Thursday, 2 November 2017

బూడిద గుమ్మడి కాయ వడియాలు


బూడిద  గుమ్మడి  కాయ  వడియాలు

కావలిసిన  పదార్థాలు
1. బూడిద  గుమ్మడి  కాయ  చిన్నది 1
2. మినపప్పు   అరకేజీ
3. పచ్చిమిర్చి  100 గ్రాములు
4. అల్లం  50 గ్రాములు
5.   ఉప్పు  తగినంత
6. ఇంగువ తగినంత
7. పసుపు

తయారీ  విధానం
ముందుగా  బూడిద గుమ్మడి  కాయను  శుభ్రం  గా  కడిగి  ,
తుడిచి  తడి లేకుండా  ఆర బెట్టుకోవాలి  బాగా   ఆరి న  తరువాత  , పగలకొట్టి
బూడిద  గుమ్మడికాయ లోపల వున్న గుజ్జును  తీసివేసి ,
 సన్నని చిన్న  ముక్కలుగా  తరుగుకోవాలి .
ఇలా  తరుగుకున్న  ముక్కలను ,తగినంత  ఉప్పు , పసుపు వేసి,
 బాగా  కలిపి  కాటన్ బట్టలో  వేసి  మూట కట్టి  ,
పైన బరువు  పెట్టి ఒక  రాత్రి  అంతా  ఉంచాలి .
దీనివలన నీరుఅంతా  ఇవతలికి  వచ్చేస్తుంది  .
మినపప్పు  ను ఒక గిన్నెలోకి  తీసుకుని  ,
తగినన్ని  నీళ్లు  పోసి నానబెట్టుకోవాలి .
మరునా డు  పప్పును  శుభ్రంగా  కడిగి  ,గారెల పిండిలా  గట్టిగా  రుబ్బుకుని  ,
వెడల్పయిన బేసిన్ లోకి  తీసుకోవాలి .
అల్లం ,పచ్చిమిర్చిలను  శుభ్రంగా  కడిగి  ,
తుడిచి  మెత్తని ముద్దలాగా  గ్రైండ్  చేసుకోవాలి  .
రుబ్బుకున్న మినపపిండిలో  గుమ్మడి ముక్కలు , అల్లం పచ్చిమిర్చి ముద్ద,
 ఇంగువ   ,పసుపు  ముక్క లపైన ఉప్పు వేసి ,
మూట కడతాము  కాబట్టి  రుచి చూసుకుని  అవసరమైతేనే  ఉప్పు  వేసుకోవాలి  .
ఇవన్నీ  బాగా  కలిసేలా  కలుపుకోవాలి  .
ఇలా  కలుపుకున్న  పిండిని
ప్లాస్టిక్ పేపర్  మీద  వడియాల  మాదిరి పెట్టుకుని  ,
ఎండబెట్టుకోవాలి .
సాయంత్రం  అట్లకాడతో   తిరగేసుకుని  ,
వెడల్పయిన  ప్లేటులో  పెట్టి  బాగా  ఎండబెట్టుకుని
బాగా  ఎండిన తరువాత
గాలి  చొర బడని  డబ్బాలో  పెట్టుకుంటే  ఏడాది  పాటు నిలువ  ఉంటాయి.
ఆ తరువాత నూనె లో వేయించుకుంటే  గుమ్మడి వడియాలు రెడీ .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.