Thursday 23 February 2017

ప్రసాదం బూరెలు


ప్రసాదం బూరెలు
కావలిసిన  పదార్థాలు
1. తెల్ల  గోధుమనూక  ఒక  గ్లాసు
2. పంచదార  ఒక  గ్లాసు
3. ఏలకుల  పొడి  కొద్దిగా
4. నీళ్లు  ఒక గ్లాసు
5.  పాలు  ఒక గ్లాసు
6.  నెయ్యి  అర  కప్పు
7. జీడిపప్పు  పలుకులు  8 

బూరెల  తోపునకు
 మైదా  పిండి 1 కప్పు  ,సెనగపిండి  1 కప్పు  ,వరిపిండి  1 కప్పు  ,నీళ్లు  తగినన్ని  ,
ఉప్పు  చిటికెడు  , బేకింగ్ పొడి  కొద్దిగా ,  ఆయిల్  పావులీటరు

తయారీ  విధానం
ముందుగా  సెనగ పిండి  ,వరి పిండి  ,మైదా పిండి  లను  ,
ఒక  బౌల్  లోకి  తీసుకుని  ,చిటికెడు  ఉప్పు,  బేకింగ్  పొడి  ని  వేసి ,
 బాగా  కలిపి  కొద్దీ కొద్దిగా  నీళ్లు  పోసుకుంటూ  ,
బజ్జీల  పిండి  మాదిరిగా  కలుపుకుని  ,ఒక   పక్కన  పెట్టుకోవాలి   .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక , ఒక  స్పూన్  నెయ్యి  వేసి ,
గోధుమ  నూకను  ,జీడిపప్పు  పలుకులను  ,
వేసి  దోరగా  వేపుకుని  ,ఒక  ప్లేట్  లోకి  తీసుకుని ,
దానిపైన  పంచదారను  వేసి   కలపాలి  .
స్టవ్  పైన  బాణలి  పెట్టి  నీళ్లు ,పాలు పోసి , మరిగాక
పంచదార  కలిపిన  నూకను ,నెయ్యి ని  ,ఏలకుల  పొడిని ,
వేసిబాగా కలిపి  మూత  పెట్టి  ఉడకనివ్వాలి .
మద్య  మధ్యలో  కలుపుతూ   అవసరమైతే , నెయ్యి ని   కూడా వేసి ,
 బాగా  కలిపి  దగ్గర  పడ్డాక  ,స్టవ్  ఆఫ్  చేసుకుంటే  ప్రసాదం  రెడీ .
 దీనిని  చల్లారాక  చిన్న  ఉండలుగా  చేసుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ,పావు లీటరు  ఆయిల్  వేసి  ,
ముందుగా  మనం  తయారు చేసుకున్న  ప్రసాదం  ఉండలను ,
తోపు  పిండిలో  ముంచి ,ఆయిల్  లో  వేసి  దోరగా  వేపుకుంటే
వేడి  వేడి  ప్రసాదం  బూరెలు  రెడీ  అవుతాయి
ఇవి  రెండు  రోజుల  పాటు  నిల్వ  ఉంటాయి .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi