ఎర్ర గోధుమ నూక ఉప్మా
కావలిసిన పదార్థాలు
1. ఎర్ర గోధుమ నూక 1 గ్లాసు
2. ఉల్లిపాయలు 2
3. టమాటా 1
4. అల్లం చిన్న ముక్క
5. పచ్చిమిర్చి 4
6. కరివేపాకు
7. పసుపు
8. ఉప్పు రుచికి సరిపడా
9. ఆయిల్ 4 స్పూన్స్
10. నీళ్లు 4 గ్లాసులు
11. క్యారెట్ ముక్కలు
12. కొత్తిమీర
పోపు దినుసులు
సెనగ పప్పు 1 స్పూన్ ,మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు అర స్పూన్ ,
జీలకర్ర అర స్పూన్ ఎండుమిరపకాయలు 2
తయారీ విధానం
ఉల్లిపాయలను ,టమాటాలు , క్యారెట్ ముక్కలు ,అల్లంలను ,సన్నగా చిన్న ముక్కలుగా ను ,
పచ్చిమిర్చి ని చీలికలుగాను తరుగుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి , దోరగా వేగిన తరువాత ,
తరిగి పెట్టుకున్న ఉల్లి పాయ, టమాటా , క్యారెట్ ముక్కలు ,అల్లం, పచ్చిమిర్చి,
కరివేపాకులను వేసి దోరగా మగ్గిన తరువాత ,
4 గ్లాసుల నీళ్లు పోసి, తగినంత ఉప్పును వేసి,
బాగా కలిపి నీళ్లు మరిగిన తరువాత ,
నూకను వేసి బాగా కలిపి, కొద్దిసేపు ఉడకనివ్వాలి.
మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి .
అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించుకోవాలి ,
తడి అంతా పోయి విడి విడి లాడుతూ వచ్చాక,
స్టవ్ ఆఫ్ చేసి కొని,
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
ఘుమ ఘుమ లాడే
ఎర్ర నూక ఉప్మా రెడీ అవుతుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi