Saturday 11 June 2022

నాన్నకు ప్రేమతో

 నాన్నకు ప్రేమతో ....కధ



నాన్నా నాకు ఇంకా పై చదువులు చదవాలని ఉంది అంది శైలు...
ఇంజినీరింగ్ అయిందిగా... ఇంకానా అన్నాడు రమేష్...
నాకు M.B.A., చేయాలని ఉంది..తరువాత బిసినెస్ చేస్తా...అంది...శైలు
మరి పెళ్లి ...సంగతి ఏమిటి...ఇంకా ఆలస్యం అయితే ..అందరూ ఏమనుకుంటారు...అని అడిగాడు రమేష్.
అందరూ ఏమనుకుంటున్నారో...అని అలోచిస్తే
నా గోల్ ఎలా రీచ్ అవుతా...
ముందు జీవితంలో
ఏదైనా సాధించాలి...
పెళ్లి చేసుకుంటే ఒక్కోసారివీలు పడవచ్చు , పడకపోవచ్చు..
పెళ్లి అనేది ఒక బాధ్యత...
అది నెత్తిమీద ఉంటే ...
మనం అనుకున్నది సాధిచాలంటే చాలా కష్టంపడాలి ..కదా నాన్నా...
నీ సంగతే చూడు...
నీకు బోల్డ్ అంబిషన్ ఉండేది...కుటుంబపరిస్థితులు వలన వెంటనే
ఉద్యోగం లో చేరడం ,  వెంటనే పెళ్లి...
మేము పుట్టడం...
ఇలా ఒకదానిమీద ఒకటి బాధ్యతలు పెరిగిపోయాయి...రిస్క్ చేసే అవకాశం దేర్యం లేకుండా పోయాయి...కదా
ఆ ఆశలు అలాగే చంపుకుని మమ్మలిని కష్టపడి
పెంచావు..చదివించావు...ఈ స్థాయిలో ఉంచావు...ఇంకాస్త కష్టపడితే ...
నీ ఆశ నేను నెరవేర్చే అవకాశం వస్తుంది...
నీ ఆశలని నీ కూతురిగా నెను సాధిస్తా...
నీ కూతురిగా అది నా బాధ్యత...కూడా...అంది శైలజ...
నిన్ను చూస్తుంటే  నాకు గర్వంగా ఉంది..
సరే తల్లీ నీకు నచ్చినట్లు చెయ్...
ఈ రోజే అప్లైచెయ్..
చదవాలి అనుకున్నది చదువు...
ఎదగాల్సిన ఎత్తుకు ఎదుగు.. నీకు నే ఉన్నా...

" నీ రెక్కల బలం తెలుసుకుని ఎగరగలిగిన ఎత్తుకి ఎదుగు...
అలిసిపోతే నువ్వు వాలడానికి చెట్టులా  ఎప్పుడూ  నేను ఉంటా..."

అన్నాడు రమేష్....

థాంక్స్ నాన్నా అంటూ లాప్టాప్ దగ్గరికి పరిగెత్తింది...
ఆనందం తో గర్వంతో తన కూతురివైపు చూసాడు..." ఈ కాలంలో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా తగిన ప్రోత్సాహం ఇస్తే...ఏదైనా సాధించగలరు అన్న నమ్మకంతో.." .....

(కల్పిత కధ...కథ కధనం పాత్రలు...కల్పించి రాసినవి..)
రచయిత...ఆచంట గోపాలకృష్ణ
ఆచంట కథలు