Tuesday 28 June 2022

ఆంజనేయుని నవ అవతారాలు

 ఆంజనేయుని నవ అవతారాలు 


బాలార్కయుత తేజసం
త్రిభువన ప్రక్షోభకం సుందరం
సుగ్రీవాది సమస్తవానర గణైః
సంసేవ్య పాదాంబుజమ్
నాదేనైవ సమస్త రాక్షసగణాన్
సంత్రాస యంతం ప్రభుం
శ్రీమద్రామ పదాంబుజ స్మృతిరతం
ధ్యాయామి వాతాత్మజమ్

"పదివేలమంది బాలసూర్యుల యొక్క కాంతిని కలిగినవాడు. ముల్లోకాలను సైతం కల్లోలపరచే శక్తిసామర్థ్యాలున్నవాడు. సుందరుడైన  సుగ్రీవాది వానరుల అందరిచేత పూజించబడే పాద పద్మాలు కలిగివాడు. తన నాదం చేత రాక్షసులని భయపెట్టేవాడు. తన ఇష్టదైవమైన  శ్రీరామపాదాలను నిరంతరం పూజించగల ఆసక్తి కలిగినవాడు. వాయుపుత్రుడు అయిన హనుమంతుని ధ్యానిస్తున్నాను." అని పై ప్రార్థనకు అర్థం.

హనుమంతుని స్మరించినంత మాత్రానికే బుద్ధి, బలం, తేజస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చైతన్యం కలుగుతాయని చెప్పబడుతోంది. సాక్షాత్తు ఆ పరమ శివుడే దుష్టశిక్షణకై, శిష్టరక్షణకై, రామకార్యసిద్దికై హనుమంతునిగా అవతరించాడు. రుద్రతేజస్స్వ రూపుడైన ఆంజనేయుడు సకలదేవతాత్మకుడు. అందుకే హనుమంతుని పూజిస్తే దేవతలందరినీ పూజించినట్లే! తన భక్తులను అనుగ్రహించేందుకు ఆంజనేయస్వామి నవ అవతారాలను ధరించాడు.

హనుమంతుని నవ అవతారాలు :-
1. ప్రసన్న హనుమదవతారం.
2. వీరాంజనేయావతారం.
3. విశంతిభుజాంజనేయావతారం.
4. పంచముఖాంజనేయావతారం.
5. అష్టాదశభుజాంజనేయావతారం.
6. సువర్చలా సహిత హనుమదావతారం.
7. చతుర్భుజాంజనేయావతారం.
8. ద్వాత్రింశద్భుజాంజనేయావతారం.
9. వానరాంజనేయావతారం.