ఉసిరి ఆవకాయ
కావాల్సిన పదార్థాలు:
1. ఉసిరికాయలు - అర కేజీ
2. నువ్వులనూనె - పావు కేజీ
3. ఉప్పు - 50 గ్రాములు
4. కారం - 50 గ్రాములు
5. ఆవపొడి - 50 గ్రాములు
6. మెంతులు - అర స్పూన్
తయారీ విధానం :
ఉసిరికాయలని కడిగి, తడి లేకుండా పొడి బట్టతో తుడవాలి.
ఆ తరువాత చాకుతో అక్కడక్కడ నిలువుగా గాట్లు పెట్టాలి.
మూకుడులో నూనె పోసి కొంచం కాగాకా ఉసిరికాయలను వేసి సన్నని మంట మీద వేయించాలి.
కొంచం ఎరుపు రంగు వచ్చేదాకా వేగనిచ్చి ,చల్లారనివ్వాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నువ్వుల నూనె వేసి కొంచెం సేపు కాగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని కారం, ఉప్పు , ఆవ పొడి, మెంతులు , మరియు
ముందుగా మనం వేపుకుని పెట్టుకున్న
ఉసిరి కాయలు,చిటికెడు పసుపు వేసి
బాగా కలిపి ,
అన్ని బాగా కలిసాకా పొడి సీసాలోకి తీసిపెట్టుకుని ఒక రోజు తర్వాత వాడుకుంటే రుచిగా వుంటుంది.
కొంత మంది నిమ్మరసం కూడా కలుపుతారు. అలా కలపాలంటే ఓ పావుకప్పు నిమ్మరసాన్ని పై మిశ్రమంలో ఆఖరున కలిపితే సరిపోతుంది.
ఇది కూడా 6 నెలలపాటు నిలవ ఉంటుంది.
Subha's Kitchen
Rachana : Subha Achanta
facebook page : Achanta Kadhalu