దప్పళం
కావలిసిన పదార్థాలు
1. గుమ్మడి కాయ అర ముక్క
2. ఆనపకాయ అరముక్క
3. చిలకడ దుంపలు 3
4. వంకాయలు 2
5. బెండకాయలు 3
6. టొమాటోలు 2
7. మునగకాడ 1
8. పచ్చిమిర్చి 3
9. కరివేపాకు
10 చింతపండు తగినంత
11 బెల్లం తగినంత
12 పసుపు కొద్దిగా
13. ఉప్పు తగినంత
14 .. వరిపిండి తగినంత
15 నీళ్లు తగినంత
పోపు దినుసులు
1 ఆవాలు కొద్దిగా
2. మెంతులు కొద్దిగా
3 జీలకర్ర కొద్దిగా
4. ఇంగువ కొద్దిగా
5 ఎండుమిరపకాయలు 3
6..ఆయిల్ 3 స్పూన్స్
తయారీ విధానం
చింత పండును తగినన్ని నీళ్లు పోసి, ఒక గిన్నె లోకి నానబెట్టుకోవాలి .
పైన చెప్పిన కూరలను ,శుభ్రంగా కడిగి ,సమానమైన ముక్కలుగా ,
తరుగు కోవాలి
వరిపిండిని ఒక బౌల్ లోకి తీసుకుని ,కొద్దిగా నీళ్లు పోసుకుని ,
కలుపుకోవాలి
స్టవ్ వెలిగించి , వెడల్పయిన బాణలి పెట్టి ,వేడెక్కాక ,ఆయిల్ వేసి ,
పోపు దినుసులను వేసి
దోరగా వేగాక, కరివేపాకు ,తరిగిన కూర ముక్కలు , వేసి ,
తగినంత చింత పండు రసం పోసి , తగినంత బెల్లం, ఉప్పు, పసుపు వేసి
బాగా ఉడకనివ్వాలి
ముక్కలు ఉడికిన తరువాత నీళ్లు కలిపిన వరిపిండిని వేసి ,
బాగా కలిపి మరికొద్దిసేపు మరగనివ్వాలి .
బాగా మరిగిన తరువాత ఒక బౌల్ లోకి తీసుకుని
పైన కొత్తిమీర తో గార్నిష్
చేసుకుంటే రుచికరమైన " దప్పళం " రెడీ
ముద్ద పప్పు తో తింటే రుచిగా ఉంటుంది.
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
" వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.