భారతీయ సంస్కృతి లో వృక్షాలు కి కూడా ప్రత్యేక స్థానం ఉంది...
జోతిష్య శాస్త్రం లో 27 నక్షత్రాలు కి
అధి దేవతలు ఉన్నట్లే...
వాటికి సంబంధించి న వృక్షాలు కూడా ఉన్నాయి...
వాటిని పెంచడం ద్వారా
మన ఆరోగ్య మరియు ఆర్థిక పరిస్థితుల్ని మెరుగు పర్చుకోవచ్చు అని సమాచారం..
మనము పుట్టిన నక్షత్రాన్నీ బట్టి
దిగువ సూచించ బడిన చెట్లను
రోజు పూజించడం లేదా
నీరు పోసి పెంచడం చేస్తూ ఉంటే వాటిలోని దాగి ఉన్న శక్తి మన మీద పనిచేసి ఆరోగ్య, ఆర్ధిక పరిస్థితులు ని మెరుగు పరుచుకోవడానికి ఉపయోగిస్తుంది...
ఏ నక్షత్రం కి సంభందించిన వారు ఆ వృక్షము ని పెంచడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు...
ఆంతే కాకుండా ఇతర నక్షత్రాలు వారికి , వారి నక్షత్రం కి సంబంధించిన మొక్కల్ని బహుమతులు గా ఇవ్వడం ద్వారా వారికి ఉపయోగం మరియు పర్యావరణ సంరక్షణ కూడా ...
1.అశ్వని ...జీడి మామిడి
2.భరణి.... ఉసిరి చెట్టు
3.కృత్తిక....మేడి చెట్టు
4.రోహిణి....నేరేడు
5.మృగశిర....మారేడు/చండ్ర
6.ఆరుద్ర.....చింత చెట్టు
7.పునర్వసు.....గన్నేరు/వెదురు
8.పుష్యమి......రావి/పిప్పల్ల
9.ఆశ్లేష...... సంపంగి/చంపక
10.మక.....మర్రిచెట్టు
11.పుబ్బ..... మోదుగ
12.ఉత్తర ఫల్గుణి..... జువ్వి చెట్టు
13.హస్త......సన్నజాజి/కుంకుడు
14.చిత్త.....మారేడు/తాడి చెట్టు
15.స్వాతి.....మద్ది చెట్టు
16.విశాఖ......వెలగ/మొగలి
17.అనురాధ....పొగడ
18.జేష్ఠ...... విష్టి చెట్టు
19.మూల.....వేగి చెట్టు/ఆపిల్
20.పూర్వాషాఢ.....నిమ్మ/అశోక
21.ఉత్తరాశాడ.... పనస
22.శ్రవణ........ జిల్లేడు
23.దనిష్ఠ......జమ్మి
24.శతభిషం....కడిమి /అరటి
25.పూర్వాభాద్ర.....మామిడి
26.ఉత్తరాభాద్ర.....వేప
27.రేవతి...... విప్ప చెట్టు
గమనిక : కొన్ని వృక్షాలని ఇంటి ఆవరణలో పెంచడం కుదరదు కనుక ఆ వృక్షం/చెట్టు దగ్గరకి వెళ్ళి నీరు పోయడం లేదా పూజించడం చేయాలి.
సేకరణ.సమాచారం...ఆచంట గోపాలకృష్ణ