Saturday, 1 February 2020

రధ సప్తమి సూర్య అష్టోత్తర శత నామావళి


సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది.
సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము
అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు.
"భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించువారును భారతీయులే.

విధి విధానాలు

సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ,
అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్‌.
మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటిపుణ్యదా,
కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః.

మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆరోజున అరుణోదయవేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడయున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈయోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము.
జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.

రథసప్తమినాడు బంగారముతోగాని, వెండితోగాని, రాగితోగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయవలెను, ఆ రోజు ఉపవాసముండి, సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము.

వ్రతకథ

భవిష్యోత్తర పురాణములో రథసప్తమి వ్రత విధానాలు, విశేషమైన వర్ణనలు ఇవ్వబడ్డాయి.

ఈ వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునకు శ్రీకృష్ణుడు ఇలా తెలియజేసెను. పూర్వము కాంభోజ దేశమున యశోధర్ముడను రాజుండెను. అతనికి ముదిమి ముప్పున ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారునికి ఎప్పుడును రోగములు వచ్చెడివి. తన కుమారునికి వ్యాధులకు కారణమేమని రాజు బ్రాహ్మణులను అడిగెను. "నీ కుమారుడు పూర్వ జన్మమున పరమలోభియైన వైశ్యుడు. రథసప్తమీ మహాత్మ్యము వలన నీ కడుపున పుట్టెను. లోభియగుట వలన వ్యాధిగ్రస్తుడయ్యెను అని తెలిపిరి. దీనికి పరిహారమడిగిన రాజుకు బ్రాహ్మణులు ఎలా చెప్పారు. ఏవ్రత ఫలితమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమీ వ్రతమును ఆచరించిన పాపము నశించి చక్రవర్తిత్వము పొందును. ఆ వ్రత మాచరించిన రాజునకు తగిన ఫలితము కలిగెను.


ఈ  క్రింది మంత్రం చెప్పు కొన్నాక అప్పుడు తలపై నుంచి స్నానం చేసిన తర్వాత తలంటు నీళ్లు పోసుకో వలెను

" సప్త సప్త మహా సప్త సప్త ద్వీపా వసుంధరా
సప్త జన్మ కృతం పాపం మకరే హంతి సప్తమి"

తలపై జిల్లేడు ఆకు రేగుపండు ఉంచుకుని స్నానం చేయవలెను

శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళి
(Sri Surya Ashtottara Shatanamavali)

ఓం సూర్యాయ నమః
ఓం అర్యమ్నే నమః
ఓం భగాయ నమః
ఓం త్వష్ట్రై నమః
ఓం పూష్ణే నమః
ఓం అర్కాయ నమః
ఓం సవిత్రే నమః
ఓం రవయే నమః
ఓం గభస్తిమతే నమః
ఓం అజాయ నమః
ఓం కాలాయ నమః
ఓం మృత్యవే నమః
ఓం ధాత్రే నమః
ఓం ప్రభాకరాయ నమః
ఓం పృధివ్యై నమః
ఓం అధ్బ్యో నమః
ఓం తేజసే నమః
ఓం రాయవే నమః
ఓం ఖాయ నమః
ఓం పారాయణాయ నమః
ఓం సోమాయ నమః
ఓం బృహస్పతయే నమః
ఓం శ్రుక్రాయ నమః
ఓం బుధాయ నమః
ఓం అంగారకాయ నమః
ఓం ఇంద్రాయ నమః
ఓం వివస్వతే నమః
ఓం దీప్తాంశవే నమః
ఓం శుచయే నమః
ఓం సౌరయే నమః
ఓం శనైస్చరాయ నమః
ఓం బ్రహ్మనే నమః
ఓం విష్ణవే నమః
ఓం రుద్రాయ నామః
ఓం స్కందాయ నమః
ఓం వైశ్రవనాయ నమః
ఓం యమాయ నమః
ఓం వైద్యుతాయ నమః
ఓం జటరాయ నమః
ఓం అగ్నయే నమః
ఓం బందవాయ నమః
ఓం తేజ సాంపతయే నమః
ఓం ధర్మధ్వజాయ నమః
ఓం వేదకర్త్రే నమః
ఓం వేదాంగాయ నమః
ఓం వేదవాహనాయ నమః
ఓం కృతాయ నమః
ఓం త్రేతాయై  నమః
ఓం ద్వాపరాయ నమః
ఓం కలయే నమః
ఓం సర్వాసురాశ్రయాయ నమః
ఓం కలాయై  నమః
ఓం కాశ్టాయై నమః
ఓం ముహుర్తాయై నమ్హ
ఓం పక్షాయ నమః
ఓం మాసాయ నమః
ఓం ఋతవే నమః
ఓం సంవత్సరాయ నమః
ఓం అశ్వత్దాయ నమః
ఓం కాలచాక్రాయ నమః
ఓం విభావసవే నమః
ఓం పురుషాయ నమః
ఓం శాశ్వతాయ అనమః
ఓం యోగినే నమః
ఓం వ్యక్తా వ్యక్తా య నమః
ఓం సనాతనాయ నమః
ఓం లోకాద్యక్షాయ నమః
ఓం సురాధ్యక్షాయ  నమః
ఓం విశ్వకర్మనే నమః
ఓం తమో మఠేనమః
ఓం వరునాయ నమః
ఓం సాగరాంశవే నమః
ఓం జీమూతాయ నమః
ఓం అరిఘ్నే నమః
ఓం భూతేశాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం సర్వభూత నిషేవితాయ నమః
ఓం మణయే నమః
ఓం సువర్ణాయ నమః
ఓం బూతాదయే నమః
ఓం సర్వతోముఖాయ నమః
ఓం జయాయ నమః
ఓం విశాలాయ నమః
ఓం వరదాయ నమః
ఓం శ్రేశ్టాయ నమః
ఓం ప్రాణ ధారణాయ నమః
ఓం ధన్వంతరయే నమః
ఓం దూమకేతవే నమః
ఓం ఆది దేవాయ నమః
ఓం ఆది తేస్సుతాయ నమః
ఓం ద్వాదశాత్మనే నమః
ఓం అరవిన్దాక్షాయ నమః
ఓం పిత్రే నమః
ఓం ప్రపితాయ నమః
ఓం స్వర్గ ద్వారాయ నమః
ఓం ప్రజా ద్వారాయ నమ
ఓం మోక్ష ద్వారాయ నమః
ఓం త్రివిష్టపాయ నమః
ఓం దేవకర్త్రే నమః
ఓం ప్రశాంతాత్మనే నమః
ఓం విశ్వాత్మనే నమః
ఓం విశ్వతో ముఖాయ నమః
ఓం చరా చరాత్మనే నమః
ఓం సూక్షాత్మనే నమః
ఓం మైత్రేయాయ నమః
ఓం అరుణాయ నమః
ఓం సూర్యనారాయణాయ నమః
ఓం ఆదిత్యాయ నమః

ఇతి శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళి సంపూర్ణం