Tuesday, 26 December 2017

భారతీయ సంఖ్యామానం


 భారతీయ సంఖ్యామానం 

ఒకటి =1
పది =10                                   
వంద =100
వెయ్యి =1000
పదివేలు =10000.             
లక్ష =100000
పదిలక్షలు =1000000
కోటి =10000000
పది కోట్లు= 100000000
శతకోటి                    =1000000000
సహస్త్ర కోటి           =10000000000 
అనంతకోటి       =100000000000
న్యార్భుద్ధం                 =1000000000000
ఖర్వం                      =10000000000000
మహాఖర్వం                =100000000000000
పద్మం                      =1000000000000000
మహాపద్మం                =10000000000000000
క్షోణి                         =100000000000000000
మహాక్షోణి                   =1000000000000000000
శంఖం                      =10000000000000000000
మహాశంఖం                =100000000000000000000
క్షితి                         =1000000000000000000000
మహాక్షితి                   =10000000000000000000000
క్షోబం                       =100000000000000000000000
మహా క్షోబం                =1000000000000000000000000
నిధి                         =10000000000000000000000000
మహానిధి                   =100000000000000000000000000
పరాటం                     =1000000000000000000000000000
పరార్థం                     =10000000000000000000000000000
అనంతం                    =100000000000000000000000000000
సాగరం                     =1000000000000000000000000000000
అవ్యయం                  =10000000000000000000000000000000
అమృతం                   =100000000000000000000000000000000
అచింత్యం                  =1000000000000000000000000000000000
అమేయం                  =10000000000000000000000000000000000
భూరి                       =100000000000000000000000000000000000
మహాభూరి                 =1000000000000000000000000000000000000

Sunday, 24 December 2017

శ్రీ సిద్దమంగళ స్తోత్రం




శ్రీ సిద్దమంగళ స్తోత్రం

1. శ్రీ మదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

2. శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

3. మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయశ్రీ పాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

4. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

5. సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

6. దో చౌపాతీ దేవ్‌లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

7. పుణ్యరూపిణీ రాజమాంబ సుతగర్భ పుణ్యఫల సంజాతా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

8. సుమతీ నందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

9. పీఠికాపుర నిత్యవిహారా మధుమతి దత్తా మంగళరూపా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

పరమ పవిత్రమయిన యీ సిద్ధ మంగళ స్తోత్రమును పఠించిన అనఘాష్టమీ వ్రతము చేసి సహస్ర సద్భ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. మండల దీక్ష వహించి ఏక భుక్తం చేయుచూ, కాయకష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్భ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠించబడును. దీనిని పఠించుట వలన సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభించును. మనసున తలచిన కోరికలు నెరవేరును. మనసా, వాచా కర్మణా దత్తారాధన చేయు భక్తులు యీ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయుమండలము నందలి సిద్ధులు అదృశ్యరూపమున సంచరించుదురు.

ఓం ద్రాo దత్తాత్రేయాయ నమః




Saturday, 23 December 2017

భాగవతం, మహాభారతం ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు


భాగవతం, మహాభారతం
ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు

1.   మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్.

2.   నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్.

3.   జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్.

4.   మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్


5.   శమంత పంచకం (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) మరియు దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా

6.   పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం

7.   మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా

8.   నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్

9.   వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్

10.   నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

11.   వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్

12.   ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్.

13.   సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర.

14.   హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.

15.   మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.

16.   వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర.

17.   కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్.

18.   మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.

19.   ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్.

20.   గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా.

21.   కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).

22.   పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్.

23.   కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్, గుజరాత్.



24.   శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.

25.   హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.

26.   విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర

27.   కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర

28.   చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.

29.   కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) - దాతియ జిల్లా, మధ్యప్రదేశ్.

30.   ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.

31.   కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.


32.   పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.

33.   కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్.

34.   జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్.

35.   కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా.

36.   మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.

37.   విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్

38.   శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం.

39.   ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం.

40.   నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.

41.   జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.


42.   కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)- నేపాల్ లోని తిలార్కోట్.

43.   బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్.

44.   గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.



Thursday, 21 December 2017

మన గోత్రములు


మన గోత్రములు
విశ్వకర్మ పంచముఖుడు (ఐదు ముఖములు కలవాడు)
౧. మను అనె ముఖము యొక్క గోత్రం సనగ బ్రహ్మర్షి
౨. మయ అనె ముఖము యొక్క గోత్రం సనాతన బ్రహ్మర్షి
౩. త్వష్ట అనె ముఖము యొక్క గోత్రం అహభౌసన బ్రహ్మర్షి
౪. దైవజ్ఞ (శిల్పి) అనె ముఖము యొక్క గోత్రం ప్రత్నస బ్రహ్మర్షి
౫. విశ్వజ్ఞ అనె ముఖము యొక్క గోత్రం సుపర్ణస బ్రహ్మర్షి

I. సనగ బ్రహ్మర్షి గోత్రానికి ఐదు ఉప గోత్రాలు.
౧. ఉప సనగ బ్రహ్మర్షి
౨. విభ్రజ బ్రహ్మర్షి
౩. కాశ్యప బ్రహ్మర్షి
౪. మను విశ్వకర్మ బ్రహ్మర్షి
౫. విశ్వాత్మక బ్రహ్మర్షి

II. సనాతన బ్రహ్మర్షి గోత్రానికి ఐదు ఉప గోత్రాలు.
౧. ఉప సనాతన బ్రహ్మర్షి
౨. వామ దేవ బ్రహ్మర్షి
౩. విశ్వ చక్షు బ్రహ్మర్షి
౪. ప్రతితక్ష బ్రహ్మర్షి
౫. సునందా బ్రహ్మర్షి

III. అహభౌసన బ్రహ్మర్షి గోత్రానికి ఐదు ఉప గోత్రాలు.
౧. ఉపభౌసన బ్రహ్మర్షి
౨. భద్ర దత్త బ్రహ్మర్షి
౩. ఖాండవ బ్రహ్మర్షి
౪. నిర్వికార బ్రహ్మర్షి
౫. శ్రీ ముఖ బ్రహ్మర్షి

IV. ప్రత్నస బ్రహ్మర్షి గోత్రానికి ఐదు ఉప గోత్రాలు.
౧. ఉప ప్రత్నస బ్రహ్మర్షి
౨. రుచి దత్త బ్రహ్మర్షి
౩. వాస్తోష్పతి బ్రహ్మర్షి
౪. కౌసల బ్రహ్మర్షి
౫. సనాభావ బ్రహ్మర్షి

V. సుపర్ణస బ్రహ్మర్షి గోత్రానికి ఐదు ఉప గోత్రాలు.
౧. ఉప సుపర్ణస బ్రహ్మర్షి
౨. విశ్వజ్ఞ  బ్రహ్మర్షి
౩. పరితర్షి  బ్రహ్మర్షి
౪. శూరసేన  బ్రహ్మర్షి
౫. సాంఖ్యయాన  బ్రహ్మర్షి

పైన పేర్కొన్న 25  ఉప గోత్రాలకు తిరిగి ఐదేసి ఉప గోత్రాలు కలవు.

Monday, 18 December 2017

అధ శ్రీ శివ ఆష్టోత్తరశతనామావళిః

అధ శ్రీ శివ ఆష్టోత్తరశతనామావళిః

1) ఓం శంకరాయ నమః
2) ఓం శశిశేఖరాయ నమః
3) ఓం కల్పాంతకాయ నమః
4) ఓం కలికల్మషఘ్నాయ నమః
5) ఓం కాలకాలాయ నమః
6) ఓం కామదహనాయ నమః
7) ఓం కమలనాభవల్లభాయ నమః
8) ఓం కామేశ్వరీవల్లభాయ నమః
9) ఓం కరవిధృతమృగాయ నమః
10) ఓం కుమారగణనాథార్చితాయ నమః
11) ఓం కలశహస్తాయ నమః
12) ఓం మంగళకరాయ నమః
13) ఓం మహాబీజాయ నమః
14) ఓం మహాబలాయ నమః
15) ఓం మహాతాండవనర్తనాయ నమః
16) ఓం మహాపాతకనాశనాయ నమః
17) ఓం మహాపాదుకాయ నమః
18) ఓం మహేశ్వరాయ నమః
19) ఓం మార్గబాంధవాయ నమః
20) ఓం మోహధ్వాంతాయ నమః
21) ఓం మార్తాండభైరవాయ నమః
22) ఓం మందస్మితవదనారవిందాయ నమః
23) ఓం చిదానందాయ నమః
24) ఓం భవభయభంజనాయ నమః
25) ఓం భవరోగనాశనాయ నమః
26) ఓం భక్తసులభాయ నమః
27) ఓం భవోద్భవాయ నమః
28) ఓం భావకారకాయ నమః
29) ఓం భర్గాయ నమః
30) ఓం భృంగాధిపాయ నమః
31) ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః
32) ఓం భాషాసూత్రప్రదాయకాయ నమః
33) ఓం భానుకోటిసదృశాయ నమః
34) ఓం బోధరూపాయ నమః
35) ఓం బ్రహ్మజ్ఞానప్రదాయకాయ నమః
36) ఓం బ్రహ్మాదిదేవగణపూజితాయ నమః
37) ఓం సర్వజ్ఞాయ నమః
38) ఓం స్వయంశ్రేష్ఠాయ నమః
39) ఓం స్వాత్మారామపరమానందాయ నమః
40) ఓం పినాకహస్తాయ నమః
41) ఓం ఖండపరశుధరాయ నమః
42) ఓం ఖట్వాంగధరాయ నమః
43) ఓం వ్యాఘ్రచర్మాంబరధరాయ నమః
44) ఓం వీణాధరాయ నమః
45) ఓం గజచర్మవసనాయ నమః
46) ఓం ఢమరుకధరాయ నమః
47) ఓం నటేశ్వరాయ నమః
48) ఓం నాదమధ్యాయ నమః
49) ఓం నీలగ్రీవాయ నమః
50) ఓం నీలలోహితాయ నమః
51) ఓం నిత్యశుద్ధాయ నమః
52) ఓం నిరామయాయ నమః
53) ఓం నిరంజనాయ నమః
54) ఓం నిర్వికల్పాయ నమః
55) ఓం నిరవద్యాయ నమః
56) ఓం నిష్ప్రపంచాయ నమః
57) ఓం నిరాలంబాయ నమః
58) ఓం నిరవశేషాయ నమః
59) ఓం నిష్కంటకాయ నమః
60) ఓం నిస్త్రైగుణ్యరూపాయ నమః
61) ఓం నియతాయ నమః
62) ఓం నియమాశ్రితాయ నమః
63) ఓం నందీశ్వరసేవితమృదుపల్లవపదాయ నమః
64) ఓం నిత్యాభిషేకాసక్తాయ నమః
65) ఓం గౌరార్ధవపుషాయ నమః
66) ఓం గంగాధరాయ నమః
67) ఓం గ్రహాధిపాయ నమః
68) ఓం వామదేవాయ నమః
69) ఓం వేదవేద్యాయ నమః
70) ఓం వైశ్వానరాయ నమః
71) ఓం వ్యోమకేశాయ నమః
72) ఓం వృషభవాహనాయ నమః
73) ఓం వైశ్రవణపూజితాయ నమః
74) ఓం విమలాయ నమః
75) ఓం విశ్వవంద్యాయ నమః
76) ఓం విశ్వేశ్వరాయ నమః
77) ఓం హిమగిరికన్యకావరాయ నమః 
78) ఓం హిరణ్యరేతాయ నమః
79) ఓం గుహ్యాతిగుహ్యాయ నమః
80) ఓం లోకోత్తరాయ నమః
81) ఓం దక్షయజ్ఞవినాశకాయ నమః
82) ఓం పంచవక్త్రాయ నమః
83) ఓం పరమహంసాయ నమః
84) ఓం పూజ్యతమాయ నమః
85) ఓం పుష్కలాయ నమః
86) ఓం సురాధ్యక్షాయ నమః
87) ఓం క్షేత్రజ్ఞాయ నమః
88) ఓం క్షేత్రపాలకాయ నమః
89) ఓం శ్రీమూలనాథాయ నమః
90) ఓం ధ్యానమగ్నాయ నమః
91) ఓం త్రిపురాంతకాయ నమః
92) ఓం ఫణిభూషణాయ నమః
93) ఓం యోగనిరతాయ నమః
94) ఓం యోగయుక్తాయ నమః
95) ఓం యోగానందాయ నమః
96) ఓం యోగగమ్యాయ నమః
97) ఓం అవాఙ్మానసగోచరాయ నమః
98) ఓం అరిందమాయ నమః
99) ఓం అమేయాత్మాయ నమః
100) ఓం అనుష్ఠానశీలాయ నమః
101) ఓం అనిమేషాయ నమః
102) ఓం అనఘాయ నమః
103) ఓం అచలాయ నమః
104) ఓం అకల్మషాయ నమః
105) ఓం అంధకాసురసూదనాయ నమః
106) ఓం అమోఘప్రభావాయ నమః
107) ఓం ఆర్తత్రాణపరాయణాయ నమః
108) ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః

Monday, 11 December 2017

చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు:


చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు:
( As Per Science)

1.చేతిస్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.
2.చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ని పంపిస్తాయట.
3.అహారాన్ని చేతితో టచ్ చేయగానే, ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది.
4.చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం.
6.మన ఆహారాన్ని నూనె మరియు ఎక్కువగా ఉపయోగిస్తాం.ఇలా తయారుచేసుకున్న ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్ తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుందట.
7.వేళ్ళతో ఆహారం కలుపుకొని, ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుందట
8.చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల,వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది.
9.ఇంకా చేతివేళ్ళతో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలుకాకుండా,ఆరోగ్యవంతంగా ఉంటారు. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది. పురణాల పరంగా…

చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుందట.
1. బొటనవేలు: అగ్నితత్వం
2. చూపుడు వేలు: వాయుతత్వం
3. మధ్యవేలు: ఆకాశం
4. ఉంగరపు వేలు: భూమి
5. చిటికిన వేలు: జలతత్వం..

ఈ అయిదు వేళ్ళ స్పర్శ ఆహారానికి తగిలినపుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది.

Tuesday, 5 December 2017

తెలుగు వర్ణమాల ప్రాశస్త్యం దేవతాస్వరూపాలు వాగ్దేవతలు

తెలుగు వర్ణమాల ప్రాశస్త్యం దేవతాస్వరూపాలు
                 వాగ్దేవతలు

తెలుగు భాషలో  వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణం :

*"అ నుండి అః"*
వరకు ఉన్న
 16 అక్షరాల విభాగాన్ని
 *"చంద్ర ఖండం"* అంటారు.

ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు  అధిదేవత *"వశిని"*
 అంటే వశపరచుకొనే శక్తి కలది అర్ధం.

*"క"* నుండి *"భ"* వరకు ఉన్న
 24 అక్షరాల విభాగాన్ని
*" సౌర ఖండం"* అంటారు.

.*"మ"* నుండి  *"క్ష"* వరకు ఉన్న
 10 వర్ణాల విభాగాన్ని  *"అగ్ని ఖండం"* అంటారు.
ఈ బీజ శబ్దాలన్నీ
జన్యు నిర్మాణాన్ని క్రోమౌజోములను ప్రభావితం చేయగలుగుతాయి.

సౌర ఖండంలోని
*"క"* నుండి  *"ఙ"*
 వరకు  గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి.

అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.

.*"చ"* నుండి  *"ఞ"* వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత *"మోదిని"* అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.

.*"ట"*నుండి *"ణ"*వరకు గల ఐదు అక్షరాల  అధిదేవతా శక్తి *"విమల"* అంటే మలినాలను తొలగించే దేవత.

*"త"* నుండి *"న"* వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత *"అరుణ"*  కరుణను మేలుకొలిపేదే అరుణ.

*"ప"*  నుండి *"మ"* అనే ఐదు అక్షరాలకు అధిదేవత *"జయని"* జయమును కలుగ చేయునది.

అలాగే అగ్ని ఖండంలోని
*" య, ర,ల, వ*
అనే అక్షరాలకు అధిష్టాన దేవత *"సర్వేశ్వరి"*. శాశించే శక్తి కలది సర్వేశ్వరి.

.ఆఖురులోని
 ఐదు అక్షరాలైన
*"శ, ష, స, హ, క్ష లకు* అధిదేవత *"కౌలిని"*

ఈ అధిదేవతలనందరినీ *"వాగ్దేవతలు"* అంటారు.

.అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం,
ఒక దేవతాశక్తి ఉంది.

ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి అద్భవించింది.
అంటే బ్రహ్మమే శబ్దము.
*ఆ బ్రహ్మమే నాదము.*

మనం నిత్యజీవితంలో  సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి.

*అదే మంత్రాలు,*
*వేదం అయితే*
*ఇంకా లోతుగా*
*ప్రభావం చూపుతుంది*

భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి అమ్మవార్లును అర్చిస్తున్నాయి.

కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా,
వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా మనం
ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు.

మనం చదివే స్తోత్రం
ఎక్కడో వున్న
దేవుడిని/దేవతను  ఉద్దేశించి కాదు,
మనం చదివే స్తోత్రమే
ఆ దేవత.

*మనం చేసే శబ్దమే*
*ఆ దేవత*

మన అంతఃచ్ఛేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత.

ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత.




Monday, 13 November 2017

దీపావళి రోజు పఠించాల్సిన లక్ష్మీ స్తోత్రం

దీపావళి రోజు పఠించాల్సిన లక్ష్మీ స్తోత్రం

నమశ్రియై లోకధాత్ర్వై బ్రహ్మామాత్రే నమోనమః
నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమోనమః !!

ప్రసన్న ముఖ పద్మాయై పద్మ కాంత్యై నమోనమః
నమో బిల్వ వన స్థాయై విష్ణు పత్న్యై నమోనమః

విచిత్ర క్షామ ధారిణ్యై పృథు శ్రోణ్యై నమోనమః
పక్వ బిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమోనమః !!

సురక్త పద్మ పత్రాభ కరపాదతలే శుభే
సరత్నాంగదకేయూర కాంచీనూ పురశోభితే !!

యక్షకర్ధమ సంలిప్త సర్వాంగే కటకోజ్జ్వలే
మాంగళ్యా భరణైశ్చిత్రైః ముక్తాహారై ర్విభూషితే !!

తాటంకై రవతం సైశ్చ శోభమాన ముఖాంబుజే
పద్మ హస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే !!

ఋగ్యజుస్సామరూపాయై విద్యాయైతే నమోనమః
ప్రసీదాస్మాన్ కృపాదృష్టి పాతై రాలోక యాబ్దిజే
యేదృష్టాతే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః

ఫలశ్రుతి
ఇతిస్తుతాతథాదేవైః విష్ణు వక్షస్స్థలాలయా
విష్ణునా సహసందృశ్య రమాప్రేతావదత్సురాన్
సురారీన్ సహసాహత్వా స్వపధాని గమిష్యథ
యే స్థానహీనాః స్వస్థానా ద్ర్భ్రం శితాయేనరాభువి
తేమామనే నస్తోత్రేణ స్తుత్వా స్థానమవాప్నుయుః !

Tuesday, 7 November 2017

చతుర్దశ (14) భువనములు


చతుర్దశ (14) భువనములు

ఊర్థ్వ లోకములు:1.సత్యలోకము
                            2.తపోలోకము
                            3.జనలోకము
                            4.మహాలోకము
                            5.స్వర్గలోకము
                            6.భువర్ లోకము
                            7.భూలోకము

అథోలోకములు:    1.అతలము
                             2.వితలము
                            3.సుతలము
                            4.తలాతలము
                            5.రసాతలము
                            6.మహాతలము
                            7.పాతాళము

అష్టాదశ (18) ఉప పురాణములు


అష్టాదశ (18) ఉప పురాణములు

1.ఉశన పురాణము
2.కపిల పురాణము
3.కాళి పురాణము
4.సనత్కుమార పురాణము
5.శంభు పురాణము
6.సౌర పురాణము
7.దౌర్వాస పురాణము
8.నందీయ పురాణము
9.నారసింహ పురాణము
10.నారదీయ పురాణము
11.పారాశర పురాణము
12.అంగీరస సంహిత పురాణము
13.భృగు సంహిత పురాణము
14.మారీచ పురాణము
15.మానవ పురాణము
16.వాసిష్ఠ పురాణము
17.లింగ పురాణము
18.వారుణ పురాణము

అష్టాదశ(18) పురాణములు


అష్టాదశ(18) పురాణములు


శ్లో:మద్వయం,భద్వయం చైవ,
     బ్రత్రయం,వచతుష్టయం/
      అ,నా,ప,లిం,గ,కూ,స్కాని-
      పురాణాని పృథక్ పృథక్//

'మ'ద్వయం:1.మత్స్య పురాణం
                    2.మార్కండేయ పురాణం

'భ'ద్వయం: 1.భవిష్య పురాణం
                   2.భాగవతము

'బ్ర‌'త్రయం:  1.బ్రహ్మ పురాణం
                   2.బ్రహ్మాండ పురాణం
                   3.బ్రహ్మవైవర్త పురాణం

'వ'చతుష్టయం:1.వామన పురాణం
                        2.వాయు పురాణం/
                           శివ పురాణం
                        3. విష్ణు పురాణం
                        4.వరాహ పురాణం

'అ'                 :అగ్ని పురాణం
'నా'                :నారద పురాణం
'ప'                  :పద్మ పురాణం
'లిం'                :లింగపురాణం
'గ'                   :గరుడ పురాణం
'కూ'                 :కూర్మ పురాణం
'స్కా'                :స్కాంద పురాణం

మహాభారతం అష్టాదశ(18) అనుబంధం


మహాభారతం అష్టాదశ(18)
అనుబంధం

1.మహాభారతంలోని
   పర్వములు-18

2.కురుక్షేత్ర యుధ్ధం లో పాల్గొన్న
   అక్షౌహిణులు-18

   (పాండవులు 7 అక్షౌహిణులు,
     కౌరవులు   11 అక్షౌహిణులు)

3.కురుక్షేత్రం సంగ్రామం జరిగిన
    రోజులు -18

4. శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన
    భగవద్గీత అధ్యాయములు -18

5.కురుక్షేత్ర యుధ్ధంలో ప్రయోగించిన
   అస్త్రములు -18

1.గాండీవము 2.పాశుపతాస్త్రము
3.బ్రహ్మాస్త్రము 4.వైష్ణవాస్త్రము
5.ఇంద్రాస్త్రము 6.చక్రము 7.ఖడ్గము
8.నారాయణాస్త్రము 9.ఇంద్రాస్త్రము
10.వరుణాస్త్రము 11.ఆగ్నేయాస్త్రము
12.నాగాస్త్రము 13.గరుడాస్త్రము
14.వాయువ్యాస్త్రము 15.భార్గవాస్త్రము
16.మేఘాస్త్రము.  17కీర్తనీయాస్త్రము
18.బ్రహ్మశిరోనామకాస్త్రము

అక్షౌహిణి-వివరణ


అక్షౌహిణి-వివరణ

'అక్షౌహిణి'యను పదము చతురంగ బలముతో కూడిన సైన్యము లోని రథ‌,గజ,తురగ, పదాదుల సంఖ్యాపరిమితిని తెలుపుటకు
ఏర్పబడిన ఒక సంజ్ఞ
అక్షౌహిణి యనగా....
1.ఒకరథము,ఒకఏనుగు,మూడు గుఱ్ఱములు,ఐదు కాల్బలములు
ఒక 'పత్తి' (10)
2.మూడు 'పత్తులు' చేరినది ఒక 'సేనాముఖము' (30)
3.మూడు 'సేనాముఖములు' చేరినది ఒక‌
'గుల్మము' (90)
4.మూడు'గుల్మము'లు కలిసిన ఒక
'గణము' (270)
5.మూడు 'గణము'లు కలిపిన ఒక
'వాహిని' (810)
6.మూడు' వాహిను'ల సైన్యము ఒక
'పృథ' (2430)
7.మూడు'పృథ'నములు కలిసిన ఒక
'చమూ' (7290)
8.మూడు'చమూ'లు కలిసిన ఒక
'అనీకినీ'(21870)
9.పది'అనీకిను'లు చేరి ఒక 'అక్షౌహిణీ'
    (2,18,700)

ఒక 'అక్షౌహిణి'  సైన్యములో....

1.కాల్బలములు       1,09,350   (18)
2.గుఱ్ఱములు              65,610    (18)
3.ఏనుగులు               21,870     (18)
4రథములు                21,870      (18)
మొత్తము సంఖ్య.     2,18,700     (18)

Thursday, 2 November 2017

బూడిద గుమ్మడి కాయ వడియాలు


బూడిద  గుమ్మడి  కాయ  వడియాలు

కావలిసిన  పదార్థాలు
1. బూడిద  గుమ్మడి  కాయ  చిన్నది 1
2. మినపప్పు   అరకేజీ
3. పచ్చిమిర్చి  100 గ్రాములు
4. అల్లం  50 గ్రాములు
5.   ఉప్పు  తగినంత
6. ఇంగువ తగినంత
7. పసుపు

తయారీ  విధానం
ముందుగా  బూడిద గుమ్మడి  కాయను  శుభ్రం  గా  కడిగి  ,
తుడిచి  తడి లేకుండా  ఆర బెట్టుకోవాలి  బాగా   ఆరి న  తరువాత  , పగలకొట్టి
బూడిద  గుమ్మడికాయ లోపల వున్న గుజ్జును  తీసివేసి ,
 సన్నని చిన్న  ముక్కలుగా  తరుగుకోవాలి .
ఇలా  తరుగుకున్న  ముక్కలను ,తగినంత  ఉప్పు , పసుపు వేసి,
 బాగా  కలిపి  కాటన్ బట్టలో  వేసి  మూట కట్టి  ,
పైన బరువు  పెట్టి ఒక  రాత్రి  అంతా  ఉంచాలి .
దీనివలన నీరుఅంతా  ఇవతలికి  వచ్చేస్తుంది  .
మినపప్పు  ను ఒక గిన్నెలోకి  తీసుకుని  ,
తగినన్ని  నీళ్లు  పోసి నానబెట్టుకోవాలి .
మరునా డు  పప్పును  శుభ్రంగా  కడిగి  ,గారెల పిండిలా  గట్టిగా  రుబ్బుకుని  ,
వెడల్పయిన బేసిన్ లోకి  తీసుకోవాలి .
అల్లం ,పచ్చిమిర్చిలను  శుభ్రంగా  కడిగి  ,
తుడిచి  మెత్తని ముద్దలాగా  గ్రైండ్  చేసుకోవాలి  .
రుబ్బుకున్న మినపపిండిలో  గుమ్మడి ముక్కలు , అల్లం పచ్చిమిర్చి ముద్ద,
 ఇంగువ   ,పసుపు  ముక్క లపైన ఉప్పు వేసి ,
మూట కడతాము  కాబట్టి  రుచి చూసుకుని  అవసరమైతేనే  ఉప్పు  వేసుకోవాలి  .
ఇవన్నీ  బాగా  కలిసేలా  కలుపుకోవాలి  .
ఇలా  కలుపుకున్న  పిండిని
ప్లాస్టిక్ పేపర్  మీద  వడియాల  మాదిరి పెట్టుకుని  ,
ఎండబెట్టుకోవాలి .
సాయంత్రం  అట్లకాడతో   తిరగేసుకుని  ,
వెడల్పయిన  ప్లేటులో  పెట్టి  బాగా  ఎండబెట్టుకుని
బాగా  ఎండిన తరువాత
గాలి  చొర బడని  డబ్బాలో  పెట్టుకుంటే  ఏడాది  పాటు నిలువ  ఉంటాయి.
ఆ తరువాత నూనె లో వేయించుకుంటే  గుమ్మడి వడియాలు రెడీ .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.



Monday, 30 October 2017

భోదన ఏకాదశి-ఉత్థాన ఏకాదశి : కార్తీక శుద్ధ ఏకాదశి


భోదన ఏకాదశి-ఉత్థాన ఏకాదశి : కార్తీక శుద్ధ ఏకాదశి
కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ-ప్రబోధినిఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేర్లు. ఆషాడ శుద్ధఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించినశ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్రనుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థానఏకాదశిగా అయ్యింది. దీనినే హరి-భోధిని ఏకాదశిఅని కూడా అంటారు.
తొలి ఏకాదశి నాడు ప్రారంభమైనచాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడేఅస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య మీదశయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈరోజునేజన్మించారు.

ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరన చేసి, మరునాడు ద్వాదశిఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారణ చేసి(భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి.
ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి బ్రహ్మదేవునికినారద మహర్షికి మహ్ద్య జరిగిన సంభాషణస్కందపురాణంలో కనిపిస్తుంది. "ఈ ఏకాదశిపాపాలను హరిస్తుంది. 1000 అశ్వమేధయాగాలు, 100 రాజసూయ యాగాలు చేసినపుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని ఒక చిన్ననిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగఒక జీవుడు,తన వేలజన్మలలో చేసిన పాపాలనుకాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈరోజు మనం చిన్న మంచిపని (పుణ్యకార్యం) చేసినా, అది సుమేరు పర్వతానికి సమానమైనపుణ్య ఫలితం ఇస్తుంది. ఈ ఏకాదశి వ్రతంచేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవు. ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానం కలగడంతో పాటు పాపాపరిహారంజరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగినపుణ్యానికి కోటిరెట్ల పుణ్యం ఒక్కసారైన ఈఏకాదశి ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుంది" అని బ్రహ్మదేవుడు నారదునితో పలుకుతాడు.
ఇంకా ఈ వ్రతంలో ఒకరికి చేసే అన్నదానం వలనసూర్యగ్రహణసమయంలో పవిత్ర గంగాతీరానకోటిమందికి అన్నదానం చేసినంత ఫలితంలబిస్తుంది. వస్త్రదానం చేయడం వలన, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకుఇవ్వడం వలన ఈ లోకంలోనే గాకమరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలులభిస్తాయి.
ఈ రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్దులు, యోగులుఅందరూ విష్ణులోకం చేరి కీర్తనలతోనూ, భజనలతోనూ, హారతులతోనూ శ్రీమహావిష్ణువునునిద్రలేపుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజునఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికిఅపమృత్యు దోషం తొలగిపోతుందని ధార్మికగ్రంధాలు చెప్తున్నాయి. అందువల్ల అందరువిష్ణుమూర్తికి హరతి ఇవ్వండి. ఏవైనా కారణాలవల్ల హారతి ఇవ్వడం కుదరకపోతే దేవాలయానికివెళ్ళండి. అక్కడ స్వామికి ఇచ్చె హారతినికన్నులారా చూడండి, వీలైతే స్వామికి హారతికర్పూరం సమర్పించండి. అపమృత్యు దోషంపరిహారం జరుగుతుంది. స్వామి అనుగ్రహంకలుగుతుంది

శివుని పేర్లు, అవతారాలు


శివుని పేర్లు, అవతారాలు

ఆదిదేవుడు ,రుద్రుడు, పరమశివుడు
గంగాధరుడు ,గౌరీపతి, నటరాజు
కైలాసాధిపతి ,పశుపతి ,గరళకంఠుడు
హరుడు ,చంద్రమౌళి ,ముక్కంటి
పాలాక్షుడు ,చంద్రశేఖరుడు ,నీలకంఠుడు
దక్షిణామూర్తి.

శివాలయం
శివుని లింగరూపములోను, మానవ ప్రతిరూపంలోనూ పూజించవచ్చని ఆగమశాస్త్రాలవల్ల తెలుస్తున్నది.
శివుని ప్రతిమలలో స్థానమూర్తిగాను, ఆశీనమూర్తిగానూ ఉంటాడు. కానీ శయనరూపంలో శివుని ప్రతిమలు లేవు.
మొత్తం 45 రకాలుగా శివ ప్రతిమలు ప్రతిష్ఠించవచ్చని ఆగమశాస్త్రాలు తెలుపుతున్నాయి. శివుడు ప్రతిమగా పూజింపబడుచున్నప్పటికీ ఎక్కువగా లింగరూపములోనే ప్రతిష్ఠింపబడుచున్నాడు.
శివలింగాలు నాలుగు రకాలు.
అవి :-
దైవికాలు  ,ఆర్షకాలు, బాణలింగాలు,
మానుషాలు.
భాస్కర క్షేత్రాలు :-

1. కాశీ
2. పుష్పగిరి,
3. కాంచీ,
4. నివృత్తి (శృంగేరి),
5. అలంపురి,
6. శ్రీశైలం,
7. శ్రీ విరూపాక్షం (హంపి),
8. సేతు (రామేశ్వరం),
9. కేదర్నాథ్,
10. గోకర్ణం.
11. ఖమ్మం
12. అమరావతి

పంచ కేదారాలు
కురుక్షేత్ర యుద్ధం ముగుసిసిన తరువాత పాండవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులను చంపిన పాపం పోగొట్టు కోవడానికి శివ దర్శననానికి వెళ్ళారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్ట పడని ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపం ధరించి ఉత్తర దిశగా పయన మయ్యాడు. పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుని పట్టుకోవడానికి భీమశేనుడు ప్రయత్నించగా ఈశ్వరుడు మాయమయ్యాడు. అప్పుడు ఈశ్వరుని శరీర భాగాలు ఐదు చోట్ల ప్రతిష్ఠితమై అవి పుణ్య క్షేత్రాలుగా భాసిల్లాయి. శివ పురాణంలో వర్ణించబడిన పంచ కేదారాలను పంచఆరామాలని పిలుస్తుంటారు.
అవి వరసగా

కేదారినాధ్,
తుంగ నాధ్,
రుద్ర నాధ్,
మధ్య మహేశ్వర్,
కల్పేశ్వర్.

కేదారినాధ్

ద్వాదశ జ్యీతిర్లింగాలలో ప్రసిద్ధి చెందింది పంచ కేదారాలలో మొదటిది కేదారనాధ్. పాండవులకు అందకుండా పారి పోయిన శివుని మూపురభాగం ఉన్న చోటు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడి లింగం ఎనిమిది గజముల పొడవు, నాలుగు గజముల ఎత్తు, నాలుగు గజముల వెడల్పు ఉంటుంది. ఈక్కడి లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు తమ అంతిమ దశలో స్వర్గారోహణ ఇక్కడ నుండి ప్రారంభించారు. శంకరాచార్యులు మోక్షం పొందిన క్షేత్రం ఇదే. సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరచి ఉంచే ఈ ఆలయం ప్రతి సంవత్సరం అక్షయత్రుతియ నాడు తెరుస్తారు. కాత్రిక మాసంలో వచ్చే యమద్వివిధియ నాడు మూసి వేస్తారు. ఈ మధ్య కాలంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 11,758 అడుగుల ఎత్తులో ఉంటుంది. హృషీ కేశ్ వరకు రైలు మార్గం ఉంటుంది. అక్కడి నుండి దాదాపు 250 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి గౌరీ కుండ్ చేరుకుని అక్కడి నుండి శిఖరానికి 14 మైళ్ళ దూరం కాలి నడకన చేరాలి. కానీ భక్తులు అనేక మంది డోలీలు, గుర్రాలపై ప్రయాణించి ఆలయం చేరుకుంటారు.

తుంగనాధ్

పంచ కేదారాలలో రెండవది తుంగనాధ్. శివుని చేతులు లింగ రూపంలో వెలసిన క్షేత్రం ఇది. ఇది సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది కేదారానికంటే ఎత్తైన ప్రదేశం. తుంగనాధుడంటే శిఖరాలకు అధిపతి అని అర్ధం. ఈ ఆలయంలోని లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది. స్వల్పంగా ఎడమ వైపు వాలి ఉంటుంది. గర్భగుడిలో శివునితో వ్యాస, గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి. ప్రమధ గణాల విగ్రహాలు ఉంటాయి. పాండవుల చిత్రాలు గోడలో చెక్కి ఉంటాయి. ఆలయానికి కుడి వైపున పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. వేరొక వైపున ఐదు ఆలయాలు ఉంటాయి . అవి పంచకేదారెఆల నమూనాలు. ఈ ఆలయాన్ని అర్జునుడు నిర్మించారని స్థల పురాణం చెప్తుంది. శీతా కాలంలో ఉత్సవ విగ్రహాలను ముకునాధ్ మఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు.

రుద్రనాధ్

పంచ కేదారాలలో మూడవది రుద్రనాధ్. నంది రూపంలో ఉన్న శివుని ముఖ భాగం వెలసిన చోటు ఇదే. అరమోడ్పు కన్నులతో భువనమోహనంగా ముఖ లింగ రూపంలో ఉండే స్వామిని నీలకంఠ్ మహాదేవ్ అని భక్తులు పిలుస్తారు. తెల్ల వారు ఝామున అభిషేక వేళలో స్వామి వెండి తొడుగు తొలగిస్తారు. నిజరూప దర్శననానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,500 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయానికి వెనుక భాగంలో వైతరణీ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు తమ పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు. ఈ ఆలయానికి సమీప గ్రామం గోపేశ్వర్.గోపేశ్వర్ నుండి 24 మైళ్ళు క్లిష్టమైన కొండ దారిలో కాలి నడకన ప్రయాణించి ఆలయానికి చేరాలి కనుక పంచ కేదారాలలో ఇది చాలా కష్ట తరమైనదిగా భావిస్తారు. శీతాకాలంలో ఇక్కడి విగ్రహాలను గోపేశ్వర్కు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.

మధ్య మహేశ్వర్

పంచ కేదారాలలో నాలుగవది మధ్య మహేశ్వర్. విశ్వనాధుని నాభి భాగం లింగంగా వెలసిన క్షేత్రం. నంది రూపంలూ ఉన్న ఈశ్వరుని భీమసేనుడు పట్టుకున్న గుప్త కాశీకి 24 మైళ్ళ దూరంలో ఉన్న ఈ క్షేత్రం ఎత్తు సముద్ర మట్టానికి 11,470 అడుగులు. ఈ ఆలయానికి ఎడమ వైపున రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి ఒకటి పార్వతీ దేవిది, ఒకటి అర్ధ నారీశ్వరునిది. ఈ మూడు ఆలయాలను భీమసేనుడు నిర్మించాడని చెప్తారు. ఆలయానికి కుడి వైపున చలువరాతితో నిర్మించిన సరస్వతీ దేవి ఆలయం ఉంటుంది. శీతా కాలంలో ఇక్కడి విగ్రహాలను యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.

 కల్పనాధ్

పంచ కేదారాలలో చివరిది కల్పనాధ్.
ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. హృషీకేశ్ బద్రీనాధ్ రోడ్డు మార్గంలో 12 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయం చేరుకోవచ్చు.
శివుని ఝటాఝూటం ఇక్కడ లింగ రూపంలో వెలసిందని స్థల పురాణం చెప్తుంది.
ఈ ఆలయంలో సంవత్సరమంతా పూజలు నిర్వహిస్తారు.
కోడలపై దట్టమైన అడవుల మధ్య చిన్న గుహలో వెలసిన ఈ స్వామిని ఝటేశ్వర్ అని భక్తులు పిలుస్తారు.

అత్రి, అనసూయల పుత్రుడైన దుర్వాస మహర్షి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్ప వృక్షం కింద తపస్సు చేసి శివుని నుండి అనేక వరాలు పొందాడని ప్రతీతి.

Sunday, 29 October 2017

బిల్వపత్రం శివార్పణమ్


బిల్వపత్రం శివార్పణమ్

శివపూజకు బిల్వపత్రాలు [మారేడుదళాలు] సర్వశ్రేష్టమైనవి. మారేడువనం కాశీక్షేత్రంతో సమానం ... అని శాస్త్రప్రమాణం. మారేడుదళాలతో శివార్చన చేయడంవల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది.
సాలగ్రామ దానఫలం,
శత అశ్వమేధయాగాలు చేసిన ఫలం,
వేయి అన్నదానాలు చేసిన ఫలం,
కోటి కన్యాదానాలు చేసిన ఫలం.
ఒక బిల్వాదళంతో శివార్చన చేయడం వలన లభిస్తుంది అని "బిల్వాష్టకం''లో చెప్పబడింది.
"ఏకబిల్వం శివార్పణం'' అని శివుని అర్చిస్తే, అనేక జన్మల పాపాలు నశిస్తాయి..

బిల్వదళంలోని మూడు ఆకులూ, సత్త్వ, రజ, స్తమోగుణాలకూ, శివుని త్రినేత్రాలకూ, త్రిశూలానికి ప్రతీకలు. ఆ మూడు ఆకులే త్రిమూర్తులు. బిల్వదళం ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక. బిల్వదళం ముందు భాగాన్ని శివునకు చూపిస్తూ పూజించాలి. ఒకసారి కోసిన బిల్వదళాలు 15 రోజుల వరకూ పూజార్హతను కలిగి ఉంటాయి. ఆలోపు ఆ బిల్వదళాలు వాడినా దోషం లేదు. కానీ, మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.
“ఏకబిల్వం శివార్పణం” అని మారేడు దాళలలతో శివుని పూజిస్తారు.
మూడు దళములు కలసి ఒక్క అండముననే ఉండును కావున, దీనికి బిల్వము అని పేరు వచ్చింది. ఈ మూడు రేకులకు ఆధ్యాత్మికంగా,

“పూజకుడు – పూజ్యము – పూజ”,
“స్తోత్రము – స్తుత్యము – స్తుతి”,
“జ్ఞాత – జ్ఞేయము – జ్ఞానము “

అని అర్థాలు చెప్పు చున్నారు.  ఈ విధంగా  (3×3) మూడు, మూడును వేర్వేరుగా భావించుటయే త్రిపుటిజ్ఞానము, ఇదియే అజ్ఞానము, వేరువేరుగా కనిపించినను, ఆధారకాండము ఒక్కటే అయినట్లు, “ఓ మహాదేవా!” సృష్టి, స్థితి, లయ కారకుడవైన నీవే “మారేడుదళము” నందు మూడు పత్రములుగా వేరువేరుగా వున్నట్లు తోచుచున్నావు. “పూజకుడవు నీవే, పూజింపబడునది నీవే, పూజాక్రియవు నీవే” – అనే భావంతో అభేదబుద్ధితో పూజించుటయే సరియైన పద్ధతి, మరియు పుణ్యఫల ప్రదము.  ఈ విధమైన భావముతో పూజించకుండుటయే అజ్ఞానము మరియు పాపహేతువు. ఈ జ్ఞానరహస్యమును తెలుసుకుని – బిల్వపత్రరూపముతో “త్రిపుటి జ్ఞానమును” నీ పాదములచెంత నేను సమర్పించుచున్నాను.  ‘శివోహం – శివోహం ‘ అను మహావాక్య జ్ఞానమును, స్థిరపర్చునదియే బిల్వార్చనయగును.
బిల్వవనము కాశీక్షేత్రముతో సరిసమానమైనది అని శాస్త్రములలో తెలుపుచున్నారు. మారేడుచెట్టు వున్నచోట ఆ చెట్టు క్రింద శివుడు ఉంటాడు.
ఇంటి ఆవరణలో ఈశాన్యభాగమున మారేడు చెట్టు వున్నచో, ఆపదలు తొలగి సర్వైశ్వర్యములు కల్గును.
తూర్పున వున్నచో సుఖప్రాప్తి కల్గును, పడమరవైపున వున్నచో సుపుత్రసంతానము కల్గును.
దక్షిణవైపున వున్నచో యమబాధలు వుండవు.

శ్లో!!  బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం!
అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!
బిల్వపత్రము యొక్క దర్శనంవలన పుణ్యము లభించును, వాటిని స్పృశించుట వలన సర్వపాపములు నశించును.

బిల్వాష్టకం:
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం

అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే
శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం
సాలిగ్రామ శిలామేకాం విప్రాణాం జాతు చార్పయేత్
సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం
దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం
లక్ష్మ్యాస్తనత ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియం
బిల్వవృక్షం ప్రయచ్ఛామి ఏకబిల్వం శివార్పణం
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం
కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం
ప్రయాగేమాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే
అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం

ఫలశృతి :
బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ
సర్వపాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్  ||

Saturday, 28 October 2017

శివపూజ కు ముఖ్యమైన ఎనిమిది నామములు


శివపూజ కు  ముఖ్యమైన
ఎనిమిది నామములు

1. భవాయ దేవాయ నమః;
2. శర్వాయ దేవాయ నమః
3. ఈశానాయ దేవాయ నమః
4. పశుపతయే దేవాయ నమః
5. రుద్రాయ దేవాయ నమః
6. ఉగ్రాయ దేవాయ నమః
7. భీమాయ దేవాయ నమః
8. మహతే దేవాయ నమః

కార్తీక స్నానం

కార్తీక స్నానం
 
కార్తీక మాసంలో నదీస్నానం తప్పనిసరిగా చేయాలన్నారు పెద్దలు. నదీస్నానం చేయడమంటే మీ పక్కన ఉన్న నదిని విడిచిపెట్టి దూరంలో ఉన్న మరొక నదిలో స్నానానికి వెళ్లకూడదు. ఎందుకంటే- మన పక్కన ఏ నది ప్రవహిస్తుందో ఆ నది మనకు అన్నం పెడుతుంది. ఆ నది వలన మన ధర్మం నిలబడుతుంది.
 కార్తీక మాసంలో చేసే నదీ స్నానం మనుషుల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కార్తీక మాసంలో చంద్రుడి తేజస్సు దేదీప్యమానంగా ఉంటుంది. చంద్రుడి కిరణాల వల్ల నీటికి ప్రత్యేకమైన శక్తి కలుగుతుంది. అలాంటి నీటిలో నిలబడి పరమేశ్వరుడికి నమస్కారం చేసి మజ్జనం చేయాలి. మజ్జనం అంటే మూడు సార్లు తల ముంచి పైకి లేవాలి. అలా స్నానం చేస్తే శరీరమంతా అమృతస్పర్శ కలుగుతుంది. అంతే కాకుండా మనసు సాత్వికమై, పరమేశ్వరారాధనయందు సాత్వికమైన బుద్ధితో తేజోవంతమైనిలబడుతుంది.
ఆ సమయంలో సంకల్పం కూడా చెప్పాలి. ఈ సంకల్పంలో ఏ ప్రాంతంలో ఉండి పూజ చేస్తున్నామో ఆ వివరాలన్నీ ఉంటాయి. ‘
 ఆ   సంకల్పం పలికించేటప్పుడు శ్రీశైలం పేరు చెబుతారు. శ్రీశైలస్య.....
...ఏ దిగ్భాగంలో ఉన్నారో ఆ ప్రాంతం గురించి చెప్పిస్తారు.
ఆ తర్వాత ఏ నదుల మధ్య ఉన్నామో
- ఆ ప్రాంతాన్ని చెప్పిస్తారు.
మనం గంగా గోదావరిల మధ్య ఉంటే- ‘గంగా గోదావరీ యోః మధ్య ప్రదేశే’ అని చెబుతారు. ఈ నదులను తలుచుకొని వాటిని ప్రార్థించటం వల్ల మన పాపాలు తొలగిపోతాయి.  స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత పుణ్యకార్యాచరణ చేయాలి.  ఎంతో కొంత దానం చేయాలి. అప్పుడే నదీస్నానం పూర్తయినట్లు అని చెపుతారు.

ఉమామహేశ్వరస్తోత్రమ్


॥ ఉమామహేశ్వరస్తోత్రమ్ ॥

శ్రీ శఙ్కరాచార్య కృతమ్ ।
నమః శివాభ్యాం నవయౌవనాభ్యామ్
పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ ।
నాగేన్ద్రకన్యావృషకేతనాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ ౧॥

నమః శివాభ్యాం సరసోత్సవాభ్యామ్
నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ ।
నారాయణేనార్చితపాదుకాభ్యాం
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ ౨॥

నమః శివాభ్యాం వృషవాహనాభ్యామ్
విరిఞ్చివిష్ణ్విన్ద్రసుపూజితాభ్యామ్ ।
విభూతిపాటీరవిలేపనాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ ౩॥

నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యామ్
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ ।
జమ్భారిముఖ్యైరభివన్దితాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ ౪॥

నమః శివాభ్యాం పరమౌషధాభ్యామ్
పఞ్చాక్షరీ పఞ్జరరఞ్జితాభ్యామ్ ।
ప్రపఞ్చసృష్టిస్థితి సంహృతాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ ౫॥

నమః శివాభ్యామతిసున్దరాభ్యామ్
అత్యన్తమాసక్తహృదమ్బుజాభ్యామ్ ।
అశేషలోకైకహితఙ్కరాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ ౬॥

నమః శివాభ్యాం కలినాశనాభ్యామ్
కఙ్కాలకల్యాణవపుర్ధరాభ్యామ్ ।
కైలాసశైలస్థితదేవతాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ ౭॥

నమః శివాభ్యామశుభాపహాభ్యామ్
అశేషలోకైకవిశేషితాభ్యామ్ ।
అకుణ్ఠితాభ్యామ్ స్మృతిసంభృతాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ ౮॥

నమః శివాభ్యాం రథవాహనాభ్యామ్
రవీన్దువైశ్వానరలోచనాభ్యామ్ ।
రాకాశశాఙ్కాభముఖామ్బుజాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ ౯॥

నమః శివాభ్యాం జటిలన్ధరభ్యామ్
జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్ ।
జనార్దనాబ్జోద్భవపూజితాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ ౧౦॥

నమః శివాభ్యాం విషమేక్షణాభ్యామ్
బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యామ్ ।
శోభావతీ శాన్తవతీశ్వరాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ ౧౧॥

నమః శివాభ్యాం పశుపాలకాభ్యామ్
జగత్రయీరక్షణ బద్ధహృద్భ్యామ్ ।
సమస్త దేవాసురపూజితాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ ౧౨॥

స్తోత్రం త్రిసన్ధ్యం శివపార్వతీభ్యామ్
భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః ।
స సర్వసౌభాగ్య ఫలాని భుఙ్క్తే
శతాయురాన్తే శివలోకమేతి ॥ ౧౩॥

ఇతి ఉమామహేశ్వరస్తోత్రం సమ్పూర్ణమ్ ॥
           

కార్తీక పౌర్ణమి శ్లోకం


కార్తీక పౌర్ణమి శ్లోకం

'కార్తిక' మాసం సంవత్సరంలోని సర్వమాసాలకంటే మహపిమాన్వితమైనది.కార్తీక మాసం నెలరోజులూ రోజూ సాయం సంధ్య వేళ పూజా స్థలములో, తులసి కోటవద్ద, ఇంటిముందు దీపాలను వెలిగించి నమస్కరించే ఆచారం మన హిందువులకు అనాదిగా వస్తున్నది. రోజూ కుదరకపోయినా కార్తీక పూర్ణిమ నాడు తప్పక వెలిగిస్తారు.అలా వెలిగించిన దీపంలో దామోదరుని ఆవాహన చేసి, ఈక్రింది శ్లోకాన్ని చెప్పి ప్రార్థన చేయాలి.

కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః
జలేస్థలే... ఫలే ఏ నివసంతి
జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః
భవతింత్వ స్వపచాహి విప్రాః

చీమలు, ఈగలు, దోమలు, పురుగులు, వృక్షాలు, జలచరాలు, భూచరాలు ఒకటేమిటి ఈ భూమిమీద నివసించే ప్రతీ ఒక్కజీవికీ కూడా ఈదీపం వెలుతురుని దర్శించ గానే ఇక మరుజన్మ అంటూ లేని అనంత పుణ్యాన్ని పొందాలి.

కార్తీక మాసమంతా స్నానం, దానం ఉపవాసం చేసే శక్తిలేని వారు కనీసం ఒక్క కార్తీక పౌర్ణమి నాడైనా వీటిని ఆచరిస్తే కార్తీక పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రోక్తి.ఈ మాసంలో ఉపవాసం పాటించేవారు ఏక భుక్తం, నక్తభోజనం చేస్తారు. నక్తం ఉండలేనివారు ఒక కార్తీక పౌర్ణమినాడు లేదా యేయైనా కార్తీక సోమవారాలు నక్తములున్నా పుణ్య ప్రదమే.కార్తీకపౌర్ణమినాడు సత్‌ బ్రాహ్మణుని ఆహ్వానించి భోజనం పెట్టి దీప దానం చేస్తూ

''సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వ సంపచ్చుభావహం!
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ''

అనే శ్లోకం పఠించాలి.

'దీపం జ్యోతి పరబ్రహ్మ:'' దీపం జ్ఞానానికి ప్రతీక. ఈ దీపదానం వలన జ్ఞానం, ఆయు:వృద్ధి, విద్య, సకల భోగాలు కలుగుతాయని శాస్త్రం. ఈ దీపదానం కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది. ఎవరైతే దీపదానం చేస్తారో వారివారి పాపాలన్నీ నశించిపోతాయని వశిష్ఠవచనం.

ఒక వత్తితో దీపదానం సద్భుద్ధిని, తేజస్సుని ఇస్తుంది. నాలుగు వత్తుల దీపదానం రాజ సమానులను చేస్తుంది. పదివత్తుల దీపదానం రాజకీయ సిద్ధినిస్తుంది. ఏ బది వత్తుల దీపదానం దేవత్వాన్నిస్తుంది. వెయ్యి వత్తుల దీపదానం ఈశ్వర కృపకు పాత్రుల్ని చేస్తుంది. వెండి, ప్రమిదలో పైడిపత్తి వత్తులు వేసి, ఆవు నేతితో వెలిగించిన దీపాన్ని దానం చేయ డంవల్ల వచ్చే పుణ్యం నంతమైనదిగా, వెండి ప్రమిదలో బంగారు వత్తులు వేసి, దానం చేస్తే జన్మరా హిత్యం పొందు తారని మన పురాణాలు తెల్పుతు న్నాయి.

వ్రతం అంటే

వ్రతం అంటే
వ్రతం అంటే ప్రధానంగా ’నియమపాలన’ అని అర్థం. ఒక దానిని శ్రేష్ఠమని అనుసరించి, దానికి తగిన నియమాలను పాటిస్తూ శ్రద్ధగా అనుష్ఠిస్తే అది వ్రతం.
“పుణ్యసాధనకోసం” ఉపవాసాది నియమాలచే చేసే కార్యానికి వ్రతమని అర్థం”.
 (వాచస్పత్య నిఘంటువు)

ధర్మ శాస్త్ర నిర్వచనాల ప్రారం:

సంకల్ప పూర్వకంగా చక్కగా అనుష్ఠించే పవిత్రకర్మ వ్రతం. ఇది ప్రవృత్తి, నివృత్తి – అనే రెండు విధానాలు. భోజనం, పూజ వంటి వాటితో కొడినది ప్రవృత్తి రూపం. ఉపవాసాదులతో చేసేది నివృత్తి రూపం.

    1. నిత్య
    2. నైమిత్తిక
    3. కామ్య

అనే భేదాలో వ్రతాలు మూడు విధాలు. ఏకాదశి వంటివి నిత్యవ్రతాలు. చాంద్రయణాది వ్రతాలు నైమిత్తికాలు. ఒక ప్రత్యేకమైన అభీష్టసిద్ధి కోసం ఆయా తిథుల్లో ఉపవాసం ఉండి చేసే వ్రతాలు కామ్యాలు. వ్రత పాలన వలన పాపాలు, త్రికరణాల దోషాలు (మను, మాట, క్రియలతో చేసినవి) నశిస్తాయి. శుద్ధికోసం వ్రతాలు. కోరికల్ని జయించిన జ్ఞానులు సైతం చిత్తశుద్ధికి, భగవద్భక్తికి, అజ్ఞాత దోష నివృత్తికి (తెలియక చేసిన దోషాల పరిహారానికి) వ్రతాలను ఆచరిస్తారు.

కపటం లేకుండుట, అహింస, సత్యం, న్యాయార్జన, బ్రహ్మచర్యం వంటి గుణాలు మానసిక వ్రతాలు.

కొన్ని వ్రతాు దారిద్ర్యాన్ని పోగొడతాయి. కొన్ని ఆపదల్ని తొలగిస్తే కొన్ని గ్రహదోషాలను హరిస్తాయి. సామాన్యుణ్ణి సైతం అనుష్ఠానపరుల్ని చేయగలిగే సులభ వ్రతాలు మన సంప్రదాయంలో ఉన్నాయి. జ్యోతిష్యపరమైన రహస్యాలు సైతం మన వ్రతలలో నిక్షిప్తం చేశారు.

ఇక ’వ్రతనాం ఉత్తమం వ్రతం’ – అని చాలా వ్రతాల్లో కనిపించడం సహజమే. దాని భావం మనం ఏది పాటించినా అదే సమగ్రమనే నిష్ఠ కుదిరినప్పుడే దానిలో పరిపూర్ణతను సాధించగలం. అందుకోసమే ఆయా వ్రత పాలకులకు వాటియందు నిష్ఠను కుదిర్చేందుకు ఆ మాటను వ్రాస్తారు. అలా నిష్ఠగా పాటించేవారికి చక్కని ఫలితాలు కూడా లభిస్తాయి.
            

గంగా తరంగ రమణీయ జటా కలాపం

గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియమనంగ మదాపహారం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ ||

వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం
వామేణ విగ్రహ వరేన కలత్రవంతం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ ||

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ ||

సీతాంశు శోభిత కిరీట విరాజమానం
బాలేక్షణాతల విశోషిత పంచబాణం
నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ ||

పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ ||

తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
ఆనంద కందమపరాజిత మప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ ||

ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
ఆధాయ హృత్-కమల మధ్య గతం పరేశం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ ||

రాగాధి దోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ ||

వారాణసీ పుర పతే స్థవనం శివస్య
వ్యాఖ్యాతమ్ అష్టకమిదం పఠతే మనుష్య
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షమ్ ||

విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేనసహ మోదతే ||

Friday, 27 October 2017

జ్యోతిష్య శాస్త్రం లో నక్షత్ర వృక్షాలు....

జ్యోతిష్య శాస్త్రం లో నక్షత్ర వృక్షాలు

జ్యోతిష్య శాస్త్రం లో 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు , అధిదేవతలు ఉన్నట్లుగానే , వాటికి సంబంధించిన వృక్షాలు/చెట్లు కూడా ఉన్నాయి

జన్మ నక్షత్రాన్ని అనుసరంచి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు

అశ్వని నక్షత్రం - వారు విషముష్టి లేదా జీడిమామిడిని పెంచడం, పూజించడం వలన జననేంద్రియాల, మరియు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కలుగుతుంది. అలాగే, అన్ని విషయాలలోనూ సూటి గా వ్యవహరించడం, సమయాన్ని వృదా చేయకుండా అన్ని పనులను సమర్ధవంతంగా నిర్వహించడం కొరకు చక్కగా ఉపయోగపడుతుంది.

భరణి నక్షత్రం - వారు ఉసిరి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యము , పైల్స్ వంటి బాధల నుండి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువ గా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది

కృత్తిక నక్షత్రం - వారు అత్తి/మేడి చెట్టును పెంచడం పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షింపబడతారు, అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి.

రోహిణి నక్షత్రం - వారు నేరేడు చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా చక్కెర వ్యాధి మరియు నేత్ర సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం , సత్ప్రవర్తన ఎక్కువ గా కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది

మృగశిర నక్షత్రం - వారు మారేడు లేదా చండ్ర చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్ మరియు అజీర్తి సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.

ఆరుద్ర నక్షత్రం - వారు చింత చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుండి బయటపడతారు, అంతే కాకుండా విషజంతువుల బాధ కుడా వీరికి కలగదు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది

పునర్వసు నక్షత్రం - వారు వెదురు లేదా గన్నేరు చెట్టు ను పెంచడం , మరియు పూజించడం ద్వారా ఊపిరితిత్తుల కి సంబందించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుండి, మరియు రొమ్ము క్యాన్సర్ నుండి ఉపశమనం పొందుతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యం గా పాల కి లోటు ఉండదని చెప్పవచ్చు. పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా , చక్కటి చాకచక్యం తో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది.

పుష్యమి నక్షత్రం - వారు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచడం, పూజించడం వలన నరాల సంబంధిత బాధలు నుండి విముక్తి పొందుతారు. అలాగే శత్రువుల బారి నుండి రక్షణ కలుగుతుంది. రోగ, రుణ భాధల నుండి విముక్తి లభిస్తుంది . స్త్రీలు సంతానవతులవుతారు.

ఆశ్లేష నక్షత్రం - వారు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచడం , పూజించడం వల్ల శ్వేతకుష్ఠు మరియు చర్మ సంబంధిత వ్యాదుల నుండి రక్షణ పొందగలరు అలాగే ముందు చూపు తో వ్యవహరించి జీవితం లో ముందుకు సాగడానికి ఎంతటి విషమ పరిస్థితుల్లోనైన తట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది.

మఖ నక్షత్రం - వారు మర్రి చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా ఎముకల సంబంధిత మరియు అనుకోని వ్యాదుల నుండి రక్షింపబడతారు. అలాగే భార్య భర్తలు ఎంతో అన్యోన్యం గా ఉండడానికి, తల్లితండ్రులకు, సంతానానికి కూడా మేలు జరుగుతుంది. జీవితం లో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి

పుబ్బ నక్షత్రం - వారు మోదుగ చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా సంతానలేమి సమస్యల నుండి బయటపడతారు. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు .ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తర నక్షత్రం – వారు జువ్వి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల నుండి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలని వారి చేతనైనంతగా అందించడానికి. మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది

హస్త నక్షత్రం - వారు సన్నజాజి , కుంకుడు చెట్లను పెంచడం, పూజించడం వలన ఉదర సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి . దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.

చిత్త నక్షత్రం - వారు మారేడు లేదా తాళ చెట్టు ను పెంచడం, పూజించడం ద్వారా పేగులు, అల్సర్ మరియు జననాంగ సమస్యల నుండి బయటపడగలరు. ఎవరిని నొప్పించకుండా వారి తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన నైపుణ్యం కలగడానికి ఉపయోగపడుతుంది.

స్వాతి నక్షత్రం - వారు మద్ది చెట్టు ను పెంచడం, పూజించడం ద్వారా స్త్రీలు గర్భసంచి సమస్యల నుండి బయట పడగలరు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. అన్ని రకములైన విద్యలలోను రాణిస్తారు, ఆత్మవిశ్వాసం అధికం గా ఉంటుంది. భావోద్వేగాలు అధికం గా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

విశాఖ నక్షత్రం - వారు వెలగ , మొగలి చెట్లను పెంచడం ద్వారా జీర్ణసంబంధిత సమస్యల నుండి బయటపడతారు. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.

అనురాధ నక్షత్రం - వారు పొగడ చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. పదిమంది లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.

జ్యేష్ఠ నక్షత్రం - వారు విష్టి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. చిన్నతనం నుండే బరువు భాద్యతలు సమర్దవంతం గా మొయగలగడానికి. ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది.

మూల నక్షత్రం - వారు వేగి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా పళ్ళ కి సంబంధించిన , మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపు లో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణ లో ఉంటుంది. శాస్త్ర ప్రవీణం, మంచి వ్యక్తిత్వము, ఔన్నత్యం కలగడానికి, సంతానం వల్ల జీవితం లో ఆనందాన్ని ఆనందం పొందడానికి ఉపయోగపడుతుంది.

పూర్వాషాడ నక్షత్రం - వారు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచడం, పూజించడం ద్వారా కీళ్ళు, సెగగడ్డలు , వాతపు నొప్పులు మరియు జననేంద్రియ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దాపరికం లేకుండా వ్యవహరించడానికి పరోపకార బుద్ది . వినయవిదేతలు కలగడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తరాషాడ నక్షత్రం - వారు పనస చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు దరి చేరవు. అలాగే ఆర్దికం గా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవు. భూముల కి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అబివృద్ది లోకి రావడానికి ఉపయోగపడుతుంది.

శ్రవణం నక్షత్రం - వారు జిల్లేడు చెట్టును పెంచడం, పూజించడం ద్వారా మానసిక సమస్యలు దూరమవుతాయి. అలాగే ధనపరమైన సమస్యలు తొలగుతాయి న్యాయం, ధర్మం పాటించేడానికి. కార్యజయం సిద్దించడానికి ఉపయోగపడుతుంది.

ధనిష్ఠ నక్షత్రం - వారు జమ్మి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా మెదడు కి సంబంధించిన సమస్యలు రావు. అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, కుటుంబ సభ్యుల అండదండల కొరకు, సంతానాబివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.

శతభిషం నక్షత్రం - వారు కడిమి చెట్టు లేదా అరటి చెట్టు ను పెంచడం ద్వారా శరీర పెరుగుదల కి సంబంధిచిన , మోకాళ్ళ సమస్యల నుండి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం , చక్కటి ఉద్యోగం కొరకు, జీవితం లో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.

పూర్వాభాద్ర నక్షత్రం - వారు మామిడి చెట్టు ని పెంచడం ద్వారా కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు రావు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితి ని పొందడానికి . కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాల లో తిరిగే అవకాశం కొరకు, ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాల లో రాణించడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తరాభాద్ర నక్షత్రం - వారు వేప చెట్టు ని పెంచడం ద్వారా శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యల ను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందం గా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది.

రేవతి నక్షత్రం - వారు విప్ప చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపు లో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ , గౌరవం అప్యాయతలు వృద్ది చెందడానికి, జీవితం లో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది.

హిందూసనాతనం


పంచగంగలు
1. గంగ
2. కృష్ణ
3. గోదావరి
4. తుంగభద్ర
5. కావేరి 

షడ్గుణాలు
హిందూ సాంప్రదాయం ప్రకారం
మనలోని 6 గుణాలుంటాయి.
అవి.
1. కామం
2. క్రోధం
3. లోభం
4. మోహం
5. మదం
6. మత్సరం

షట్చక్రాలు
మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు
1. మూలాధార చక్రము
2. స్వాధిష్ఠాన చక్రము
3. మణిపూరక చక్రము
4. అనాహత చక్రము
5. విశుద్ధ చక్రము
6. ఆజ్ఞా చక్రము

షడ్విధ రసములు
1. ఉప్పు
2. పులుపు
3. కారం
4. తీపి
5. చేదు
6. వగరు 

షడృతువులు - ఋతువులు 6
అవి
1. వసంత ఋతువు
2. గ్రీష్మ ఋతువు
3. వర్ష ఋతువు
4. శరదృతువు
5. హేమంత ఋతువు
6. శిశిర ఋతువు

సప్త గిరులు
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటెశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో ఏడు కొండలు కలవు.వీటినే సప్త గిరులు అని అంటారు.
అవి.
1 శేషాద్రి
2 నీలాద్రి
3 గరుడాద్రి
4 అంజనాద్రి
5 వృషభాద్రి
6 నారాయణాద్రి
7 వేంకటాద్రి

సప్త స్వరాలు
మన భారతీయ సంగీతంలో 7 స్వరాలు కలవు.వీటినే సప్త స్వరాలు అని పిలుస్తారు.
అవి.
1. స = షడ్జమం (నెమలి క్రేంకారం)
2. రి = రిషభం (ఎద్దు రంకె)
3. గ = గాంధర్వం (మేక అరుపు)
4. మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)
5. ప = పంచమం (కోయిల కూత)
6. ధ = ధైవతం (గుర్రం సకిలింత)
7. ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)

సప్త ద్వీపాలు
బ్రహ్మాండ పురాణములోను, మహాభారతంలోను, భాగవతం సప్త ద్వీపాలగురించి ప్రస్తావన ఉంది.
అవి .
1. జంబూద్వీపం - అగ్నీంద్రుడు
2. ప్లక్షద్వీపం - మేధాతిథి
3. శాల్మలీద్వీపం - వపుష్మంతుడు
4. కుశద్వీపం - జ్యోతిష్మంతుడు
5. క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు
6. శాకద్వీపం - హవ్యుడు
7. పుష్కరద్వీపం - సేవనుడు.

సప్త నదులు
1. గంగ
2. యమున
3. సరస్వతి
4. గోదావరి
5. సింధు
6. నర్మద
7. కావేరి 

సప్త అధొలోకములు
1. అతలము
2. వితలము
3. సుతలము
4. తలాతలము
5. రసాతలము
6. మహాతలము
7. పాతాళము

సప్త ఋషులు
1.వశిష్టుడ
2.ఆత్రి
3.గౌతముడు
4.కశ్యపుడు
5.భరద్వాజుడు
6.జమదగ్ని
7.విశ్వామిత్రుడు

పురాణాలలో అష్టదిగ్గజాలు
1. ఐరావతం
2. పుండరీకం
3. వామనం
4. కుముదం
5. అంజనం
6. పుష్పదంతం
7. సార్వభౌమం
8. సుప్రతీకం

అష్ట జన్మలు
1.దేవ జన్మ
2. మనుష్య జన్మ
3. రాక్షస జన్మ
4. పిచాచ జన్మ
5. పశు జన్మ
6. పక్షి జన్మ
7. జలజీవ జన్మ
8. కీటక జన్మ

అష్ట భార్యలు
శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలును అష్ట భార్యలు లేదా అష్టమహిషులు అని అంటారు.
వారు
1. రుక్మిణి
2. సత్యభామ
3. జాంబవతి
4. మిత్రవింద
5. భద్ర
6. సుదంత
7. కాళింది
8. లక్షణ

అష్ట కష్టములు
1. ఋణము
2. యాచన
3. ముసలితనము
4. వ్యభిచారము
5. దొంగతనము
6. దారిద్ర్యము
7. రోగము
8. ఎంగిలి తిని బ్రతుకుట

అష్ట కర్మలు
1. స్నానము
2. సంధ్య
3. జపము
4. హూమము
5. స్వాధ్యాయము
6. దేవ పూజ
7. ఆతిధ్యము
8. వైశ్యదేవము

అష్టభాషలు.
1. సంస్కృతము
2. ప్రాకృతము
3. శౌరసేని
4. మాగధి
5. పైశాచి
6. సూళికోక్తి
7. అపభ్రంశము
8. ఆంధ్రము

నవధాన్యాలు
మన నిత్య జీవితంలో ఉపయోగించే 9 రకాల ధాన్యాలను నవ దాన్యాలు అని పిలుస్తారు అవి -
గోధుమలు ,వడ్లు ,పెసలు,
శనగలు , కందులు , అలసందలు,
నువ్వులు, మినుములు ,ఉలవలు

నవ రత్నాలు
1.మౌక్తికం = ముత్యము
2.మాణిక్యం = కెంపు
3.వైఢూర్యం = రత్నం
4.గోమేదికం = పసుపురంగులోని ఒక రత్నం
5.వజ్రం
6.విద్రుమం = పగడం
7.పుష్యరాగం = తెల్లటి మణి
8.మరకతం = పచ్చ
9.నీలమణి

నవధాతువులు
1. బంగారం
2. వెండి
3.ఇత్తడి
4.సీసం
5.రాగి
6.తగరం
7.ఇనుము
8.కంచు
9.కాంతలోహం

నవబ్రహ్మలు
1.మరీచి
2.భరద్వాజుడు
3.అంగీరసుడు
4.పులస్త్యుడు
5.పులహుడు
6.క్రతువు
7.దక్షుడు
8.వసిష్టుడు
9.వామదేవుడు

నవ చక్రములు
మానవ శరీరంలో గల చక్రస్థానాలు.
1. మూలాధార చక్రము
2.స్వాధిష్టాన చక్రము
3.నాభి చక్రము
4.హృదయచక్రము
5.కంఠ చక్రము
6.ఘంటికాచక్రము
7.భ్రూవుచక్రము
8.బ్రహ్మరంధ్రము
9. గగన చక్రము

నవదుర్గలు
1 శైలపుత్రి దుర్గ
2 బ్రహ్మచారిణి దుర్గ
3 చంద్రఘంట దుర్గ
4 కూష్మాండ దుర్గ
5 స్కందమాత దుర్గ
6 కాత్యాయని దుర్గ
7 కాళరాత్రి దుర్గ
8 మహాగౌరి దుర్గ
9 సిద్ధిధాత్రి దుర్గ

దిశలు
1. తూర్పు
2. ఆగ్నేయం
3. దక్షిణం
4. నైఋతి
5. పడమర
6. వాయువ్యం
7. ఉత్తరం
8. ఈశాన్యం
9.భూమి (క్రింది ప్రక్క)
10.ఆకాశం (పైకి)

దశావతారాలు
1. మత్స్యావతారము
2. కూర్మావతారము
3. వరాహావతారము
4. నృసింహావతారము లేదా నరసింహావతారము
5. వామనావతారము
6. పరశురామావతారము
7. రామావతారము
8. కృష్ణావతారము
9. బుద్ధావతారము 
10.కల్కి అవతారము

దశవిధ సంస్కారములు
1. వివాహము
2. గర్బాదానము
3.పుంసవనము
4.సీమంతము
5.జాతక కర్మ
6.నామకరణము
7.అన్న ప్రాశనము
8.చూడకర్మ
9.ఉపనయనము
10.సమావర్తనము

దశవిధ బలములు

1. విద్యా బలము
2.కులినితా బలము
3.స్నేహ బలము
4.బుద్ది బలము
5.ధన బలము
6.పరివార బలము
7.సత్య బలము
8. సామర్ద్య బలము
9. జ్ఞాన బలము
10. దైవ బలము

Thursday, 19 October 2017

విష్ణువు వేయి నామములు- 951--1000


విష్ణువు వేయి నామములు-

951) అధాతా - తానే ఆధారమైనవాడు.
952) పుష్టహాస: - మొగ్గ పువ్వుగా వికసించునట్లు ప్రపంచరూపమున వికసించువాడు.
953) ప్రజాగర: - సదా మేల్కొనియుండువాడు.
954) ఊర్ధ్వగ: - సర్వుల కన్నా పైనుండువాడు.
955) సత్పధాచార: - సత్పురుషుల మార్గములో చరించువాడు.
956) ప్రాణద: - ప్రాణ ప్రదాత యైనవాడు.
957) ప్రణవ: - ప్రణవ స్వరూపుడైనవాడు.
958) పణ: - సర్వ కార్యములను నిర్వహించువాడు.
959) ప్రమాణ: - స్వయముగానే జ్ఞానస్వరూపుడై యున్నవాడు.
960) ప్రాణ నిలయ: - సమస్త జీవుల అంతిమ విరామ స్థానమైనవాడు.
961) ప్రాణభృత్ - ప్రాణములను పోషించువాడు.
962) ప్రాణజీవన: - ప్రాణ వాయువుల ద్వారా ప్రాణులను జీవింపజేయువాడు.
963) తత్త్వం - సత్యస్వరూపమైనందున భగవానుడు తత్త్వం అని తెలియబడిన వాడు.
964) తత్త్వవిత్ - సత్యవిదుడైన భగవానుడు తత్త్వవిత్ అని స్తుతించబడువాడు.
965) ఏకాత్మా - ఏకమై, అద్వితీయమైన పరమాత్మ
966) జన్మమృత్యు జరాతిగ: - పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పుచెందుట, కృశించుట నశించుట వంటి వికారములకు లోనుగానివాడు.
967) భూర్భువ: స్వస్తరు: - భూ: భువ: స్వ: అను వ్యాహృతి రూపములు 3 గలవాడు.
968) తార: - సంసార సాగరమును దాటించువాడు.
969) సవితా - తండ్రి వంటివాడైన భగవానుడు.
970) ప్రపితామహః - బ్రహ్మదేవునికి కూడా తండ్రియైనవాడు.
971) యజ్ఞ: - యజ్ఞ స్వరూపుడు.
972) యజ్ఞపతి: - యజ్ఞము నందు అధిష్టాన దేవత తానైన భగవానుడు.
973) యజ్వా - యజ్ఞము నందు యజమాని.
974) యజ్ఞాంగ: - యజ్ఞము లోని అంగములన్నియు తానే అయినవాడు.
975) యజ్ఞవాహన: - ఫలహేతువులైన యజ్ఞములు వాహనములుగా కలవాడు.
976) యజ్ఞభృత్ - యజ్ఞములను సంరక్షించువాడు.
977) యజ్ఞకృత్ - యజ్ఞములను నిర్వహించువాడు.
978) యజ్ఞీ - యజ్ఞములందు ప్రధానముగా ఆరాధించుబడువాడు.
979) యజ్ఞభుక్ - యజ్ఞఫలమును అనుభవించువాడు.
980) యజ్ఞసాధన: - తనను పొందుటకు యజ్ఞములు సాధనములుగా గలవాడు.
981) యజ్ఞాంతకృత్ - యజ్ఞఫలము నిచ్చువాడు.
982) యజ్ఞగుహ్యమ్ - గోప్యమైన యజ్ఞము తానైనవాడు.
983) అన్నం - ఆహారము తానైనవాడు.
984) అన్నాద: - అన్నము భక్షించువాడు.
985) ఆత్మయోని: - తన ఆవిర్భావమునకు తానే కారణమైనవాడు.
986) స్వయంజాత: - మరొకరి ప్రమేయము లేకనే తనకు తానుగ ఆవిర్భవించువాడు.
987) వైఖాన: - ప్రాపంచిక దు:ఖమును నివారించువాడు.
988) సామగాయన: - సామగానము చేయువాడు.
989) దేవకీనందన: - దేవకీ పుత్రుడైన శ్రీ కృష్ణుడు.
990) స్రష్టా - సృష్టికర్త
991) క్షితీశ: - భూమికి నాధుడైనవాడు.
992) పాపనాశన: - పాపములను నశింపజేయువాడు.
993) శంఖభృత్ - పాంచజన్యమను శంఖమును ధరించినవాడు.
994) నందకీ - నందకమను ఖడ్గమును ధరించినవాడు.
995) చక్రీ - సుదర్శనమును చక్రమును ధరించినవాడు.
996) శారంగ ధన్వా - శారంగము అనెడి ధనుస్సు కలవాడు.
997) గదాధర: - కౌమోదకి యనెడి గదను ధరించినవాడు.
998) రథాంగపాణి: - చక్రము చేతియందు గలవాడు.
999) అక్షోభ్య: - కలవరము లేనివాడు.
1000) సర్వ ప్రహరణాయుధ: - సర్వవిధ ఆయుధములు కలవాడు

విష్ణువు వేయి నామములు- 901--950


విష్ణువు వేయి నామములు-

901) స్వస్తిద: - సర్వశ్రేయములను చేకూర్చువాడు.
902) స్వస్తికృత్ - శుభమును కూర్చువాడు.
903) స్వస్తి - సర్వ మంగళ స్వరూపుడు.
904) స్వస్తిభుక్ - శుభమును అనుభవించువాడు.
905) స్వస్తిదక్షిణ: - స్మరణ మాత్రముననే సర్వ శుభములు సమకూర్చువాడు.
906) అరౌద్ర: - రౌద్రము లేనివాడు.
907) కుండలీ - మకర కుండలములు ధరించినవాడు.
908) చక్రీ - సుదర్శనమను చక్రమును ధరించినవాడు.
909) విక్రమీ - గొప్ప శూరుడైన భగవానుడు.
910) ఊర్జిత శాసన: - ఉల్లంఘించుటకు వీలులేని శాసనములు కలవాడు.
911) శబ్దాతిగ: - వాక్కుకు అందనివాడు.
912) శబ్దసహ: - సమస్త వేదములు తెలియబడినవాడు.
913) శిశిర: - శిశిర ఋతువువలె చల్లబరుచువాడు.
914) శర్వరీకర: - రాత్రిని కలుగజేయువాడు.
915) అక్రూర: - క్రూరత్వము లేనివాడు.
916) పేశల: - మనోవాక్కాయ కర్మలచే రమణీయముగ నుండువాడై పేశల: అని స్తుతించబడును.
917) దక్ష: - సమర్థుడైనవాడు.
918) దక్షిణ: - భక్తులను ఔదార్యముతో బ్రోచువాడు.
919) క్షమిణాం వర: - సహనశీలు లైన వారిలందరిలో శ్రేష్ఠుడు.
920) విద్వత్తమ: - సర్వజ్ఞత్తము కలిగియుండి, అందరిలో ఉత్తమమైనవాడు.
921) వీతభయ: - భయము లేనివాడు.
922) పుణ్యశ్రవణ కీర్తన: - తనను గూర్చి శ్రవణము గాని, కీర్తన గాని పుణ్యము కలుగజేయును.
923) ఉత్తారణ: - సంసార సముద్రమును దాటించువాడు.
924) దుష్కృతిహా - సాధకులలో యున్న చెడువాసనలను అంతరింప చేయువాడు.
925) ప్రాణ: - ప్రాణులకు పవిత్రతను చేకూర్చు పుణ్య స్వరూపుడు.
926) దుస్వప్న నాశన: - చెడు స్వప్నములను నాశనము చేయువాడు.
927) వీరహా - భక్తులు మనస్సులు వివిధ మార్గములలో ప్రయాణించకుండ క్రమము చేయువాడు.
928) రక్షణ: - రక్షించువాడైనందున భగవానుడు రక్షణ: అని స్తవనీయుడయ్యెను.
929) సంత: - పవిత్ర స్వరూపుడు.
930) జీవన: - సర్వ జీవులయందు ప్రాణశక్తి తానైనవాడు.
931) పర్యవస్థిత: - అన్నివైపుల అందరిలో వ్యాపించి యున్నవాడు.
932) అనంతరూప: - అనంతమైన రూపములు గలవాడు.
933) అనంత శ్రీ: - అంతము లేని శక్తివంతుడైనవాడు.
934) జితమన్యు: - క్రోధము ఎఱగని వాడు.
935) భయాపహ: - భయమును పోగొట్టువాడు.
936) చతురశ్ర: - జీవులకు కర్మఫలములను న్యాయముగా పంచువాడు.
937) గభీరాత్మా - గ్రహింప శక్యము గాని స్వరూపము గలవాడు.
938) విదిశ: - అధికారులైన వారికి ఫలము ననుగ్రహించుటలో ప్రత్యేకత కలిగియున్నవాడు.
939) వ్యాదిశ: - వారి వారి అర్హతలను గమనించి బ్రహ్మాదులను సైతము నియమించి, ఆజ్ఞాపించువాడు.
940) దిశ: - వేదముద్వారా మానవుల కర్మఫలములను తెలియజేయువాడు.
941) అనాది: - ఆదిలేనివాడు.
942) భూర్భువ: - సర్వభూతములకు ఆధారమైన భూమికి కూడా భూ: ఆధారమైనవాడు.
943) లక్ష్మీ: - లక్ష్మీ స్వరూపుడు.
944) సువీర: - అనేక విధములైన సుందర పోకడలు గలవాడు.
945) రుచిరాంగద: - మంగళమైన బాహువులు గలవాడు.
946) జనన: - సర్వ ప్రాణులను సృజించినవాడు.
947) జన జన్మాది: - జన్మించు ప్రాణుల జన్మకు ఆధారమైనవాడు.
948) భీమ: - అధర్మపరుల హృదయములో భీతిని కలిగించు భయరూపుడు.
949) భీమ పరాక్రమ: - విరోధులకు భయంకరమై గోచరించువాడు.
950) ఆధార నిలయ: - సృష్టికి ఆధారమైన పృధ్వి, జలము, తేజము, వాయువు, ఆకాశము అను పంచ మహాభూతములకు ఆధారమైనవాడు.

విష్ణువు వేయి నామములు- 851--900


విష్ణువు వేయి నామములు-

851) సర్వ కామద: - సకల కోరికలను తీర్చువాడు.
852) ఆశ్రమ: - జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు.
853) శ్రమణ: - భక్తిహీనులను, వివేకరహితులను శ్రమ పెట్టువాడు.
854) క్షామ: - సర్వ జీవులను క్షీణింపజేయువాడు.
855) సుపర్ణ: - రమణీయ పత్రములు కలిగిన వృక్షము తానైనవాడు.
856) వాయువాహన: - వాయు చలనమునకు కారణభూతుడైనవాడు.
857) ధనుర్ధర: - ధనస్సును ధరించినవాడు.
858) ధనుర్వేద: - ధనుర్వేదము తెలిసినవాడు.
859) దండ: - దండించువాడు.
860) దమయితా - శిక్షించువాడు.
861) దమ: - శిక్షానుభవము ద్వారా ఏర్పడు పవిత్రత తానైనవాడు.
862) అపరాజిత: - పరాజయము తెలియనివాడు.
863) సర్వసహ: - సమస్త శత్రువులను సహించువాడు.
864) నియంతా - అందరినీ తమతమ కార్యములందు నియమించువాడు.
865) అనియమ: - నియమము లేనివాడు.
866) ఆయమ: - మృత్యుభీతి లేనివాడు.
867) సత్త్వావాన్ - సత్త్వము గలవాడు.
868) సాత్త్విక: - సత్త్వగుణ ప్రధానుడైనవాడు.
869) సత్య: - సత్పురుషుల విషయములో మంచిగా ప్రవర్తించువాడు.
870) సత్యధర్మ పరాయణ: - సత్య విషయమునందును, ధర్మ విషయమునందును దీక్షాపరుడైనవాడు.
871) అభిప్రాయ: - అభిలషించు వారిచేత అభిప్రాయపడువాడు.
872) ప్రియార్హ: - భక్తుల ప్రేమకు పాత్రుడైనవాడు.
873) అర్హ: - అర్పింపబడుటకు అర్హుడైనవాడు.
874) ప్రియకృత్ - తన నాశ్రయించినవారికి ప్రియము నొసగూర్చువాడు.
875) ప్రీతివర్ధన: - భక్తులలో భవవంతునిపై ప్రీతిని వృద్ధి చేయువాడు.
876) విహాయన గతి: - ఆకాశము ఆశ్రయముగ గలదియైన విష్ణుపదము తానైనవాడు.
877) జ్యోతి: - తన ప్రకాశము చేత సర్వమును ప్రకాశింపచేయువాడు.
878) సురుచి: - అందమైన ప్రకాశము గలవాడు.
879) హుతభుక్ - యజ్ఞములందు ఆవాహన చేయబడిన దేవతల రూపమున హవిస్సులను స్వీకరించువాడు.
880) విభు: - సర్వ లోకములకు ప్రభువైనవాడు.
881) రవి: - తన విభూతియైన సూర్యుని ద్వారా భూమినుండి సర్వరసములను గ్రహించువాడు.
882) విలోచన: - వివిధ రూపముల ద్వారా ప్రకాశించువాడు.
883) సూర్య: - ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదించువాడు.
884) సవితా: - సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు.
885) రవిలోచన: - సూర్యుడు నేత్రములుగా కలవాడు.
886) అనంత: - అంతము లేనివాడు.
887) హుతభుక్ - హోమద్రవ్యము నారిగించువాడు.
888) భోక్తా - భోగ్యవస్తువైన ప్రకృతిని అనుభవించువాడు.
889) సుఖద: - భక్తులకు ఆత్మసుఖము నొసంగువాడు.
890) నైకజ: - అనేక రూపములలో అవతరించువాడు.
891) అగ్రజ: - సృష్ట్యారంభమునకు ముందే ఆవిర్భవించినవాడు.
892) అనిర్వణ్ణ: - నిరాశ నెరుగనివాడు.
893) సదామర్షీ - సజ్జనుల దోషములను క్షమించువాడు.
894) లోకాధిష్టానం - ప్రపంచమంతటికి ఆధారభూతుడు.
895) అధ్బుత: - ఆశ్చర్య స్వరూపుడు.
896) సనాత్ - ఆది లేనివాడు.
897) సనాతన సమ: - సృష్టికర్త యైన బ్రహ్మకు పూర్వము కూడా యున్నవాడు.
898) కపిల: - ఋషులలో కపిలుడు తానైనవాడు.
899) కపి: - సూర్యరూపుడు.
900) అవ్యయ: - ప్రళయకాలము నందు సమస్తము తనలో లీనమగుటకు విశ్రామ స్థానమైనవాడు.

విష్ణువు వేయి నామములు- 801---850


విష్ణువు వేయి నామములు-

801) అక్షోభ్య: - క్షోభ తెలియనివాడు.
802) సర్వవాగీశ్వరేశ్వర: - వాక్పతులైన బ్రహ్మాదులకు కూడ ప్రభువైన భగవానుడు.
803) మహాహ్రద: - గొప్ప జలాశయము.
804) మహాగర్త : - అగాధమైన లోయ వంటివాడు.
805) మహాభూత: - పంచభూతములకు అతీతమైనవాడు.
806) మహానిధి: - సమస్త భూతములు తనయందు ఉన్నవాడు.
807) కుముద: - కు అనగా భూమి . అట్టి భూమి యొక్క భారమును తొలగించి మోదమును కూర్చువాడు.
808) కుందర: - భూమిని చీల్చుకుపోయినవాడు.
809) కుంద: - భూమిని దానమిచ్చినవాడు.
810) పర్జన్య: - మేఘము వర్షించి భూమిని చల్లబరుచునట్లు జీవుల తాపత్రయములను తొలగించి,వారి మనస్సులను శాంతింపచేయువాడు భగవానుడు.
811) పావన: - పవిత్రీకరించువాడు.
812) అనిల: - ప్రేరణ చేయువాడు, సదా జాగరూకుడు.
813) అమృతాశ: - అమృతము నొసంగువాడు.
814) అమృతవపు: - అమృతస్వరూపుడు శాశ్వతుడు.
815) సర్వజ్ఞ: - సర్వము తెలిసినవాడు.
816) సర్వతోముఖ: - ఏకకాలమున సర్వమును వీక్షించగలవాడు.
817) సులభ: - భక్తితో తనను స్మరించువారికి సులభముగా లభ్యమగువాడు.
818) సువ్రత: - మంచి వ్రతము గలవాడు.
819) సిద్ధ: - సత్వస్వరూపుడై, పూర్ణరూపుడై భగవానుడు సిద్ధ: అని తెలియబడువాడు.
820) శత్రుజిత్ - శత్రువులను జయించువాడు.
821) శత్రుతాపన: - దేవతల విరోదులైన వారిని,సజ్జనులకు విరోధులైన వారిని తపింప చేయువాడు.
822) న్యగ్రోధ: - సర్వ భూతములను తన మాయచే ఆవరించి ఉన్నవాడు.
823) ఉదుంబర: - అన్నముచేత విశ్వమును పోషించువాడు.
824) అశ్వత్ధ: - అశాశ్వతమైన సంసార వృక్ష స్వరూపుడు.
825) చాణూరాంధ్ర నిషూదన: - చాణూరుడను మల్లయోధుని వధించినవాడు.
826) సహస్రార్చి: - అనంతకిరణములు కలవాడు.
827) సప్తజిహ్వ: - ఏడు నాలుకలుగల అగ్నిస్వరూపుడు.
828) సప్తైథా: - ఏడు దీప్తులు కలవాడు.
829) సప్తవాహన: -ఏడు గుఱ్ఱములు వాహనములుగా కలవాడు.
830) అమూర్తి: - రూపము లేనివాడు.
831) అనఘ: - పాపరహితుడు.
832) అచింత్య: - చింతించుటకు వీలుకానివాడు.
833) భయకృత్ - దుర్జనులకు భీతిని కలిగించువాడు.
834) భయనాశన: - భయమును నశింపచేయువాడు.
835) అణు: - సూక్షాతి సూక్షమైనవాడు.
836) బృహుత్ - మిక్కిలి పెద్దది అయిన బ్రహ్మము స్వరూపము.
837) కృశ: - సన్ననివాడై, అస్థూలమైనవాడు.
838) స్థూల: - స్థూల స్వరూపము కలిగియున్నవాడు.
839) గుణభృత్ - సత్వరజోస్తమో గుణములకు ఆధారమైనవాడు.
840) నిర్గుణ: - గుణములు తనలో లేనివాడు.
841) మహాన్ - దేశకాలాదుల నధిగమించి యున్నవాడు.
842) అధృత: - సర్వము తానే ధరించియుండి, తనను ధరించునది మరియొకటి లేనివాడు.
843) స్వధృత: - తనకు తానే ఆధారమైనవాడైన భగవానుడు.
844) స్వాస్య: - విశ్వశ్రేయమునకై వేదములను వెలువరించినవాడు.
845) ప్రాగ్వంశ: - ప్రాచీనమైన వంశము కలవాడు.
846) వంశవర్థన: - తన వంశమును వృద్ధినొందించువాడు.
847) భారభృత్ - భారమును మోయువాడు.
848) కథిత: - వేదములచేత సర్వోత్తముడుగా కీర్తించబడినవాడు.
849) యోగీ - ఆత్మజ్ఞానము నందే సదా ఓలలాడు వాడు.
850) యోగీశ: - యోగులకు ప్రభువు.

విష్ణువు వేయి నామములు- 751--800


విష్ణువు వేయి నామములు-

751) త్రిలోకథృక్ - ముల్లోకములకు ఆధారమైన భగవానుడు.
752) సుమేధా: - చక్కని ప్రజ్ఞ గలవాడు.
753) మేధజ: - యజ్ఞము నుండి ఆవిర్భవించినవాడు.
754) ధన్య: - కృతార్థుడైనట్టివాడు.
755) సత్యమేధ: - సత్య జ్ఞానము కలవాడు.
756) ధరాధర: - భూమిని ధరించి యున్నవాడు.
757) తేజోవృష: - సూర్యతేజముతో నీటిని వర్షించువాడు.
758) ద్యుతిధర: - కాంతివంతమైన శరీరమును ధరించినవాడు.
759) సర్వ శస్త్ర భృతాంవర: - శస్త్రములను ధరించినవారిలో శ్రేష్ఠుడైనవాడు.
760) ప్రగ్రహ: - ఇంద్రియములనెడి అశ్వములను తన అనుగ్రహము అనెడి పగ్గముతో కట్టివేయువాడు.
761) నిగ్రహ: - సమస్తమును నిగ్రహించువాడు.
762) వ్యగ్ర: - భక్తులను తృప్తి పరుచుటలో సదా నిమగ్నమై ఉండువాడు.
763) నైకశృంగ: - అనేక కొమ్ములు గలవాడు, భగవానుడు.
764) గదాగ్రజ: - గదుడను వానికి అన్న.
765) చతుర్మూర్తి: - నాలుగు రూపములు గలవాడు.
766) చతుర్బాహు: - నాలుగు బాహువులు గలవాడు.
767) చతుర్వ్యూహ: - శరీర, వేద, ఛందో మహద్రూపుడైన పురుషుడు. ఈ నలుగురు పురుషులు వ్యూహములుగా కలవాడు.
768) చతుర్గతి: - నాలుగు విధములైన వారికి ఆశ్రయ స్థానము.
769) చతురాత్మా - చతురమనగా సామర్ధ్యము.
770) చతుర్భావ: - చతుర్విద పురుషార్థములకు మూలమైనవాడు.
771) చతుర్వేదవిత్ - నాలుగు వేదములను తెలిసినవాడు.
772) ఏకపాత్ - జగత్తంతయు ఒక పాదముగా గలవాడు.
773) సమావర్త: - సంసార చక్రమును సమర్థతతో త్రిప్పువాడు.
774) అనివృత్తాత్మా - అంతయు తానైయున్నందున దేనినుండియు విడివడినవాడు.
775) దుర్జయ: - జయింప శక్యము గానివాడు.
776) దురతిక్రమ: - అతిక్రమింపరాని విధమును సాసించువాడు.
777) దుర్లభ: - తేలికగా లభించనివాడు.
778) దుర్గమ: - మిక్కిలి కష్టముతో మాత్రమే పొందబడినవాడు.
779) దుర్గ: - సులభముగా లభించనివాడు.
780) దురావాస: - యోగులకు కూడా మనస్సున నిలుపుకొనుటకు కష్టతరమైనవాడు.
781) దురారిహా: - దుర్మార్గులను వధించువాడు.
782) శుభాంగ: - దివ్యములైన, సుందరములైన అవయువములు గలవాడు.
783) లోకసారంగ: - లోకములోని సారమును గ్రహించువాడు.
784) సుతంతు: - జగద్రూపమున అందమైన తంతువువలె విస్తరించినవాడు.
785) తంతువర్థన: - వృద్ధి పరచువాడు, నాశనము చేయువాడు.
786) ఇంద్రకర్మా - ఇంద్రుని కర్మవంటి శుభప్రధమైన కర్మ నాచరించువాడు.
787) మహాకర్మా - గొప్ప కార్యములు చేయువాడు.
788) కృతకర్మా - ఆచరించదగిన కార్యములన్నియు ఆచరించినవాడు.
789) కృతాగమ: - వేదముల నందించువాడు.
790) ఉద్భవ: - ఉత్క్రష్టమైన జన్మ గలవాడు.
791) సుందర: - మిక్కిలి సౌందర్యవంతుడు.
792) సుంద: - కరుణా స్వరూపుడు.
793) రత్నగర్భ: - రత్నమువలె సుందరమైన నాభి గలవాడు.
794) సులోచన: - అందమైన నేత్రములు కలిగిన భగవానుడు.
795) అర్క: - శ్రేష్టులైన బ్రహ్మాదుల చేతను అర్చించబడువాడు.
796) వాజసన: - అర్థించు వారలకు ఆహారము నొసంగువాడని భావము.
797) శృంగీ - శృంగము గలవాడు.
798) జయంత: - సర్వ విధములైన విజయములకు ఆధారభూతుడు.
799) సర్వవిజ్జయీ - సర్వవిద్ అనగా సర్వము తెలిసినవాడు.
800) సువర్ణబిందు: - బంగారము వంటి అవయువములు గలవాడు.

విష్ణువు వేయి నామములు- 701---750


విష్ణువు వేయి నామములు-

701) సత్తా - సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైన అనుభవ స్వరూపము.
702) సద్భూతి: - పరమోత్కృష్టమైన మేధా స్వరూపుడు.
703) సత్పరాయణ: - సజ్జనులకు పరమగతి అయినవాడు.
704) శూరసేన: - శూరత్వము గల సైనికులు గలవాడు.
705) యదుశ్రేష్ఠ: - యాదవులలో గొప్పవాడు.
706) సన్నివాస: - సజ్జనులకు నిలయమైనవాడు.
707) సుయామున: - యమునా తీర వాసులగు గోపకులచే పరివేష్ఠింప బడినవాడు.
708) భూతవాస: - సర్వ భూతములకు నిలయమైనవాడు.
709) వాసుదేవ: - తన మాయాశక్తిచే సర్వము ఆవరించియున్నవాడు. వసుదేవుని కుమారుడు.
710) సర్వాసు నిలయ: - సమస్త జీవులకు, ప్రాణులకు నిలయమైనవాడు.
711) అనల: - అపరిమిత శక్తి, సంపద గలవాడు.
712) దర్పహా - దుష్టచిత్తుల గర్వమణుచు వాడు.
713) దర్పద: - ధర్మమార్గమున చరించువారికి దర్పము నొసంగువాడు.
714) దృప్త: - సదా ఆత్మానందామృత రసపాన చిత్తుడు.
715) దుర్థర: - ధ్యానించుటకు, బంధించుటకు సులభసాధ్యము కానివాడు.
716) అపరాజిత: - అపజయము పొందనివాడు.
717) విశ్వమూర్తి: - విశ్వమే తన మూర్తిగా గలవాడు.
718) మహామూర్తి: - గొప్ప మూర్తి గలవాడు.
719) దీప్తమూర్తి: - సంపూర్ణ జ్ఞానముతో ప్రకాశించువాడు.
720) అమూర్తివాన్ - కర్మాధీనమైన దేహమే లేనివాడు.
721) అనేకమూర్తి: - అనేక మూర్తులు ధరించినవాడు.
722) అవ్యక్త: - అగోచరుడు.
723) శతమూర్తి: - అనేక మూర్తులు ధరించినవాడు.
724) శతానన: - అనంత ముఖములు గలవాడు.
725) ఏక: - ఒక్కడే అయినవాడు.
726) నైక: - అనేక రూపములు గలవాడు.
727) సవ: - సోమయాగ రూపమున ఉండువాడు. ఏకముగా, అనేకముగా తానే యుండుటచేత తాను పూర్ణరూపుడు.
728) క: - సుఖ స్వరూపుడు.
729) కిమ్ - అతడెవరు? అని విచారణ చేయదగినవాడు.
730) యత్ - దేనినుండి సర్వభూతములు ఆవిర్భవించుచున్నవో ఆ బ్రహ్మము.
731) తత్ - ఏది అయితే వ్యాపించిఉన్నదో అది అయినవాడు.
732) పదం-అనుత్తమం - ముముక్షువులు కోరు ఉత్తమస్థితి తాను అయినవాడు.
733) లోకబంధు: - లోకమునకు బంధువైనవాడు.
734) లోకనాధ: - లోకములకు ప్రభువు
735) మాధవ: - మౌన, ధ్యాన, యోగాదుల వలన గ్రహించుటకు శక్యమైనవాడు.
736) భక్తవత్సల: - భక్తుల యందు వాత్సల్యము గలవాడు.
737) సువర్ణవర్ణ: - బంగారు వంటి వర్ణము గలవాడు.
738) హేమాంగ: - బంగారు వన్నెగల అవయువములు గలవాడు.
739) వరంగ: - గొప్పవైన అవయువములు గలవాడు.
740) చందనాంగదీ - ఆహ్లాదకరమైన చందనముతోను కేయూరములతోను అలంకృతమైనవాడు.
741) వీరహా - వీరులను వధించినవాడు.
742) విషమ: - సాటిలేనివాడు.
743) శూన్య: - శూన్యము తానైనవాడు.
744) ఘృతాశీ: - సమస్త కోరికలనుండి విడువడినవాడు.
745) అచల: - కదలిక లేనివాడు.
746) చల: - కదులువాడు.
747) అమానీ - నిగర్వి, నిరహంకారుడు.
748) మానద: - భక్తులకు గౌరవము ఇచ్చువాడు.
749) మాన్య: - పూజింపదగిన వాడైన భగవానుడు.
750) లోకస్వామీ - పదునాలుగు భువనములకు ప్రభువు.

Wednesday, 18 October 2017

విష్ణువు వేయి నామములు- 651---700


విష్ణువు వేయి నామములు-

651) కామదేవ: - చతుర్విధ పురుషార్థములను కోరువారిచే పూజింపబడువాడు.
652) కామపాల: - భక్తులు తననుండి పొందిన పురుషార్థములను చక్కగా ఉపయోగపడునట్లు చూచువాడు.
653) కామీ - సకల కోరికలు సిద్ధించినవాడు.
654) కాంత: - రమణీయ రూపధారియైన వాడు.
655) కృతాగమ: - శ్రుతి, స్తృతి ఇత్యాది శాస్త్రములు రచించినవాడు.
656) అనిర్దేశ్యవపు: - నిర్దేశించి, నిర్వచించుటకు వీలుకానివాడు.
657) విష్ణు: - భూమ్యాకాశాలను వ్యాపించినవాడు.
658) వీర: - వీ ధాతువుచే సూచించు కర్మలచే నిండియున్నవాడు.
659) అనంత: - సర్వత్రా, సర్వకాలములందు ఉండువాడు.
660) ధనంజయ: - ధనమును జయించినవాడు.
661) బ్రహ్మణ్య: - బ్రహ్మను అభిమానించువాడు.
662) బ్రహ్మకృత్ - తపస్సు మొదలైనవిగా తెలియజేయుబడిన బ్రహ్మకు తానే కర్త అయినవాడు.
663) బ్రహ్మా - బ్రహ్మదేవుని రూపమున తానే సృష్టి చేయువాడు.
664) బ్రహ్మ - బ్రహ్మ అనగా పెద్దదని అర్థము.
665) బ్రహ్మవివర్థన: - తపస్సు మొదలైనవానిని వృద్ధి నొందించువాడు.
666) బ్రహ్మవిత్ - బ్రహ్మమును చక్కగా తెలిసినవాడు.
667) బ్రాహ్మణ: - వేదజ్ఞానమును ప్రబోధము చేయువాడు.
668) బ్రహ్మీ - తపస్యాది బ్రహ్మము తనకు అంగములై భాసించువాడు.
669) బ్రహ్మజ్ఞ: - వేదములే తన స్వరూపమని తెలిసికొనిన వాడు.
670) బ్రాహ్మణప్రియ: - బ్రహ్మజ్ఞానులైన వారిని ప్రేమించువాడు.
671) మహాక్రమ: - గొప్ప పధ్ధతి గలవాడు.
672) మహాకర్మా - గొప్ప కర్మను ఆచరించువాడు.
673) మహాతేజా: - గొప్ప తేజస్సు గలవాడు.
674) మహోరగ: - గొప్ప సర్ప స్వరూపుడు.
675) మహాక్రతు: - గొప్ప యజ్ఞ స్వరూపుడు.
676) మహాయజ్వా - విశ్వ శ్రేయమునకై అనేక యజ్ఞములు నిర్వహించినవాడు.
677) మహాయజ్ఞ: - గొప్ప యజ్ఞ స్వరూపుడు.
678) మహాహవి: - యజ్ఞమునందలి హోమసాధనములు, హోమద్రవ్యములు అన్నిటి స్వరూపుడు.
679) స్తవ్య: - సర్వులచే స్తుతించబడువాడు.
680) స్తవప్రియ: - స్తోత్రములయందు ప్రీతి కలవాడు.
681) స్తోత్రం - స్తోత్రము కూడా తానే అయినవాడు.
682) స్తుతి: - స్తవనక్రియ కూడా తానే అయినవాడు.
683) స్తోతా - స్తుతించు ప్రాణి కూడా తానే అయినవాడు.
684) రణప్రియ: - యుద్ధమునందు ప్రీతి కలవాడు.
685) పూర్ణ: - సర్వము తనయందే గలవాడు.
686) పూరయితా - తన నాశ్రయించిన భక్తులను శుభములతో నింపువాడు.
687) పుణ్య: - పుణ్య స్వరూపుడు.
688) పుణ్యకీర్తి: - పవిత్రమైన కీర్తి గలవాడు.
689) అనామయ: - ఏవిధమైన భౌతిక, మానసిక వ్యాధులు దరిచేరనివాడు.
690) మనోజవ: - మనసు వలె అమిత వేగము కలవాడు.
691) తీర్థకర: - సకల విద్యలను రచించినవాడు.
692) వసురేతా: - బంగారము వంటి వీర్యము గలవాడు.
693) వసుప్రద: - ధనమును ఇచ్చువాడు.
694) వసుప్రద: - మోక్షప్రదాత
695) వాసుదేవ: - వాసుదేవునకు కుమారుడు.
696) వసు: - సర్వులకు శరణ్యమైనవాడు.
697) వసుమనా: - సర్వత్ర సమమగు మనస్సు గలవాడు.
698) హవి: - తానే హవిస్వరూపుడైనవాడు.
699) సద్గతి: - సజ్జనులకు పరమగతియైన వాడు.
700) సత్కృతి: - జగత్కళ్యాణమైన ఉత్తమ కార్యము.

విష్ణువు వేయి నామములు- 601---650


విష్ణువు వేయి నామములు-

601) శ్రీవత్సవక్షా - శ్రీ వత్సమనెడి చిహ్నమును వక్షస్థలమున ధరించినవాడు.
602) శ్రీ వాస: - వక్షస్థలమున లక్ష్మీదేవికి వాసమైనవాడు.
603) శ్రీపతి: - లక్ష్మీదేవికి భర్తయైనవాడు.
604) శ్రీమతాంవరా: - శ్రీమంతులైన వారిలో శ్రేష్ఠుడు.
605) శ్రీ ద: - భక్తులకు సిరిని గ్రహించువాడు.
606) శ్రీ శ: - శ్రీ దేవికి నాథుడైనవాడు.
607) శ్రీనివాస: - ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులైనవారి హృదయముల యందు వసించువాడు.
608) శ్రీ నిధి: - ఐశ్వర్య నిధి.
609) శ్రీ విభావన: - సిరులను పంచువాడు.
610) శ్రీ ధర: - శ్రీదేవిని వక్షస్థలమున ధరించినవాడు.
611) శ్రీ కర: - శుభముల నొసగువాడు.
612) శ్రేయ: - మోక్ష స్వరూపుడు.
613) శ్రీమాన్ - సర్వ విధములైన ఐశ్వర్యములు గలవాడు.
614) లోకత్రయాశ్రయ: - ముల్లోకములకు ఆశ్రయమైనవాడు.
615) స్వక్ష: - చక్కని కన్నులు కలవాడు.
616) స్వంగ: - చక్కని అంగములు కలవాడు.
617) శతానంద: - అసంఖ్యాకమైన ఉపాధుల ద్వారా ఆనందించువాడు.
618) నంది: - పరమానంద స్వరూపుడు.
619) జ్యోతిర్గణేశ్వర: - జ్యోతిర్గణములకు ప్రభువు.
620) విజితాత్మ - మనస్సును జయించువాడు.
621) విధేయాత్మా - సదా భక్తులకు విధేయుడు.
622) సత్కీర్తి: - సత్యమైన యశస్సు గలవాడు.
623) ఛిన్నసంశయ: - సంశయములు లేనివాడు.
624) ఉదీర్ణ: - సర్వ జీవుల కంటెను ఉత్క్రష్టుడు.
625) సర్వతశ్చక్షు: - అంతటను నేత్రములు గలవాడు.
626) అనీశ: - తనకు ప్రభువు గాని, నియామకుడు గాని లేనివాడు.
627) శాశ్వతస్థిర: - శాశ్వతుడు స్థిరుడు.
628) భూశయ: - భూమిపై శయనించువాడు.
629) భూషణ: - తానే ఆభరణము, అలంకారము అయినవాడు.
630) భూతి: - సర్వ ఐశ్వర్యములకు నిలయమైనవాడు.
631) విశోక: - శోకము లేనివాడు.
632) శోకనాశన: - భక్తుల శోకములను నశింపచేయువాడు.
633) అర్చిష్మాన్ - తేజోరూపుడు.
634) అర్చిత: - సమస్త లోకములచే పూజింపబడువాడు.
635) కుంభ: - సర్వము తనయందుండువాడు.
636) విశుద్ధాత్మా - పరిశుద్ధమైన ఆత్మ స్వరూపుడు.
637) విశోధనః - తనను స్మరించు వారి పాపములను నశింపచేయువాడు
638) అనిరుద్ధః - శత్రువులచే అడ్డగింపబడనివాడు.
639) అప్రతిరథ: - తన నెదుర్కొను ప్రతిపక్షము లేని పరాక్రమవంతుడు.
640) ప్రద్యుమ్న: - విశేష ధనము కలవాడు.
641) అమిత విక్రమ: - విశేష పరాక్రమము గలవాడు.
642) కాలనేమినిహా - కాలనేమి యను రాక్షసుని వధించినవాడు.
643) వీర: - వీరత్వము గలవాడు.
644) శౌరి: - శూరుడను వాడి వంశమున పుట్టినవాడు.
645) శూరజనేస్వర: - శూరులలో శ్రేష్ఠుడు.
646) త్రిలోకాత్మా - త్రిలోకములకు ఆత్మయైనవాడు.
647) త్రిలోకేశ: - మూడు లోకములకు ప్రభువు.
648) కేశవ: - పొడవైన కేశములు గలవాడు.
649) కేశిహా: - కేశి యనుడి రాక్షసుని చంపినవాడు.
650) హరి: - అజ్ఞాన జనిత సంసార దు:ఖమును సమూలముగా అంతమొందించువాడు.

విష్ణువు వేయి నామములు- 551---600


విష్ణువు వేయి నామములు-

551) దృఢ: - చలించని స్వభావము కలవాడు.
552) సంకర్షణోచ్యుత: - విశ్వమంతయు ప్రళయకాలములో కదిలిపోయినను తానూ ఏ విధమైన పరిణామము చెందనివాడు.
553) వరుణ: - తన కిరణములను ఉపసంహరించుకొను సాయంకాల సూర్యుడు.
554) వారుణ: - వరుణుని కుమారులైన వశిష్ఠుడు మరియు అగస్త్యులుగా వ్యక్తమైనవాడు.
555) వృక్ష: - భక్తులకు అనుగ్రహఛాయ నందించువాడు.
556) పుష్కరాక్ష: - ఆకాశమంతయు వ్యాపించినవాడు.
557) మహామనా: - గొప్ప మనస్సు కలవాడు.
558) భగవాన్ - భగమను ఆరు లక్షణములు సమగ్రముగా యున్నవాడు.
559) భగహా - ప్రళయ సమయమున తన విభూతులను పోగొట్టువాడు.
560) ఆనందీ - ఆనందము నొసంగువాడు.
561) వనమాలీ - వైజయంతి అను వనమాలను ధరించినవాడు.
562) హలాయుధ: - నాగలి ఆయుధముగా కలవాడు.
563) ఆదిత్య: - అదితి యొక్క కుమారుడు. వామనుడు.
564) జ్యోతిరాదిత్య: - సూర్యునియందు తేజోరూపమై భాసిల్లువాడు.
565) సహిష్ణు: - ద్వంద్వములను సహించువాడు.
566) గతిసత్తమ: - సర్వులకు గతియై ఉన్నవాడు.
567) సుధన్వా - శార్ఙమను (శారంగ ధనువు) గొప్ప ధనువును ధరించినవాడు.
568) ఖండ పరశు: - శత్రువులను ఖండించునట్టి గొడ్డలిని ధరించినవాడు.
569) దారుణ: - దుష్టులైన వారికి భయమును కలిగించువాడు.
570) ద్రవిణప్రద: - భక్తులకు కావలిసిన సంపదలను ఇచ్చువాడు.
571) దివ: సృక్ - దివిని అంటియున్నవాడు.
572) సర్వదృగ్య్వాస: - సమస్తమైన జ్ఞానములను వ్యాపింపచేయు వ్యాసుడు.
573) వాచస్పతి రయోనిజ: - విద్యలకు పతి, మరియు మాతృగర్భమున జన్మించనివాడు.
574) త్రిసామా - మూడు సామ మంత్రములచే స్తుతించబడువాడు.
575) సామగ: - సామగానము చేయు ఉద్గాత కూడ తానే అయినవాడు.
576) సామ - సామవేదము తానైనవాడు.
577) నిర్వాణమ్ - సమస్త దు:ఖ విలక్షణమైన పరమానంద స్వరూపుడు.
578) భేషజం - భవరోగమును నివారించు దివ్యౌషధము తానైనవాడు.
579) భిషక్ - భవరోగమును నిర్మూలించు వైద్యుడు.
580) సంన్యాసకృత్ - సన్యాస వ్యవస్థను ఏర్పరచినవాడు.
581) శమ: - శాంత స్వరూపమైనవాడు.
582) శాంత: - శాంతి స్వరూపుడు.
583) నిష్ఠా - ప్రళయ కాలమున సర్వజీవులకు లయస్థానమైనవాడు.
584) శాంతి: - శాంతి స్వరూపుడు.
585) పరాయణమ్ - పరమోత్కృష్ట స్థానము.
586) శుభాంగ: - మనోహరమైన రూపము గలవాడు.
587) శాంతిద: - శాంతిని ప్రసాదించువాడు.
588) స్రష్టా - సృష్ట్యారంభమున జీవులందరిని ఉత్పత్తి చేసినవాడు.
589) కుముద: - కు అనగా భూమి, ముద అనగా సంతోషము. భూమి యందు సంతోషించువాడు.
590) కువలేశయ: - భూమిని చుట్టియున్న సముద్రమునందు శయనించువాడు.
591) గోహిత: - భూమికి హితము చేయువాడు.
592) గోపతి: - భూదేవికి భర్తయైనవాడు.
593) గోప్తా - జగత్తును రక్షించువాడు.
594) వృషభాక్ష: - ధర్మదృష్టి కలవాడు.
595) వృషప్రియ: - ధర్మమే ప్రియముగా గలవాడు.
596) అనివర్తీ - ధర్మ మార్గమున ఎన్నడూ వెనుకకు మఱలని వాడు.
597) నివృత్తాత్మా - నియమింపబడిన మనసు గలవాడు.
598) సంక్షేప్తా - జగత్తును ప్రళయకాలమున సూక్షము గావించువాడు.
599) క్షేమకృత్ - క్షేమమును గూర్చువాడు.
600) శివ: - తనను స్మరించు వారలను పవిత్రము చేయువాడు.

విష్ణువు వేయి నామములు- 501---550


విష్ణువు వేయి నామములు-

501) కపీంద్ర: - వానరులకు ప్రభువైనవాడు.
502) భూరిదక్షిణ: - యజ్ఞ సమయములలో విశేషముగా దక్షిణ లిచ్చువాడు.
503) సోమప: - యజ్ఞముల యందు యజింపబడిన దేవతలరూపముతో సోమరసమును పానము చేయువాడు.
504) అమృతప: - ఆత్మానందరసమును అనుభవించువాడు.
505) సోమ: - చంద్రరూపమున ఓషధులను పోషించువాడు.
506) పురుజిత్: - ఒక్కడై అనేకమందిని ఎదురించి, జయించగల్గినవాడు.
507) పురుసత్తమ: - ఉత్తములలో ఉత్తముడైనవాడు.
508) వినయ: - దుష్టులను దండించి, వినయము కల్గించువాడు.
509) జయ: - సర్వులను జయించి వశపరుచుకొనువాడు.
510) సత్యసంధ: - సత్యసంకల్పములు, సత్యవాక్కులు గలవాడు.
511) దాశార్హ: - దశార్హుడనువాని వంశమున పుట్టినవాడు.
512) సాత్వతాంపతి: - యదుకులమునకు ప్రభువు.
513) జీవ: - జీవుడు.
514) వినయితా సాక్షీ - భక్తుల యందలి వినయమును గాంచువాడు.
515) ముకుంద: - ముక్తి నొసగువాడు.
516) అమిత విక్రమ: - అమితమైన పరాక్రామము గలవాడు.
517) అంభోనిధి: - దేవతలు, మనుష్యులు, పితరులు, అసురులు ఈ నాలుగు వర్గములు అంభశబ్ధార్థములు, అంభస్సులు తనయందే ఇమిడి యున్నవాడు.
518) అనంతాత్మా - అనంతమైన ఆత్మస్వరూపుడు.
519) మహోదధిశయ: - వైకుంఠమునందు క్షీరసాగరమున శేషతల్పముపై శయనించువాడు.
520) అంతక: - ప్రళయకాలమున సర్వమును అంతము చేయువాడు.
521) అజ: - పుట్టుకలేనివాడు.
522) మహార్హ: - విశేష పూజకు అర్హుడైనవాడు.
523) స్వాభావ్య: - నిరంతరము స్వరూపజ్ఞానముతో విరాజిల్లువాడు.
524) జితమిత్ర: - శత్రువులను జయించినవాడు.
525) ప్రమోదన: - సదా ఆనందమునందుండువాడు.
526) ఆనంద: - ఆనందమే తన స్వరూపముగా గలవాడు.
527) నందన: - సర్వులకు ఆనందము నొసగువాడు.
528) నంద: - విషయ సంబంధమైన సుఖమునకు దూరుడు.
529) సత్యధర్మా - సత్య, ధర్మ స్వరూపుడు.
530) త్రివిక్రమ: - మూడడుగులచే ముల్లోకములు వ్యాపించినవాడు.
531) మహర్షి: కపిలాచార్య: - వేదవిదుడైన కపిలమునిగా అవతరించినవాడు.
532) కృతజ్ఞ: - సృష్టి, సృష్టికర్త రెండును తానైనవాడు.
533) మేదినీపతి: - భూదేవికి భర్తయైనవాడు.
534) త్రిపద: - మూడు పాదములతో సమస్తము కొలిచినవాడు. వామనుడని భావము.
535) త్రిదశాధ్యక్ష: - జీవులనుభవించు జాగ్రుత, స్వప్న, సుషుప్త్య వస్థలకు సాక్షియైనవాడు.
536) మహాశృంగ: - ప్రళయకాల సాగరములోని నావను గొప్పదియైన తన కొమ్మున బంధించి సత్యవ్రతుని ఆయన అనుచరులైన ఋషులను ప్రళయము నుండి రక్షించినవాడు.
537) కృతాంతకృత్ - మృత్యువుని ఖండించినవాడు.
538) మహావరాహ: - మహిమగల వరాహమూర్తి.
539) గోవింద: - గోవులకు ఆనందాన్నిచ్చువాడు. భూమికి ఆధారభూతమైనవాడు.
540) సుషేణ: - శోభనమైన సేన గలవాడు.
541) కనకాంగదీ - సువర్ణమయములైన భుజకీర్తులు కలవాడు.
542) గుహ్య: - హృదయగుహలో దర్శించదగినవాడు.
543) గభీర: - జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము మొదలగువానిచే గంభీరముగా నుండువాడు.
544) గహన: - సులభముగా గ్రహించుటకు వీలుకానివాడు.
545) గుప్త: - నిగూఢమైన ఉనికి గలవాడు.
546) చక్రగదాధర: - సుదర్శనమను చక్రమును, కౌమోదకీ యను గదను ధరించినవాడు.
547) వేధా: - సృష్టి చేయువాడు.
548) స్వాంగ: - సృష్టి కార్యమును నిర్వహించుటకు అవసరమగు సాధన సామాగ్రి కూడా తానే అయినవాడు.
549) అజిత: - ఎవనికి తలవొగ్గనివాడై జయింపవీలుకానివాడు.
550) కృష్ణ: - నీలమేఘ శ్యాముడు.