  వరకు  మగ్గనిచ్చి ,
పాలకూర పేస్ట్  ,తగినంత  ఉప్పు  వేసి , ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనిచ్చి ,
స్టవ్  ఆఫ్ చేసుకోవాలి .
వేరే   బాణలిని స్టవ్ మీద  పెట్టి  ,వేడెక్కాక  నెయ్యి  వేసి ,
తరిగిపెట్టుకున్న  పన్నీరు  ముక్కలను  వేసి  ,
దోరగా  వేగనిచ్చి ,
పాలకూర  మిశ్రమం లో వేసి ,
బాగా  కలిపి సర్వ్ చేసుకుంటే ,
పాలక్  పన్నీరు  రెడీ

ఈ కూరను  చపాతీ గాని  పరోటా లోగాని  తింటే  రుచిగా ఉంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
Deepti Burgula .....U.S.A.,

Wednesday, 10 May 2017

బెల్లం ఆవ కాయ


బెల్లం  ఆవ కాయ

కావలిసిన  పదార్థాలు
1. మామిడి కాయ  ముక్కలు   2 కప్పులు
2. కారం  1 కప్పు
3. ఆవ పిండి  1 కప్పు
4.  ఉప్పు  అర  కప్పు
5.  ఆయిల్ 1 కప్పు
6.  బెల్లం 2 కప్పులు
7.  పసుపు  కొద్దిగా
8. మెంతులు  1 స్పూన్

తయారీ  విధానం
ముందుగా మామిడికాయలు  శుభ్రం గా  కడిగి ,
తుడిచి , ఆరబెట్టి,   ముక్కలుగా  తరుగు కోవాలి.
ఒక  బేసిన్ లోకి  కారం  , ఆవపిండి,   ఉప్పు,   మెంతులు  ,
పసుపు ,  వేసి ఉండలు  లేకుండా  బాగా  కలిపి ,
తరువాత  తరిగి పెట్టుకున్న  మామిడికాయ  ముక్కలను  ,
ఆయిల్  ను  వేసి,  బాగా  కలిసేలా  కలుపుకోవాలి .
తరువాత 2 కప్పు ల  బెల్లం తురుమును  కూడా  వేసి
బాగా  కలిపి,   4 లేక  5 రోజులు
ఎండలో పెట్టి  ,
తరువాత  ఇంగువ నూనె  , కాచి  ,
పోసుకుంటే  బెల్లం  ఆవ కాయ  రెడీ  అవుతుంది.

*** బెల్లమును  పాకం  పెట్టి  , ఈ పాకం లో ఆవకాయను  వేసి ,బాగా  కలిపినా కూడా
       బెల్లపు  ఆవకాయ  రెడీ  అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's :
Achanta Subbalakshmi
Achanta Subhadevi

మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.


Saturday, 6 May 2017

పులిహోర ఆవకాయ


పులిహోర  ఆవకాయ

కావలిసిన పదార్థాలు
1. మామిడికాయముక్కలు  2 కప్పులు
2. కారం  అర  కప్పు
3. ఆవ పిండి  అర  కప్పు
4. ఉప్పు  పావు కప్పు
5. ఆయిల్  అర  కప్పు
6.   నీళ్లు  అర కప్పు

పోపు  దినుసులు
సెనగ పప్పు  అర  స్పూన్  , మినపప్పు  అర  స్పూన్  ,ఆవాలు  కొద్దిగా  ,
 ఎండుమిర్చి  2   ,ఇంగువ  కొద్దిగా ,  ఆయిల్  3 స్పూన్స్ ,పచ్చిమిర్చి  చీలికలు  3
కరివేపాకు  కొద్దిగా

తయారీ  విధానం
ముందుగా  మామిడికాయలను  శుభ్రంగా  కడిగి  ,తుడిచి  ,
ఆరిన  తరువాత  చిన్న  ముక్కలుగా  తరుగుకోవాలి  .
ముందు రోజు  రాత్రి  ఒక  వెడల్పయిన  బేసిన్  లోకి ,
 కారము  ,ఉప్పు , మామిడికాయముక్కలు  , ఆయిల్  వేసి  ,
బాగా  కలిపి  ఒక జాడీలోకి  తీసుకుని   ,మూత పెట్టుకోవాలి  .
మరునాడు   అర కప్పు  నీళ్లు  తీసుకుని , బాగా  మరిగించి  ,
చల్లారిన తరువాత  ,
ఆవపిండిని ,
ఈ నీళ్లలో  కలిపితే  వచ్చిన  ముద్దను  , ఎండలో  ఎండపెడితే  ,
సాయంత్రానికి  పొడిలా  తయారవుతుంది  .
ఈ పొడిని   ముందుగా
 కారం , ఉప్పు , ఆయిల్ కలిపి  ,ఉంచుకున్న
మామిడిముక్కల మిశ్రమము  పైన  వేసి  , బాగా  కలిపి  ,
ఒక  బేసిన్  లోకి  తీసుకుని  2 రోజులు  ఎండబెట్టాలి .
 ఇలా  ఎండిన  మిశ్రమాన్ని  మనకి  కావలిసినప్పుడు  ,
కొద్దిగా  ఒక  బౌల్ లోకి  తీసుకోవాలి  ,
స్టవ్ వెలిగించి  బాణలి పెట్టి  వేడెక్కాక  3 స్పూన్స్  ఆయిల్  వేసి ,
పైన  చెప్పిన  పోపు దినుసులను  వేసి ,
దోరగా వేగాక పచ్చిమిర్చి  చీలికలు ,  కరివేపాకు లను  వేసి  ,
కొద్దిసేపు  వేగనిచ్చి  బౌల్  లోకి తీసుకున్న  ఆవ కాయ  మిశ్రమం  పైన  ,
వేసుకుంటే  పులిహోర  ఆవకాయ రెడీ
ఈఆవకాయను  మాగాయ  పచ్చడి  లాగ  ఎప్పటికప్పుడు  కొద్దిగా  తీసుకుని ,
పులిహోర పోపు  పెట్టుకుంటే  బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.

Wednesday, 3 May 2017

వారానికి 7 రోజులు " పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలు"


వారానికి 7 రోజులు " పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలు"

మన వాడుకలో ప్రతి రోజుకి ఒక పేరు ఉంది.

ఆది వారము, సోమ వారము, మంగళ వారము,బుదవారము,
గురువారము, శుక్రవారము, శని వారము.

ఆ పేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి వుంది.
నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు.

భారత కాలమానంలో హోరా అనగా ఒక గంట అని అర్థం.
దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు HOUR .
ఒక రోజుకు 24 గంటలుంటాయి, అంటే 24 హోరాలు.
ఒక రోజులో ఉన్న 24 గంటలు (24 హోరాలు) కూడా ఏడు హోరాల చక్రం లో తిరుగుతాయి..
ఆ 7 హోరాలకి ఏడు పేర్లున్నాయి.
అవి వరుసగా... (ఈ వరుసలోనే) శని, గురుడు, కుజుడు, రవి, శుక్ర, బుద, చంద్ర
హోరాలు ప్రతి రోజు వుంటాయి.
ఈ 7 హోరాలే ప్రతి రోజు 24 గంటల్లో ఉంటాయి.
7 గంటల కొకసారి ఈ 7 హోరాలు పూర్తీ అయ్యాక మల్లి మొదటి హోరాకి వస్తుంది.
అంటే శని హోరా నుండి చంద్ర హోరాకి మల్లి శని హోరాకి..
ఉదాహరణకు ఆది వారము రవి హోరాతో ప్రారంభం అయి ,
మూడు సార్లు  పూర్తికాగా (3 సార్లు 7 హోరాలు 3x7 = 21 హోరాలు)
22 వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది.
23 వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది.
24 వ హోరా బుద హోర అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది.
ఆతర్వాత హోరా 25వ హోరా.
అనగా తరువాతి రోజు మొదటి హోరా దాని పేరు చంద్ర హోరా.
అనగా సోమవారము. అనగా చంద్ర హోరాతొ ప్రారంభ మౌతుంది.
ఏరోజు ఏ హోరాతో ప్రారంభ మవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది.
చంద్ర హోరాతో ప్రారంభమైనది గాన అది సోమ వారము.
ఈ విధంగానే మిగిలిన దినములు కూడా ఆయా హోరాల పేరన పేర్లు ఏర్పడతాయి.
రవి (సూర్యుడు) హోరాతో ప్రారంభం = రవివారం,
ఆదిత్య అన్న కూడా సూర్యుడు పేరే..ఆదివారం, భానుడు అన్న కూడా సూర్యుడే భానువారం (కర్ణాటక, తమిళనాడు లో భానువారం వాడుతారు)
ఇలా ఆయా హోరాలు బట్టి రోజుల పేర్లు వచ్చాయి...
ఆదివారం తరవాత సోమవారం ఎందుకు రావాలి?
మంగళ వారమ్ రాకూడదా??
రాదు.... ఏందుకంటే ఆదివారం రవి హోరా ప్రారంభం అయ్యింది, తరువాత రోజు అంటే సోమవారం చంద్ర హోరా తో ప్రారంభం అయ్యింది కాబట్టి.
ఇంత నిర్థిష్టమైన పద్ధతిలో వారమునకు పేర్లు పెట్టారు గనుకనే భారత దేశ సంప్రదాయాన్ని ప్రపంచ మంతా అనుసరిస్తున్నది..