నీరు పోసిన మొక్కలు
ఆరోజు విశ్వ ...షూటింగ్ స్పాట్ కి కొంచెం ఆలస్యంగా వచ్చాడు...
రాగానే డైరెక్టర్ దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాడు...
క్షమించండి సర్...కొంచెం ఆలస్యం అయింది... ఇంకెప్పుడు ఇలా జరగదు... అని అడిగాడు..
నీ దగ్గర ఇవాళ్టి స్క్రిప్ట్ ఉండిపోయింది... హీరోయిన్ చాలా బిజీ అని తెలుసుగా...
ఆవిడ ఎదురుచూస్తున్నారు..
వెళ్ళు ..ముందు డైలాగ్ పేపర్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించు.
నీ సంగతి నాకు తెలుసు కాబట్టి నేను ఏమి అనను...
ఆవిడ కోప్పడితే ఏమీ మాట్లాడకు...
కాస్త సంయమనం పాటించు...
అర్థం అయిందా అన్నాడు రమేష్....
సరే సర్ ...
థాంక్స్ సర్...
అని కృతజ్ఞతతో చూసి పేపర్ పట్టుకుని వెళ్ళాడు...
మిగతా వాళ్లు రెడీ అవ్వండి...
ఈ లోగా వేరే షాట్స్ కంప్లీట్ చేద్దాం...
అని కెమెరా మెన్ ని పిలిచాడు..
సర్ మిగతా షాట్స్ చేద్దాం...
ఈ లోగా ఆవిడ డైలాగ్ వెర్షన్ ప్రాక్టీసు అవుతుంది...
ఇంకా నయం హీరో తో కాంబినేషన్ లేదు ఈవేళ... లేకపోతే ...ముందు నా పని అయిపోయేది... అన్నాడు నవ్వుతూ రమేష్...
ఏమి పరవాలేదు సర్ ..
ఆవిడకి వేరే చోట షూటింగ్ ఉంది ట...
అందుకే కంగారు... అక్కడ పెద్ద హీరో గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి ట...
ఆ విడకూడా ఆలస్యం కి సమాధానం
చెప్పుకోవాలిగా..D.O.P., అన్నాడు
వివేక్...
విశ్వ పేపర్స్ పట్టుకుని కార్వాన్ దగ్గరికి వెళ్ళాడు...
నిత్యా మామ్ ...అంటూ డోర్ కొట్టాడు... అసిస్టెంట్ తలుపు తీసింది...
మేడం కోసం... డైలాగ్స్ పేపర్ ...అన్నాడు...
రా నిగురించే ఎదురు చూస్తున్నారు...
అంటూ తలుపు తీసింది...
లోపలికి రాగానే క్షమించండి మేడం... అనుకోకుండా ఈ రోజు ఆలస్యం అయింది.. అని క్షమాపణ అడిగాడు...
నీకు అసలు బుద్ధి లేదు...
నీ కోసం ఇంత మంది ఎదురు చూడాలా... అసలు నిన్ను పెట్టిన ఆ రమేష్ ని అనాలి... అవతల ...వేరే షూట్ ఉంది అని తెలుసు గా అని విరుచుకుపడ్డారు...
తల వంచి మౌనంగా విన్నాడు...
రెండు నిమిషాలు బైట కూర్చో... కోపం తగ్గాక పిలుస్తా...అంది...
సరే అండి అంటూ బైటకి వచ్చాడు...
ఇదిగొండి జ్యూస్ అంటూ ఇచ్చింది అసిస్టెంట్... అది తాగి చల్లబడింది...
రమ్మను.. మళ్ళీ ఆలస్యం అవుతుంది...
అంటూ ఆర్డర్ వేసింది నిత్యా...
రమ్మన్నారు అంటూ పిలిచింది అసిస్టెంట్...
గబ గబ లోపలికి వచ్చాడు...
ఇవాళ చిన్న డైలాగ్స్ అండి...5 సీన్స్... అంతే అరగంటలో అయిపోతాయి...
అంటూ షీట్స్ ఇచ్చి... ఫీల్ , డిక్షన్... ఎక్స్ప్లెయిన్ చేసాడు...
నువ్వు చెప్పే విధానము నాకు నచ్చుతుంది... బట్టి అక్కర్లేదు...
అర్థం అయిపోతుంది...
డైలాగ్స్ అలాగే గుర్తు ఉంటాయి... అంది...
ఇందాక కోపం లో ఏదో అనేసా....
అవతల పెద్దాయన తో ...వర్క్...
ఆయనని వైట్ చేయించే సాహసం ఇంకా ఇండస్ట్రీలో ఎవరికి లేదు..
ఆ కోపం లో తిట్టేసా....
పద నేను రెడీ. ..కొంచెం టచ్ అప్ చెయ్ సరిపోతుంది... అంది అసిస్టెంట్ తో...
వాన్ దిగి లొకేషన్ కి వచ్చింది...
అంతే అందరు పరుగులు....
షాట్ రెడి... అంటూ మొదలు పెట్టారు...
అర గంట లో మొత్తాన్ని షూట్ చేసేసారు..
చాలా బాగా వచ్చాయి... అన్ని సీన్స్...
కట్ చెప్పి... నిత్యా గారు...
చాలా బాగా వచ్చాయి ...
మీ అభినయం 100 శాతం బాగా వచ్చాయి... అభినందనలు... అన్నాడు రమేష్...
థాంక్స్... విశ్వ ని పిలు ఒకసారి అంది నిత్యా... వెళ్లి పిలుచుకుని వచ్చాడు...
ఒక అసిస్టెంట్...
పిలిచారుట ...
నీకు అసలు కోపం రాదా...
ఇందాక అన్ని తిడుతుంటే కనీసం ..
తల ఎత్తలేదు... అన్ని భరించావ్... అంది... అదేం లేదు అండి... నా వలనే ఆలస్యం కావడం ఒక కారణం అయితే...
రెండవది... మీకు కోపం వస్తే ...మూడ్ పాడవుతుంది...
ఆ కోపము లో అభినయం అంత బాగా రాదు... మీరు మంచి కళాకారిణి..
మీ నుంచి ప్రేక్షకులు బెస్ట్ కోరుకుంటారు...
నేను తల దించుకోవడం వలన...
మీ కోపం తగ్గి... ఇదిగో.. ఇలా మంచి మూడ్ లో ఉంటే ...బెస్ట్ ఇస్తారు...అందుకే... నేను ఏమి మాట్లాడలేక పోయా ..
.నిజానికి నేను కూడా మీకు బెస్ట్ ఫ్యాన్...
ని మేడం... అన్నాడు వినయం గా...
నీ సింపుల్ సిటీ నాకు నచ్చింది...
ఇదిగో తీసుకో అంటూ 10,000 చేతిలో పెట్టింది...
అయ్యో వద్దు మేడం...
మీరు మరోలా భవించవద్దు..
ఇప్పడు నాకు డబ్బు ఇవ్వొద్దు... అండి...
మీకు కోపం పోయింది అది చాలు అన్నాడు... విశ్వ....
ఇంతలో మేడం అక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి.. మనం బయలుదేరి వెళ్ళాలి... అంది అసిస్టెంట్..
సరే మనం తరువాత మాట్లాడదాం...
అంటూ రమేష్ నేను వెడుతున్నా అని వెళ్ళిపోయింది నిత్యా
..
హమ్మయ్య... ఇవాళ ఎంత గొడవ అవుతుందో అనుకున్నా ..కానీ అంతా సవ్యంగా నే జరిగింది... అన్నాడు రమేష్... ఒకే..pakup చెప్పేస్తానంటూ... చెప్పేసాడు... రమేష్...
ఆ సినిమా సూపర్ హిట్... అయింది..
నిత్యా పేరు పెద్ద రెమ్యూనరేషన్ లిస్ట్ లోకి వెళ్లి పోయింది... వరుసగా సినిమాలు ...బిజీ హీరోయిన్ అయిపోయింది...
ఒకరోజు ఒక స్టూడియో లో నిత్యా షూటింగ్ ...సాంగ్ జరుగుతోంది... అని తెలిసింది విశ్వ కి...ఆ పక్క ఫ్లోర్ లో రమేష్ మూవీ జరుగుతోంది...
రమేష్ గారు నేను నిత్య మేడం ని పలకరించి వస్తా ...ఇంకా బ్రేక్ టైం ఉంది గా అన్నాడు విశ్వ...
సరే వెళ్ళు ...
మళ్ళీ అక్కడినుంచి ఎక్కడికి వెళ్లకు...
నేను వెతుక్కోవాలి... అన్నాడు నవ్వుతూ... సర్...మీరు మరీనూ... అంటూ వెళ్ళాడు...
ఒక అసిస్టెంట్ కి అంత వాల్యూ ఇస్తారు ఏమిటీ సర్ అన్నాడు కొత్త ప్రొడ్యూసర్...
వాడు చాలా మంచి వాడు అండి.. నాదగ్గరే చాలా కాలం గా పని చేస్తున్నాడు... వాడు ఒక్కడు ఉంటే చాలు నేను ఇంక ఏమి చూసుకోవక్కరలేదు... మొత్తం తానే చూసుకుంటాడు... బైట ఆఫర్ లు వచ్చినా ...నన్ను వదిలి పోలేదు...చాలా టాలెంటెడ్... అన్నాడు రమేష్.
***
అక్కడ డాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది...
విశ్వ వెళ్ళాడు...
ఇంకో అసిస్టెంట్ చూసాడు..
రా విశ్వ అన్నా... ఇలా వచ్చారు... మీరు ఈ ప్రాజెక్ట్ లో ఉన్నారా అని అడిగాడు...
లేదు నిత్యా మామ్ కోసం వచ్చా...
కలవచ్చా అన్నాడు...
సాంగ్ అవుతోంది...
మాస్టర్ ని అడగాలి...
నేను వెళ్లి అడిగి వస్తా... అని వెళ్ళాడు...
కొంచెం బ్రేక్ అవగానే...
నిత్యా దగ్గరకి వెళ్ళాడు...
మామ్ మిమ్మలిని కలవాలి ట విశ్వా వచ్చాడు... అన్నాడు...
ఒక్క నిమిషం వైట్ చేయమని చెప్పు...
ఈ స్టెప్ అవగానే కలుస్తా...
అని మళ్ళీ డాన్స్ లోకి వెళ్ళిపోయింది...
బ్రేక్ ఇచ్చాడు మాస్టర్...
మేడం ఇంకొక్క చరణం ఉంది...
వెంటనే అయిపోతుంది... అన్నాడు మాస్టర్... ఒక్క నిమిషం ..తనతో మాట్లాడి వస్తా... అంటూ విశ్వా దగ్గరకి వచ్చింది...
ఎమ్ విశ్వ ఎలా ఉన్నావ్... అంటూ పలకరించింది... బాగున్నా అండి... మీ షూట్ ఉంది అని తెలిసి వచ్చా...
.ఆ కబుర్లు కెమిటి గాని ముందు విషయం చెప్పు అంది...
అదేం లేదు మేడం అన్నాడు...
కొంచెం తడబాటు గా...
మళ్ళీ వాళ్ళు పిలుస్తారు..తొందరగా చెప్పు అంది...
అది కొంచెం డబ్బు కావాలి... అన్నాడు నెమ్మది గా...
ఇచ్చి నప్పుడు తీసుకోవు...
ఇప్పడు వచ్చి అడుగుతున్నా వు... అంది... నిత్యా...
నిజానికి కొంచెం అర్జెంట్ అండి... తప్పలేదు...ఇది వరకు మీరు ఆఫర్ ఇచ్చారని నమ్మకంతో వచ్చా... అన్నాడు...
సరేలే ఎంత కావాలి అని అడిగింది నిత్యా...
అది అది అన్నాడు...
మొహమాటం గా పరవాలేదు లే చెప్పు ఎంత కావాలి అంది.. నిత్యా..
మీరు ఎంత ఇవ్వాలి అనుకుంటే అంత ఇవ్వండి... అన్నాడు సిగ్గు గా...
నీ సిగ్గు బంగారం కాను... చెప్పు... నీ మీద నాకు సదాభిప్రాయం ఉందిలే... అంది... నిత్యా...
50 వేలు అండి ...కానీ మీరు ఎంత ఇచ్చిన పరవాలేదు.. అన్నాడు...
మేడం షాట్ రెడీ ...మాస్టర్ పిలుస్తున్నారు... అని వచ్చాడు అసిస్టెంట్...
పద వస్తున్నా... అంది నిత్య...
నేను మళ్ళీ కలుస్తా అండి ...అన్నాడు వినయం గా
ఒక్క నిమిషం ఉండు... అంటూ తన pa నిపిలిచింది... ఇతనికి ఒక లక్ష రూపాయలు ఇవ్వు... అంది.. అంత ఎందుకు అండి ...అన్నాడు...
ఏదో కారణం లేకుండా అడగవు గా...తీసుకో నేను వెళ్ళాలి... మళ్ళీ కలుద్దాం అంది...
మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు... నమస్తే మేడం అన్నాడు...
సరే ఫోన్ చెయ్... అంటూ వెళ్ళిపోయింది... నిత్యా...
ఒకరోజు కలెక్టర్ కార్యాలయం నుండి ఫోన్ వచ్చింది...
నిత్యా ఆఫీస్ కి ..
pa తీసాడు...
మేము కలెక్టర్ కార్యాలయం నుండి మాట్లాడుతూ ఉన్నాం...
సాంస్కృతిక సంస్థలు కార్యక్రమాలు జరుగుతున్నాయి ...
అందులో భాగం గా ...కళాకారులకు మరియు ఆ సంవత్సరం 10 వ తరగతి ...విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చిన కొంతమంది కి అభినందన ..ఉన్నాయి..
నిత్యా గారిని ప్రత్యేక అతిధి గా ఆహ్వానం పంపుతున్నాం...
ఆవిడ డేట్స్ కొంచెం ఆరోజుకి ...ఫంక్షన్ కి వచ్చేలా చేయమని కలెక్టర్ గారు చెప్పారు... అన్నాడు...
ఒకే సర్ ఆరోజు మేడం కి పనులు అవి నేను adjust చేసుకుంటా...
మీరు ఆహ్వాన పత్రిక లో పేరు వేసేయండి... అన్నాడు... థాంక్స్ అని ఫోన్ పెట్టేసాడు...
అంతలో కిందికి వచ్చింది...
మేడం కలెక్టర్ కార్యాలయం నుండి ఫోన్ వచ్చింది... ఆరోజు ఫంక్షన్ కి మీరు గెస్ట్ గా రావాలి అని.. డేట్స్ adjust చేశా...మనకి ఆ రెండు రోజులు షూటింగ్ లేదు... ఆహ్వానం పత్రిక మీద మీ పేరు కూడా వేస్తున్నారు... అన్నాడు...
ఇప్పడు మనం ఏమి చేశామని గెస్ట్ గా పిలుస్తున్నారు... అంది... నవ్వుతూ...
ఈ మధ్య ప్రతి ఫంక్షన్ కి సినిమా సెలైబ్రెటీ లని పిలవడం అలవాటు అయింది... కదా అలాగే ఏమో అండి... ఈ సారి కలెక్టర్ గారు చెప్పామన్నారు అన్నాడు ...అందుకే ఒకే చేశా అన్నాడు...
సరే ఆరోజు ఏర్పాటు చూడు... అంది... నిత్యా...
ఆరోజు ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు... ఫ్లెక్స్ లు దండలు ...లైటింగ్ తో చాలా గొప్పగా ఉంది... వరుసగా కార్స్ వస్తున్నాయి... అతిథుల్ని దింపేసి.. వాలెట్ పార్కింగ్ వైపు వేడుతున్నాయి... ముందు కలెక్టర్ కాన్ వోయ్ వచ్చింది... వెనుకే నిత్యా కార్... వచ్చింది.. అందరూ నినాదాలు చేస్తున్నారు... ఆమె అందరికి అభివాదం చేస్తోంది... రండి అంటూ పూల గుచ్చాల తో అందరికి ఆహ్వానం పలికారు... సభ మొదలైన ది...
అందరూ ఆశీనులు అయ్యారు... ఒక్కొక్కరు మాట్లాడుతూ సాంస్కృతిక సంస్థలు, కార్యక్రమాలు గురించి... వారు సాధించిన విజయాలు గురించి అభినందనలు తెలిపారు...అందరికీ సన్మానించారు... కలెక్టరు మాట్లాడుతూ... అందరికి ప్రభుత్వం అన్నీ రకాల సాహాయాలు చేస్తున్నా ఇంకా చాలామంది కి అవి అందట్లేదు... ఈ మధ్యనే నాకు తెలిసిన ఒక విషయం మీతో పంచుకుంటా... అంటూ ...ఆగి అటూ ఇటూ చూసారు... అక్కడే ఒక ములగా నిలబడి చూస్తున్నాడు ..విశ్వ
ఇలా రండి అన్నారు... ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు... విశ్వ మిమ్మల్నే అని పిలిచారు... అప్పడు చూసాడు...
గబ గబా స్టేజి మీదకి వెళ్ళాడు...
నిత్యా కి నమస్తే పెట్టి సర్ పిలిచారు... అన్నాడు..
ఇలా నుంచో ...అని ఆయన ప్రక్కన నిలబెట్టుకుని... ఈ రోజు మీ గురించి అందరికి తెలియాలి... అన్నారు.. సర్ వద్దు సర్ ...ప్లీజ్ అన్నాడు... విశ్వ..
ఆశ్చర్యం గా చూస్తోంది నిత్య... విస్వ ఏమిటీ ఇక్కడ ఇలా అని...నువ్వు ఉండు... అని అతని చేతిని తన ఎడమ చేతితో పట్టుకుని ...ఇతను కనబడకుండా తాను చేయాల్సినది చేసేసి ..ఎలా వినమ్రంగా ఉన్నాడో చూసారా...ఇతను.. కష్టపడి ఒక అసిస్టెంట్ దర్శకుడు గా పనిచేస్తూ... కొంత డబ్బు ని అనాధ ఆశ్రమం లో కొంతమంది పిల్లలని దత్తత కి తీసుకుని ...వాళ్ళని చదివిస్తున్నాడు... నాకు ఈ మధ్య తెలిసింది... ప్రభుత్వం నుండి ఏమాత్రం సహాయం ఆశించకుండా... తన వంతు సాయం చేస్తూ ఆ పిల్లలు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు... తల్లి దండ్రులు లేని ఆ పిల్లల కోసం తాను ఇంత చేస్తున్నాడు.. ఈ రోజున వాళ్ళు అందరూ10/10 GPA తో ఉత్తీర్ణులై... పేరుకి అనాథ లే కానీ చదువుకు కాదు అని నిరూపించారు... ఈ 20 మంది ఒకే ఆశ్రమానికి చెందినవారు...ఆ పిల్లలని ఈ రోజు ప్రత్యేకంగా అభినందిస్తున్నా... అంతే కాదు.. అతనికి ఏ సహాయం కావాల్సి వచ్చినా నాకు డైరెక్ట్ గా వచ్చి కలవమని ఈ సభా ముఖం గా ప్రకటిస్తున్నా... అన్నారు...
మైక్ విశ్వ చేతికి ఇచ్చి మాట్లాడు అన్నారు...అభినందనీయం గా చూస్తోంది నిత్యా... అందరూ చప్పట్లు కొట్టారు... ఆగిన తరువాత... విశ్వ మొదలు పెట్టాడు...
అందరికి నమస్కారం... ఏదో నాకు తోచిన సాయం చేస్తూ... వస్తున్నా... ఇక్కడ మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి.. ఈ క్రెడిట్ మొత్తం నాదీ కాదు... అందుకు ముఖ్యమైన కారకులు వేరే ఉన్నారు... వారు ఇక్కడే ఈ వేదిక మీద ఉన్నారు.. ఈ సన్మానాలు నిజానికి వారికే చెందాలి అన్నాడు విశ్వ...
అందరూ ఆశ్చర్యం గా చూస్తున్నారు ఎవరా అని...
ఎవరు వారు పిలు ,
ఎవరికి కనబడకుండా సహాయం చేసే వారి గురించి మనకి తెలియాలి...
వారిని చూసి మరికొంతమంది ముందుకు రావాలి... అన్నారు కలెక్టర్...
వారు ఎవరో కాదు... నిత్యా మామ్... అన్నాడు... అంతటా తమకి ఇష్టమైన కళాకారిని... లో ఇంత మంచి గుణం... సాయం చేసే తత్వం... ఒక్కసారి గా బైట పడడం తో హాలు అంతా చప్పట్లు తో మారుమ్రోగింది...
ఆరోజు పరీక్ష ఫీజు కట్టడానికి రెండు రోజులు గడువు మాత్రమే ఉంది..నా దగ్గర ఉన్న మనీ సరిపోలేదు... ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి లో... ఉండగా.. మామ్ నాకు ఒకసారి 10000 టిప్ ఇచ్చారు... కానీ అది అప్పుడు తీసుకోలేదు... ఆ పక్క ఫ్లోర్ లో ఆవిడ షూటింగ్ జరుగుతోంది అని తెలిసి వెళ్ళా... ఆవిడని కొంత డబ్బు కావాలి అని అడిగా... ఎందుకు ఏమిటీ అని అడగలేదు... నేను 50 వేలు అడిగి తే ఒక లక్ష ఇచ్చారు... ఆ తరువాత ఆవిడ బిజీ గా ఉండి , కనీసం ఏం చేశావ్ అని కూడా అడగలేదు...నీమీద నమ్మకం ఉంది ఏదో మంచి పనికోసం అడిగి ఉంటావు... తీసుకో మళ్ళీ కలుద్దాం అని వెళ్లిపోయారు... ఆ డబ్బు తో వీళ్ళ ఫిజులు ఇంకా కొన్ని అవసరాలు తీర్చి... సదుపాయాలు కల్పించా...
మేడం ఆరోజు మీరు నీరు పోసిన మొక్కలే ...ఈరోజు పెద్దవై విజయాల పూవులు పూశాయి... ఉత్తమ విద్యార్థులు గా తమని తాము నిరూపించుకున్నారు....
పిల్లలు మేడం కి కృతజ్ఞతలు చెప్పండి అన్నాడు విశ్వ....
అందరూ..ఆమెకి నమస్కారం చేసి చాలా థాంక్స్ మేడం మీరు చేసిన ఈ సాయం మేము ఎప్పటికి మరిచిపోము అంటూ సెల్యూట్ చేశారు...
సర్ మీకు అభ్యంతరం లేకపోతే వాళ్లకి సన్మాన పత్రాలు , షీల్డ్స్ నిత్య గారి చేతులు మీదుగా అందజేయాలని కోరుతూన్నా.. అన్నాడు విశ్వ.
తప్పకుండా ఇది ఆవిడ చేతుల మీదుగా జరగాల్సిన విషయం అంటూ నవ్వుతూ... రండి నిత్యా గారు... ఇన్నాళ్లు మీరు హీరోయిన్ గానే తెలుసు.. ఈ రోజు ఇంకా ఎత్తు కి ఎదిగి పోయారు...మీకు నా ప్రత్యేక అభినందనలు... అన్నారు కలెక్టర్...
తనకు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు... రండి నిత్యా గారు... అంటూ సాదరంగా ఆహ్వానించారు... కర తాళ ధ్వనులు మధ్య ఆమెకి శాలువా కప్పి ,పూల గుచ్చాన్ని ఇచ్చి సత్కరించారు
ఆమెచే పిల్లలకి అవార్డ్స్ ఇప్పించారు... తరువాత ఆమెకి మైక్ ఇచ్చారు... రెండు మాటలు మాట్లాడమ ని...
కళ్ళ లో ఆనంద బాష్పాలు తో...అందరికి నమస్కారం... చాలా సంతోషం గా ఉంది.. అసలు ఈ సన్మానం విశ్వ కి చెందాలి... అతని కృషి వలనే ఇది సాధ్యమైంది... నేను ఆర్థిక సాయం చేశా అంతే... తన పని తాను చేసుకుంటూ.. సమాజ శ్రేయస్సు కూడా తమ బాధ్యత ఆని భావించే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి... అందుకే నేను మళ్ళీ5 లక్షల రూపాయలు అదే ఆశ్రమానికి విరాళం గా ఇస్తున్నా... దీని ద్వారా మరింత మంది విద్యార్థులు కి లబ్ది.. సహాయం అందుతుంది ని భావిస్తున్నా... అంది...
మళ్ళీ మొత్తం చప్పట్లు తో మారు మ్రోగింది... తరువాత ...విశ్వ కి కూడా శాలువా కప్పి సత్కరించారు.... విచ్చేసిన పెద్దల కి కలెక్టరేట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు....
అందరికి నమస్కారం తెలిపి నిత్యా తన కార్ లో వెళ్ళిపోయింది...
మనం ఎలాగూ అంత పని చేయలేము... కొన్ని ఉద్యోగ కారణాల వలన సమయం కేటాయింపు చేయలేము... చేసే వాళ్లకి కొంత చేయూత నిస్తే మనకి కూడా కొంత ...సంతృప్తి ఉంటుంది అని భావిస్తున్నా...
ఇట్లు రచయిత
కథ ..కధనం ..పాత్రలు... అన్ని కల్పితం.
రచయిత...
నచ్చితే దయచేసి
షేర్ చెయ్యండి..స్టికర్ ఇవ్వండి...