Friday, 30 June 2017

కాకర కాయ మరియు ఉల్లిపాయ పులుసు


కాకర కాయ  మరియు  ఉల్లిపాయ  పులుసు

కావలిసిన  పదార్థాలు
1. కాకర  కాయలు  2
2. ఉల్లి పాయలు  4
3. వంకాయ 1.
4. పచ్చిమిర్చి  2
5.  కరివేపాకు
6. పసుపు  కొద్దిగా
7. చింత పండు  తగినంత
8. ఉప్పు  రుచికి  సరిపడా
8.   బెల్లం  తగినంత
9. వరిపిండి  2 స్పూన్స్
10.   నీళ్లు  తగినన్ని

పోపు దినుసులు
ఆవాలు  కొద్దిగా  , మెంతులు  కొద్దిగా,   జీలకర్ర  కొద్దిగా  ,
ఇంగువ  కొద్దిగా  , వెల్లుల్లి  రెబ్బలు 3 , ఎండుమిరపకాయ1  ,ఆయిల్  3 స్పూన్స్

తయారీ  విధానం
ముందుగా  చింతపండును , తగినన్ని  నీళ్లు  పోసి ,
 ఒక  గిన్నెలో  నానబెట్టుకోవాలి .
 వరిపిండి ని  ఒక  బౌల్  లోకి   తీసుకుని ,  కొద్దిగా  నీళ్లు  పోసి కలుపు కోవాలి .
కాకర కాయలు  , ఉల్లి పాయలు ,  వంకాయ , పచ్చిమిర్చిలను  ,
శుభ్రం  గా కడిగి  చిన్న  ముక్కలుగా  తరుగుకోవాలి .
స్టవ్  వెలిగించి  వెడల్పయినబాణలి  పెట్టి  , వేడెక్కాక  ,
ఆయిల్  వేసి,     పైన  చెప్పిన  పోపు  దినుసులు ,  వెల్లుల్లి  రెబ్బలు  ,
వేసి  దోరగా  వేగిన  తరువాత ,
తరిగి  పెట్టుకున్న  ముక్కలను  ,కరివేపాకును  వేసి   ,
కొద్దీ  సేపు  మగ్గిన  తరువాత  ,
చింత పండు  రసమును  పిసికి  , పోసి  ,
పసుపు  , తగినంత  ఉప్పు  ,  బెల్లము లను  వేసి
 బాగా  కలిపి  కొద్దిసేపు  ఉడకనివ్వాలి .
తరువాత  నీళ్లు  కలిపిన వరిపిండి  ని  వేసి  ,
బాగా  కలిపి కొద్దిసేపు  ఉడకనిచ్చి ,
 స్టవ్  ఆఫ్  చేసుకుని   ఒక  బౌల్  లోకి  తీసుకుని  ,
 కొత్తిమీరతో  గార్నిష్  చేసుకుంటే  కాకర  కాయ  ఉల్లి  పాయ  పులు సు  రెడీ .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.

మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన
ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.


శ్రీ గురు రాఘవేంద్ర అష్టోత్తర శత నామావళి



మంత్రాలయ రాఘవేంద్ర స్వామి
శ్రీ గురు రాఘవేంద్ర అష్టోత్తర శత నామావళి

                       
                                   ఓం శ్రీ గురుభ్యో నమః
                           ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః

                 పూజ్యాయ రాఘువేంద్రాయ సత్య ధర్మ రతాయచ
                     భజతాం కల్పవృక్షాయ నమతాం కామథేనవే
                       
శ్రీ గురు రాఘవేంద్ర అష్టోత్తర శత నామావళి

ఓం స్వవాగ్దే వ తాసరి ద్బ క్తవిమలీ కర్త్రే నమః
ఓం రాఘవేంద్రాయ నమః
ఓం సకల ప్రదాత్రే నమః
ఓం భ క్తౌఘ సంభే దన ద్రుష్టి వజ్రాయ నమః
ఓం క్షమా సురెంద్రాయ నమః
ఓం హరి పాదకంజ నిషేవ ణాలబ్ది సమస్తే సంపదే నమః
ఓం దేవ స్వభావాయ నమః
ఓం ది విజద్రుమాయ నమః
ఓం ఇష్ట ప్రదాత్రే నమః
ఓం భవ్య స్వరూపాయ నమః || 10 ||
ఓం భ వ దుఃఖతూల సంఘాగ్నిచర్యాయ నమః
ఓం సుఖ ధైర్య శాలినే నమః
ఓం సమస్త దుష్టగ్ర హనిగ్ర హేశాయ నమః
ఓం దురత్య యో పప్ల సింధు సేతవే నమః
ఓం నిరస్త దోషాయ నమః
ఓం నిర వధ్యదేహాయ నమః
ఓం ప్రత్యర్ధ మూకత్వవిధాన భాషాయ నమః
ఓం విద్వత్సరి ఙ్ఞేయ మహా విశేషాయ నమః
ఓం వా గ్వైఖరీ నిర్జిత భవ్య శే షాయ నమః
ఓం సంతాన సంపత్సరిశుద్దభక్తీ విఙ్ఞాన నమః ||20 ||
ఓం వాగ్దె హసుపాటవాది ధాత్రే నమః
ఓం శరిరోత్ధ సమస్త దోష హంత్రె నమః
ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః
ఓం తిరస్కృత సుంనదీ జలపాదో దక మహిమావతే నమః
ఓం దుస్తా పత్రయ నాశనాయ నమః
ఓం మహావంద్యాసుపుత్ర దాయకాయ నమః
ఓం వ్యంగయ స్వంగ సమృద్ద దాయ నమః
ఓం గ్రహపాపా పహయె నమః
ఓం దురితకానదావ భుత స్వభక్తి దర్శ నాయ నమః || 30 ||
ఓం సర్వతంత్ర స్వతంత్రయ నమః
ఓం శ్రీమధ్వమతవర్దనాయ నమః
ఓం విజయేంద్ర కరా బ్జోత్ద సుదోంద్రవర పూత్రకాయ నమః
ఓం యతిరాజయే నమః
ఓం గురువే నమః
ఓం భయా పహాయ నమః
ఓం ఙ్ఞాన భక్తీ సుపుత్రాయుర్యశః
శ్రీ పుణ్యవర్ద నాయ నమః
ఓం ప్రతివాది భయస్వంత భేద చిహ్నార్ధ రాయ నమః
ఓం సర్వ విద్యాప్రవీణాయ నమః
ఓం అపరోక్షి కృత శ్రీశాయ నమః || 40 ||
ఓం అపేక్షిత ప్రదాత్రే నమః
ఓం దాయాదాక్షిణ్య వైరాగ్య వాక్పాటవ ముఖాంకి తాయ నమః
ఓం శాపానుగ్ర హశాక్తయ నమః
ఓం అఙ్ఞాన విస్మృతి బ్రాంతి నమః
ఓం సంశయాపస్మృతి క్ష యదోష నాశకాయ నమః
ఓం అష్టాక్షర జపేస్టార్ద ప్రదాత్రే నమః
ఓం అధ్యాత్మయ సముద్భవకాయజ దోష హంత్రే నమః
ఓం సర్వ పుణ్యర్ధ ప్రదాత్రే నమః
ఓం కాలత్ర యప్రార్ధ నాకర్త్యహికాముష్మక సర్వస్టా ప్రదాత్రే నమః
ఓం అగమ్య మహిమ్నేనమః || 50 ||
ఓం మహయశశే నమః
ఓం మద్వమత దుగ్దాబ్ది చంద్రాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం యధాశక్తి ప్రదక్షిణ కృత సర్వయాత్ర ఫలదాత్రే నమః
ఓం శిరోధారణ సర్వతీర్ధ స్నాన ఫతదాతృ సమవ బందావన గత జాలయ నమః
ఓం నమః కరణ సర్వభిస్టా ధార్తే నమః
ఓం సంకీర్తన వేదాద్యర్ద ఙ్ఞాన దాత్రే నమః
ఓం సంసార మగ్నజనోద్దార కర్త్రే నమః
ఓం కుస్టది రోగ నివర్త కాయ నమః
ఓం అంధ దివ్య దృష్టి ధాత్రే నమః || 60 ||
ఓం ఏడ మూకవాక్సతుత్వ ప్రదాత్రే నమః
ఓం పూర్ణా యు:ప్రదాత్రే నమః
ఓం పూర్ణ సంప త్స్ర దాత్రే నమః
ఓం కుక్షి గత సర్వదోషమ్నానమః
ఓం పంగు ఖంజ సమీచానావ యవ నమః
ఓం భుత ప్రేత పిశాచాది పిడాఘ్నేనమః
ఓం దీప సంయోజనఙ్ఞాన పుత్రా దాత్రే నమః
ఓం భవ్య ఙ్ఞాన భక్త్యది వర్దనాయ నమః
ఓం సర్వాభిష్ట ప్రదాయ నమః
ఓం రాజచోర మహా వ్యా ఘ్ర సర్పన క్రాది పిడనఘ్నేనమః || 70 ||
ఓం స్వస్తోత్ర పరనేస్టార్ధ సమృద్ధ దయ నమః
ఓం ఉద్య త్ప్రుద్యోన ధర్మకూర్మాసన స్దాయ నమః
ఓం ఖద్య ఖద్యో తన ద్యోత ప్రతాపాయ నమః
ఓం శ్రీరామమానసాయ నమః
ఓం దృత కాషాయవ సనాయ నమః
ఓం తులసిహార వక్ష నమః
ఓం దోర్దండ విలసద్దండ కమండలు విరాజితాయ నమః
ఓం అభయ ఙ్ఞాన సముద్రాక్ష మాలాశీలక రాంబుజాయ నమః
ఓం యోగేంద్ర వంద్య పాదాబ్జాయ నమః
ఓం పాపాద్రి పాటన వజ్రాయ నమః || 80 ||
ఓం క్షమా సుర గణాధీ శాయ నమః
ఓం హరి సేవలబ్ది సర్వ సంపదే నమః
ఓం తత్వ ప్రదర్శకాయ నమః
ఓం భవ్యకృతే నమః
ఓం బహువాది విజయినే నమః
ఓం పుణ్యవర్దన పాదాబ్జాభి షేక జల సంచాయాయ నమః
ఓం ద్యునదీ తుల్యసద్గుణాయ నమః
ఓం భక్తాఘవిద్వంసకర నిజమూరి ప్రదర్శకాయ నమః || 90 ||
ఓం జగద్గుర వే నమః కృపానిధ యే నమః
ఓం సర్వశాస్త్ర విశారదాయ నమః
ఓం నిఖిలేంద్రి యదోష ఘ్నే నమః
ఓం అష్టాక్షర మనూది తాయ నమః
ఓం సర్వసౌఖ్యకృతే నమః
ఓం మృత పోత ప్రాణాదాత్రే నమః
ఓం వేది స్ధపురుషోజ్జీ వినే నమః
ఓం వహ్నిస్త మాలికోద్ద ర్త్రే నమః
ఓం సమగ్ర టీక వ్యాఖ్యాత్రే నమః
ఓం భాట్ట సంగ్ర హకృతే నమః || 100 ||
ఓం సుధాపర మిళోద్ద ర్త్రే నమః
ఓం అపస్మారా పహ ర్త్రే నమః
ఓం ఉపనిష త్ఖండార్ధ కృతే నమః
ఓం ఋ గ్వ్యఖ్యాన కృదాచార్యాయ నమః
ఓం మంత్రాలయ నివసినే నమః
ఓం న్యాయ ముక్తా వలీక ర్త్రే నమః
ఓం చంద్రి కావ్యాఖ్యాక ర్త్రే నమః
ఓం సుంతంత్ర దీపికా ర్త్రే నమః
ఓం గీతార్ద సంగ్రహకృతే నమః || 108 ||


Monday, 26 June 2017

శ్రీశివపఞ్చాక్షరనక్షత్రమాలాస్తోత్రమ్


॥ శ్రీశివపఞ్చాక్షరనక్షత్రమాలాస్తోత్రమ్ ॥

శ్రీమదాత్మనే గుణైకసిన్ధవే నమః శివాయ
ధామలేశధూతకోకబన్ధవే నమః శివాయ ।
నామశేషితానమద్భావాన్ధవే నమః శివాయ
పామరేతరప్రధానబన్ధవే నమః శివాయ ॥ ౧॥

కాలభీతవిప్రబాలపాల తే నమః శివాయ
శూలభిన్నదుష్టదక్షఫాల తే నమః శివాయ ।
మూలకారణాయ కాలకాల తే నమః శివాయ
పాలయాధునా దయాలవాల తే నమః శివాయ ॥ ౨॥

ఇష్టవస్తుముఖ్యదానహేతవే నమః శివాయ
దుష్టదైత్యవంశధూమకేతవే నమః శివాయ ।
సృష్టిరక్షణాయ ధర్మసేతవే నమః శివాయ
అష్టమూర్తయే వృషేన్ద్రకేతవే నమః శివాయ ॥ ౩॥

ఆపదద్రిభేదటఙ్కహస్త తే నమః శివాయ
పాపహారిదివ్యసిన్ధుమస్త తే నమః శివాయ ।
పాపదారిణే లసన్నమస్తతే నమః శివాయ
శాపదోషఖణ్డనప్రశస్త తే నమః శివాయ ॥ ౪॥

వ్యోమకేశ దివ్యభవ్యరూప తే నమః శివాయ
హేమమేదినీధరేన్ద్రచాప తే నమః శివాయ ।
నామమాత్రదగ్ధసర్వపాప తే నమః శివాయ
కామనైకతానహృద్దురాప తే నమః శివాయ ॥ ౫॥

బ్రహ్మమస్తకావలీనిబద్ధ తే నమః శివాయ
జిహ్మగేన్ద్రకుణ్డలప్రసిద్ధ తే నమః శివాయ ।
బ్రహ్మణే ప్రణీతవేదపద్ధతే నమః శివాయ
జింహకాలదేహదత్తపద్ధతే నమః శివాయ ॥ ౬॥

కామనాశనాయ శుద్ధకర్మణే నమః శివాయ
సామగానజాయమానశర్మణే నమః శివాయ ।
హేమకాన్తిచాకచక్యవర్మణే నమః శివాయ
సామజాసురాఙ్గలబ్ధచర్మణే నమః శివాయ ॥ ౭॥

జన్మమృత్యుఘోరదుఃఖహారిణే నమః శివాయ
చిన్మయైకరూపదేహధారిణే నమః శివాయ ।
మన్మనోరథావపూర్తికారిణే నమః శివాయ
సన్మనోగతాయ కామవైరిణే నమః శివాయ ॥ ౮॥

యక్షరాజబన్ధవే దయాలవే నమః శివాయ
దక్షపాణిశోభికాఞ్చనాలవే నమః శివాయ ।
పక్షిరాజవాహహృచ్ఛయాలవే నమః శివాయ
అక్షిఫాల వేదపూతతాలవే నమః శివాయ ॥ ౯॥

దక్షహస్తనిష్ఠజాతవేదసే నమః శివాయ
అక్షరాత్మనే నమద్బిడౌజసే నమః శివాయ ।
దీక్షితప్రకాశితాత్మతేజసే నమః శివాయ
ఉక్షరాజవాహ తే సతాం గతే నమః శివాయ ॥ ౧౦॥

రాజతాచలేన్ద్రసానువాసినే నమః శివాయ
రాజమాననిత్యమన్దహాసినే నమః శివాయ ।
రాజకోరకావతంసభాసినే నమః శివాయ
రాజరాజమిత్రతాప్రకాశినే నమః శివాయ ॥ ౧౧॥

దీనమానవాలికామధేనవే నమః శివాయ
సూనబాణదాహకృత్కృశానవే నమః శివాయ ।
స్వానురాగభక్తరత్నసానవే నమః శివాయ
దానవాన్ధకారచణ్డభానవే నమః శివాయ ॥ ౧౨॥

సర్వమఙ్గలాకుచాగ్రశాయినే నమః శివాయ
సర్వదేవతాగణాతిశాయినే నమః శివాయ ।
పూర్వదేవనాశసంవిధాయినే నమః శివాయ
సర్వమన్మనోజభఙ్గదాయినే నమః శివాయ ॥ ౧౩॥

స్తోకభక్తితోఽపి భక్తపోషిణే నమః శివాయ
మాకరన్దసారవర్షిభాషిణే నమః శివాయ ।
ఏకబిల్వదానతోఽపి తోషిణే నమః శివాయ
నైకజన్మపాపజాలశోషిణే నమః శివాయ ॥ ౧౪॥

సర్వజీవరక్షణైకశీలినే నమః శివాయ
పార్వతీప్రియాయ భక్తపాలినే నమః శివాయ ।
దుర్విదగ్ధదైత్యసైన్యదారిణే నమః శివాయ
శర్వరీశధారిణే కపాలినే నమః శివాయ ॥ ౧౫॥

పాహి మాముమామనోజ్ఞదేహ తే నమః శివాయ
దేహి మే వరం సితాద్రిగేహ తే నమః శివాయ ।
మోహితర్షికామినీసమూహ తే నమః శివాయ
స్వేహితప్రసన్న కామదోహ తే నమః శివాయ ॥ ౧౬॥

మఙ్గలప్రదాయ గోతురంగ తే నమః శివాయ
గఙ్గయా తరఙ్గితోత్తమాఙ్గ తే నమః శివాయ ।
సఙ్గరప్రవృత్తవైరిభఙ్గ తే నమః శివాయ
అఙ్గజారయే కరేకురఙ్గ తే నమః శివాయ ॥ ౧౭॥

ఈహితక్షణప్రదానహేతవే నమః శివాయ
ఆహితాగ్నిపాలకోక్షకేతవే నమః శివాయ ।
దేహకాన్తిధూతరౌప్యధాతవే నమః శివాయ
గేహదుఃఖపుఞ్జధూమకేతవే నమః శివాయ ॥ ౧౮॥

త్ర్యక్ష దీనసత్కృపాకటాక్ష తే నమః శివాయ
దక్షసప్తతన్తునాశదక్ష తే నమః శివాయ ।
ఋక్షరాజభానుపావకాక్ష తే నమః శివాయ
రక్ష మాం ప్రపన్నమాత్రరక్ష తే నమః శివాయ ॥ ౧౯॥

న్యఙ్కుపాణయే శివంకరాయ తే నమః శివాయ
సంకటాబ్ధితీర్ణకింకరాయ తే నమః శివాయ ।
కఙ్కభీషితాభయంకరాయ తే నమః శివాయ
పఙ్కజాననాయ శంకరాయ తే నమః శివాయ ॥ ౨౦॥

కర్మపాశనాశ నీలకణ్ఠ తే నమః శివాయ
శర్మదాయ నర్యభస్మకణ్ఠ తే నమః శివాయ ।
నిర్మమర్షిసేవితోపకణ్ఠ తే నమః శివాయ
కుర్మహే నతీర్నమద్వికుణ్ఠ తే నమః శివాయ ॥ ౨౧॥

విష్టపాధిపాయ నమ్రవిష్ణవే నమః శివాయ
శిష్టవిప్రహృద్గుహాచరిష్ణవే నమః శివాయ ।
ఇష్టవస్తునిత్యతుష్టజిష్ణవే నమః శివాయ
కష్టనాశనాయ లోకజిష్ణవే నమః శివాయ ॥ ౨౨॥

అప్రమేయదివ్యసుప్రభావ తే నమః శివాయ
సత్ప్రపన్నరక్షణస్వభావ తే నమః శివాయ ।
స్వప్రకాశ నిస్తులానుభావ తే నమః శివాయ
విప్రడిమ్భదర్శితార్ద్రభావ తే నమః శివాయ ॥ ౨౩॥

సేవకాయ మే మృడ ప్రసీద తే నమః శివాయ
భావలభ్య తావకప్రసాద తే నమః శివాయ ।
పావకాక్ష దేవపూజ్యపాద తే నమః శివాయ
తవకాఙ్ఘ్రిభక్తదత్తమోద తే నమః శివాయ ॥ ౨౪॥

భుక్తిముక్తిదివ్యభోగదాయినే నమః శివాయ
శక్తికల్పితప్రపఞ్చభాగినే నమః శివాయ ।
భక్తసంకటాపహారయోగినే నమః శివాయ
యుక్తసన్మనఃసరోజయోగినే నమః శివాయ ॥ ౨౫॥

అన్తకాన్తకాయ పాపహారిణే నమః శివాయ
శాన్తమాయదన్తిచర్మధారిణే నమః శివాయ ।
సంతతాశ్రితవ్యథావిదారిణే నమః శివాయ
జన్తుజాతనిత్యసౌఖ్యకారిణే నమః శివాయ ॥ ౨౬॥

శూలినే నమో నమః కపాలినే నమః శివాయ
పాలినే విరిఞ్చితుణ్డమాలినే నమః శివాయ ।
లీలినే విశేషరుణ్డమాలినే నమః శివాయ
శీలినే నమః ప్రపుణ్యశాలినే నమః శివాయ ॥ ౨౭॥

శివపఞ్చాక్షరముద్రాం
చతుష్పదోల్లాసపద్యమణిఘటితామ్ ।
నక్షత్రమాలికామిహ
దధదుపకణ్ఠం నరో భవేత్సోమః ॥ ౨౮॥

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య
శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య
శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ
శివపఞ్చాక్షరనక్షత్రమాలాస్తోత్రం సంపూర్ణమ్ ॥

సెనగ పిండి పచ్చడి లేక బొంబాయి చట్నీ


సెనగ పిండి  పచ్చడి  లేక  బొంబాయి  చట్నీ

కావలిసిన  పదార్థాలు
1. సెనగ  పిండి  6 స్పూన్స్
2.  పసుపు
3. ఉప్పు  రుచికి  సరిపడా
4. పచ్చిమిర్చి  2
5. అల్లం  చిన్న  ముక్క
6. కరివేపాకు
7. కొత్తిమీర
8. చింత పండు  కొద్దిగా
9. నీళ్లు  తగినన్ని

పోపు దినుసులు
సెనగ పప్పు  అర స్పూన్ ,   మినపప్పు  అర స్పూన్  ,ఆవాలు  కొద్దిగా ,
 జీలకర్ర  కొద్దిగా  ,ఎండుమిరప కాయలు  2 , ఆయిల్  2 స్పూన్

తయారీ  విధానం
ముందుగా  సెనగపిండి ని కాస్త వేయించి ,  ఒక  బౌల్ లోకి  తీసుకుని  ,
తగినన్ని  నీళ్లు పోసుకుని  ఉండలులేకుండా  కలుపుకుని ,
ఒక పక్కన  పెట్టుకోవాలి  . పచ్చిమిర్చి ని  చీలికలు గాను  , అల్లమును  చిన్న  ముక్కలుగా ను
తరుగుకోవాలి . స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి   ,
వేడెక్కాక  ఆయిల్  వేసి , పైన  చెప్పిన  పోపుదినుసులను  వేసి ,
 అవి  దోరగా  వేగాక కరివేపాకు  ,పచ్చిమిర్చి  చీలికలు  ,అల్లము  ముక్కలు  వేసి  ,
అవి వేగాక  ముందుగా  నీళ్లు పోసి  ,కలుపుకుని  పెట్టుకున్న సెనగపిండి  మిశ్రమాన్ని  వేసి
పసుపు  , ఉప్పు   ,చింతపండు  గుజ్జు  వేసి  బాగా  కలిపి  ,
తగినన్ని  నీళ్లు  పోసి  ఉడకనివ్వాలి  .
స్టవ్  మంట    సిమ్  లో  ఉండాలి . మధ్య మధ్య  లో  కలుపుతూ  ఉండాలి .
బాగా  ఉడికిన  తరువాత స్టవ్  ఆఫ్  చేసుకుని ,
 ఒక  బౌల్  లోకి  తీసుకుని కొత్తిమీరతో   గార్నిష్  చేసుకుంటే
సెనగ పిండి  పచ్చడి  రెడీ
దీనిని  చపాతీ  , ఇడ్లీ  , దోసెలలోకి  బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.

Saturday, 24 June 2017

అటుకుల. MIXTURE


అటుకుల. MIXTURE

కావలిసిన పదార్థాలు
1. అటుకులు   2 కప్పులు
2.  పల్లీలు  అరకప్పు
3.  గుల్ల  సెనగపప్పు  అర కప్పు  
4. జీడిపప్పు పలుకులు  పావు కప్పు
5. కరివేపాకు  కొద్దిగా  
6. కారం తగినంత
7. ఉప్పు  తగినంత
8. ఆయిల్ పావు లీటరు

తయారీ  విధానం
కరివేపాకును  శుభ్రం గా  కడిగి , తడి  లేకుండా  ఆరబెట్టుకోవాలి .
కారమును , ఉప్పు  ను ,  తగినంత ఒక  బౌల్ లోకి  ,
తీసుకుని  కలుపుకోవాలి . స్టవ్  వెలిగించి  , బాణలి  పెట్టి  వేడెక్కాక  ,
ఆయిల్  వేసి ముందుగా ,  అటుకులను  వేపుకుని ,
 టిష్యూ  పేపర్ మీద  వేసుకోవాలి  , తరువాత  ,
వరుసగా  పల్లీలు ,  గుల్లసెనగపప్పు  , జీడిపప్పు  పలుకులు ,
 కరివేపాకులను  , వేసి ,  దోరగా  వేపకుని ,   అటుకుల మీద  వేసుకుని
తరువాత  ముందుగా  తయారుచేసి  పెట్టుకున్న  ఉప్పు ,  కారం  మిశ్రమాన్ని
తగినంత వేసి  బాగా  కలుపుకుంటే  అటుకుల  mixture  రెడీ. 
ఒక  15 రోజుల పాటు  నిలువ  ఉంటాయి.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి. 

Saturday, 10 June 2017

బీరకాయ వడియాలు


కావలిసిన పదార్ధాలు

1. బీరకాయ లు  2
2.  ఉల్లిపాయలు   2
3 .పచ్చిమిర్చి  3
4 .బియ్యపు పిండి   ఒక  కప్పు
5. సెనగ  పిండి   2 స్పూన్స్
6 .కారం  కొద్దిగా
7. జీలకర్ర  కొద్దిగా
8 .ఉప్పు  తగినంత
9 .ఆయిల్  తగినంత
10. కొత్తిమీర తరుగు

తయారీ  విధానం
ముందుగా  బీరకాయ ను  శుభ్రంగా  కడిగి  ,
పైన  వున్న చెక్కు తీసి చిన్నముక్కలు తరగాలి. 
ఉల్లి పాయ ,పచ్చి మిర్చి లను 
సన్నగా తరుగు కోవాలి
ఒక  బౌల్  లోకి   బీరకాయముక్కలు ,
ఉల్లిపాయ  ముక్కలు , పచ్చిమిర్చి  ముక్కలు  , కొత్తిమీర తరుగు 
బియ్యంపిండి , కాస్త శనగపిండి , కారం  ,జీలకర్ర ,
తగినంత  ఉప్పు  వేసి 
గట్టిగా కలిపితే ముద్ద లాగ అవుతుంది . 
నీళ్ళు పొయ్యకూడదు .
స్టవ్  వెలిగించి బాణలి  పెట్టి  వేడెక్కాక ఆయిల్  వేసి 
వేడెక్కాక , ముందుగా తయారు  చేసుకున్న  పిండిని
వడియాల్లా వేసి  దోరగా వేపుకుంటే
బీర కాయ  వడియాలు  రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.



Friday, 9 June 2017

టమాటో దోశ


టమాటో  దోశ

కావలిసిన  పదార్థాలు
1. బియ్యం  1 కప్పు
2. టమాటో  1
3. జీలకర్ర  పొడి  పావు  స్పూన్
4. కారం  పావు  స్పూన్
5. ఆయిల్   తగినంత
6. ఉప్పు  తగినంత
7. ఆవాలు  కొద్దిగా
8.  జీలకర్ర   కొద్దిగా
9. మినపప్పు   అర  స్పూన్
10. కరివేపాకు
11 కొత్తిమీర

తయారీ  విధానం
ముందుగా  బియ్యమును శుభ్రం గా  కడిగి  ,
తగినన్ని  నీళ్లు  పోసి  ,4 గంటల  సేపు  నానబెట్టుకోవాలి.
ఇలా  నానిన  బియ్యమును  , ఉప్పు  ,టమాటో  వేసి ,
మెత్తగా  దోశ  పిండి  మాదిరిగా గ్రైండ్    చేసుకోవాలి  .
 ఈ  పిండికి  జీలకర్ర పొడి , కారం , వేసి   బాగా  కలుపుకోవాలి .
స్టవ్  వెలిగించి  బానలిపెట్టి  వేడెక్కాక   ,
పైన  చెప్పిన  పోపు  దినుసులను  ,కరివేపాకును  ,
వేసి  దోరగా  వేపుకుని, పిండి  లో  వేసి  ,బాగా  కలుపుకోవాలి .
స్టవ్  మీద  పెనం  పెట్టి  వేడెక్కాక,  ఆయిల్  వేసి ,
రుబ్బిన  పిండిని  వేసి  దోశ  మాదిరిగా  తిప్పుకోవాలి .
 ఒక పక్క  వేగాక  ,అట్లకాడతో  తిరగేసి ,కొద్దిగా  ఆయిల్  వేసి,
దోరగా  వేగనిచ్చి  ప్లేటులోకి  తీసుకుని
 సర్వ్  చేసుకుంటే  టమాటో  దోశ  రెడీ  అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.


Thursday, 8 June 2017

సాంబార్ పొడి


సాంబార్  పొడి

కావలిసిన  పదార్థాలు
1. సెనగ పప్పు  3. స్పూన్స్
2. మినపప్పు  3. స్పూన్స్
3. ధనియాలు  2. స్పూన్స్
4.   జీలకర్ర  అర  స్పూన్
5.  ఆవాలు అర స్పూన్
6. ఇంగువ  కొద్దిగా
7. మిరియాలు  6
8. ఎండుమిరపకాయలు  6.
9. బియ్యం  కొద్దిగా
10.   ఆయిల్  1 స్పూన్

తయారీ  విధానం
ముందుగా  స్టవ్   వెలిగించి  బాణలి  పెట్టి ,
వేడెక్కాక  ఆయిల్  వేసి ,
పైన  చెప్పిన  పోపు దినుసులను  వేసి  ,
దోరగా  వేపుకుని ,  స్టవ్  ఆఫ్  చేసుకోవాలి.
వీటిని  చల్లారాక  మెత్తని  పొడి లాగ
గ్రైండ్  చేసుకుని
ఒక  డబ్బాలో పోసుకుంటే
ఘుమ ఘుమ లాడే  సాంబార్  పొడి  రెడీ 
ఒక  నెల రోజులపాటు  నిలువ  ఉంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి.
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.

https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.





Monday, 5 June 2017

సేమ్యా పులిహోర


సేమ్యా  పులిహోర

కావలిసిన  పదార్థాలు
1.  సేమ్యా  ఒక  కప్పు
2. పల్లీలు  2 స్పూన్స్
3.  సెనగపప్పు  1 స్పూన్
4. మినపప్పు  1 స్పూన్
5.  ఆవాలు  అర  స్పూన్
6.  జీలకర్ర  అర  స్పూన్
7. ఎండుమిరపకాయలు
8. ఆయిల్ 4 /స్పూన్స్
9. కరివేపాకు
10. పచ్చిమిర్చి  4
11.  అల్లం  చిన్న  ముక్క
12. నిమ్మ  రసం  కొద్దిగా
13. కొత్తిమీర  కొద్దిగా
14.   నీళ్లు  తగినన్ని

తయారీ  విధానం
ముందుగా  స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  ,తగినన్ని  నీళ్లు పోసి  ,
మరగనిచ్చి  దీనిలో సేమ్యా  ను  వేసి  ,ఉడకనివ్వాలి  .
ఇలా  ఉడికిన  సేమ్యాను  చిల్లుల  పళ్లెం  లో వేసి  , చన్నీళ్లను  పోసి ,
చల్లారనివ్వాలి .  దీనివలన  సేమ్యా  పొడి పొడిలాడుతూ  ఉంటుంది.
 స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ,ఆయిల్  వేసి ,
 పల్లీలు  వేసి  దోరగా  వేగాక,
 పైన  చెప్పిన  పోపు  దినుసులు  వేసి   ,
అవి  దోరగా  వేగాక  పచ్చిమిర్చి  చీలికలు  ,అల్లం  ముక్కలు ,
కరివేపాకు  వేసి  దోరగా  వేపుకోవాలి  .
ఒక  వెడల్పయిన  బేసిన్  లోకి  చల్లారిన  సేమ్యాను  వేసి ,  పసుపు ,
తగినంత  ఉప్పు  వేపుకుని  , పెట్టుకున్న  పోపు  వేసి  ,బాగాకలిపి ,
నిమ్మరసం  కూడా  వేసి  ,
బాగా  కలిపి , పైన  కొత్తిమీరతో  గార్నిష్  చేసుకుంటే
సేమ్యా  పులిహోర  రెడీ  అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi