Wednesday 27 January 2016

స్నాన విధి


                                                                         స్నాన విధి

గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి / 
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు //
లేదా

యో సౌ సర్వగతో విష్ణు: చిత్ స్వరూపీ నిరంజనః / 
స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః //

(భాహ్యాభ్యంతరభేదేన శౌచం తు ద్వివిధం స్మృతమ్ / మృజ్జలాభ్యాం బహిశుద్ధి ర్భావశుద్ధి స్తదాన్తరమ్ //
బాహ్యాభ్యంతర భేదములచే శౌచం రెండువిధములుగా వుండును. జలముచే కలిగెడుశుద్ధి బాహ్యశుద్ది, నిర్మలభావము(భావశుద్ధి) చే కలిగెడుశుద్ధి అంతర శుద్ధి).

హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి ప్రస్తావించారు. అవి

నిత్య స్నానం :

ప్రతీరోజూ చేసే స్నానం నిత్య స్నానం.

నైమిత్తిక స్నానం : 
ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసేది నైమిత్తికం.

కామ్య స్నానం : 
ఒక కోరికతో చేసేది కామ్య స్నానం.
ఉదా : తీర్థాదులలో, పుష్కరాలలో, రధసప్తమికి, కార్తీక మాసంలో, మాఘఫాల్గుణాలలో విశేష ఫలాలనుద్దేశించి చేసేదానికి, తన జన్మనక్షత్రం, వ్యతీపాత, వైదృతియను యోగాలు కలిసే రోజుల్లోగాని, పర్వతిథులలో చేసేది కామ్య స్నానం.

స్నానానికి ఉపయోగించే పదార్ధాన్ని బట్టి స్నానాలు రెండు విధములు.

ముఖ్య స్నానం : 
ఇది నీటిని ఉపయోగించి చేసేది ఇది మళ్ళీ రెండు రకాలు.

మంత్రం లేదా బ్రాహ్మ్యం : 
వేదములలో చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రాలను ఉచ్ఛరిస్తూ చేసేది "మంత్ర స్నానం". మంత్రించిన నీళ్ళని నెత్తిమీద చల్లుకోవడమే బ్రాహ్మ్య స్నానం.

ఓం ఆపోహిష్టామ యోభువః
తాన ఊర్జే దధాతన మహేరణాయచక్షసే
యోవశ్శివతమోరసః
తస్య భాజయతేహనః
ఉశతీరివ మాతరః
తస్మారంగా మామవో
యస్యక్షయాయ చ తనః
ఆపో జన యధాచనః "
అనే మంత్రముతో పైన నీటిని చల్లుకుంటారు.

వారుణం : 
ఇది మామూలు నీళ్ళతో చేసేది. మనమందరం ఎక్కువగా చేసేది ఇదే. 
పుణ్య నదులలో స్నానం ఆచరించడాన్ని కూడా వారుణ స్నానం అంటారు.

అముఖ్యం లేదా గౌణ స్నానం : 
నీరు లేకుండా చేసే స్నానాన్ని గౌణ స్నానం అంటారు. ఇది అయిదు రకాలు

ఆగ్నేయస్నానం : 
హోమ భస్మాన్ని లేపనంగా పూసుకోడాన్ని ఆగ్నేయ స్నానం లేదా విభూది స్నానం అంటారు. అంటే ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు.

భౌమస్నానం : 
పుణ్య నదులలో దొరికే మన్ను లేక పుట్ట మన్ను మొదలైన పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేసేది "భౌమ స్నానం".

వాయవ్యస్నానం : 
ముప్పయి మూడు కోట్ల దేవతులు నివశించియున్న గోవులు నడుస్తుండగా వాటి కాళ్ళ నుండి రేగే మట్టి మన మీద పడేలా నడవడం. విభూతిని పెట్టుకోవడం, గోధూళిలో విహరించడం అనేవి పవిత్రమైన అంశాలుగా పద్మ పురాణం చెప్తోంది.

దివ్యస్నానం : 
లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అయినటువంటి సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వర్షం నీటిలో తడవడాన్నే దివ్య స్నానం అంటారు.

మానసిక స్నానం : 
అంటే మానసికంగా చేస్తాం తప్ప నిజంగా చేసే స్నానం కాదు. నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం

"మానస స్నానం". 
ఇది మహత్తర స్నానం. మహా ఋషుల చేత ఆచరింప బడుతుంది.

అభ్యంగన స్నానం : 
ఇక మిగతా రకాల స్నానాల గురించి చెప్పుకోవాలంటే అభ్యంగన స్నానం ఒకటి.

నఖ శిఖ పర్యంతము తలస్నానము చేయుట .

సముద్ర స్నానము:
మానవుడు సముద్రములో మునుగగానే, అన్ని తీర్థములలోను పుణ్యనదులలోను స్నానము చేసిన పుణ్యము లభించును.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/