శివపంచాక్షరీస్తోత్రం
నాగేంద్రహారాయ త్రిలోచనాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్థాయ దిగంబరాయ. తస్మైన కారాయ నమశ్శివాయ
మందాకినీ సలిలచందన చర్చితాయ. నందీశ్వర ప్రమధనాథ మహేశ్వరాయ
మందారపుష్ప బహుపుష్పసుపూజితాయ. తస్మై మ కారాయ నమశ్శివాయ
శివాయ గౌరీ వదనాబ్జబృం గ. సూర్యాయ దక్షాధ్వర నాశకాయ
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ. తస్మై శి కారాయ నమశ్శివాయ
వశిష్టకుంభోద్భవ గౌతమార్య. మునీంద్ర దేవార్చిత శేఖరాయ
తస్మై వ కారాయ నమశ్శివాయ. యక్ష స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతననాయ. దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై య కారాయ నమశ్శివాయ. పంచాక్షర మిదంపుణ్యం య :పఠేతే
శివ సన్నిధౌ శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే.
ద్వాదశ జ్యోతిర్లింగములు
సౌరాష్ట్రే సోమనాధంచ , శ్రీశైలే మల్లికార్జున మ్
ఉజ్జయిన్యాం మహాకాళ , మోంకారే పరమేశ్వరమ్
కేదారం హిమవత్ప్సెషే , ఢాకిన్యాం భీమశకరం
వారణస్యాం చ విశ్యేశం , త్ర్యంబకం గౌతమీతటె
వైద్యనాధం చితా భూమౌ , నాగేశం దారుకావనే
సేటుబంధె చ రామేశం , ఝృశ్మేశం చ గుహాలయే
పుణ్యక్షేత్రాలు , పుణ్యతీర్ధలు గల భారత దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అనే పన్నెండు
జ్యోతిర్లింగాలు స్వయం ప్రతిష్టితాలు. అనగా వాటికవే ఆవిర్భవించిన మహిమాన్విత
లింగాలు. అనంతమైన తేజస్సుతో, వేదకాలమునాటికి పూర్వంనుండి భక్తజనాన్ని తరింప చేస్తున్న లింగాలే ఈ "ద్వాదశ జ్యోతిర్లింగాలు".
1. సౌరాష్ర (గుజరాత్) దేశంలో సొమేశ్వరుడు.
2. ఆంధ్రప్రదేశములోని శ్రీ శైలంలో మల్లికార్జునుడు.
3. ఉజ్జయినిలో(మద్య ప్రదేశ్) శిప్రా నది తీరాన మహా కాలేశ్వరుదు.
4. మాలవ్యదేశంలొ(మద్య ప్రదేశ్) నర్మదానది తీరాన ఓంకారేశ్వరుడు.
5. హిమాలయాల్లో(ఉత్తరాంచల్) మందాకినీ శిఖరాన కేదారేశ్వరుడు.
6. ఢాకిని నగరాన(మహా రాష్ట్రం) భీమశంకరుడు.
7. కాశీ క్షేత్రంలో(ఉత్తర ప్రదేశ్) గంగానది తీరాన విశ్వేశ్వరుడు.
8. సహ్యగిరి శిఖరాలలొ(మహా రాష్ట్రం) నాసికామండలంలో బ్రహ్మగిరిపై గోదావరీ బ్రహ్మ స్థలాన త్రయంబకేశ్వరుడు.
9. ఉత్తర భారతదేశంలో(బీహారు రాష్ట్రం) చితభూమియందు వైద్యనాధుడు.
10. దారుకావనము సమీపంలో(గుజరాత్) గోమతీ నది వద్ద నాగేశ్వరుడు.
11. సేతుబంధము(తమిళనాడు) వద్ద రామేశ్వరుడు.
12. ఎల్లోరా గుహలవద్ద(మహా రాష్ట్రం) ఘృశ్శేశ్వరుదు.
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/