Sunday, 25 December 2022

నవ వ్యాకరణాలు అనగా ఏవి

 నవ వ్యాకరణాలు అనగా ఏవి


1. పాణి నీయం . 2. కలాపం. 3. సుపద్మం.
4. సారస్వతం. 5. ప్రాతిశాఖ్యం ( కుమార వ్యాకరణం ) 6. ఐంద్రం . 7. వ్యాఘ్ర బౌతికం.
8. శాఖటా టా యానం . 9.శాకల్యం .

శ్రీ రాముని జన్మనక్షత్రం , మాసం ఎప్పుడు

శ్రీ రాముడు చైత్ర మాసం , నవమి తిధిలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం పునర్వసు .

పర్వ దినాలలో వడపప్పుని ఎందుకు పెడతారు

భగవంతుడికి ప్రతి పండగనాడు వడపప్పుని , చలిమిడిని తప్పకుండా చేసి పెడతారు. అలాగే తల స్నానం చేసి ఆయా దేవుళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేయడం వల్ల వేడి చేసి తిన్న పిండి వంటలు సరిగ్గా అరగవు . తద్వార అనారోగ్యం కలుగుతుంది.
          ఇటువంటి ఉపద్రవాలు తలెత్తకుండా ఉండటానికి కొన్ని ప్రాంతాలలో వడపప్పు, పానకం , చలిమిడి తప్పకుండా చేస్తారు . పెసరపప్పుతో చేసిన వడపప్పు తినడం వలన తిన్న పిండి వంటలు జీర్ణం అయ్యి వేడి చేయకుండా చలువ చేస్తుంది .

శ్రీ వారి సుప్రభాతాన్ని ఎవరు ఎప్పుడు రచించారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ సుప్రబాతాన్ని రచించిన వారు శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ అనే ఆచార్యులు. వీరు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధులైన శ్రీ మనవాల మహామునుల శిష్యులలో ప్రముఖులు వీరు క్రీ .శ . 1361 లొ జన్మించి 1454 వరకు అంటే 93 సంవత్సరాలు జీవించి ఉన్నారని పరిశోధకుల అభిప్రాయం.వీరు తమ జీవిత కాలంలో అనేక కృతులు రచించారు. వీరి రచనలలో శ్రీ స్వామివారి సుప్రబాతం అనన్య సామాన్యమైన ప్రచారం పొందింది.