గోంగూర పులుసు
కావలిసిన పదార్థాలు
1. గోంగూర 1 కట్ట
2. పసుపు
3. ఉప్పు రుచికి సరిపడా
4. బెల్లం కొద్దిగా
5. పచ్చిమిర్చి 3
6. వరిపిండి 2 స్పూన్స్
7. నీళ్లు తగినన్న్ని
పోపు దినుసులు
ఆవాలు అర స్పూన్ ,మెంతులు అర స్పూన్ , జీలకర్ర అర స్పూన్ ,
ఇంగువ కొద్దిగా ,ఎండుమిరపకాయలు 2, కారం కొద్దిగా , ఆయిల్ 2 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా గోంగూరను శుభ్రం చేసుకుని , శుభ్రంగా కడిగి ,సన్నగా తరిగి ,
ఒక గిన్నెలోకి తీసుకుని ,పసుపు ,తగినంత ఉప్పు ,బెల్లం ,పచ్చిమిర్చి చీలికలు ,
వేసి తగినన్ని నీళ్లు పోసి ,ఉడికించుకోవాలి .
ఉడికిన తరువాత వరిపిండిని , కొద్దిగా నీళ్లలో కలిపి ,పేస్ట్ లాగ చేసి ,
ఉడుకుతున్న పులుసులో కలిపి మరగనివ్వాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులు ,కారం ,వెల్లుల్లి రెబ్బలు వేసి ,
దోరగా వేగిన తరువాత ,మరుగుతున్న పులుసులో వేసి ,బాగా కలిపి,
స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఘుమ ఘుమ లాడే గోంగూర పులుసు రెడీ అవుతుంది.
*గోంగూర పుల్లటిది అయితే చింత పండు అవసరం లేదు
**గోంగూర పులుపు లేకపోతే చింత పండు వేసుకొవాలి.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi