ఉసిరి నిల్వ పచ్చడి
ఈ పచ్చడిని మొదటి ముద్దలో నెయ్యి వేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. ఇది సంవత్సరం అంత నిల్వ ఉండే పచ్చడి.
ముఖ్య సూచన :
ఆదివారం నాడు మరియు రాత్రులు తినడం నిషిద్ధం అని చెబుతారు.
కావలిసిన పదార్ధాలు:
1. పెద్ద ( రాచ ) ఉసిరికాయలు: ఒక కేజీ
2. ఉప్పు: అర కేజీ
3. పసుపు : ఒక స్పూన్
పోపు కి కావలసిన పదార్థాలు
1. ఎండు మిర్చి
2. ఆవాలు
3. ఇంగువ
4. 2 స్పూన్ల నూనె
తయారీ విధానం :
ముందుగా ఉసిరికాయలను కడిగి పొడి బట్టతో తుడవాలి.
ఆ తర్వాత నాలుగు ముక్కలుగా కోసి మధ్యలో గింజ తీసేయ్యాలి.
ఆ తర్వాత ఉప్పు , పసుపు కలిపి పొడిగా వున్న సీసాలోకి తీసి పెట్టాలి.
మూడురోజుల తర్వాత తీసి చూస్తే ముక్క మెత్తబడి ఉంటుంది.
వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి .
తరువాత ఈ ముద్దను 3 రోజులు ఎండబెట్టుకోవాలి.
దీనివలన పచ్చడి పాడవ కుండా ఎక్కువ రోజులు నిల్వవుంటుంది.
మనకి కావాల్సి నప్పుడు,
ఎండబెట్టిన ఈ ముద్ద లో నించి కొంత తీసుకుని పక్కన పెట్టి... తరువాత
ఒక పాన్ లో
ఆవాలు, ఎండుమిర్చి ,మెంతులు , కొంచెం ఇంగువ వేసి దోరగా వేపుకుని ,
చల్లారాక మెత్తగా పొడి లాగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత దీనిని తీసుకున్న
ఆ ముద్ద కి కలుపుకుని
(ఇంగువ లో నూని వేసి వేడి చేస్తే దానిని ఇంగువ నూని అంటారు )
ఇంగువ నూనె ని పోసి కలుపుకుంటే
ఘుమఘుమ లాడే
ఉసిరి పచ్చడి రెడి .
* కొందరు పొడి కారం బదులు పచ్చిమిర్చి వేసి రుబ్బుకుంటారు. పచ్చిమిర్చి తో ఉసిరి పచ్చడి రుచి చాలా బావుంటుంది .
Subha's kitchen
Rachana : Subha Achanta