క్యాబేజీ పెసర పప్పు పొడికూర
కావలిసిన పదార్థాలు
1. పెసరపప్పు 1 కప్పు
2. క్యాబేజీ పావుకేజీ
3. పచ్చిమిర్చి 3
4. కరివేపాకు కొద్దిగా
5. నీళ్లు తగినన్ని
6. పసుపు
7. ఉప్పు రుచికి సరిపడా
పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అర స్పూన్ ,జీలకర్ర అర స్పూన్ ,ఎండుమిరపకాయలు 2 ,
ఇంగువ కొద్దిగా, ఆయిల్ 2 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా క్యాబేజీని శుభ్రంగా కడిగి ,సన్నగా తరుగుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి , అందులో తరిగిన క్యాబేజీ ని ,
పెసరపప్పును వేసి తగినన్ని నీళ్లు పోసి ,ఉడికించుకుని ,
చిల్లుపల్లెం లో పోసి చల్లార్చుకోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక , ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపుదినుసులను వేసి ,దోరగా వేగాక ,
పచ్చిమిర్చి చీలికలు ,కరివేపాకు వేసి ,వేగిన తరువాత ,
ముందుగా మనం ఉడికించి చల్లారబెట్టుకున్న ,
పెసరపప్పు ,క్యాబేజీ ,పసుపు లను వేసి ,బాగా కలిపి ,
కొద్దిసేపు మగ్గనిచ్చి , తగినంత ఉప్పు వేసి , బాగా కలిపి ,
స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకుని
పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
పెసరపప్పు క్యాబేజీ పొడికూర రెడీ అవుతుంది
దీనిని వేడి అన్నంలోను చపాతీలోనూ బాగుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi