నిమ్మకాయ కారం ముక్కలు
కావలిసిన పదార్థాలు
1. నిమ్మకాయలు 6
2. పచ్చిమిర్చి 3
3. పసుపు కొద్దిగా
4. ఆయిల్ 8 స్పూన్స్
5. ఉప్పు తగినంత
కారమునకు
మినపప్పు 1 స్పూన్ , ఆవాలు 1 స్పూన్ , మెంతులు అర స్పూన్ ,
జీలకర్ర 1 స్పూన్ , ఎండుమిరపకాయలు 6 , ఇంగువ కొద్దిగా
తయారీ విధానం
ముందుగా నిమ్మకాయలు శుభ్రం గా కడిగి తుడిచి ,ఆరిన తరువాత ,
చిన్న ముక్కలుగా తరుగుకోవాలి ,
పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా తరుగుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి దోరగా వేపుకుని ,చల్లార్చుకోవాలి .
చల్లారిన వీటిని తగినంత ఉప్పు వేసి ,
పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి .
ఈ పొడిని తరిగిన నిమ్మకాయ ముక్కలమీద వేసి బాగా కలుపుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక కొద్దిగా ఇంగువ ,
6 స్పూన్స్ ఆయిల్ వేసి, వేడెక్కనిచ్చి,
కారము కలిపిన నిమ్మకాయ ముక్కలపై న వేసి ,
బాగా కలిపి ఊర నిస్తే
రుచికరమైన నిమ్మకాయ ముక్కలు రెడీ అవుతాయి
ఇవి ఒక వారం రోజులపాటు నిల్వ ఉంటాయి
వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi