Sunday, 25 December 2022

నదులలోను, సముద్రాలలోను పవిత్ర స్నానాలు చేసేప్పుడు పాటించవలసిన నియమాలు

 నదులలోను, సముద్రాలలోను పవిత్ర స్నానాలు చేసేప్పుడు పాటించవలసిన నియమాలు ఏవి


నదీ స్నానం , సముద్ర స్నానం వంటివి చేసే ముందు నదీ స్నానం అయితే నదీమ తల్లిని, సముద్ర స్నానం అయితే సముద్రున్ని, అనంతరం క్షేత్ర దేవతల్ని, మనస్సులొ స్మరించుకొని సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి .
రాత్రి పూట నిద్రించే టైములో ఒంటిపై ధరించిన వస్త్రాలతో నదిలో మునగరాదు. ఈ బట్టలను విడిచి శుభ్రమైన వస్త్రములను ధరించాలి.
  పుణ్య నదులలో పాప పరిహారార్ధం చేసే పవిత్ర స్నానముల సమయం లొ ఖచ్చితమైన నియమాలు పాటించి తీరాలి.
స్నాన అనంతరం ఆ బట్టల్ని నదుల్లో పిండ రాదు అలాగే సబ్బులను ఉపయొగించి కూడా బట్టలను ఉతకరాదు .
అభ్యంగ స్నానం అంటే కుంకుళ్ళు , షాంపు లు మొదలయిన వాటిని ఉపయొగించి తలంటు స్నానం చేయరాదు .
పొరబాటున కూడా నదిలోగాని, నదీ తీరాల్లోగాని మలముత్రాలు విసర్జిన్చరాదు . ఈ నియమానికి వ్యతిరేకంగా  చేస్తే పాపం అంటుతుంది.
ఆఖరికి నీళ్లను పుక్కిలించి ఉమ్మి వేసినా కూడా మహా దొషం అవుతుంది.
  పవిత్ర స్నానములు ఆచరించే సమయంలో అ మంగళ కరమైన మాటలు మాట్లడకుడదు. కసురుకోవడం, కోప్పడటం, వంటివి చేయకూడదు.*
సముద్ర స్నానం కేవలం పర్వదినములలో  మాత్రమే చే
యాలి .మాములు సమయాలలో సముద్రాన్ని తాకకూడదు .
స్నానం చెసే ముందు సంకల్పం చెప్పుకోవాలి

భగవంతుడికి నివేదించే సమయం లొ గుర్తు ఉంచుకోవలసినవి

 భగవంతుడికి నివేదించే సమయం లొ గుర్తు ఉంచుకోవలసినవి


భగవంతుడికి నివేధించేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు . తెలిసి చెసినా,తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. కనుక నివేధించేప్పుడు ప్రతివారు తప్పక చేయవలసినవి .

1. దేవునికి నైవేద్యం గా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు .పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి .
2. పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదిన్చరాదు . చల్లారాక పెట్టాలి .
3. నివేదనలో మంచినీటిని కుడా తప్పనిసరిగా పెట్టాలి.
4. నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.

ఊర్ధ్వ పుండ్ర ములు ఎందుకు ధరిస్తారు

ఆర్య మతంలో ముఖధారణం (బొట్టు ) ఒక ఆర్ష సాంప్రదాయంగా ఏర్పడింది. అది త్రి పుండ్రము , ఊర్ధ్వ పుండ్రము. అని రెండు రకాలుగా విభజించబడింది. వైష్ణవులు ఊర్ధ్వ పుండ్రము లు  ధరిస్తారు . స్త్రీలు తిలకధారణ చేస్తారు .
     తిరుమణిని నిలువునా మూడు రేఖలుగా ధరించడంనే ఊర్ధ్వ పుండ్ర దారణ అంటారు.ఈ మూడు రేఖలు అకార, ఉకార, మకార స్వరూపమైన ప్రనవాన్ని సూచిస్తాయి. అకారం - సత్వ స్వరుపడైన శ్రీ మహావిష్ణువును , ఉకారం - చిత్వ స్వరూపిణి అయిన మహాలక్ష్మిని , మకారం  భగవద్భాక్తులైన భాగవతులను తెలియజేస్తాయని చెబుతారు.  శైవులు భస్మాన్ని మూడు అడ్డరేకులుగా నుదుట ధరిస్తారు .

    తిరుమణి మట్టికి సంభందించినది . కావున అది మట్టి నుండి కలిగిన ఈ శరీరం చివరికి మట్టిలోనే కలిసిపోతుందని సుచిస్తుంది. ఇందువల్ల వైరాగ్యం కలుగుతుంది. ముక్తి కోరేవానికి వైరాగ్యం చాలా ముఖ్యం. విభూతి దారణ కూడా ఈ శరీరం చివరికి బూడిద అయ్యేది అనే తత్వాన్ని నిర్దేశిస్తుంది. ముఖదారణ లేకుండా చేసే సత్కర్మలు నిరర్ధకాలు అని ఆగమాలు పేర్కొన్నాయి.

  ద్వాదశ (12) ఊర్ధ్వ పుండ్రము లు ధరించడం కూడా కద్దు. నాడులు, హృదయం మొదలయిన శరీర భాగములను చల్లబరుచుటకు కూడా ఆయా స్థానములలో ఊర్ధ్వ పుండ్ర దారణ అవసరమయిన వైజ్ఞానికం గా విశ్లేషణ చేసి కొంతమంది వివరిస్తున్నారు . ఉర్ధ్వ పుండ్రం లొ ఉపయొగించే వస్తువులకు చల్లదనం కలిగించే లక్షణం ఉంది.

రావణుడు ప్రతిష్టించిన 6 శివ లింగాలు ఏవి

 రావణుడు ప్రతిష్టించిన 6 శివ లింగాలు ఏవి


1. వైద్యనాధ లింగం. 2. వక్రేశ్వర నాద లింగం.
3. సిద్ధినాద లింగం. 4. తారకేశ్వర లింగం.
5. ఘటేశ్వర లింగం. 6. కపిలేశ్వర లింగం.

పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు

పదనాలుగు లోకాలలోని మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, స్వర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లొకాల్లొను ఉంటారు.

నాల్గొవదైన మహర్లోకం కల్పాన్తములో కూడా నశించదు. ఈ లొకం లొ కల్పాంత జీవులు ఉంటారు.

అయిదోవది అయిన జనలోకం లొ బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.

ఆరొవదైన తపోలోకంలో దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉంటదము. 

ఏయే ప్రదేశాల్లో జపం చేస్తే ఎంతెంత ఫలితం

 ఏయే ప్రదేశాల్లో జపం చేస్తే ఎంతెంత ఫలితం


ఇంట్లో చేసే జపానికి సత్ఫలితమే ఉంటుంది . కాని ఇంట్లో జపం చేస్తే అంతే ఫలితం ఉంటుంది. అదే జపాన్ని నది పరీవాహక ప్రాంతాల్లో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది . గోశాలలో చేసే జపం వల్ల వందరెట్ల ఫలితం ఉంటుంది . యాగశాలలో చేసే జపం వలన వందరెట్ల కంటే అధికమైన ఫలితం వస్తుంది. దేవాలయాలలో , పుణ్య ప్రదేశాలలో చేసే జపం వలన పదివేల రెట్లు ఫలితం కలుగుతుంది. శివాలయాలలో , శివ సాన్నిద్యం నందు చేసే జపం వలన అత్యున్నతమైన ఫలితం దక్కుతుంది.

పంచ కోశాలు అంటే ఏమిటి

 పంచ కోశాలు అంటే ఏమిటి


1. అన్నమయ కోశం. 2. ప్రాణమయ కోశం .
3. మనోమయ కోశం . 4. విజ్ఞానమయ కోశం .
5. ఆనందమయ కోశం .

శౌచమంటే ఏమిటి

శుచి అంటే శుభ్రము , శుద్ధము . ధర్మాది పరీక్షల చేత భాహ్య అంతరములలో పరిశుద్దిని పొందుటయే " శౌచం" అనబడును. శౌచం రెండు విధములు
1. బాహ్య శౌచం.
2. అంతః శౌచం .

భాహ్య శౌచం - శరీరం పైన ఉండే మలినాలను పోగొట్టుకోవడానికి చేసే స్నానాదులు, శరీరం పరిశుద్ధం గా ఉండేందుకు పూసే సుగంద ద్రవ్యాలు వంటివి. వీటిని భాహ్య శౌచం అంటారు.

అంతః శౌచం - మనస్సులో ఎటువంటి చెడు భావాలు లేకుండా అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద , వాత్సర్యాలు లేకుండా నిర్మలమైన అంతహకరణను కలిగి ఉండటమే అంతః శౌచం అనబడను. అంతః శౌచం మనస్సుకి సంభందించినది. కాబట్టి దీనికి శాస్త్రాలలో అదిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

నవ వ్యాకరణాలు అనగా ఏవి

 నవ వ్యాకరణాలు అనగా ఏవి


1. పాణి నీయం . 2. కలాపం. 3. సుపద్మం.
4. సారస్వతం. 5. ప్రాతిశాఖ్యం ( కుమార వ్యాకరణం ) 6. ఐంద్రం . 7. వ్యాఘ్ర బౌతికం.
8. శాఖటా టా యానం . 9.శాకల్యం .

శ్రీ రాముని జన్మనక్షత్రం , మాసం ఎప్పుడు

శ్రీ రాముడు చైత్ర మాసం , నవమి తిధిలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం పునర్వసు .

పర్వ దినాలలో వడపప్పుని ఎందుకు పెడతారు

భగవంతుడికి ప్రతి పండగనాడు వడపప్పుని , చలిమిడిని తప్పకుండా చేసి పెడతారు. అలాగే తల స్నానం చేసి ఆయా దేవుళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేయడం వల్ల వేడి చేసి తిన్న పిండి వంటలు సరిగ్గా అరగవు . తద్వార అనారోగ్యం కలుగుతుంది.
          ఇటువంటి ఉపద్రవాలు తలెత్తకుండా ఉండటానికి కొన్ని ప్రాంతాలలో వడపప్పు, పానకం , చలిమిడి తప్పకుండా చేస్తారు . పెసరపప్పుతో చేసిన వడపప్పు తినడం వలన తిన్న పిండి వంటలు జీర్ణం అయ్యి వేడి చేయకుండా చలువ చేస్తుంది .

శ్రీ వారి సుప్రభాతాన్ని ఎవరు ఎప్పుడు రచించారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ సుప్రబాతాన్ని రచించిన వారు శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ అనే ఆచార్యులు. వీరు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధులైన శ్రీ మనవాల మహామునుల శిష్యులలో ప్రముఖులు వీరు క్రీ .శ . 1361 లొ జన్మించి 1454 వరకు అంటే 93 సంవత్సరాలు జీవించి ఉన్నారని పరిశోధకుల అభిప్రాయం.వీరు తమ జీవిత కాలంలో అనేక కృతులు రచించారు. వీరి రచనలలో శ్రీ స్వామివారి సుప్రబాతం అనన్య సామాన్యమైన ప్రచారం పొందింది.

శ్రీ చక్రం నందు గల దేవతలు ఎవరు

 శ్రీ చక్రం నందు గల దేవతలు ఎవరు


1. వశిని . 2. కామేశ్వరి. 3. మోదిని . 4. విమల.
5. అరుణి . 6. జయిని . 7. సర్వేశ్వరీ . 8. కాళిని .

ధర్మం అంటే

  ధృతి, క్షమ , దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ , విద్య, సత్యము, అక్రోధము. ఈ పది లక్షణములు కలిగినదే "ధర్మము"


సహంపక్తి బోజనాల సమయం లొ అందరూ ఒకేసారి లేవాలి అంటారు ఎందుకు

సహంపక్తి బోజనానికి కూర్చున్న వారందరి జీవన ప్రమాణం ఒకేవిధంగా ఉండదు. సహంపక్తి బోజనాలలో రకరకాల వారు ఉంటారు. వారిలొ మంచివారు ఉంటారు. అలాగే చెడు అలవాట్లు ఉన్నవారు ఉంటారు. ఎవరి శరీరాల్లోని విద్యుత్ వారి వారి శరీరపు శక్తిని అనుసరించే పనిచేస్తూ ఉంటుంది .
కాని సహపంక్తి లొ కూర్చున్నప్పుడు దాదాపు అందరి శరీరాల్లోని విద్యుత్ నియంత్రణ అందరిలో ఒకేలా ఉంటుంది. అటువంటప్పుడు తక్కువ శక్తితో ఉన్న వ్యక్తీ అందరికంటే ముందుగా లేచినచో మిగిలిన వారి శక్తి అతనికి ఎంతోకొంత వెళ్ళిపోతుంది.
          కనుకనే సహపంక్తి బోజనానినికి కుర్చున్నప్పుడు ఎవరు ముందు తిన్నా , ఎవరు వెనక తిన్నా , అందరూ ఒకేసారి లేవాలన్న నియమం పూర్వకాలం నుండి ఆచరణలో ఉంది.

దేవతా లక్షణాలు ఏవి

1. రెప్పపాటు లేకుండుట . 2. భూమి మీద పాదాలు ఆనించ కుండా ఉండుట.3. వ్యసనం లేకుండా ఉండుట.

వివిధ జన్మలు

 వివిధ జన్మలు ఏవి


1. దేవతలు . 2. మనుష్యులు. 3. మృగములు.
4. పక్షులు . 5. పురుగులు. 6. జలచరములు.
7. వృక్షములు .

శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఏడుకొండల పేర్లు

1. వ్రుషబాద్రి . 2. నీలాద్రి. 3. గరుడాద్రి.
4. అంజనాద్రి. 5. శేషాద్రి. 6. వెంకటాద్రి.
7. నారాయణాద్రి.

ఎవరెవరికి యే విధంగా నమస్కరించాలి

1. విష్ణుమూర్తి యెక్క సర్వ అవతారాల విగ్రహాలకు మరియు శివునికి 12 అంగుళాల ఎత్తులొ చేతులు జోడించి శిరస్సు వంచి భక్తి , శ్రద్దలతో వినయంగా నమస్కరించాలి.
2. ఇతర దేవుళ్ళకు శిరస్సు పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.
3. గురువుకి నోటితో " నమస్కారం " అని చెప్పకుండా రెండు చేతులు జోడించి వినయవిధేయలతో నమస్కరించాలి.
4. మహానుభావులకు , యోగులకు రెండు చేతులు వక్షస్థలం పై  జోడించి నమస్కరించాలి.
5. తండ్రికి , పరిపాలకుడికి రెండు చేతులు నోటి మీదగా జోడించి నమస్కరించాలి.
6. తల్లికి ఉదరం పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.

పుజాంగాలు

 పుజాంగాలు  ఎన్ని రకాలు


పుజాంగాలు  5 రకాలు.
1.అభిగమనము - దైవాన్ని స్మరిస్తూ దేవాలయానికి వెళ్ళుట.
2. ఉపాధానము - పూజా సామగ్రిని సంపాదించుట
3. ఇజ్య - దూప, దీప, నైవేద్యములతో పూజించుట.
4. స్వాద్యాయము - తనకు తానుగా మంత్రోచ్చారణ తో స్తుతించడం.
5. యోగము - తదేకమైన నిష్టతో ధ్యానించుట .
 
ఏయే గృహాలకి ఎటువంటి శంఖువు ప్రతిష్ట చేయాలి

రాతితో కట్టే గృహానికి ఆ రాతితోనే శంఖువు తయారు చేసి శంఖుస్థాపన చేయవలెను . ఇటుకలతో కట్టిన గృహమునకు ఇటుకలతోనే శంఖువు చేసి ప్రతిష్ట చేయవలెను .గోడలు పెట్టక కర్రలతో , నిట్రాట లతో వేయు పాకలకు కర్రతో శంఖువు తయారు చేసి ప్రతిష్ట చేయవలెను . శంఖువును నవరత్న, సువర్ణ, తామ్ర , రజిత నాణేలతో , నవధన్యములతో పూజించి , స్థాపించవలెను . అన్ని రకాల గృహములకు కర్ర శంఖువు ప్రతిష్టించరాదు . కాష్ట శంఖువు భుమిలొ ఎంతకాలం ఉండునో అంతకాలం ఆ గృహం శుబప్రధంగా ఉండును. ఆ తరువాత ఆ గృహములలో నివసించువారికి కష్టాలు కలుగును.కావున కర్రతో చేసిన శంఖువు కంటే రాతితో చేసిన శంఖువు ఉత్తమం అని తెలుస్తుంది.

గృహ నిర్మాణం లొ ఇంటి కిటికీలు, ద్వారాలు ఏ విధంగా అమర్చాలి

గృహంలో కిటికీలు, ద్వారములు సమసంఖ్యలో ఉండాలి. వేటికవే విడివిడిగా సమసంఖ్యలొ ఉండాలి. కిటికీలు సరిసంఖ్యలోను , ద్వారాలు సరిసంఖ్యలొను ఉండాలి. అలమారాల గురించి శాస్త్రం లొ ఏమీ చెప్పలేదు. వాటి ఉపయోగాన్ని అనుసరించి సరిసంఖ్యో, బేసి సంఖ్యలొ నో పెట్టుకొవాలి. వాటికి స్థల నిర్ణయం కూడా చెప్పలేదు కిటికీలు , ద్వారాలు సరిసంఖ్యలో ఉన్నా చివరన సున్నా లేకుండా ఉండాలి. అనగా 10,20,30 ఇలా చివరన సున్నా రాకూడదు. అలాగే మొత్తం గృహం లొ ఉన్న ద్వారాలు, కిటికీలు అన్ని లెక్కపెట్టాలి.

నవగ్రహాలకు సంభందించిన సమిధలు

 నవగ్రహాలకు సంభందించిన సమిధలు


1. సూర్యుడు - జిల్లెడు. 2. చంద్రుడు - మొదుగ .
3. అంగారకుడు - చండ్ర. 4. బుదుడు - ఉత్తరేణి .
5. బృహస్పతి - రావి . 6. శుక్రుడు - అత్తి .
7. శని - జమ్మి . 8. రాహువు - దర్భ.
9. కేతువు - గరిక .

పంచవిధ సూతకములు

 పంచవిధ సూతకములు అంటే ఏమిటి


1.జన్మ సూతకము. 2. మృత సుతకము. 3. రజః సూతకం . 4. అంటు (రొగ ) సూతకం . 5. శవదర్శన సూతకం .

దేవాలయాల వద్ద గృహ నిర్మాణం చేయడం దోషమా

శివాలయానికి నూరు బారుల దూరం లొపల, విష్ణువాలయముకు వెనక ఇరవై బారుల దూరం లొపల, శక్తి ఆలయముకు సమీపం లొను గృహనిర్మాణం చేయకూడదు . దీనికి వ్యతిరేఖంగా గృహ నిర్మాణం జరిగితే సఖల సంపదలు నశించి కష్టాలపాలు అవుతారు. గుడి దగ్గర ఉన్న ఇళ్ళకు ఏ వైపునైనా , ఏ మాత్రమైనా గుడి నీడ పడిందంటే దరిద్రం, ప్రాణనష్టం వంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు.

తాంబూలం సేవించేప్పుడు తమలపాకు తొడిమ, చివర్లు ఎందుకు తుంచాలి

తాంబులం వేసుకునే ముందు తమలపాకుల తొడిమలు, చివరలు తుంచివేయాలి. ఎందుకంటే తొడిమను తినడం వ్యాదికారకం అవుతుంది. చిగుర్లు పాపానికి ప్రతీకలు అని అంటారు. కనుక తమలపాకు తొడిమలు , చివరలు తుంచిన తర్వాతే తాంబులం వేసుకొవడం ఆరొగ్య ప్రధమం . అలాగే తమలపాకులో ఉండే ఈనెలు బుద్దిని మందగింప చేస్తాయి. అందుకే తమలపాకును నమిలి మొదటగా నోటిలో ఊరిన రసాన్ని ఉమ్మివేయాలి. తొడిమలు, చివరలు తున్చివేసినా ఇంకా అవి తమలపాకులో శేషించి ఉంటాయి కనుక

శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుంది ఎందుకు

తిరుపతి శ్రీ గొవింద రాజస్వామి వారి సన్నిదిలో కుంచం ఉండటం నిజమే . దీనికి కారణం ఈ విధంగా చెబుతారు. తిరుమల స్వామి శ్రీ వెంకటేశ్వరస్వామి  కుబేరుని వద్ద అప్పు చేసాడట . దానిని తీర్చుట కొరకు ద్రవ్యాన్ని కుంచం తో కొలిసి ఇచ్చేవారట స్వామివారు. స్వామివారి పక్షాన గొవింద రాజస్వామి ఈ కార్యమును సాగించారని ఒక కధ ప్రచారం లొ ఉంది. ఆ కుంచం తన తలక్రింద ఉంచుకున్నాడు అని ప్రతీతి.

వివిద ఫలాల నైవేద్యం - ఫలితాలు

 వివిద ఫలాల నైవేద్యం  -  ఫలితాలు


కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) -

భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.

అరటి పండు -

భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.

నేరెడు పండు. -
శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి  ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.

ద్రాక్ష పండు. -
భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.

మామిడి పండు. - 
మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.

అంజూర  పండు. -
భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.

సపోట పండు. -
సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.

యాపిల్ పండు -
భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.

కమలా పండు. -
భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.

పనసపండు - 
పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.

ఆయుర్వేద సంహితలు

 అష్టాదశ ఆయుర్వేద సంహితలు


1. చరక సంహిత. 2. శూశ్రుత సంహిత. 3. పరాశర సంహిత. 4. హరిత సంహిత. 5. అగ్నివేశ సంహిత. 6. చ్యవన సంహిత. 7. ఆత్రేయ సంహిత. 8. భోజ సంహిత. 9. బృగు సంహిత. 10. బెడ సంహిత.
11. అగస్త్య సంహిత. 12. వరాహ సంహిత.
13. అత్రి సంహిత. 14. నారయణ సంహిత.
15. చంద్ర సంహిత. 16. నారసింహ సంహిత.
17. శివ సంహిత. 18. సూర్య సంహిత.

గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు

1. ఈశాన్యం లొ పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.
2. ఆగ్నేయం లొ అగ్నికి సంబందించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.
3. నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.
4. వాయువ్యం లొ స్వతంత్రబిలాష చిహ్నములు .
5. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.
6. యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.
7. కుభేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.
8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.
ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.

అప్సరసల పేర్లు

 ఏడుగురు అప్సరసల పేర్లు


1.రంభ. 2. ఉర్వశి. 3.మేనక  4.తిలోత్తమ. 5.సుకేశి. 6. ఘ్రుతాచి 7. మంజుగోష .

సప్త సంతానములు

1. తటాక నిర్మాణం. 2. ధన నిక్షేపం. 3. అగ్రహార ప్రతిష్ట . 4. దేవాలయ ప్రతిష్ట . 5. ప్రభంధ రచన.
6. స్వసంతానం ( పుత్రుడు ).

తొమ్మిది రకాల ఆత్మలు

1. జీవాత్మ. 2. అంతరాత్మ. 3. పరమాత్మ.
4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానత్మ 
7. మహాధాత్మ . 8. భూతాత్మ . 9. సకలాత్మ.

పదిరకాల పాలు

1. చనుబాలు. 2. ఆవుపాలు . 3. బర్రెపాలు .
4. గొర్రె పాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు.
7. గాడిద పాలు. 8. ఒంటె పాలు. 9. ఏనుగు పాలు.
10. లేడి పాలు.

యజ్ఞోపవీతం లొ ఎన్నిపోగులు ఉంటాయి

యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు. వారు 
1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 4. చంద్రుడు . 5. పితృ దేవతలు . 6. ప్రజాపతి. 7. వాయువు .
8. సూర్యుడు . 9. సూర్య దేవతలు .

Wednesday, 7 September 2022

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి
   



ఓం విష్ణవే నమః
    ఓం లక్ష్మీ పతయేనమః
    ఓం కృష్ణాయనమః
    ఓం వైకుంఠాయనమః
    ఓం గురుడధ్వజాయనమః
    ఓం పరబ్రహ్మణ్యేనమః
    ఓం జగన్నాథాయనమః
    ఓం వాసుదేవాయనమః
    ఓం త్రివిక్రమాయనమః
    ఓం దైత్యాన్తకాయనమః 10
    ఓం మధురిపవేనమః
    ఓం తార్ష్యవాహాయనమః
    ఓం సనాతనాయనమః
    ఓం నారాయణాయనమః
    ఓం పద్మనాభాయనమః
    ఓం హృషికేశాయనమః
    ఓం సుధాప్రదాయనమః
    ఓం మాధవాయనమః
    ఓం పుండరీకాక్షాయనమః
    ఓం స్థితికర్రేనమః20
    ఓం పరాత్పరాయనమః
    ఓం వనమాలినేనమః
    ఓం యజ్ఞరూపాయనమః
    ఓం చక్రపాణయేనమః
    ఓం గదాధరాయనమః
    ఓం ఉపేంద్రాయనమః
    ఓం కేశవాయనమః
    ఓం హంసాయనమః   
    ఓం సముద్రమధనాయనమః   
    ఓం హరయేనమః30
    ఓం గోవిందాయనమః   
    ఓం బ్రహ్మజనకాయనమః
    ఓం కైటభాసురమర్ధనాయనమః
    ఓం శ్రీధరాయనమః
    ఓం కామజనకాయనమః
    ఓం శేషసాయినేనమః
    ఓం చతుర్భుజాయనమః
    ఓం పాంచజన్యధరాయనమః
    ఓం శ్రీమతేనమః
    ఓం శార్జపాణయేనమః40
    ఓం జనార్ధనాయనమః
    ఓం పీతాంబరధరాయనమః
    ఓం దేవాయనమః
    ఓం జగత్కారాయనమః
    ఓం సూర్యచంద్రవిలోచనాయనమః
    ఓం మత్స్యరూపాయనమః
    ఓం కూర్మతనవేనమః
    ఓం క్రోధరూపాయనమః
    ఓం నృకేసరిణేనమః
    ఓం వామనాయనమః 50
    ఓం భార్గవాయనమః
    ఓం రామాయనమః
    ఓం హలినేనమః
    ఓం కలికినేనమః
    ఓం హయవాహనాయనమః
    ఓం విశ్వంభరాయనమః
    ఓం శింశుమారాయనమః
    ఓం శ్రీకరాయనమః
    ఓం కపిలాయనమః
    ఓం ధృవాయనమః 60
    ఓం దత్తాత్రేయానమః
    ఓం అచ్యుతాయనమః
    ఓం అనన్తాయనమః
    ఓం ముకుందాయనమః
    ఓం ఉదధివాసాయనమః
    ఓం శ్రీనివాసాయనమః   
    ఓం లక్ష్మీప్రియాయనమః
    ఓం ప్రద్యుమ్నాయనమః
    ఓం పురుషోత్తమాయనమః
    ఓం శ్రీవత్సకౌస్తుభధరాయనమః
    ఓం మురారాతయేనమః 71
    ఓం అధోక్షజాయనమః
    ఓం ఋషభాయనమః
    ఓం మోహినీరూపధరాయనమః
    ఓం సంకర్షనాయనమః
    ఓం పృథవేనమః
    ఓం క్షరాబ్దిశాయినేనమః
    ఓం భూతాత్మనేనమః
    ఓం అనిరుద్దాయనమః
    ఓం భక్తవత్సలాయనమః80
    ఓం నారాయనమః
    ఓం గజేంద్రవరదాయనమః
    ఓం త్రిధామ్నేనమః
    ఓం భూతభావనాయనమః
    ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయనమః
    ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయనమః
    ఓం సూర్యమండలమధ్యగాయనమః
    ఓం భగవతేనమః
    ఓం శంకరప్రియాయనమః
    ఓం నీళాకాన్తాయనమః 90
    ఓం ధరాకాన్తాయనమః
    ఓం వేదాత్మనేనమః
    ఓం బాదరాయణాయనమః
    ఓంభాగీరధీజన్మభూమి
        పాదపద్మాయనమః
    ఓం సతాంప్రభవేనమః
    ఓం స్వభువేనమః
    ఓం ఘనశ్యామాయనమః
    ఓం జగత్కారణాయనమః
    ఓం అవ్యయాయనమః
    ఓం బుద్దావతారాయనమః100
    ఓం శాంన్తాత్మనేనమః
    ఓం లీలామానుషవిగ్రహాయనమః
    ఓం దామోదరాయనమః
    ఓం విరాడ్రూపాయనమః
    ఓం భూతభవ్యభవత్ప్రభవేనమః
    ఓం ఆదిబిదేవాయనమః
    ఓం దేవదేవాయనమః
    ఓం ప్రహ్లదపరిపాలకాయనమః
    ఓం శ్రీ మహావిష్ణవే నమః
           
            

Tuesday, 6 September 2022

శ్రీ క్షీరాబ్ది శయన నారాయణ అష్టోత్తర శతనామావళి

 శ్రీ క్షీరాబ్ది శయన నారాయణ అష్టోత్తర శతనామావళి



ఓం విష్ణవే నమః
ఓం లక్ష్మీ పతయేనమః
ఓం కృష్ణాయ నమః
ఓం వైకుంఠాయ నమః
ఓం గరుడధ్వజాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం జగన్నాధాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం హంసాయ నమః
ఓం శుభప్రదాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓ మధు పతయే నమః
ఓం తర్ క్ష్య వాహనాయ నమః
ఓం దైత్యాంతకాయ నమః
ఓం శింశుమారాయ నమః
ఓం పుండరీకాక్షాయ నమః
ఓం స్థితికర్త్రే నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం యజ్ఞ రూపాయ నమః
ఓం చక్ర రూపాయ నమః
ఓం గదాధరాయే నమః
ఓం కేశవాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం భూతావాసాయ నమః
ఓం సముద్రమధరాయ నమః
ఓం హరయే నమః
ఓం గోవిందాయ నమః
ఓం బ్రహ్మజనకాయ నమః
ఓం కైటభాసురమర్ధనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం శేషశాయినే యనమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం పాంచజన్య ధరాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం శర్ జ్ఞపాణయే నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం పీతాంబరధరాయ నమః
ఓం దేవాయ నమః
ఓం సూర్యచంద్రలోచనాయ నమః
ఓం మత్స్య రూపాయ నమః
ఓం కూర్మతనవే నమః
ఓం క్రోడరూపాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం వామనాయ నమః
ఓం భార్గవాయ నమః
ఓం రామాయ నమః
ఓం హలినే నమః
ఓం కల్కి నే నమః
ఓం హమాననాయ నమః
ఓం విశ్వంభరాయ నమః
ఓం ఆదిదేవాయ నమః
ఓం దేవదేవాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం ధృవాయ నమః
ఓం దత్తాత్రేయాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ముకుందాయ నమః
ఓం దధివాహనాయ నమః
ఓం ధన్వంతర్యై నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
ఓం మురారాతయే నమః
ఓం అదోక్షజాయ నమః
ఓం వృషభాయ నమః
ఓం మోహినీరూపాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం పృధివే నమః
ఓం క్షీరాబ్దిశాయినే నమః
ఓం భూతాత్మనే నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం గజేంద్రవరదాయ నమః
ఓం త్రిధామ్నే నమః
ఓం ప్రహ్లాదపరిపాలనాయ నమః
ఓం శ్వేతద్వీపవాసినే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం సూర్యమండలమధ్యగాయ నమః
ఓం అనాదిమధ్యాంతరహితాయ నమః
ఓం భగవతే నమః
ఓం శంకరప్రియాయ నమః
ఓం నీలతనవే నమః
ఓం ధరామంతాయ నమః
ఓం వేదాత్మనే నమః
ఓం బాదరాయణాయ నమః
ఓం భాగీరధీజన్మభూమినే నమః
ఓం పాదపద్మాయ నమః
ఓం సతాంప్రభవే నమః
ఓం ఘనశ్యామాయ నమః
ఓం జగత్కారణాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం దశావతారయ నమః
ఓం లీలామానుషవిగ్రహాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం విరూడ్రూపాయ నమః
ఓం భూతభవ్యభవత్ర్పభవే నమః
ఓం శ్రీ క్షీరాబ్ధిశయననాయ నమః
ఇతి శ్రీ క్షీరాబ్ధి శయన నారాయణ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం





భాగవత గ్రంథ మహిమ

   శ్రీ కృష్ణ ఆరాధన భాగవత గ్రంథ మహిమ




సంతాన సమస్యలు:

పుట్టిన సంతానం ప్రయోజకులు అవ్వాలన్నా అటువంటి దంపతులు యశోద తో కలిసి ఉన్న బాలకృష్ణుడి చిత్రపటం తెచ్చుకొని శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ జనన అధ్యాయాన్ని 41 రోజులు పారాయణం చేయాలి
స్వామివారికి పాలు పెరుగు వెన్న మధుర పదార్థాలు ఏవైనా నైవేద్యంగా పెట్టవచ్చు మంత్రోచ్ఛారణ వచ్చినవాళ్లు సంతాన వేణుగోపాల స్వామి మంత్రం దీనితోపాటుగా చదివిన మంచిది మంత్రోచ్ఛారణ చేయడం సాధ్యం కాని వ్యక్తులు శ్రీకృష్ణ జనన ఘట్టం పారాయణం చేస్తే సరిపోతుంది

సర్పదోషాలు కాలసర్ప దోషాలు రాహుకేతు ప్రతికూల ప్రభావాలు :

జాతకంలో సర్ప దోషం వల్ల అభివృద్ధి లేని వ్యక్తులు ఆటంకాలు చిక్కులు ఏర్పడుతున్న వ్యక్తులు అలాగే వివిధ విష రోగాలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు రాహు కేతు గ్రహాల ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు శ్రీమద్భాగవతం దశమ స్కంధం లో ఉన్నటువంటి కాళియమర్థన ఘట్టం స్వామి వారు కాళీయమర్దనం చేసినటువంటి చిత్రపటం పూజ గదిలో ఉంచి నలభై ఒక్క రోజులు ఈ అధ్యాయాన్ని పారాయణం చేయాలి మీకు నచ్చిన నైవేద్యం ఏదైనా పెట్టవచ్చు
అవకాశం ఉన్నవారు స్వామి వారు కాళీయమర్దనం చేసినటువంటి రూపు రాగి లో కానీ వెండిలో కానీ ధరించవచ్చు

వివాహ సమస్యలు రుక్మిణీ కల్యాణం

వివాహం కోసం వివాహ అనంతరం అన్యోన్య దాంపత్యం కోసం
శ్రీమద్భాగవతంలో దశమస్కంధం లో ఉన్నటువంటి రుక్మిణీకల్యాణం రుక్మిణీ సమేత కృష్ణపరమాత్మ  కలిసి ఉన్న చిత్రపటం పూజలో ఉంచి అవకాశం ఉన్నన్ని రోజులు పారాయణం చేయాలి అవకాశం ఉంటే దగ్గరలో విఠలేశ్వర ఆలయాలు కానీ శ్రీకృష్ణ ఆలయాలు కానీ లేదా వైష్ణవాలయాలు ఏవైనా సరే అంటే అక్కడికి వెళ్లి అక్కడి బ్రాహ్మణోత్తముడు చేత ఒకమారు పారాయణం చేసుకొని రావాలి ఇది అద్భుతమైనటువంటి పరిహారం కల్యాణ దోషాలను పోగొట్టిఎందుకు చెప్పబడినటువంటి అధ్యాయం ఇది . మూడు పదుల వయసు దాటిన వారికి కూడా వివాహం జరిగింది కాబట్టి నమ్మకంతో ఒకసారి రుక్మిణీకల్యాణం పారాయణం చేయించుకోండి లేదా చేయండి

అన్ని సమస్యలకు ఒక్కటే పరిష్కారం
గజేంద్రమోక్ష పారాయణం

శ్రీమద్భాగవతం అష్టమ స్కంధంలో ఉన్నటువంటి అద్భుత పరిష్కార మార్గం .
ముసలి బారిన పడిన గజేంద్రుడు శ్రీహరి మేము తప్ప ఇంకెవరు నీవే నా గతి దీన హృదయంతో శ్రీహరిని ప్రార్ధించగా శ్రీహరి ఆగమేఘాల మీద శంకచక్రధర లను సైతం ధరించకుండా లక్ష్మికి కూడా చెప్పకుండా భక్తితో పిలిచిన వారే ప్రార్థనలను స్వీకరించే ప్రభువై గజేంద్రుడి ప్రాణాలను రక్షించాడు కాబట్టి మిత్రులారా ఎటువంటి సమస్య అయినా సరే శ్రీ మహావిష్ణువు గజేంద్రుడి ప్రాణాలను రక్షించిన అటువంటి చిత్రపటం సంపాదించి పూజా గదిలో ఉంచి 41 దినములు నిష్టతో భక్తితో శ్రద్ధగా పారాయణం చేయాలి స్వామివారికి కలసి నివేదన చేయాలి మీకు అవకాశం ఉన్న నైవేద్యం పెట్టండి నిత్యం గజేంద్రమోక్ష పారాయణం చేసే వారికి ఎటువంటి సమస్యలు ఉండవు ఇది సత్యం

అన్ని రకాల ఆర్థిక సమస్యలకు పరిష్కారం కుచేలోపాఖ్యానము

పేదరికంతో ఇబ్బంది పడుతున్నరు ఇచ్చిన డబ్బు తిరిగి రాక పోయినా రుణాలు ఎక్కువగా ఉన్నా సంపాదన నిలువక పోయినా ధన పరమైనటువంటి ఎటువంటి సమస్య ఉన్నా సరే

శ్రీమద్భాగవత గ్రంథంలో దశమ స్కంధంలో చెప్పబడిన శ్రీకృష్ణ పరమాత్మ బాల్య మిత్రుడు కుచేలుడు కటిక పేదరికం తో ఇబ్బంది పడుతున్న సమయంలో అతని భార్య సూచనమేరకు తన బాల్య మిత్రుడు అయిన శ్రీ కృష్ణ పరమాత్మను కుచేలుడు దర్శించి ఒక పిడికెడు అటుకులు స్వామివారికి సమర్పించిన మాత్రం చేతనే ఇహ పర లోకాలను మించిపోయేటువంటి ధనాన్ని కేవలం తాను అటుకులు తిన్న పుణ్యం చేత స్వామివారు అనుగ్రహించారు అంతటి కరుణామయుడు శ్రీకృష్ణపరమాత్మ కాబట్టి కుచేల శ్రీకృష్ణ ఘట్టం ను శ్రీ కృష్ణ పరమాత్మ కుచేలుడి కి సాదరంగా ఆహ్వానించి ఆయన పాద ప్రక్షాళన చేస్తున్న చిత్రపటమును సంపాదించి పూజా గదిలో ఉంచి 41 దినములు ఈ కుచేలోపాఖ్యానము పారాయణం చేయాలి ఇలా చేస్తే తప్పక ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది

అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే శ్రీమద్భాగవతం పారాయణం చేయాలి శ్రీ మద్భాగవతం పారాయణం చేసే వారికి ఎటువంటి కష్టాలు ఇబ్బందులు రావు గ్రహదోషాలు కూడా ఉండవు మహిమాన్వితమైనది అద్భుతమైనది ఈ గ్రంథం వ్యాస పునీతమైనది శ్రీమద్భాగవతం ప్రతి ఇంట శ్రీ మద్భాగవత గ్రంథం ఉండాలి కనీసం ఈ గ్రంథానికి పూజ చేసిన  పాపాలు తొలగిపోయి పుణ్యం వస్తుంది

శ్రీమద్భాగవతం పారాయణం చేయడం వీలు కాని వ్యక్తులు ఏకశ్లోకి భాగవత శ్లోకం కనీసం రోజుకు ఒక్కసారైనా పారాయణం చేయాలి
(సేకరణ)

Saturday, 16 July 2022

హరేకృష్ణ మహామంత్రం /విశిష్టత


          హరేకృష్ణ మహామంత్రం /విశిష్టత

           


             ‘బ్రహ్మాండ పురాణం’ ప్రకారం 

                  హరేకృష్ణ మహామంత్రం 

యొక్క శక్తి అపరిమితమైనదిగా వివరించబడింది.


మహామంత్రం…

"హరేకృష్ణ హరేకృష్ణ

కృష్ణకృష్ణ హరేహరే

హరేరామ హరేరామ

రామరామ హరేహరే ”


కేవలం ఒకసారి "రామ" నామాన్ని జపిస్తే 1000 సార్లు "విష్ణు" నామాన్ని జపించినప్పుడు వచ్చే ఫలితం వస్తుంది.


ఒకసారి "కృష్ణ" నామాన్ని జపిస్తే 3 సార్లు "రామ" నామాన్ని జపించినప్పుడు కలిగే ఫలితం వస్తుంది. 


"హరేకృష్ణ" మహామంత్రంలో నాలుగు సార్లు "కృష్ణ" నామం మరియు నాలుగు సార్లు "రామ" నామం ఉన్నాయి.


అంటే "హరేకృష్ణ" మహామంత్రంలో నాలుగు సార్లు "కృష్ణ" నామాన్ని జపిస్తాము , అందువల్ల 12 సార్లు "రామ" నామాన్ని జపించిన ఫలితం వస్తుంది.


ఆ విధంగా మహామంత్రంలో 4 "కృష్ణ" నామాలు (అంటే 16 "రామ" నామాలతో సమానం) మరియు మరో 4 "రామ" నామాలు ఉన్నాయి.అంటే మొత్తం కలిసి 16  "రామ" నామాలు ఉన్నట్లు.


1"రామ" నామం =1000 "విష్ణు" నామాలు


16 "రామ" నామాలు =16000 "విష్ణు" నామాలు.


ఒక్క మహామంత్రంలో 16 "రామ" నామాలు = 16000 "విష్ణు" నామాలు ఉన్నట్లు.


అంటే ఒక్కసారి "హరేకృష్ణ" మహామంత్రం జపము చేసినట్లయితే 16,000 సార్లు "విష్ణు" నామాలు జపించడంతో సమానం అవుతుంది.


ఒక మాల జపము అనగా 108 సార్లు జపించడం.


ఒక మాల "హరేకృష్ణ" మహామంత్రం జపము చేసినట్లయితే 108×16000=17,28,000 సార్లు విష్ణు నామాలు జపించడంతో సమానం అవుతుంది.


16 మాలలు ‌ హరేకృష్ణ మహామంత్రం జపము చేసినట్లయితే 2,76,48,000 సార్లు "విష్ణు" నామాలు జపించడంతో సమానం అవుతుంది.

మహామంత్రం

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే హరేరామ హరేరామ రామరామ హరేహరే

సేకరణ 


Tuesday, 12 July 2022

తెలుగు భాషలోని వాగ్దేవతలు వారి అద్భుత శక్తులు

 తెలుగు భాషలోని వాగ్దేవతలు

      వారి అద్భుత శక్తులు

తెలుగు భాషలో
      వాగ్దేవతల యొక్క వర్ణమాల
      దాని అంతర్నిర్మాణం

"అ నుండి అః" వరకు ఉన్న
16 అక్షరాల విభాగాన్ని
"చంద్ర ఖండం" అంటారు.
ఈ చంద్రఖండంలోని
అచ్చులైన 16 వర్ణాలకు
అధిదేవత "వశిని"
అంటే వశపరచుకొనే శక్తి కలది.

"క"  నుండి  "భ" వరకు
ఉన్న 24 అక్షరాల విభాగాన్ని
" సౌర ఖండం " అంటారు.

"మ" నుండి "క్ష" వరకు
ఉన్న 10 వర్ణాల విభాగాన్ని
" అగ్ని ఖండం" అంటారు. 

ఈ బీజ శబ్దాలన్నీ
జన్యు నిర్మాణాన్ని
క్రోమౌజోములను
ప్రభావితం చేయగలుగుతాయి.

సౌర ఖండంలోని
" క "నుండి "ఙ" వరకు  గల
ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి.
అంటే కోర్కెలను
మేలుకొలిపేది అని అర్ధం.

"చ" నుండి "ఞ" వరకు గల
ఐదు వర్ణాలకు అధిదేవత  "మోదిని" 
అంటే సంతోషాన్ని
వ్యక్తం చేసేది.

"ట" నుండి "ణ" వరకు
గల ఐదు అక్షరాల 
అధిదేవతా శక్తి "విమల".
అంటే మలినాలను
తొలగించే దేవత.

"త" నుండి "న" వరకు గల
ఐదు అక్షరాలకు అధిదేవత "అరుణ" 
కరుణను మేలుకొలిపేదే అరుణ.

"ప" నుండి "మ" అనే
ఐదు అక్షరాలకు అధిదేవత "జయని".
జయమును కలుగ చేయునది.

అలాగే అగ్ని ఖండంలోని
"య, ర,ల, వ అనే
అక్షరాలకు అధిష్టాన దేవత
" సర్వేశ్వరి".
శాశించే శక్తి కలది సర్వేశ్వరి.

ఆఖరులోని ఐదు అక్షరాలైన
"శ, ష, స, హ, క్ష లకు
అధిదేవత "కౌలిని"

ఈ అధిదేవతలనందరినీ
"వాగ్దేవతలు" అంటారు.
అయితే ఈ ఏడుగురే కాకుండా
అన్ని వర్ణాలకు
ప్రకృతిలో ఒక రూపం,
ఒక దేవతాశక్తి ఉంది.
ఎందుకంటే
శబ్దం బ్రహ్మ నుండి
ఉద్భవించింది.
అంటే బ్రహ్మమే శబ్దము.
ఆ బ్రహ్మమే నాదము.

మనం నిత్యజీవితంలో
సంభాషించేటప్పుడు
వెలువడే శబ్దాలు
మనపై, ప్రకృతి పై
ప్రభావం చూపుతాయి.

అదే మంత్రాలు, వేదం అయితే
ఇంకా లోతుగా
ప్రభావం చూపుతుంది.
భూమి మీద పుట్టిన
ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్చరించి
అమ్మవార్లను అర్చిస్తున్నాయి.

కాబట్టి
మనం స్తోత్రం చదువుతున్నా,
వేద మంత్రాలు, సూక్తులు
వింటున్నా మనం
ఈ విషయం
స్ఫురణలో ఉంచుకుంటే
అద్భుతాలను చూడవచ్చు.

మనం చదివే స్తోత్రం
ఎక్కడో వున్న
దేవుడిని/దేవతను 
ఉద్దేశించి కాదు,
మనం చదివే స్తోత్రమే ఆ దేవత.
మనం చేసే శబ్దమే ఆ దేవత.
మన అంతఃచ్ఛేతనలో ఉండి
పలికిస్తున్న శక్తియే
మన ఉపాస్య దేవత.
ఆ శబ్దం వలన పుట్టిన
నాదం దేవత.
ఎంత అద్భుతం.
ఇది మన తెలుగు వైభవం.
ఇది సనాతన ధర్మం.
ఇది మనకు మాత్రమే
పరిమితమైన అపూర్వ సిద్ధాంతం.

సేకరణ 

Wednesday, 29 June 2022

సుందర హనుమాన్ మంత్రం 27నామాలు



సుందర హనుమాన్ మంత్రం 27నామాలు


లంకిణిని హనుమంతుడు దెబ్బకొట్టడం తర్వాత దేవతలు కుసుమవృష్టి కురిపించారు ఆంజనేయస్వామి వారిమీద. 
కుసుమ వృష్టి కురిపించగనే 
బ్రహ్మదేవుడు స్వయంగా దిగి 
వచ్చి హనుమంతుని స్తుతి చేసారు.

ఈ 32 నామాల వరుసని సుందర మంత్రము అంటారు. 

 32 నామాల శక్తి సుందరకాండలో వ్యాపించి ఉంది. . అందుకే సరిగ్గా లంకలో ప్రవేశించబోయే ముందు చేసిన స్తోత్రం .

సంహితా గ్రంథాలలో ఉంటుంది.

 ఎవరైతే ఈ నామాలు పఠిస్తారో వారికి అన్నిరకాల ఆధివ్యాధులు నశిస్తాయి. 


" హనుమానంజనా సూనుః
వాయుపుత్రో మహాబలః
కపీంద్రః
పింగళాక్షశ్చ
లంకా ద్వీప భయంకరః
ప్రభంజన సుతః
వీరః
సీతాశోక వినాశకః
అక్షహంతా రామ సఖః
రామకార్య దురంధరా
మహౌషధ గిరేర్హారీ
వానర ప్రాణదాయకః
వాగీశ తారకశ్చైవ
మైనాక గిరిభంజనః
నిరంజనో జితక్రోధః
కదళీవన సంవృతః
ఊర్ధ్వ రేతా మహాసత్వః
సర్వమంత్ర ప్రవర్తకః
మహాలింగ ప్రతిష్ఠాతా
బాష్పకృత్ జపతాం వరః
శివధ్యానపరో నిత్యం శివపూజా పరాయణః

ఇవి మొత్తం ఇరవై ఏడు నామాలు. 27 నామాలు కలుపుకుంటే దీనికి సుందరహనుమన్మంత్రము అని పేరు. 

Tuesday, 28 June 2022

ఆంజనేయుని నవ అవతారాలు

 ఆంజనేయుని నవ అవతారాలు 


బాలార్కయుత తేజసం
త్రిభువన ప్రక్షోభకం సుందరం
సుగ్రీవాది సమస్తవానర గణైః
సంసేవ్య పాదాంబుజమ్
నాదేనైవ సమస్త రాక్షసగణాన్
సంత్రాస యంతం ప్రభుం
శ్రీమద్రామ పదాంబుజ స్మృతిరతం
ధ్యాయామి వాతాత్మజమ్

"పదివేలమంది బాలసూర్యుల యొక్క కాంతిని కలిగినవాడు. ముల్లోకాలను సైతం కల్లోలపరచే శక్తిసామర్థ్యాలున్నవాడు. సుందరుడైన  సుగ్రీవాది వానరుల అందరిచేత పూజించబడే పాద పద్మాలు కలిగివాడు. తన నాదం చేత రాక్షసులని భయపెట్టేవాడు. తన ఇష్టదైవమైన  శ్రీరామపాదాలను నిరంతరం పూజించగల ఆసక్తి కలిగినవాడు. వాయుపుత్రుడు అయిన హనుమంతుని ధ్యానిస్తున్నాను." అని పై ప్రార్థనకు అర్థం.

హనుమంతుని స్మరించినంత మాత్రానికే బుద్ధి, బలం, తేజస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చైతన్యం కలుగుతాయని చెప్పబడుతోంది. సాక్షాత్తు ఆ పరమ శివుడే దుష్టశిక్షణకై, శిష్టరక్షణకై, రామకార్యసిద్దికై హనుమంతునిగా అవతరించాడు. రుద్రతేజస్స్వ రూపుడైన ఆంజనేయుడు సకలదేవతాత్మకుడు. అందుకే హనుమంతుని పూజిస్తే దేవతలందరినీ పూజించినట్లే! తన భక్తులను అనుగ్రహించేందుకు ఆంజనేయస్వామి నవ అవతారాలను ధరించాడు.

హనుమంతుని నవ అవతారాలు :-
1. ప్రసన్న హనుమదవతారం.
2. వీరాంజనేయావతారం.
3. విశంతిభుజాంజనేయావతారం.
4. పంచముఖాంజనేయావతారం.
5. అష్టాదశభుజాంజనేయావతారం.
6. సువర్చలా సహిత హనుమదావతారం.
7. చతుర్భుజాంజనేయావతారం.
8. ద్వాత్రింశద్భుజాంజనేయావతారం.
9. వానరాంజనేయావతారం.



Wednesday, 15 June 2022

నీరు పోసిన మొక్కలు

 నీరు పోసిన మొక్కలు



ఆరోజు విశ్వ ...షూటింగ్ స్పాట్ కి కొంచెం ఆలస్యంగా వచ్చాడు...
రాగానే డైరెక్టర్ దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాడు...
క్షమించండి సర్...కొంచెం ఆలస్యం అయింది... ఇంకెప్పుడు ఇలా జరగదు... అని అడిగాడు..
నీ దగ్గర ఇవాళ్టి స్క్రిప్ట్ ఉండిపోయింది... హీరోయిన్ చాలా బిజీ అని తెలుసుగా...
ఆవిడ ఎదురుచూస్తున్నారు..
వెళ్ళు ..ముందు డైలాగ్ పేపర్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించు.
నీ సంగతి నాకు తెలుసు కాబట్టి నేను ఏమి అనను...
ఆవిడ కోప్పడితే ఏమీ మాట్లాడకు...
కాస్త సంయమనం పాటించు...
అర్థం అయిందా అన్నాడు రమేష్....
సరే సర్ ...
థాంక్స్ సర్...
అని కృతజ్ఞతతో చూసి పేపర్ పట్టుకుని వెళ్ళాడు...
మిగతా వాళ్లు రెడీ అవ్వండి...
ఈ లోగా వేరే షాట్స్ కంప్లీట్ చేద్దాం...
అని కెమెరా మెన్ ని పిలిచాడు..
సర్ మిగతా షాట్స్ చేద్దాం...
ఈ లోగా ఆవిడ డైలాగ్ వెర్షన్ ప్రాక్టీసు అవుతుంది...
ఇంకా నయం హీరో తో కాంబినేషన్ లేదు ఈవేళ... లేకపోతే ...ముందు నా పని అయిపోయేది... అన్నాడు నవ్వుతూ రమేష్...
ఏమి పరవాలేదు సర్ ..
ఆవిడకి వేరే చోట షూటింగ్ ఉంది ట...
అందుకే కంగారు... అక్కడ పెద్ద హీరో గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి ట...
ఆ విడకూడా ఆలస్యం కి సమాధానం
చెప్పుకోవాలిగా..D.O.P., అన్నాడు
వివేక్...
విశ్వ పేపర్స్ పట్టుకుని కార్వాన్ దగ్గరికి వెళ్ళాడు...
నిత్యా మామ్ ...అంటూ డోర్ కొట్టాడు... అసిస్టెంట్ తలుపు తీసింది...
మేడం కోసం... డైలాగ్స్ పేపర్ ...అన్నాడు...
రా నిగురించే ఎదురు చూస్తున్నారు...
అంటూ తలుపు తీసింది...
లోపలికి రాగానే క్షమించండి మేడం... అనుకోకుండా ఈ రోజు ఆలస్యం అయింది.. అని క్షమాపణ అడిగాడు...
నీకు అసలు బుద్ధి లేదు...
నీ కోసం ఇంత మంది ఎదురు చూడాలా... అసలు నిన్ను పెట్టిన ఆ రమేష్ ని అనాలి... అవతల ...వేరే షూట్ ఉంది అని తెలుసు గా అని విరుచుకుపడ్డారు...
తల వంచి మౌనంగా విన్నాడు...
రెండు నిమిషాలు బైట కూర్చో... కోపం తగ్గాక పిలుస్తా...అంది...
సరే అండి అంటూ బైటకి వచ్చాడు...
ఇదిగొండి జ్యూస్ అంటూ ఇచ్చింది అసిస్టెంట్... అది తాగి చల్లబడింది...
రమ్మను.. మళ్ళీ ఆలస్యం అవుతుంది...
అంటూ ఆర్డర్ వేసింది నిత్యా...
రమ్మన్నారు అంటూ పిలిచింది అసిస్టెంట్...
గబ గబ లోపలికి వచ్చాడు...
ఇవాళ చిన్న డైలాగ్స్ అండి...5 సీన్స్... అంతే అరగంటలో అయిపోతాయి...
అంటూ షీట్స్ ఇచ్చి... ఫీల్ , డిక్షన్... ఎక్స్ప్లెయిన్ చేసాడు...
నువ్వు చెప్పే విధానము నాకు నచ్చుతుంది... బట్టి అక్కర్లేదు...
అర్థం అయిపోతుంది...
డైలాగ్స్ అలాగే గుర్తు ఉంటాయి... అంది...
ఇందాక కోపం లో ఏదో అనేసా....
అవతల పెద్దాయన తో ...వర్క్...
ఆయనని వైట్ చేయించే సాహసం ఇంకా ఇండస్ట్రీలో ఎవరికి లేదు..
ఆ కోపం లో తిట్టేసా....
పద నేను రెడీ. ..కొంచెం టచ్ అప్ చెయ్ సరిపోతుంది... అంది అసిస్టెంట్ తో...
వాన్ దిగి లొకేషన్ కి వచ్చింది...
అంతే అందరు పరుగులు....
షాట్ రెడి... అంటూ మొదలు పెట్టారు...
అర గంట లో మొత్తాన్ని షూట్ చేసేసారు..
చాలా బాగా వచ్చాయి... అన్ని సీన్స్...
కట్ చెప్పి... నిత్యా గారు...
చాలా బాగా వచ్చాయి ...
మీ అభినయం 100 శాతం బాగా వచ్చాయి... అభినందనలు... అన్నాడు రమేష్...
థాంక్స్... విశ్వ ని పిలు ఒకసారి అంది నిత్యా... వెళ్లి పిలుచుకుని వచ్చాడు...
ఒక అసిస్టెంట్...
పిలిచారుట ...
నీకు అసలు కోపం రాదా...
ఇందాక అన్ని తిడుతుంటే కనీసం ..
తల ఎత్తలేదు... అన్ని భరించావ్... అంది... అదేం లేదు అండి... నా వలనే ఆలస్యం కావడం ఒక కారణం అయితే...
రెండవది... మీకు కోపం వస్తే ...మూడ్ పాడవుతుంది...
ఆ కోపము లో అభినయం అంత బాగా రాదు... మీరు మంచి కళాకారిణి..
మీ నుంచి ప్రేక్షకులు బెస్ట్ కోరుకుంటారు...
నేను తల దించుకోవడం వలన...
మీ కోపం తగ్గి... ఇదిగో.. ఇలా మంచి మూడ్ లో ఉంటే ...బెస్ట్ ఇస్తారు...అందుకే... నేను ఏమి మాట్లాడలేక పోయా ..
.నిజానికి నేను కూడా మీకు బెస్ట్ ఫ్యాన్...
ని మేడం... అన్నాడు వినయం గా...
నీ సింపుల్ సిటీ నాకు నచ్చింది...
ఇదిగో తీసుకో అంటూ 10,000 చేతిలో పెట్టింది...
అయ్యో వద్దు మేడం...
మీరు మరోలా భవించవద్దు..
ఇప్పడు నాకు డబ్బు ఇవ్వొద్దు... అండి...
మీకు కోపం పోయింది అది చాలు అన్నాడు... విశ్వ....
ఇంతలో మేడం అక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి.. మనం బయలుదేరి వెళ్ళాలి... అంది అసిస్టెంట్..
సరే మనం తరువాత మాట్లాడదాం...
అంటూ రమేష్ నేను వెడుతున్నా అని వెళ్ళిపోయింది నిత్యా
..
హమ్మయ్య... ఇవాళ ఎంత గొడవ అవుతుందో అనుకున్నా ..కానీ అంతా సవ్యంగా నే జరిగింది... అన్నాడు రమేష్... ఒకే..pakup చెప్పేస్తానంటూ... చెప్పేసాడు... రమేష్...
ఆ సినిమా సూపర్ హిట్... అయింది..
నిత్యా పేరు పెద్ద రెమ్యూనరేషన్ లిస్ట్ లోకి వెళ్లి పోయింది... వరుసగా సినిమాలు ...బిజీ హీరోయిన్ అయిపోయింది...
ఒకరోజు ఒక స్టూడియో లో నిత్యా షూటింగ్ ...సాంగ్ జరుగుతోంది... అని తెలిసింది విశ్వ కి...ఆ పక్క ఫ్లోర్ లో రమేష్ మూవీ జరుగుతోంది...
రమేష్ గారు నేను నిత్య మేడం ని పలకరించి వస్తా ...ఇంకా బ్రేక్ టైం ఉంది గా అన్నాడు విశ్వ...
సరే వెళ్ళు ...
మళ్ళీ అక్కడినుంచి ఎక్కడికి వెళ్లకు...
నేను వెతుక్కోవాలి... అన్నాడు నవ్వుతూ... సర్...మీరు మరీనూ... అంటూ వెళ్ళాడు...
ఒక అసిస్టెంట్ కి అంత వాల్యూ ఇస్తారు ఏమిటీ సర్ అన్నాడు కొత్త ప్రొడ్యూసర్...
వాడు చాలా మంచి వాడు అండి.. నాదగ్గరే చాలా కాలం గా పని చేస్తున్నాడు... వాడు ఒక్కడు ఉంటే చాలు నేను ఇంక ఏమి చూసుకోవక్కరలేదు... మొత్తం తానే చూసుకుంటాడు... బైట ఆఫర్ లు వచ్చినా ...నన్ను వదిలి పోలేదు...చాలా టాలెంటెడ్... అన్నాడు రమేష్.
***
అక్కడ డాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది...
విశ్వ వెళ్ళాడు...
ఇంకో అసిస్టెంట్ చూసాడు..
రా విశ్వ అన్నా... ఇలా వచ్చారు... మీరు ఈ ప్రాజెక్ట్ లో ఉన్నారా అని అడిగాడు...
లేదు నిత్యా మామ్ కోసం వచ్చా...
కలవచ్చా అన్నాడు...
సాంగ్ అవుతోంది...
మాస్టర్ ని అడగాలి...
నేను వెళ్లి అడిగి వస్తా... అని వెళ్ళాడు...
కొంచెం బ్రేక్ అవగానే...
నిత్యా దగ్గరకి వెళ్ళాడు...
మామ్ మిమ్మలిని కలవాలి ట విశ్వా వచ్చాడు... అన్నాడు...
ఒక్క నిమిషం వైట్ చేయమని చెప్పు...
ఈ స్టెప్ అవగానే కలుస్తా...
అని మళ్ళీ డాన్స్ లోకి వెళ్ళిపోయింది...
బ్రేక్ ఇచ్చాడు మాస్టర్...
మేడం ఇంకొక్క చరణం ఉంది...
వెంటనే అయిపోతుంది... అన్నాడు మాస్టర్... ఒక్క నిమిషం ..తనతో మాట్లాడి వస్తా... అంటూ విశ్వా దగ్గరకి వచ్చింది...
ఎమ్ విశ్వ ఎలా ఉన్నావ్... అంటూ పలకరించింది... బాగున్నా అండి... మీ షూట్ ఉంది అని తెలిసి వచ్చా...
.ఆ కబుర్లు కెమిటి గాని ముందు విషయం చెప్పు అంది...
అదేం లేదు మేడం అన్నాడు...
కొంచెం తడబాటు గా...
మళ్ళీ వాళ్ళు పిలుస్తారు..తొందరగా చెప్పు అంది...
అది కొంచెం డబ్బు కావాలి... అన్నాడు నెమ్మది గా...
ఇచ్చి నప్పుడు తీసుకోవు...
ఇప్పడు వచ్చి అడుగుతున్నా వు... అంది... నిత్యా...
నిజానికి కొంచెం అర్జెంట్ అండి... తప్పలేదు...ఇది వరకు మీరు ఆఫర్ ఇచ్చారని నమ్మకంతో వచ్చా... అన్నాడు...
సరేలే ఎంత కావాలి అని అడిగింది నిత్యా...
అది అది అన్నాడు...
మొహమాటం గా పరవాలేదు లే చెప్పు ఎంత కావాలి అంది.. నిత్యా..
మీరు ఎంత ఇవ్వాలి అనుకుంటే అంత ఇవ్వండి... అన్నాడు సిగ్గు గా...
నీ సిగ్గు బంగారం కాను... చెప్పు... నీ మీద నాకు సదాభిప్రాయం ఉందిలే... అంది... నిత్యా...
50 వేలు అండి ...కానీ మీరు ఎంత ఇచ్చిన పరవాలేదు.. అన్నాడు...
మేడం షాట్ రెడీ ...మాస్టర్ పిలుస్తున్నారు... అని వచ్చాడు అసిస్టెంట్...
పద  వస్తున్నా... అంది నిత్య...
నేను మళ్ళీ కలుస్తా అండి ...అన్నాడు వినయం గా
ఒక్క నిమిషం ఉండు... అంటూ తన pa నిపిలిచింది... ఇతనికి ఒక లక్ష రూపాయలు ఇవ్వు... అంది.. అంత ఎందుకు అండి ...అన్నాడు...
ఏదో కారణం లేకుండా అడగవు గా...తీసుకో నేను వెళ్ళాలి... మళ్ళీ కలుద్దాం అంది...
మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు... నమస్తే మేడం అన్నాడు...
సరే ఫోన్ చెయ్... అంటూ వెళ్ళిపోయింది... నిత్యా...
ఒకరోజు కలెక్టర్ కార్యాలయం నుండి ఫోన్ వచ్చింది...
నిత్యా ఆఫీస్ కి ..
pa తీసాడు...
మేము కలెక్టర్ కార్యాలయం నుండి మాట్లాడుతూ ఉన్నాం...
సాంస్కృతిక సంస్థలు కార్యక్రమాలు జరుగుతున్నాయి ...
అందులో భాగం గా ...కళాకారులకు మరియు ఆ సంవత్సరం 10 వ తరగతి ...విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చిన కొంతమంది కి అభినందన ..ఉన్నాయి..
నిత్యా గారిని ప్రత్యేక అతిధి గా ఆహ్వానం పంపుతున్నాం...
ఆవిడ డేట్స్ కొంచెం ఆరోజుకి ...ఫంక్షన్ కి వచ్చేలా చేయమని కలెక్టర్ గారు చెప్పారు... అన్నాడు...
ఒకే సర్ ఆరోజు మేడం కి పనులు అవి నేను adjust చేసుకుంటా...
మీరు ఆహ్వాన పత్రిక లో పేరు వేసేయండి... అన్నాడు... థాంక్స్ అని ఫోన్ పెట్టేసాడు...
అంతలో కిందికి వచ్చింది...
మేడం కలెక్టర్ కార్యాలయం నుండి ఫోన్ వచ్చింది... ఆరోజు ఫంక్షన్ కి మీరు గెస్ట్ గా రావాలి అని.. డేట్స్ adjust చేశా...మనకి ఆ రెండు రోజులు షూటింగ్ లేదు... ఆహ్వానం పత్రిక మీద మీ పేరు కూడా వేస్తున్నారు... అన్నాడు...
ఇప్పడు మనం ఏమి చేశామని గెస్ట్ గా పిలుస్తున్నారు... అంది... నవ్వుతూ...
ఈ మధ్య ప్రతి ఫంక్షన్ కి సినిమా సెలైబ్రెటీ లని పిలవడం అలవాటు అయింది... కదా అలాగే ఏమో అండి... ఈ సారి కలెక్టర్ గారు చెప్పామన్నారు అన్నాడు ...అందుకే ఒకే చేశా అన్నాడు...
సరే ఆరోజు ఏర్పాటు చూడు... అంది... నిత్యా...
ఆరోజు ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు... ఫ్లెక్స్ లు దండలు ...లైటింగ్ తో చాలా గొప్పగా ఉంది... వరుసగా కార్స్ వస్తున్నాయి... అతిథుల్ని దింపేసి.. వాలెట్ పార్కింగ్ వైపు వేడుతున్నాయి... ముందు కలెక్టర్ కాన్ వోయ్ వచ్చింది... వెనుకే నిత్యా కార్... వచ్చింది.. అందరూ నినాదాలు చేస్తున్నారు... ఆమె అందరికి అభివాదం చేస్తోంది... రండి అంటూ పూల గుచ్చాల తో అందరికి ఆహ్వానం పలికారు... సభ మొదలైన ది...
అందరూ ఆశీనులు అయ్యారు... ఒక్కొక్కరు మాట్లాడుతూ సాంస్కృతిక సంస్థలు, కార్యక్రమాలు గురించి... వారు సాధించిన విజయాలు గురించి అభినందనలు తెలిపారు...అందరికీ సన్మానించారు... కలెక్టరు మాట్లాడుతూ... అందరికి ప్రభుత్వం అన్నీ రకాల సాహాయాలు చేస్తున్నా ఇంకా చాలామంది కి అవి అందట్లేదు... ఈ మధ్యనే నాకు తెలిసిన ఒక విషయం మీతో పంచుకుంటా... అంటూ ...ఆగి అటూ ఇటూ చూసారు... అక్కడే ఒక ములగా నిలబడి చూస్తున్నాడు ..విశ్వ
ఇలా రండి అన్నారు... ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు... విశ్వ మిమ్మల్నే  అని పిలిచారు... అప్పడు చూసాడు...
గబ గబా స్టేజి మీదకి వెళ్ళాడు...
నిత్యా కి నమస్తే పెట్టి సర్ పిలిచారు... అన్నాడు..
ఇలా నుంచో ...అని ఆయన ప్రక్కన నిలబెట్టుకుని... ఈ రోజు మీ గురించి అందరికి తెలియాలి... అన్నారు.. సర్ వద్దు సర్ ...ప్లీజ్ అన్నాడు... విశ్వ..
ఆశ్చర్యం గా చూస్తోంది నిత్య... విస్వ ఏమిటీ ఇక్కడ ఇలా అని...నువ్వు ఉండు... అని అతని చేతిని తన ఎడమ చేతితో పట్టుకుని ...ఇతను కనబడకుండా తాను చేయాల్సినది చేసేసి ..ఎలా వినమ్రంగా ఉన్నాడో చూసారా...ఇతను.. కష్టపడి ఒక అసిస్టెంట్ దర్శకుడు గా పనిచేస్తూ... కొంత డబ్బు ని అనాధ ఆశ్రమం లో కొంతమంది పిల్లలని దత్తత కి తీసుకుని ...వాళ్ళని చదివిస్తున్నాడు... నాకు ఈ మధ్య తెలిసింది... ప్రభుత్వం నుండి ఏమాత్రం సహాయం ఆశించకుండా... తన వంతు సాయం చేస్తూ ఆ పిల్లలు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు... తల్లి దండ్రులు లేని ఆ పిల్లల కోసం తాను ఇంత చేస్తున్నాడు.. ఈ రోజున వాళ్ళు అందరూ10/10 GPA తో ఉత్తీర్ణులై... పేరుకి అనాథ లే కానీ చదువుకు కాదు అని నిరూపించారు... ఈ 20 మంది ఒకే ఆశ్రమానికి చెందినవారు...ఆ పిల్లలని ఈ రోజు ప్రత్యేకంగా అభినందిస్తున్నా... అంతే కాదు.. అతనికి ఏ సహాయం కావాల్సి వచ్చినా నాకు డైరెక్ట్ గా వచ్చి కలవమని ఈ సభా ముఖం గా ప్రకటిస్తున్నా... అన్నారు...
మైక్ విశ్వ చేతికి ఇచ్చి మాట్లాడు అన్నారు...అభినందనీయం గా చూస్తోంది నిత్యా... అందరూ చప్పట్లు కొట్టారు... ఆగిన తరువాత... విశ్వ మొదలు పెట్టాడు...
అందరికి నమస్కారం... ఏదో నాకు తోచిన సాయం చేస్తూ... వస్తున్నా... ఇక్కడ మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి.. ఈ క్రెడిట్ మొత్తం నాదీ కాదు... అందుకు ముఖ్యమైన కారకులు వేరే ఉన్నారు... వారు ఇక్కడే ఈ వేదిక మీద ఉన్నారు.. ఈ సన్మానాలు నిజానికి వారికే చెందాలి అన్నాడు విశ్వ...
అందరూ ఆశ్చర్యం గా చూస్తున్నారు ఎవరా అని...
ఎవరు వారు పిలు ,
ఎవరికి కనబడకుండా సహాయం చేసే వారి గురించి మనకి తెలియాలి...
వారిని చూసి మరికొంతమంది ముందుకు రావాలి... అన్నారు కలెక్టర్...
వారు ఎవరో కాదు... నిత్యా మామ్... అన్నాడు... అంతటా తమకి ఇష్టమైన కళాకారిని... లో ఇంత మంచి గుణం... సాయం చేసే తత్వం... ఒక్కసారి గా బైట పడడం తో హాలు అంతా చప్పట్లు తో మారుమ్రోగింది...
ఆరోజు పరీక్ష ఫీజు కట్టడానికి రెండు రోజులు గడువు మాత్రమే ఉంది..నా దగ్గర ఉన్న మనీ సరిపోలేదు... ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి లో... ఉండగా.. మామ్ నాకు ఒకసారి 10000 టిప్ ఇచ్చారు... కానీ అది అప్పుడు తీసుకోలేదు... ఆ పక్క ఫ్లోర్ లో ఆవిడ షూటింగ్ జరుగుతోంది అని తెలిసి వెళ్ళా... ఆవిడని కొంత డబ్బు కావాలి అని అడిగా... ఎందుకు ఏమిటీ అని అడగలేదు... నేను 50 వేలు అడిగి తే ఒక లక్ష ఇచ్చారు... ఆ తరువాత ఆవిడ బిజీ గా ఉండి , కనీసం ఏం చేశావ్ అని కూడా అడగలేదు...నీమీద నమ్మకం ఉంది ఏదో మంచి పనికోసం అడిగి ఉంటావు... తీసుకో మళ్ళీ కలుద్దాం అని వెళ్లిపోయారు... ఆ డబ్బు తో వీళ్ళ ఫిజులు ఇంకా కొన్ని అవసరాలు తీర్చి... సదుపాయాలు కల్పించా...

మేడం ఆరోజు మీరు నీరు పోసిన మొక్కలే ...ఈరోజు పెద్దవై విజయాల పూవులు పూశాయి... ఉత్తమ విద్యార్థులు గా తమని తాము నిరూపించుకున్నారు....

పిల్లలు మేడం కి కృతజ్ఞతలు చెప్పండి అన్నాడు విశ్వ....
అందరూ..ఆమెకి నమస్కారం చేసి చాలా థాంక్స్ మేడం మీరు చేసిన ఈ సాయం మేము ఎప్పటికి మరిచిపోము అంటూ సెల్యూట్ చేశారు...
సర్ మీకు అభ్యంతరం లేకపోతే వాళ్లకి సన్మాన పత్రాలు , షీల్డ్స్ నిత్య గారి చేతులు మీదుగా అందజేయాలని కోరుతూన్నా.. అన్నాడు విశ్వ.
తప్పకుండా ఇది ఆవిడ చేతుల మీదుగా జరగాల్సిన విషయం అంటూ నవ్వుతూ... రండి నిత్యా గారు... ఇన్నాళ్లు మీరు హీరోయిన్ గానే తెలుసు.. ఈ రోజు ఇంకా ఎత్తు కి ఎదిగి పోయారు...మీకు నా ప్రత్యేక అభినందనలు... అన్నారు కలెక్టర్...
తనకు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు... రండి నిత్యా గారు... అంటూ సాదరంగా ఆహ్వానించారు... కర తాళ ధ్వనులు మధ్య ఆమెకి శాలువా కప్పి ,పూల గుచ్చాన్ని ఇచ్చి సత్కరించారు
ఆమెచే పిల్లలకి అవార్డ్స్ ఇప్పించారు... తరువాత ఆమెకి మైక్ ఇచ్చారు... రెండు మాటలు మాట్లాడమ ని...
కళ్ళ లో ఆనంద బాష్పాలు తో...అందరికి నమస్కారం... చాలా సంతోషం గా ఉంది.. అసలు ఈ సన్మానం విశ్వ కి చెందాలి... అతని కృషి వలనే ఇది సాధ్యమైంది... నేను ఆర్థిక సాయం చేశా అంతే... తన పని తాను చేసుకుంటూ.. సమాజ శ్రేయస్సు కూడా తమ బాధ్యత ఆని భావించే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి... అందుకే నేను మళ్ళీ5 లక్షల రూపాయలు అదే ఆశ్రమానికి విరాళం గా ఇస్తున్నా... దీని ద్వారా మరింత మంది విద్యార్థులు కి లబ్ది.. సహాయం అందుతుంది ని భావిస్తున్నా... అంది...
మళ్ళీ మొత్తం చప్పట్లు తో మారు మ్రోగింది... తరువాత ...విశ్వ కి కూడా శాలువా కప్పి సత్కరించారు.... విచ్చేసిన పెద్దల కి కలెక్టరేట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు....
అందరికి నమస్కారం తెలిపి నిత్యా తన కార్ లో వెళ్ళిపోయింది...

మనం ఎలాగూ అంత పని చేయలేము... కొన్ని ఉద్యోగ కారణాల వలన సమయం కేటాయింపు చేయలేము... చేసే వాళ్లకి కొంత చేయూత నిస్తే మనకి కూడా కొంత ...సంతృప్తి ఉంటుంది అని భావిస్తున్నా...

ఇట్లు రచయిత

కథ ..కధనం ..పాత్రలు... అన్ని కల్పితం.
రచయిత...
నచ్చితే దయచేసి
షేర్ చెయ్యండి..స్టికర్ ఇవ్వండి...


Saturday, 11 June 2022

నాన్నకు ప్రేమతో

 నాన్నకు ప్రేమతో ....కధ



నాన్నా నాకు ఇంకా పై చదువులు చదవాలని ఉంది అంది శైలు...
ఇంజినీరింగ్ అయిందిగా... ఇంకానా అన్నాడు రమేష్...
నాకు M.B.A., చేయాలని ఉంది..తరువాత బిసినెస్ చేస్తా...అంది...శైలు
మరి పెళ్లి ...సంగతి ఏమిటి...ఇంకా ఆలస్యం అయితే ..అందరూ ఏమనుకుంటారు...అని అడిగాడు రమేష్.
అందరూ ఏమనుకుంటున్నారో...అని అలోచిస్తే
నా గోల్ ఎలా రీచ్ అవుతా...
ముందు జీవితంలో
ఏదైనా సాధించాలి...
పెళ్లి చేసుకుంటే ఒక్కోసారివీలు పడవచ్చు , పడకపోవచ్చు..
పెళ్లి అనేది ఒక బాధ్యత...
అది నెత్తిమీద ఉంటే ...
మనం అనుకున్నది సాధిచాలంటే చాలా కష్టంపడాలి ..కదా నాన్నా...
నీ సంగతే చూడు...
నీకు బోల్డ్ అంబిషన్ ఉండేది...కుటుంబపరిస్థితులు వలన వెంటనే
ఉద్యోగం లో చేరడం ,  వెంటనే పెళ్లి...
మేము పుట్టడం...
ఇలా ఒకదానిమీద ఒకటి బాధ్యతలు పెరిగిపోయాయి...రిస్క్ చేసే అవకాశం దేర్యం లేకుండా పోయాయి...కదా
ఆ ఆశలు అలాగే చంపుకుని మమ్మలిని కష్టపడి
పెంచావు..చదివించావు...ఈ స్థాయిలో ఉంచావు...ఇంకాస్త కష్టపడితే ...
నీ ఆశ నేను నెరవేర్చే అవకాశం వస్తుంది...
నీ ఆశలని నీ కూతురిగా నెను సాధిస్తా...
నీ కూతురిగా అది నా బాధ్యత...కూడా...అంది శైలజ...
నిన్ను చూస్తుంటే  నాకు గర్వంగా ఉంది..
సరే తల్లీ నీకు నచ్చినట్లు చెయ్...
ఈ రోజే అప్లైచెయ్..
చదవాలి అనుకున్నది చదువు...
ఎదగాల్సిన ఎత్తుకు ఎదుగు.. నీకు నే ఉన్నా...

" నీ రెక్కల బలం తెలుసుకుని ఎగరగలిగిన ఎత్తుకి ఎదుగు...
అలిసిపోతే నువ్వు వాలడానికి చెట్టులా  ఎప్పుడూ  నేను ఉంటా..."

అన్నాడు రమేష్....

థాంక్స్ నాన్నా అంటూ లాప్టాప్ దగ్గరికి పరిగెత్తింది...
ఆనందం తో గర్వంతో తన కూతురివైపు చూసాడు..." ఈ కాలంలో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా తగిన ప్రోత్సాహం ఇస్తే...ఏదైనా సాధించగలరు అన్న నమ్మకంతో.." .....

(కల్పిత కధ...కథ కధనం పాత్రలు...కల్పించి రాసినవి..)
రచయిత...ఆచంట గోపాలకృష్ణ
ఆచంట కథలు


Sunday, 15 May 2022

మన దేశం లో విశిష్ట దేవాలయలు

 మన  దేశం లో విశిష్ట దేవాలయలు


సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయo
హాసంబా దేవాలయం
హాసన్ కర్ణాటక.
సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.

నీటితో దీపం వెలిగించే దేవాలయం
మధ్యప్రదేశ్

ఘడియ ఘాట్ మాతాజీ మందిర్,   అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇకనుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.

స్వామివారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయం

1.  కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
2. బృందావనం రాధాకృష్ణ శయన మందిరం.

12 ఏళ్లకు ఒకసారి
పిడుగుపడే తిరిగి అతుక్కునేదేవాలయం

బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.

సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు

1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం,  కడప జిల్లా
7. బ్రమరాంబికా సమేత సిద్దేశ్వర ఆలయం చెన్నారావుపేట.

నిరంతరం జలము ప్రవహించే  దేవాలయాలు
1. మహానంది
2. జంబుకేశ్వర్
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
8. సిద్ధగంగా


నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు

1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్. 
3. మంజునాథ్.

శ్వాస తీసుకునే దేవాలయం
శ్రీ కాళహస్తీశ్వర్

సముద్రమే వెనక్కివెళ్లే దేవాలయం

1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్.

2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.

స్త్రీవలె నెలసరి అయ్యే

1. అస్సాం కామాఖ్యా అమ్మవారు, 

2. కేరళ దుర్గామాత.

రంగులు మారే ఆలయం

1. ఉత్తరాయణం,  దక్షిణాయనంలో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.

2. పౌర్ణమికి తెల్లగా,  అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.
పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.

నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు

1. కాణిపాకం, 
2. యాగంటి బసవన్న, 
3. కాశీ తిలభండేశ్వర్, 
4. బెంగుళూరు బసవేశ్వర్
5. బిక్కవోలు లక్ష్మీగణపతి

స్వయంభువుగా
సంవత్సరానికి ఒకసారి వెలిసే  దేవాలయం

అమర్నాధ్.

ఆరునెలలకు ఒకసారి తెరిచే

1. బదరీనాథ్, 

2. కేదారనాథ్ ( ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)

3. గుహ్యకాళీమందిరం.

ఒంటి స్తంభంతో
యుగాంతానికి గుర్తుగా ఉండే
పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.

రూపాలు మారే
ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.

మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు

1. హేమాచల నరసింహ స్వామి.

2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి

మనిషి వలె గుటకలు
వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.

అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.

ఛాయా విశేషం

1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.

2. హంపి విరూపాక్షేశ్వర్,  గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.

3. బృహదీశ్వరాలయం

నీటిలో తేలే విష్ణువు (టన్నుల బరువుంటుంది ),  నేపాల్

ఇంకా...
తిరుమల వెంకటేశ్వరస్వామి, అనంత పద్మనాభస్వామి, రామేశ్వరం , కంచి,
చిలుకూరి బాలాజీ,  పండరినాథ్, భద్రాచలం,  అన్నవరం .

పూరీ

పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడపడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమఘుమలాడే  పూరి ప్రసాదం.
సేకరణ: 

Thursday, 10 March 2022

శ్రీ ఆంజనేయ స్వామి ద్వాదశాక్షరీ మహామంత్రం

 శ్రీ ఆంజనేయ స్వామి ద్వాదశాక్షరీ మహామంత్రం


  "  ఓం హరిమర్కట మర్కటాయ నమః "


విజయ మంత్రం : కార్య సిద్ధి మంత్రం
త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరి సత్తమ | హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ ||





హనుమ/ "ఆరోగ్య రక్ష "శ్లోకం

 


తీవ్ర అనారోగ్యము' లేదా ఎముకలు విరిగినప్పుడు మరియు 
ప్రమాదాలు కలగకుండా ఉండుటకు, 
వాల్మీకి రామాయణం లోని 
ఈ శ్లోకం చదవాలని శాస్త్రం.


సర్వథా క్రియతాం యత్న స్సీతామధిగమిష్యథ
పక్షలాభో మమాయం వస్సిద్ధిప్రత్యయకారకః."

బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు

Wednesday, 9 March 2022

స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదము లు

 స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదము లు

1. అంగన

2. అంచయాన

3. అంబుజాలోచన

4. అంబుజవదన

5. అంబుజాక్షి

6. అంబుజనయన

7. అంబురుహాక్షి

8. అక్క

9. అతివ

10. అన్ను

11. అన్నువ

12. అన్నువు

13. అబల

14. అబ్జనయన

15. అబ్జముఖి

16. అలరుబోడి

17. అలివేణి

18. అవ్వ

19. ఆటది

20. ఆడది

21. ఆడగూతూరు

22. ఆడుబుట్టువు

23. ఇంచుబోడి

24. ఇంతి

25. ఇదీవరాక్షి

26. ఇందునిభాష్య

27. ఇందుముఖి

28. ఇందువదన

29. ఇగురాకుబోణి

30. ఇగురాకుబోడి

31. ఇభయాన

32. ఉగ్మలి

33. ఉజ్జ్వలాంగి

34. ఉవిధ

35. ఎలతీగబోడి

36. ఎలనాగ

37. ఏతుల

38. కంజముఖి

39. కంబుకంఠ

40. కంబుగ్రీవ

41. కనకాంగి

42. కన్నులకలికి

43. కప్పురగంధి

44. కమలాక్షి

45. కరబోరువు

46. కర్పూరగంది

47. కలకంఠి

48. కలశస్తిని

49. కలికి

50. కలువకంటి

51. కళింగ

52. కాంత

53. కించిద్విలగ్న

54. కిన్నెరకంఠి

55. కురంగానయన

56. కురంగాక్షి

57. కువలయాక్షి

58. కూచి

59. కృషమధ్యమ

60. కేశిని

61. కొమ

62. కొమరాలు

63. కొమిరె

64. కొమ్మ

65. కోమ

66. కోమలాంగి

67. కొమలి

68. క్రాలుగంటి

69. గజయాన

70. గరిత

71. గర్త

72. గుబ్బలాడి

73. గుబ్బెత

74. గుమ్మ

75. గోతి

76. గోల

77. చంచరీకచికుర

78. చంచలాక్షి

79. చంద్రముఖి

80. చంద్రవదన

81. చక్కనమ్మ

82. చక్కెరబొమ్మ

83. చక్కెర

84. ముద్దుగుమ్మ

85. చాన

86. చామ

87. చారులోన

88. చిగురుంటాకుబోడి

89. చిగురుబోడి

90. చిలుకలకొలోకి

91. చెలి

92. చెలియ

93. చెలువ

94. చేడి(డియ)

95. చోఱుబుడత

96. జక్కవచంటి

97. జని

98. జలజనేత్ర

99. జోటి

100. ఝషలోచన

101. తనుమధ్య

102. తన్వంగి

103. తన్వి

104. తమ్మికింటి

105. తరళలోచన

106. తరళేక్షణ

107. తరుణి

108. తలిరుబోడి

109. తలోదరి

110. తాటంకావతి

111. తాటంకిని

112. తామరకంటి

113. తామరసనేత్ర

114. తియ్యబోడి

115. తీగ(వ)బోడి

116. తెఱువ

117. తెలిగంటి

118. తొగవకంటి

119. తొయ్యలి

120. తోయజలోచన

121. తోయజాక్షి

122. తోయలి

123. దుండి

124. ధవలాక్షి

125. ననబోడి

126. నళినలోచన

127. నళినాక్షి

128. నవల(లా)

129. నాంచారు

130. నాచారు

131. నాచి

132. నాతి

133. నాతుక

134. నారి

135. నితంబవతి

136. నితంబిని

137. నీరజాక్షి

138. నీలవేణి

139. నెచ్చెలి

140. నెలత

141. నెలతుక

142. పంకజాక్షి

143. పడతి

144. పడతుక

145. పద్మముఖి

146. పద్మాక్షి

147. పర్వందుముఖి

148. పల్లవాధర

149. పల్లవోష్ఠి

150. పాటలగంధి

151. పుచ్చడిక

152. పుత్తడిబొమ్మ

153. పువు(వ్వు)బోడి

154. పువ్వారుబోడి

155. పుష్కరాక్షి

156. పూబోడి

157. పైదలి

158. పొల్తి(లతి)

159. పొల్తు(లతు)క

160. త్రీదర్శిని

161. ప్రమద

162. ప్రియ

163. ప్రోడ

164. ప్రోయాలు

165. బంగారుకోడి

166. బాగరి

167. బాగులాడి

168. బింబాధర

169. బింబోష్ఠి

170. బోటి

171. భగిని

172. భామ

173. భామిని

174. భావిని

175. భీరువు

176. మండయంతి

177. మగువ

178. మచ్చెకంటి

179. మడతి

180. మడతుక

181. మత్తకాశిని

182. మదిరనయన

183. మదిరాక్షి

184. మసలాడి

185. మహిళ

186. మానవతి

187. మానిని

188. మించుగంటి

189. మించుబోడి

190.మీనసేత్రి

191. మీనాక్షి

192. ముగుద

193. ముదిత

194. ముదిర

195. ముద్దరాలు

196. ముద్దియ

197. ముద్దుగుమ్మ

198. ముద్దులగుమ్మ

199. ముద్దులాడి

200. ముష్ఠిమధ్య

201. మృగలోచన

202. మృగాక్షి

203. మృగీవిలోకన

204. మెచ్చులాడి

205. మెఱుగారుబోడి

206. మెఱుగుబోడి(ణి)

207. మెలుత

208. మెళ్త(లత)మెల్లు(లతు)

209. యోష

210. యోషిత

211. యోషిత్తు

212. రమణి

213. రామ

214. రుచిరాంగి

215. రూపరి

216. రూపసి

217. రోచన

218. లతకూన

219.లతాంగి

220. లతాతన్వి

సేకరణ 

Saturday, 5 March 2022

శ్రీ అరుణగిరి ప్రదక్షిణ

 శ్రీ అరుణగిరి ప్రదక్షిణ


అరుణాచల దివ్యక్షేత్రమునకు అత్యుత్తమ నివాళిగా చెప్పబడిన కార్యము "గిరి ప్రదక్షిణము". అరుణగిరి ప్రదక్షిణతో సకల పాపములు నశించి, అంత్యమున శివలోక ప్రాప్తి కలుగును.
దీనిపై ఎన్నో  గుహలు కలవు.
వాటిలో ఎందరో మహాత్ములు నేటికీ తపము చేసికొనుచున్నారు.
ఈ గిరి హిమాలయముల కన్నాప్రాచీనమైనది మరియు కైలాసము కన్నా మహత్తరమైనది. ఎందువలననగా

కైలాసము - శివుని నివాసము
అరుణాచలము - సాక్షాత్తు శివుడు

ఎన్నో యుగములుగా అరుణాచలము ఎందరో ఉపాసకులను తన వైపుకు ఆకర్షించి వారిని
కృతార్థులను చేసినది. ఈ పర్వతము చుట్టూ ఇరువది అయిదు మైళ్ళ వరకు దీని దివ్య తేజస్సు పడును. ఆ ప్రాంతమంతటా ఎటువంటి దీక్షా   నియమములు లేవు.
ఇంతటి సౌలభ్యము గల ఏకైక క్షేత్రము అరుణాచలము.

"యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే"

అని స్కాందపురాణము వర్ణించినది .
అరుణగిరి ప్రదక్షిణ గూర్చియే. జన్మాంతరముల యందు చేసిన పాపములు గూడా గిరి ప్రదక్షిణ వలన నశించును.
స్కాందపురాణము "గిరి ప్రదక్షిణ" వైభవమును ఎంతో ఉన్నతముగా వర్ణన చేసినది.
గిరి ప్రదక్షిణ చేసిన వారికి
1. కోటి అశ్వమేధ యాగములు,
2. కోటి వాజపేయ యాగములు,
3.  సమస్త తీర్థముల యందు స్నానములు చేసిన ఫలితము అనుగ్రహింపబడును.

మొదటి అడుగుతో భూలోకము, రెండవ అడుగుతో అంతరిక్షము, మూడవ అడుగుతో స్వర్గలోకము అనుగ్రహింపబడును.
అంతేగాదు, మొదటి అడుగుతో మానసిక పాపములు, రెండవ అడుగుతో శారీరిక పాపములు, మూడవ అడుగుతో వాచక పాపములు నశించును. ధ్యానము నందు కుదరని ఏకాగ్రత గిరి ప్రదక్షిణ వలన సంభవమగును.

సకల దేవతలు, నవగ్రహములు, బ్రహ్మదేవుడు, శ్రీమహావిష్ణువు గూడా సర్వకాలముల యందు గిరి ప్రదక్షిణ చేస్తూ యుండెదరు. ఉత్తరాయణ పుణ్యకాల సమయమందు (కనుమ పండుగ నాడు) మరియు కార్తీక మాస కృత్తికా దీపోత్సవ మూడవ దినమున సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే, పార్వతీ మాత మరియు తన భూతగణ సహితముగా, గిరి ప్రదక్షిణ చేస్తాడనిన ఈ ప్రదక్షిణ వైభవము వర్ణించుట ఎవరి తరము. దిక్పాలకులు మరియు నవగ్రహములు గిరి ప్రదక్షిణ చేసిన కారణముననే వారు వారివారి స్థానములు పొందిరి. పార్వతీ మాత గూడా గిరి ప్రదక్షిణ చేసిన కారణముననే పరమేశ్వరుని వామార్ధభాగమును పొంది పార్వతీపరమేశ్వరులు "అర్ధనారీశ్వరులు" అయినారు.
1. భానువారము ప్రదక్షిణ చేయువారు సూర్య మండలమును బేధన చేసి శివసన్నిధి పొందెదరు.

2. సోమవార ప్రదక్షిణము అజరామరత్వమును కలిగించును.

3. మంగళవార ప్రదక్షిణము సార్వభౌమత్వమును ఒసగును.
4. బుధవార ప్రదక్షిణము మహాపాండిత్యమును ప్రసాదించును.
5. గురువార ప్రదక్షిణము సర్వులు నమస్కరించెడి లోకగురుత్వమును కటాక్షించును.
6. శుక్రవార ప్రదక్షిణ చేయువారికి సకల సంపదలూ కలిగి, విష్ణుపధమును పొందదరు.
7. శనివార ప్రదక్షిణము వలన సమస్త గ్రహ పీడలూ తొలగిపోవును.
అదృశ్య రూపమున ప్రదక్షిణ చేయు దేవతలు, గిరి ప్రదక్షిణ చేయువారి భక్తిశ్రద్ధలకు సంతసించి అడగకనే వరములు అనుగ్రహించెదరు.

పౌర్ణమి, అమావాస్య మరియు ఇతర పర్వదినముల యందు చేయు గిరి ప్రదక్షిణ విశేష ఫలితములను అనుగ్రహించును.

"చిత్రం వటతరోర్మూలే వృద్ద శిష్యః గురుర్యువాః
గురోస్తూ మౌనం వ్యాఖ్యానం, శిష్యోస్తు ఛిన్న సంశయః"

వట వృక్షము నీడన ఆసీనుడై, చిన్ముద్ర పట్టి, మౌనమే వ్యాఖ్యానముగా యున్న యువకుడైన గురువు, తన వద్దకు చేరిన వృద్ధ శిష్యుల సంశయములు తీర్చుచుండెను.
ఆ స్వరూపమే "శ్రీ గురుదక్షిణామూర్తి".
పరమశివుని జ్ఞానరూపమైనట్టి శ్రీ దక్షిణామూర్తిని వేదములు బహుదా ప్రస్తుతించినవి. అటువంటి దివ్య స్వరూపమైన దక్షిణామూర్తి యే వటవృక్షము నీడన ఆసీనులై యున్నారో, ఆ వృక్షము అరుణాచలము పైనే యున్నది.
ఈ గిరికి ఉత్తర దిక్కుగా యున్న ఉన్నత శిఖరముపై ఈ స్వామి ఆసీనుడై యున్నాడని పురాణవచనము. ఈ స్వామినే "అరుణగిరి యోగి" అని పేర కొలిచెదరు. గిరి ప్రదక్షిణము చేసెడి వారు, వారికి తెలియకుండానే ఈ స్వామికి కూడా ప్రదక్షిణ చేసెదరు. అందువలననే అరుణాచల గిరి ప్రదక్షిణము మహత్తరమైన జ్ఞానమును కూడా అనుగ్రహించును.

అరుణగిరి ప్రదక్షిణమునకు ప్రత్యేక సమయమంటూ లేదు. ఎప్పుడైనా ప్రదక్షిణ చేయ్యవచ్చును. స్నానము చేసి, శుభ్రమైన వస్త్రములు ధరించి, భస్మధారణ గావించి, శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేయవలెను. ప్రదక్షిణ చేయు సమయమున త్వరపడి నడవక నిండు గర్భిణి వలె నెమ్మదిగా అడుగులు వేయవలెను. దేవ, ఋషి, సిద్ధ, గంధర్వ, కిన్నెర, కింపురుష, నవగ్రహ, దిక్పాలక గణములన్నియూ ప్రదక్షిణ మార్గము యొక్క కుడి వైపు ప్రదక్షిణ చేయును. కనుక వారి త్రోవకు అడ్డము రాని రీతిలో మార్గాముకు ఎడమ వైపుగా ప్రదక్షిణ చేయవలెను.

అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి  కొన్ని వివరాలు


1. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారు అక్కడికి చేరుకోవడంతో నే గిరిప్రదక్షిణ పూర్తి అవుతుంది '
రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడం ఈ ప్రదర్శన పూర్తి అవుతుంది అని భావించకండి .
మీరు ఎక్కడినుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టిన కచ్చితంగా అక్కడ ఒక వినాయకుని గుడి అయినా ఉంటుంది .
అక్కడ స్వామికి నమస్కరించి మొదలుపెట్టవచ్చు '

2. గిరిప్రదక్షిణ అనేది కచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి " కుడివైపున కరుణగిరి కి దగ్గరలో ఉండే కుడి మార్గం లో  సూక్ష్మరూపంలో యోగులు ' సిద్ధులు ' దేవతలు ప్రదక్షిణలు చేస్తారట . అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు .

3. ఆరుణాచలం వెళ్లే ప్రతి వారు కచ్చితంగా పది రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి .
ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూది ప్యాకెట్ లు ఖచ్చితంగా ఇస్తారు .

4 . దర్శనానికి గిరిప్రదక్షిణ కి వెళ్లేటప్పుడు రెండు చిన్న చిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి . ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ చిన్న డబ్బాలలో తీసుకోవచ్చు .

5. ఎముకలు అరిగి పోయిన వారు యమ లింగం దగ్గర ఇచ్చే విభూతి ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘం అని చెబుతారు .

6. నైఋతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు కచ్చితంగా  అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది '
ఏ మంత్రము లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు .

7. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు గాని ' మధ్యలో గాని ఎక్కువ ఆహారం తీసుకుని మొదలు పెట్టవద్దు " భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు . ఖాళీ కడుపుతో చేసే గిరిప్రదక్షణ వేగవంతంగా ఉంటుంది .

8. సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరిప్రదక్షణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది .

9. గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది '
మాక్సిమం కూర్చోకుండా నిలబడి గానీ ' తప్పనిసరి పరిస్థితుల్లో  బెంచీపై పడుకోండి " కూర్చోవడం అన్న చాలా ఇబ్బందులు ఉంటాయి .

10 . కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకొని  దర్శనానికి వెళ్లే వారు ' అరుణాచలేశ్వరుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్లో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి . అక్కడ మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్ర నామాలు చదివి విభూతి ప్రసాదంగా ఇస్తారు .
లేకపోతే అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు.

11. ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత
ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది .
కచ్చితంగా దర్శనం చేసుకోండి .

12. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్దపెద్ద పిల్లర్లతో అతి పెద్ద మండపం ఉంటుంది '
ఆ మండపంపై కి వెళ్లి కొంచెం ముందుకు వెళితే పాతాళ లింగం ఉంటుంది .
రమణ మహర్షి వారు  అక్కడే తపస్సు చేసారు .

13.రాజ గోపురానికి కుడివైపున అనుకొని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది . అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు బృందావనం .

14 ' ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్లి రావాలని శాస్త్రం ' అది ఇది మహా భక్తురాలైన అమ్మాణి అమ్మన్‌ అని ఆవిడ కట్టించిన గోపురం .

15. రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతిపెద్ద కాలభైరవుని విగ్రహం గల ఆలయం ఉంటుంది .తప్పకుండా దర్శనం చేసుకోండి .

16 ' అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది దాని క్రింద రాతితో చెక్కిన అతి పెద్ద త్రిశూలం ఉంటుంది .
అద్భుతః

17. అమ్మవారి ఆలయంలో కూడా పది రూపాయల దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు .

18 ' అగ్ని లింగానికి ' రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది . చాలా పెద్ద విగ్రహం ' అత్యంత శక్తివంతమైన విగ్రహం '
అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు .
ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించండి . రూపాయలకు శెనగల దండ అమ్ముతారు . మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే శెనగల దండలను స్వామివారికి సమర్పించండి . అది స్వామి వారి మీద వేస్తారు .

19. శివసన్నిధి రోడ్ లో కొంచెం ముందుకు వెళ్లి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది '
చాలా చాలా బాగుంటుంది . ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది .
రమణ మహర్షి వారి ఆశ్రమంలో కి వలె ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి .
ఇక్కడ
ఉదయం టిఫిన్ ' మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతారు .
విదేశీయులు కూడా సామాన్యులతో పాటు లైన్ లో ఉండి ప్రసాదం స్వీకరిస్తారు .
ఒకసారి అక్కడి ప్రసాదం స్వీకరించండి

20 . ఈ రామ్ సూరత్ బాబా ఆశ్రమం లోనే అవధూత శ్రీ తోప్పి అమ్మాల్ వారు వుంటారు.
దర్శనం చేసుకొని తరించండి

ఓం అరుణాచలేశ్వరాయ నమః

సేకరణ :