Sunday, 10 January 2016

. " శక్తినిచ్చే ‘ ఖర్జూరం’ "




                                                           "" శక్తినిచ్చే ‘ ఖర్జూరం’"

1. పొటాషియం ఎక్కువగా లభించే ఖర్జూరాలు తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు అదుపులో ఉంటాయి. అలాగే ఇవి గుండెకు సంబంధించిన అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి.

2. ఖర్జూరం పండ్లలో శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్స్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల ఎదుగుదలకు చాలా అవసరం.

3. ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్, క్యాలరీలు తక్కువగా.. ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి తింటే బరువు పెరుగుతామన్న భయం ఉండదు.

4. ఖర్జూరం పండ్లలో యాంటీఆక్సిడెంట్ల రూపంలో ఉండే విటమిన్ ‘ఎ’ కంటికి చాలా మంచిది. ఈ పండు వల్ల రేచీకటి వంటి కంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

5. క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్.. వంటి మినరల్స్ ఈ పండులో అధికంగా లభిస్తాయి. క్యాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడానికి.. కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి.. మాంగనీస్ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడతాయి.

6. ఖర్జూరాలు కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు..
     బాగా సన్నగా ఉండి ఆరోగ్యకరంగా బరువు పెరగాలనుకునే వారికి కూడా
      మంచి ఫలితాన్నిస్తాయి.

7. ఖర్జూరం పండు శరీరానికి తక్షణ శక్తినిస్తుంది.

8. అలాగే ఇది త్వరగా జీర్ణమవుతుంది.

9. మలబద్ధకంతో బాధపడే వారు కొన్ని ఖర్జూరాల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున
వాటిని తిని, ఆ నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

10. ఖర్జూరంలో బి-కాంప్లెక్స్‌తో పాటు విటమిన్ ‘కె’ కూడా ఉంటుంది. ఇందులోని నియాసిన్, రైబోఫ్లేవిన్, పాంటోథెనికామ్లం, పైరిడాక్సిన్.. మొదలైన విటమిన్లు శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి.

11. ఖర్జూరాలు తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయని చాలామంది వాటిని తినడానికి భయపడుతుంటారు. వీటిలో ఉండే సహజసిద్ధమైన చక్కెరల వల్ల రక్తంలో చక్కెర స్థాయులు మరీ గణనీయంగా పెరగవని ఓ పరిశోధనలో వెల్లడైంది.

***కానీ డయాబెటిస్‌తో బాధపడే వారు మాత్రం డాక్టర్ సలహా మేరకే వీటిని ఆహారంలో
            భాగం     చేసుకోవడం మంచిది.

12. ఖర్జూరాల్లో ఉండే విటమిన్ బి6 వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

13. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఖర్జూరాలు తమవంతు పాత్ర పోషిస్తాయి.

14. మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు కరగాలంటే ఖర్జూరాల్ని తరచూ తినాలి. అలాగే కొంతమందికి మూత్రం
     సరిగ్గా రాకపోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు.. తదితర సమస్యలుంటాయి. ఇవన్నీ ఖర్జూరం తినడం
     వల్ల   తగ్గే అవకాశం ఉంది.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/